బడ్జెట్‌.. నారా వారి మోసం | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌.. నారా వారి మోసం

Feb 17 2026 8:55 AM | Updated on Feb 17 2026 8:55 AM

బడ్జె

బడ్జెట్‌.. నారా వారి మోసం

పెళ్లకూరు:బాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ సామాన్యులను నడ్డివిరిచేలా ఉందని, దీంతో మరోసారి చంద్రబాబు మోసం తేటతెల్లం అయ్యిందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పుల్లూరులోని ఆయ న నివాసం వద్ద మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా కొండంత ఆశతో ఎదురు చూస్తుంటే నారావారి అంకెల గారఢీతో నిరాశ మిగిల్చారన్నారు. సామా న్య ప్రజానీకానికి కన్నీళ్లు మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలను అవమాన పరిచేలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ1500 అందజేస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కేటాయించకపోవడం ఆయన మోసానికి నిదర్శనమన్నారు. నిరుద్యోగులకు నిరాశ మిగిలిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోకుండా అంకెల గారఢీతో జిమ్మిక్కులు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. ఆయన వెంట నాయకులు వెంకటేశ్‌రెడ్డి, చలం ఉన్నారు.

గొల్లపాళెంలో విషాదం

చిట్టమూరు: మండలంలోని గొల్లపాళెం గ్రామానికి చెందిన మణెమ్మ శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని సోమవారం గొల్లపాళెం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శివయ్య దర్శనానికి వెళ్లిన మణెమ్మ ఫిట్స్‌ వచ్చి ఊపిరాడక మృతి చెండదం బాధాకరమన్నారు.

బడ్జెట్‌.. నారా వారి మోసం 1
1/1

బడ్జెట్‌.. నారా వారి మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement