ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ సమక్షంలో మాట్లాడుతున్న టీడీపీ కార్యకర్త మజ్జి శ్రీనివాసరావు (ఫైల్)
విజయనగరం జిల్లా చిన్నశిర్లాం
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు అనుచరుడి శివాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులపై రెచ్చిపోయిన మరో ఉదంతమిది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం చిన్నశిర్లాం పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ కార్యకర్తలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
‘ఎవడ్రా నువ్వు చెత్త నా కొడకా.. ఏ విషయం నాకు తెలియకుండా చేయవద్దని మొన్న నీకు వార్నింగ్ ఇవ్వలేదా.. నీకు చెప్పలేదా.. లం..కొ.. వేషాలు దెం...వా. ఆఫీసులో పెట్టి కొడతాను.. చెత్తనా కొ.. నోరుముయ్యు.. లం..కొ.. నువ్వు నాకు నేరుగా వచ్చి చెప్పవా.. ఎవడికి కావాలి నీ మెస్సేజ్. ఇప్పుడు చెరువు పనివారికి ఎందుకు ఫోన్‌చేశావు ? వాళ్లు ఎక్కువా ? మేం ఎక్కువా చెప్పరా వెధవ నా కొ.. ఎవడ్రా నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది.. మర్యాదగా పనిచేయి.. లేకపోతే.. దెం... మాకు చెబుతావా నీతులు.. ఉద్యోగం చేస్తున్న నీకు సిగ్గులజ్జా లేవా..’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అనుచరుడు మజ్జి శ్రీనివాసరావు ఫోన్‌లో శివాలెత్తిపోయారు.
ఇంతలో మరో టీడీపీ కార్యకర్త ‘చెత్త నా కొడకా.. నువ్వు ఊళ్లోకి రారా నీ సంగతి తేలుస్తాం.. ఎవరికి కంప్లైట్ ఇస్తావో ఇవ్వరా..’ అంటూ నోటికి పనిచెప్పాడు. చిన్నశిర్లాంలో సచివాలయ గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి వి.బిందుశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం సోషల్ ఆడిట్ గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభకు సంబంధించి ముందుగానే ఆ గ్రామ టీడీపీ కార్యకర్తలకు సెల్‌ఫోన్ వాట్సప్ ద్వారా మెసేజ్ పెట్టి ఆహ్వానించారు.
తమను నేరుగా పిలవలేదంటూ మజ్జి శ్రీనివాసరావు ఫోన్‌లో శివాలెత్తిపోయారు. ఉద్యోగి తల్లిని సైతం బూతులు తిట్టారు. ఫోన్‌లో పంచాయతీ కార్యదర్శి బతిమాలుతున్నా వినలేదు. పంచాయతీ కార్యదర్శిని బూతులు తిట్టిన టీడీపీ వారిపై ఎంపీడీవోకి, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శుల సంఘం నేతలు చెప్పారు.
ఉద్యోగులకు సైతం భద్రత లేదు
రాష్ట్రంలో ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం భద్రత లేదు. తెలుగుదేశం వారు గూండాల్లా వ్యవహరిస్తూ ఉద్యోగులపై రంకెలేయడం దారుణం. – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్‌సీపీ , రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి


