బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

Feb 17 2026 7:17 AM | Updated on Feb 17 2026 7:17 AM

బ్రహ్

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల మోత
సమస్యలు పరిష్కరించకపోయినా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసి వందలాది అర్జీలు ఇచ్చారు.
రెండో ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో టైరు పంక్చర్‌ కావడంతో ఓ సుమో కొండను ఢీకొంది. ఎవరికీ గాయాలు కాలేదు.

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

తెప్పపై ఊరేగుతున్న సోమస్కందుడు

సమస్త భూమండలాన్ని రథంగాను..సూర్యచంద్రాదులను నేత్రాలుగా.. భూమ్యాకాశాలను చెవులుగా..అగ్నిభట్టారుకుడిని మూడో నేత్రంగా.. చతుర్వేదాలను వాక్కు..నాలుగు దిక్కులను రథ చక్రాలుగా..చేసుకున్న ఆదిమధ్యాంత రహితుని రథోత్సవ వైభవ దర్శనంతో భక్తకోటి మనో రథం ఫలించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రథోత్సవ వేడుకల్లో.. దివ్యరథాలపై ముందు సోమస్కందుడు.. వెనుక జ్ఞానప్రసూనాంబ రథోత్సవం ఆద్యంతం నయనోత్సవంగా సాగింది. రథోత్సవం వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వాయులింగేశ్వరుని క్షేత్రం ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. రథోత్సవం సందర్భంగా భక్తులు ఉప్పు, మిరియాలను రథంపై చల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్‌, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి నారదపుష్కరిణిలో త్రినేత్రుని తెప్పోత్సవం వైభవంగా సాగింది. – శ్రీకాళహస్తి

‘డయల్‌ యువర్‌ సీఎండీ’కి 51 వినతులు

నేడు జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : నగరంలలోని శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ నెల 17వ తేదీన ఉదయం 9గంటలకు జిల్లా స్థాయి చెస్‌ పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ ఎన్‌.శశిధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శాప్‌ లీగ్‌లో భాగంగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం అండర్‌–13, 15, 17, 19 విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8గంటలకు శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో జూనియర్‌ అండర్‌–18 ఇండివిడ్యువల్‌ టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ మాస్టర్‌ విభాగంలో సైక్లింగ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన చెస్‌ క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో, అలాగే ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో ఎన్టీఆర్‌ జిల్లాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొంటారని డీఎస్‌డీఓ తెలిపారు.

తిరుపతి రూరల్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమంలో సోమవారం 51 వినతులు అందినట్లు ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు విద్యుత్‌ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ ఖాన్‌, కె.గురవయ్య, కె.రామమోహన్‌ రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు పి.హెచ్‌.జానకి జె. రమణా దేవి, ఆర్‌.పద్మ, యం.మురళీ కుమార్‌, యం.కృష్ణా రెడ్డి, సిహెచ్‌ రామచంద్ర రావు, కె.సంపత్‌ కుమార్‌, జనరల్‌ మేనేజర్లు విజయన్‌, చక్రపాణి, సురేంద్రరావు, భాస్కర్‌ రెడ్డి, జగదీష్‌, లత పాల్గొన్నారు.

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం1
1/4

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం2
2/4

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం3
3/4

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం4
4/4

బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement