సాక్షి, అమరావతి: గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్‌పై ఏఐ ఇంఫాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది? గ్లోబల్ విజనరీస్ లిస్ట్ నుంచి బిల్‌గేట్స్ పేరు మాయమైంది. బిల్‌గేట్స్ పేరు తొలగించారా? లేక ఆయనే రావడం లేదా? అనేదానిపై చర్చ నడుస్తోంది. ఎక్స్‌లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. బిల్‌గేట్స్ ఎప్‌స్టీన్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్‌కు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. కూటమి పాలకుల తీరుపై నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు.
బిల్‌గేట్స్‌కు ఏపీ సర్కార్ రాచమర్యాదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బిల్ గేట్స్‌కు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఎప్‌స్టీన్ ఫైల్‌లో బిల్‌గేట్స్ పేరు బయటకు వచ్చింది. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్‌స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్‌గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్‌గేట్స్‌కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్ తన పొడ్రక్ట్స్‌కు భారత్ ల్యాబ్‌గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
చదవండి: అవమానాలు భరించలేను.. జనసేనకు రాజీనామా చేస్తున్నా


