బలివేలో కల్యాణ శోభ | - | Sakshi
Sakshi News home page

బలివేలో కల్యాణ శోభ

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

బలివేలో కల్యాణ శోభ

బలివేలో కల్యాణ శోభ

బలివేలో కల్యాణ శోభ

ముసునూరు: బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి జగజ్జ్యోతి కార్యక్రమం అనంతరం స్వామివారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. అర్చకులు తోలేటి అరుణ భాస్కర్‌, చావలి అమర్‌బాబు కల్యాణ తంతు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రా మోత్సవంగా కిలోమీటరు దూరంలోని మృత్యుమల్లేశ్వరస్వామి (తాత గుడి) ఆలయానికి వెళ్లి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సోమ వారం ఉదయం బిందె తీర్థం, హోమం, బలిహరణ, సాయంత్రం హోమం, బలి హరణాదులు, రాత్రి మహాకుంభం, నారకోలోత్సవం నిర్వహించారు. మంగళవారం అమావాస్య కావడంతో సోమవారం రాత్రి నుంచే అమావాస్య స్నానాలకు భక్తులు తరలివస్తున్నారని ఈఓ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు. ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. నూజివీడు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. సర్పంచ్‌ రావు ప్రవీణ సుధాకర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బొమ్మకంటి శ్యామలరావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement