జిల్లాలో నిరుద్యోగుల వివరాలివీ..
రెండేళ్లు గడుస్తున్నా భృతిపై మాటే ఎత్తని ప్రభుత్వం యువతను మోసం చేశారని ఆగ్రహం జిల్లాలో 9 లక్షల మంది ఎదురుచూపు
‘మేం అధికారంలోకి వస్తే పారిశ్రామిక విప్లవం సృష్టిస్తాం.. ఇంటింటికీ ఓ ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు భృతి ఇస్తాం..’ ఇవీ నాటి ఎన్నికల్లో బూటకపు బాబు అండ్ కో హామీలు. దీంతో బాబు సర్కారు గద్దెనెక్కింది.. అసెంబ్లీలో మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టింది.. అయినా నేటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు.. ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. మూడో బడ్జెట్‌లో కూడా భృతికి నిధులు కేటాయించకపోవడంతో నిరుద్యోగ భృతి భ్రాంతి అని తేలిపోయింది.. దీనిపై యువత నిప్పులు కక్కుతోంది.
యువతను నమ్మించి మోసం చేసి..
జిల్లాలో సుమారు 9 లక్షల మంది నిరుద్యోగు లు చంద్రబాబు ఇచ్చిన హామీతో నిరుద్యోగ భృతి కోసం వేచిచూస్తున్నారు. ఒక్కో నిరుద్యోగికి రెండేళ్లుగా రూ.72 వేలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పది, ఇంటర్, ఐటీఐ, డి ప్లొమో, డిగ్రీలు, పీజీలు, బీటెక్, పలు మెడిక ల్ కోర్సులను పూర్తి చేసి, ఖాళీగా ఉన్న లక్ష లాది మంది యువత ఆశలపై బాబు సర్కార్ నీళ్లు చల్లింది. అన్ని ప్రభుత్వ శాఖలతో కలిపి ఖాళీగా ఉన్న సుమారు 98 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ తుంగలో తొక్కేశారు. రెండేళ్లుగా జిల్లాలో వేలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా పట్టించులేదు.
తిరుపతి సిటీ: నిరుద్యోగ భృతి బ్రాంతిగా మారింది. ఎన్నికల హామీపై బాబు సర్కార్ యూటర్న్ తీ సుకుంది. యువతకు ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి కుటుంబంలోని నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి అందిస్తాం..పారిశ్రామిక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించి తీరుతాం.. అని సార్వత్రిక ఎన్నికల్లో బా బు అండ్ కో ప్రగల్భాలు పలికి యువతను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్న జాబ్ క్యాలెండ్ ఊసే ఎత్తకపోగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయిస్తారని జిల్లాలోని సుమారు 9 లక్షల మంది నిరుద్యోగులు వేచి చూశారు. మాటవరసకై నా భృతి ప్రస్తావనే బడ్జెట్‌లో రాకపోవడంతో భృతికి మంగళం పాడేశారని స్పష్టమైంది. ఇ చ్చిన హామీలను నెరవేర్చని కూటమి సర్కార్‌ను చూసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
గాలం వేసి..నామం పెట్టేశారు!
ఎన్నికల్లో యువతకు గాలం వేసి ఓట్లు దండుకునేందుకు యువగళం పేరుతో పాదయాత్ర చేప ట్టిన లోకేష్ ఊరు వాడా తిరుగుతూ సభలు పెట్టి అపద్ధాలు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలను ఏటా భర్తీ చేస్తాం. ఏడాదికి 4 లక్షల ప్ర భుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం. ఉ ద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతిని అంది స్తామని ఊదరగొట్టారు. అధికారం చేపట్టి మంత్రిగా తనకు ఉపాధి కల్పించుకుని నిరుద్యోగులకు శఠగోపం పెట్టేశారు.
నిరుద్యోగ భృతికి మంగళం పాడేసిన బాబు సర్కార్
నియోజకవర్గం పదో తరగతి ఇంటర్, ఐటీఐ, డిప్లోమో యూజీ పీజీ ఆపైన
తిరుపతి 92,210 26,560 56,102 22,940
చంద్రగిరి 77,357 35,865 45,776 16,887
శ్రీకాళహస్తి 65,720 38,150 41,805 14,125
వెంకటగిరి 45,771 25,900 38,007 10,750
సూళ్లూరుపేట 51,325 17,550 35,650 9,255
కోడూరు 44,867 12,763 40,127 11,558
సత్యవేడు 50,122 13,407 31,252 10,657
రెండేళ్లుగా నిరుద్యోగ భృతి బకాయిలు
నియోజకవర్గం భృతికి అర్హులు(సుమారుగా) చెల్లించాల్సిన భృతి(రూ.కోట్లలో)
తిరుపతి 1,97,812 165.20
చంద్రగిరి 1,77,885 121.60
శ్రీకాళహస్తి 1,59,800 101.72
వెంకటగిరి 1,20,428 86.70
సూళ్లూరు పేట 1,13,780 81.92
కోడూరు 1,09,315 83.22
సత్యవేడు 1,05,438 76.74
జిల్లాలో నిరుద్యోగుల వివరాలివీ..


