నేత్రపర్వం.. రథోత్సవం
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసిన రథంలో స్వామి ఉత్సవమూర్తులతో క్షేత్రం దగ్గర నుంచి నాచువారి సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఈఓ డి.రామకృష్ణంరాజు, చైర్మన్ బంగార్రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


