తిరుమల: శ్రీవారిని మే నెలలో దర్శించుకోవాలనుకునే వారి కోసం టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)ను లక్కీ డిప్‌లో పొందేందుకు 18 ఉదయం 10 గంటల నుంచి 20 ఉదయం 10 వరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాలి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను 21న విడుదల చేయనున్నారు. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను విడుదల చేస్తారు. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటా విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను 27న విడుదల చేస్తారు.


