ఆశగా ఎదురు చూశాం
నేను ఎంబీఏ పూర్తి చేశా. ఉద్యోగ వేటలో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశతో ఎదురు చూశాం. నిరాశ మిగిల్చారు. మా లాంటి యువతకు నిరుద్యోగ భృతి ఆసరాగా ఉంటుందని అనుకున్నాం. కానీ ఆశలు అడియాశలయ్యాయి. – సుకన్య, ఎంబీఏ, తిరుపతి రూరల్
చేతులెత్తేస్తారని ఊహించలేదు
నిరుద్యోగ భృతి కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకు రూ.72 వేలు రావాల్సి ఉంది. బడ్జెట్‌లో రెండేళ్ల భృతి బకాయిల కోసం నిధులు కేటాయిస్తారని ఎదురు చూశా. కానీ నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తామనే మాట సైతం ఎత్తలేదు. దీంతో భృతిని అమలు చేసే ఉద్దేశం లేదని, చేతులెత్తేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు అండ్ కో అమలకు వీలు కాని హామీలను ఓట్ల కోసం ఇచ్చినట్లు అర్థమైంది. – రామచంద్ర, ఎమ్మెస్సీ, శ్రీకాళహస్తి
●
ఆశగా ఎదురు చూశాం


