గిరిజనుల ‘ఎర్ర బంగారం’.. కార్పొరేట్‌పరం | Good results in saffron cultivation | Sakshi
Sakshi News home page

గిరిజనుల ‘ఎర్ర బంగారం’.. కార్పొరేట్‌పరం

Feb 17 2026 6:18 AM | Updated on Feb 17 2026 6:18 AM

Good results in saffron cultivation

ఏజెన్సీలోని లంబసింగిలో కుంకుమ పువ్వు సాగులో సత్ఫలితాలు 

కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుండడంతో కార్పొరేట్‌ సంస్థల కన్ను

పీపీపీలో కట్టబెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం 

ఇప్పటికే ఒక కంపెనీ ప్రతిపాదనతో 18 ఎకరాలు గుర్తించిన సెరికల్చర్‌ అధికారులు 

రానున్న రోజుల్లో వందల ఎకరాలను ప్రైవేట్‌కు కట్టబెట్టే ప్రతిపాదనలు 

షెడ్యూల్డ్‌ ఏరియాలో సాగు ప్రైవేట్‌కు అప్పగిస్తే గిరిజనులకు తీరని నష్టం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, చింతపల్లిలో మూడేళ్ల నుంచి కుంకుమపువ్వు సాగులో ప్రయోగాలు ఫలిస్తున్నాయి. దీంతో ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో మాత్రమే పండే ఎర్రబంగారం(కుంకుమపువ్వు–సాఫ్రన్‌)ను కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కుంకుమ పువ్వు సాగును పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేసేందుకు చర్యలు చేపడుతోంది ఇప్పటికే ఒక ప్రైవేట్‌ కంపెనీ ఏజెన్సీలో పది ఎకరాలు కావాలని పావులు కదిపింది.

దీంతో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సెరికల్చర్‌ విభాగం అధికారులు 18 ఎకరాలను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికితోడు పీపీపీ పద్ధతి ద్వారా రానున్న రోజుల్లో వందలాది ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగును ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజనులకు దక్కాల్సిన ఆదాయ ఫలాలు ప్రైవేట్‌ కంపెనీల పరం అవుతాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఎత్తయిన ప్రదేశం కావడంతో సాగుకు అనుకూలం 
సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల కంటే ఎత్తు ఉండే మన్యంలోని లంబసింగి అత్యంత శీతల ప్రాంతం. జమ్మూకశ్మీర్‌లోని పంపూర్‌ వంటి శీతల ప్రాంతాలకే పరిమితమైన సాఫ్రన్‌ సాగుకు లంబసింగి అనుకూలమని గత మూడేళ్ల ప్రయోగాలు రుజువు చేశాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఇప్పటికే విజయం సాధిస్తున్నారు. 

కశ్మీర్‌లోని పంపూర్‌ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న క్రోకస్‌ సటైవస్‌ రకం సాఫ్రన్‌ దుంపలను లంబసింగిలో నాటారు. సాధారణంగా ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల్లో నాటితే నవంబర్, డిసెంబర్‌ నెలల్లో చలి తీవ్రత పెరిగినప్పుడు పూలు పూయడం మొదలవుతుంది. గ్లాస్‌ హౌస్, షేడ్‌ నెట్‌ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ దశలో ఉన్న సాఫ్రన్‌ సాగును వాణిజ్య పంట స్థాయికి విస్తరించేలా ప్రభుత్వం గిరిజన రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, తగిన పెట్టుబడి సాయం అందించి, ఫార్మా, కాస్మోటిక్‌ కంపెనీలకు విక్రయించేలా మార్కెటింగ్‌ కలి్పస్తే వారి జీవన ప్రమాణాలు అద్భుతంగా మారతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దేశంలో కుంకుమ పువ్వు సాగు చేసే రెండవ హబ్‌గా లంబసింగి చరిత్ర సృష్టించడంతో పాటు పర్యాటకంగా భాసిల్లుతుంది.

ఇది నిజంగా ఎర్ర బంగారమే..
కిలో కుంకుమ పువ్వు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల ధర పలుకుతుండడంతో ఇది నిజంగా ఎర్ర బంగారం(రెడ్‌ గోల్డ్‌) అని పేరొందింది. ఒక ఎకరానికి విత్తనం(దుంప) నాటేందుకే సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా పెట్టుబడి అవసరం. ఒక్కసారి నాటితే ఏడేళ్లపాటు పంట వస్తుంది. కుంకుమపువ్వు అరుదైన సువాసన, రంగు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పరిగణించబడుతోంది. అందుకే దీన్ని ‘సన్‌షైన్‌ స్పైస్‌‘ అని కూడా పిలుస్తారు.

 ముఖ్యంగా కాస్మొటిక్స్‌ తయారీలో వినియోగిస్తారు. ఆయుర్వేదం, యునానీ వైద్యంలో కంటి సమస్యలు, గుండె జబ్బులు, ఆస్తమా నివారణకు వాడే మందుల్లో ఉపయోగిస్తారు. బిర్యా­నీలు, పులావ్, ఖీర్‌(పాయసం), మిఠాయిలలో వేస్తారు. గర్భిణులు ఐదో నెల నుంచి కుంకుమపువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగు పర్చడంతోపాటు రక్తపోటు(బీపీ)ని అదుపు­లో ఉంచుతుంది. ఇది సొంతంగా తీవ్ర వేడి కలిగిస్తుందని దీన్ని ఆహారం, పాలలో రెండు, మూడు రేకలకు మించి తీసుకోకూడదని కూడా వైద్యులు సూచిస్తారు.

పీపీపీ నిర్ణయం గిరిజనులను దెబ్బతీయడమే
లంబసింగి ప్రాంతంలో కుంకుమ పువ్వు(సాంఫ్రన్‌) సాగును పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చే నిర్ణ­యం గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు  తేదీన రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించడంతో పాటు సూచనలు చేశాను.  షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ ప్రాజెక్టు లేదా ఏ పథకమైనా చేపట్టే ముందు పీసా చట్టానికి అనుగుణంగా గ్రామసభల్లో ఆ ప్రతిపాదనను ప్రవేశపెట్టి స్థానిక గిరిజనుల అనుమతి తీసుకోవాలి. 

గిరిజనులకు తగిన శిక్షణ ఇస్తే వారే సాఫ్రన్‌ సాగులో కొత్త వ్యవసాయ పద్ధతులను చేపట్టగలరు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ కంపెనీలను ప్రవేశ పెట్టడాన్ని నిషేధిస్తూ సమతా కేసులో 1997 నవంబర్‌ 7న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి.  – ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ఇంధన శాఖ విశ్రాంత కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement