ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసిన వైనం కలకలం రేపింది. అనుమానంతోనే ఈ హత్యకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఆగ్రాలో యమునా నదిపై ఉన్న వంతెన సమీపంలో 32 ఏళ్ల హెచ్‌ఆర్ మేనేజర్‌ను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, తల నరికి, ఆ తర్వాత ఒక గోనె సంచిలో కుక్కి పడేశాడని పోలీసులు సోమవారం తెలిపారు.
వినయ్‌సింగ్ (30) ఆగ్రాలోని తేధి బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ (32) గత రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో నిందితుడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత ఆరు నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే వారి మధ్య తరచుగా గొడవలకు దారి తీసింది.
పోలీసుల ప్రకారం, జనవరి 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మింకీ తన కార్యాలయానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయలు దేరింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
జనవరి 24 తెల్లవారుజామున, ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ వంతెనపై ఒక గోనె సంచి పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంచిని తెరిచి చూడగా, అందులో తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, గోనె సంచిని లాక్కెళ్లడం, ఆ తర్వాత స్కూటర్‌పై జవహర్ వంతెన వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. మారుతి ప్లాజా, ఎంజీ రోడ్, హైవేతో సహా పలు ప్రాంతాల నుండి సేకరించిన ఫుటేజ్ ఆధారంగా, బాధితురాలి స్కూటర్‌ను నడుపుతున్నట్లు కనిపించిన వినయ్ సింగ్‌ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించి విచారించారు. దీంతో సింగ్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్ గురించి తెలుసా?
జనవరి 23న వినయ్, మింకీని కార్యాలయానికి పిలిచాడు. ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అతను కత్తితో పదేపదే దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి, ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి, తలను ఒక బ్యాక్‌ప్యాక్‌లో పెట్టాడు. మింకీ స్కూటర్‌పైనే ఆమె మృతదేహాన్ని జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి యమునా నదిలో పడేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బరువైన సంచిని ఎత్తలేక, అటుగా వెళ్తున్న వారిని గమనించి, అతను దానిని వంతెన సమీపంలో వదిలి పారిపోయాడు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అందులో మొండెం, బాధితురాలి బట్టలు, మొబైల్ ఫోన్, బ్యాగ్‌ను ఒక మురుగు కాలువ సమీపంలో పారవేసి, స్కూటర్‌ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
నేరానికి ఉపయోగించిన స్కూటర్, కత్తి, బాధితురాలి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింగ్, శర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమె నిరాకరించచడంతోనే హత్య చేశాడని డీసీపీ అబ్బాస్ తెలిపారు. మృతురాలి తల, నేరానికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్


