ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని, పుట్టినరోజు నాడు బాగాఇంప్రెస్ చేయాలని ఏ ప్రేమికుడైనా అనుకుంటాడు. సాధారణంగా పువ్వులు, చాక్లెట్లు, రింగ్స్, లేదా మరేదైనా సర్‌ప్రైజింగ్‌గా తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాడు. తాజాగా ఒక యువకుడు తన ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను ఆకట్టుకోవాలని వినూత్నంగా ప్రయత్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
తన స్నేహితురాలి 26వ పుట్టినరోజును పురస్కరించుకుని అవిక్ భట్టాచార్య అనే యువకుడు రొమాంటింగ్ ప్రయత్నించాడు. ఏకంగా 26 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. భట్టాచార్య తన స్నేహితురాలు సిమ్రాన్ కలిసి ఉమ్మడిగా @simranxavik అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఈ క్లిప్ వైరల్ అవుతోంది.అసలు విషయం ఏమిటంటే..
సిమ్రాన్ తన పుట్టినరోజున 26 కి.మీ పరిగెత్తాలని ప్లాన్ చేసుకుంది కానీ ఆమె అనారోగ్యం కారణంగా పరుగెత్తలేకపోయింది. దీంతో అవిక్ ఆ పనిచేసి ఆమె మనసు దోచుకున్నాడన్నమాట. అతను చేసిన పనికి ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.
వీడియో భట్టాచార్య ఇలా అంటాడు "నా స్నేహితురాలు ఇప్పుడే 26 ఏళ్లు నిండాయి, కాబట్టి నేను ఆమె పుట్టినరోజు కోసం 26 కి.మీ పరిగెత్తబోతున్నాను." అంటూ తన రొమాంటిక్ రన్‌ను 2 కి.మీ, 4 కి.మీ, 6 కి.మీ, 10 కి.మీ అంటూ రికార్డ్ చేయడంతో పాటు, సిమ్రాన్ ఆరోగ్యంగా ఆనందాన్ని ఉండాలని కోరుకున్నాడు. అలాగే మరికొన్ని వారాల్లో రాబోయే ముంబై మారథాన్‌కు శిక్షణ పొందుతున్నామని, ఈ ప్రత్యేకమైన పరుగును పూర్తిగా ఆమెకు అంకితం చేయాలనుకుంటున్నానని కూడా వెల్లడించాడు. దీంతో నెటిజన్లు అవిక్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి



