గళమెత్తిన వీఆర్వోలు
లింగపాలెం : పని ఒత్తిడితో వీఆర్వోలు మానసి కంగా ఆందోళన గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని మండల వీఆర్వోలు గళమెత్తారు. నల్ల బ్యాడ్జీలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. రెవెన్యూ, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారుల్లో సమన్వయ లోపంతో వీఆర్వోలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, వీఆర్వోల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు కొండపల్లి వేణుగోపాల్, దాసరి రంగారావు, షేక్ పహిర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): చిరుధాన్యాలతో ఆర్యోగకరమైన వంటలు తయారు చేసుకుని తినాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన చిరుధాన్యాలుతో రుచికరమైన వంటలు పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆరోగ్యవంతమైన సమాజం తీర్చిదిద్దాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వర రావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని ఆగడాలలంక సీబీసీఎన్‌సీ ప్రాథమిక పాఠశాల, బుసరాజుపల్లి పీఎంకే ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 23, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్‌లో పరీక్షలు నిర్వహిస్తారని, సీఎస్‌ఈఏపీ వె బ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 79890 02168లో సంప్రదించాలన్నారు.
ఏలూరు(మెట్రో): చెస్, సైక్లింగ్ విభాగాల్లో శాప్ లీగ్ రాష్ట్రస్థాయి సెలెక్షన్స్, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం శాప్ లీగ్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 జిల్లాస్థాయి చెస్ పోటీలు, సెలెక్షన్స్ నిర్వహిస్తామన్నారు. 24న అండర్–18 సైక్లింగ్ పోటీలు, సెలెక్షన్స్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9440647391, 9059485538 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
గళమెత్తిన వీఆర్వోలు


