భృతి.. అంతా భ్రాంతి
దగా చేశారు
అమలు చేస్తారా?
జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పామాయిల్, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పలు పరిశ్రమలకు పుష్కలంగా ల్యాండ్ బ్యాంక్ మెట్ట ప్రాంతంలో ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోని సర్కారు గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేవీ ఆయుధ కర్మగార డిపో ఏర్పాటుకు అడ్డగోలుగా ప్రయత్నిస్తోంది. అయితే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు విలువ పెరిగేలా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయని పరిస్థితి. జిల్లాలో పామాయిల్, కోకో, కొబ్బరి, ఆక్వా సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏకై క కార్పొరేషన్ గా ఉన్న ఏలూరు, శివారు ప్రాంతాల్లో కనీసం 200 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కూడా లేకపోవడం గమనార్హం.
ఉద్యోగాల
మాటేంటి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిరుద్యోగులకు చంద్రబాబు సర్కారు పంగనామం పెట్టింది. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ప్రచారాలతో హోరెత్తించారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత మూడు రాష్ట్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా కనీసం నిరుద్యోగ భృతి మాటెద్దలేదు. ఉద్యోగాల కల్పనలో భాగంగా కనీసం జిల్లాలో ఒక్క పరిశ్రమకు కూడా కొబ్బరికాయ కొట్టలేదు. ఇలా జిల్లాలో 4.51 లక్షల కుటుంబాలను నిరుద్యోగ భృతి పేరుతో సర్కారు వంచించింది.
ప్రశ్నిస్తే వేధింపులు
ఏడాదికి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతితో ఆదుకుంటామని కూటమి నేతలు హామీ ఇ చ్చారు. ఈ క్రమంలో జిల్లాలో ఏటా 20 వేలు చొప్పున 40 వేల ఉద్యోగాలు ఇవ్వాలి. లేకుంటే ఏడాదికి రూ.1,969 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాలి. అయితే వీటన్నింటికీ సర్కారు మంగళం పాడింది. అలాగే ప్రశ్నించిన గొంతులపై వేధింపుల పర్వానికి దిగింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించినా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. దీంతో పాటు పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఏలూరులో పరిశ్రమలు పూర్తిగా కరువయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వంతో కనీసం వంద మందికి ఉపాధి కల్పించే కొత్త పరిశ్రమ ఒక్కటీ కూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం.
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు
బడ్జెట్‌లో నిరుద్యోగులకు కేటాయింపుల్లేవ్
నిరుద్యోగ భృతి ఒట్టిమాటే
జాబ్ క్యాలెండర్ ఊసే లేదు
జిల్లాలో 4.51 లక్షల కుటుంబాలకు అందని సాయం
పరిశ్రమల స్థాపనా పట్టదు
నిరుద్యోగ యువతను చంద్రబాబు దగా చేశారు. ఎన్నికల ముందు నిరుద్యో గ యువతను ఆదుకుంటామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు లేదు, ఉద్యోగాల కల్పన అసలే లేదు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్‌లో ఏ మాత్రం కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది.
–నిట్టా శ్రీను, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు
నిరుద్యోగులను మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ని ట్టనిలువునా దగా చేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఒక్క నెల కూడా నిరుద్యోగ భృతి ఇ వ్వలేదు. ఈ పథకం అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్‌లో నిధులు ఎందుకు కేటాయించలేదు.
– ముంగర సంజీవ్‌కుమార్, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్
భృతి.. అంతా భ్రాంతి
భృతి.. అంతా భ్రాంతి


