కాలేజీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 15 మందికి గాయాలు | students were injured goods train rammed into private college bus Karur | Sakshi
Sakshi News home page

కాలేజీ బస్సును ఢీ కొట్టిన రైలు.. 15 మందికి గాయాలు

Mar 14 2026 8:12 PM | Updated on Mar 14 2026 8:31 PM

students were injured goods train rammed into private college bus Karur

చెన్నై: కరూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లియానై సమీపంలో ఓ ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సు రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ దానిమీదే  ఆగిపోయింది. అదే సమయంలో ప్రైవేట్ సిమెంట్ కర్మాగారం కోసం గ్రావెల్‌ స్టోన్స్‌ తీసుకెళ్తున్న గూడ్సు రైలు దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ ప్రైవేట్ కళాశాల బస్సులోని 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ జ్యోతిమణి స్వయంగా కలిసి, వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement