మేత వేసేందుకు వెళ్లి మృత్యుఒడికి..
● రొయ్యల చెరువు వద్ద ప్రమాదం
● ఫ్యాన్ సెట్ రాడ్‌లో చిక్కుకుని తల్లీకూతుళ్లు మృతి
కలిదిండి (కై కలూరు): రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లి తల్లీకూతుళ్లు మృతిచెందిన విషాద ఘటన కలిదిండి సమీప పడమటిపాలెంలో చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరు మండలం దొడ్డిపట్లకి చెందిన గంగుల శ్రీనివాసరావు, వీర నాగజ్యోతి భార్యాభర్తలు. వీరికి లీలాప్రసన్న, హిమశ్రీ (6) సంతానం. శ్రీనివాసరావు వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం భార్యాకుమార్తెలను కోట కలిదిండిలో అత్తింటిలో దించాడు. 15న సాయంత్రం వచ్చి కలిదిండి భోగేశ్వరస్వామి శివరాత్రి వేడుకలకు వెళ్దామని అన్నాడు. ఆదివారం ఉదయం నాగజ్యోతి తల్లిదండ్రులు శివరాత్రి వేడుకలకు వెళ్లగా ఆమె భర్త కోసం వేచిచూస్తూ ఇంటి వద్దే ఉండిపోయింది. ఈ క్రమంలో తండ్రికి పడమటిపాలెంలో రొయ్యల చెరువు ఉండగా మేత వేసేందుకు మధ్యాహ్నం హిమశ్రీతో కలిసి వెళ్లింది. రొయ్యల చెరువుపై ఫ్యాన్ సెట్లు తిరుగుతున్నాయి. చెరువు గట్టుపై ఫ్యాన్ మోటారు వద్ద దాటుతుండగా నాగజ్యోతి చీర రాడ్డుకు చిక్కుకుంది. దీంతో ఆమె చుట్టు తిరిగి ఎగిరి బలంగా కిందపడింది. త ల్లీకూతుళ్లు ఇద్దరూ నలిగిపోయి అక్కడికక్కడే కన్నుమూశారు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూ తుళ్లను చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. కోట కలిదిండి, దొడ్డిపట్లలో విషాదచాయలు అలముకున్నాయి. కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


