అవమానాలు భరించలేను.. జనసేనకు రాజీనామా చేస్తున్నా.. | Unguturu Mandal Janasena President Rambabu Resigns | Sakshi
Sakshi News home page

అవమానాలు భరించలేను.. జనసేనకు రాజీనామా చేస్తున్నా..

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 9:26 AM

Unguturu Mandal Janasena President Rambabu Resigns

ఉంగుటూరు: ‘జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి శక్తికి మించి పనిచేశా.. అయితే అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాకు ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.. అవమానాలు భరించలేను.. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పంది రాంబాబు తెలిపారు.

సోమవారం పార్టీ సభ్యత్వానికి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ.. ప్రతిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌కి, జిల్లా అధ్యక్షుడికి పంపించారు. అనంతరం ఉంగుటూరులో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారీ్టలో తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకు అన్నీ అవమానాలేనని వాపోయారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాలుగు సార్లు పార్టీ మండల కార్యకర్తల సమావేశాలు నిర్వహించారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఒక మండల అధ్యక్షుడిగా ఎప్పుడూ చూడలేదని.. కార్యకర్తల దగ్గర చులకనగా చూసేవారని వాపోయారు. ఉన్నత వర్గాలకు, ధనికులకు మాత్రమే ఎమ్మెల్యే ధర్మరాజు దగ్గర ప్రాధాన్యత లభిస్తుందని..బడుగు, బలహీన (బీసీ) వర్గాలకు ఉండదన్నారు. అందుకే ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి పని చేయలేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement