ఆగ్రహానికి గురికాక తప్పదు
చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులను నట్టేట ముంచింది. ఏటా జాబ్ క్యాలెండ్ అన్నారు..ఆ ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేలు నెలకు జమ చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పటివరకు భృతి ప్రస్తావలేదు. కచ్చితంగా 2026–27 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని భావించారు. నిధులు కేటాయించలేదు. దీంతో ఆ పథకానికి మంగళం పాడేశారని స్పష్టమైంది. ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదు. – కొండ యుగంధర్,
భారతీయ దళిత విద్యార్థి సేన ప్రెసిడెంట్, తిరుపతి


