విషాదం.. ముగ్గురు పిల్లలని చంపి ఆపై వారు మృతి | Family commits suicide in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

విషాదం.. ముగ్గురు పిల్లలని చంపి ఆపై వారు మృతి

Feb 11 2026 10:46 AM | Updated on Feb 11 2026 10:57 AM

Family commits suicide in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లో విషాదం జరిగింది.  తీవ్ర మనస్థాపంతో ఒక పండంటి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  ముక్కుపచ్చలారని తమ ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపిన అనంతరం భార్యభర్తలిద్దరూ తనవు చాలించారు.

మధురలో నివసించే మనిష్ కుమార్ అనే వ్యక్తికి 2018లో వివాహమయ్యింది. వారికి హానీ, ప్రియాంశ్, ప్రీతిక్ అనే ముగ్గురు పిల్లలు అయితే ఏం జరిగిందే తెలియదు కాని కుటుంబసభ్యలు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ముగ్గురిని గొంతు నులిమి హతమార్చిన అనంతరం భార్యభర్తలు తనువు చాలించారు.మనిష్ విద్యుదాఘాతంతో మరణించగా ఆయన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే వారి ఇంటి వద్ద సూసైడ్‌కు సంబంధించిన ఒక వీడియో లభించింది. అందులో తమ ఇష్టపూర్వకంగానే తాము చావాలనుకుంటున్నారని ఇందులో ఎవరి తప్పుగానీ బలవంతం గానీ లేదన్నారు. పోలీసులు సైతం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు.అయితే తాను ఇటీవల ఒక స్థలాన్ని రూ.12 లక్షలకు అమ్మానని దానికి  ఎటువంటి ఇబ్బందులు జరగలేదని వీడియోలో పేర్కొన్నారు.

అయితే పిల్లలు ఆడుకోవడానికి బయిటకి రాకపోగా అనుమానం చెందిన ‍గ్రామస్థులు తలుపులు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో  గోడలు బద్దలు గొట్టి లోపలికి వెళ్లగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో  ఆసమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేప్టటారు.

Advertisement
 
Advertisement
Advertisement