ఆరోగ్య దిక్సూచి యోగా | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య దిక్సూచి యోగా

Feb 17 2026 7:17 AM | Updated on Feb 17 2026 7:17 AM

ఆరోగ్య దిక్సూచి యోగా

ఆరోగ్య దిక్సూచి యోగా

తిరుపతి సిటీ:ఆధునిక కాలంలో మానవు ని ఆరోగ్యానికి దిక్సూచి యోగాసనాలని శ్రీకృష్ణాశ్రమ దక్షిణామూర్తి పీఠం పీఠాధీశులు స్వామి సదానంద మహారాజ్‌ పే ర్కొన్నారు. ఆయన సోమవారం జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగిన అఖిల భారత సంస్కృత వర్సిటీల ప్రాయోగిక యోగా పోటీల సంగమం–2026 ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయిలో యోగాసన పోటీలు నిర్వహించడం యోగశాస్త్ర జ్ఞాన బోధనకు చక్కటి ప్రచార వేదిక అన్నారు. యోగ శాస్త్రం ద్వారా మానవుడు ఇంద్రియ నిగ్రహాన్ని పొంది స్వస్థమైన శరీరాన్ని పొందుతారని చెప్పారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో యోగా శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచి ప్రతిభను వెలికితీసేందుకు జాతీయ స్థాయి యోగా పోటీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ పోటీల్లో 14 సంస్కృత వర్సిటీల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వీసీ ప్రొఫెసర్‌ హరేకృష్ణ శతపది, రిజిస్ట్రార్‌ వెంకటనారాయణరావు, డీన్‌ రజనీకాంత్‌ శుక్లా, ప్రొఫెసర్‌ విష్ణుభట్టాచార్యులు, ప్రొఫెసర్‌ దక్షిణమూర్తి శర్మ, రంగనాథన్‌, అధ్యాపకులు డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ తపన్‌ కుమార్‌ గడై, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement