breaking news
Eluru District Latest News
-
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1,010 మందిని ఎంపిక చేయగా వారిలో తొలిరోజు 505 మందిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. ఉదయం 8 గంటల కల్లా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్‌లో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించారు. దీనికి సంబందించిన ఫీజులను కూడా కట్టించుకున్నారు. తొలిరోజు 446 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వగా వారందరికీ అడ్మిషన్లు కల్పించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీనర్, ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, అకడమిక్స్ డీన్ సాదు చిరంజీవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. పలువురు మెంటార్లు, లెక్చరర్లు నిరంతరం కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్ల పరిశీలనలో సిబ్బందికి కలిగే సందేహాలను నివృత్తి చేశారు. కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 100 మంది సిబ్బందిని నియమించి కౌన్సెలింగ్ ప్రక్రియను తొలిరోజు ప్రశాంతంగా ముగించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులను ఏర్పాటు చేసి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. వచ్చిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు తక్కువ ధరకే భోజన సదుపాయాన్ని కల్పించారు. కవలలకు సీట్లు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఇద్దరు కవలలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. సోమవారం కౌన్సెలింగ్ కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చిన నందికట్ల కుందన్ వెంకట నాగశ్రీ సాయి, నందికట్ల కుందన వెంకట నాగశ్రీ కంచికచర్లలోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నారు. కుందన్‌కు 587 మార్కులు, కుందనకు 584 మార్కులు వచ్చాయి. వారిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం దరఖాస్తు చేయగా, ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీట్లు వచ్చాయి. దీంతో సోమవారం వారిద్దరూ పీయూసీలో చేరారు. ఈ సందర్భంగా వారిని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు. 446 మందికి ప్రవేశాలు -
మొక్కజొన్న సాగులో మెలకువలు ఇలా..
చింతలపూడి : మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, సాగునీటి కింద పండిస్తారు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలో పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాల పంటగాను, కాయగూర రకంగాను రైతులు సాగు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 వేల హెక్టారుల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఏటా 4.40 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ఖరీఫ్ మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు వివరాలను వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వై సుబ్బారావు రైతులకు సూచించారు. విత్తే సమయం సాధారణంగా జూన్ 15 నుంచి జూలై లోగా విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే నీటి వసతి కింద స్వల్పకాలిక హైబ్రీడ్ రకాలు ఆగస్టు రెండో వారంలో కూడా విత్తుకోవచ్చు. అనువైన రకాలు ● దీర్ఘకాలిక రకాలు: (100–120 ) రోజులు డీహెచ్ఎం –113, 900 ఎం గోల్డ్, బయో 9861, ప్రో–311, 30బి07 ● మధ్య కాలిక రకాలు : (90–100 రోజులు) డీహెచ్ఎం–111, 117, 119, కేహెచ్–510, బయో– 9657, కేఎం–9541, ఎంసీహెచ్–2 ● స్వల్పకాలిక రకాలు : (వీటి కాల పరిమితి 90 రోజుల కంటే తక్కువ) డీహెచ్ఎం– 115, ప్రకాశ్ కేహెచ్–5991, జేకేఎంఎచ్–1701 డీకేసీ–7074 ఆర్, ఎంఎంహెచ్–1701, డీకేసీ– 7074 ఆర్, ఎంఎంహెచ్– 133, 3342. ప్రత్యేక రకాలు ● తీపి మొక్కజొన్న (స్వీట్ కార్న్): మాధురి, ప్రియ, విన్ ఆరెంజ్, అల్మోరా స్వీట్ కార్న్ రకాలు, సుగర్–75, బ్రైట్జేన్ సంకర రకాలు. విత్తే విధానం ఎకరాకు సంకర రకాలైతే 7–8 కిలోల విత్తనం వాడి 60 సెం.మీ ఎడంగా బోదెలు చేసి సాళ్లలో 20 సెం.మీ ఎడంగా విత్తాలి. ఇలా విత్తితే ఎకరాకు సుమారు 33,333 మొక్కలు వస్తాయి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాస్టాన్ లేదా డైధేన్ ఎం.45 చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి బోదెకు ఒక పక్కగా విత్తాలి. ఎరువుల వాడకం ఖరీఫ్ పంటలో ఎకరాకు 72–80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వాడాలి. మొత్తం పొటాష్, భాస్వరం ఎరువులను పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఒకవేళ జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై జింక్‌లోపం గమనిస్తే జింక్ సల్ఫేట్ (20 గ్రా) పిచికారీ చేయాలి. కలుపు నివారణ పంట విత్తాక 45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పంటను ఏక పంటగా వేసినప్పుడు నేల రకాన్ని బట్టి ఎకరాకు 800–1200 గ్రా, అట్రాజిన్ పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన వెంటనే లేదా 2–3 రోజుల్లోగా పిచికారీ చేసి కలుపును నివారించవచ్చును. వెడల్పాటి కలుపు మొక్కల నివారణకు విత్తిన 30 రోజుల తర్వాత ఎకరాకు అరకిలో 2, 4–డి సోడియం సాల్ట్‌తో పిచికారీ చేయాలి. నీటి తడులు వర్షాధారంగా సాగు చేసినా పూత దశలో వర్షాభావ పరిస్థితులేర్పడితే వీలున్న చోట నీరు తడిపితే మంచి దిగుబడులు వస్తాయి. పూత దశ, గింజలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పైరు తొలి దశలో పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ పైరు తొలి దశలో ఆశించే మొవ్వ తొల్చే పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా విత్తిన 10–12 రోజులకు పైరుపై మోనోక్రోటోఫాస్ (1.6 మి.లీ) లేదా కోరా.ఎన్ (03 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు 25–30 రోజుల దశలో ఆకు సుడుల్లో వేయాలి. ఆకు మాడు తెగులు నివారణకు మాంకో జెట్ (2.5 గ్రా) లీటర్ నీటిలో కలిపి వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే మొక్క దిగువనున్న 2–3 ఆకులు తుంచివేసి ప్రొపికొనజోల్ (1 మి,లీ) లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క ఎండు, కాండం మసికుళ్లు తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్తగా ఎదుర్కొనే రకాల సాగు, పంట మార్పిడి, వేసవిలో లోతు దుక్కులు, పూత దశ తర్వాత నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. పాడి–పంట -
మునిసిపల్ కార్మికుల పోరు ఉద్ధృతం
పోటీ కార్మికులను దింపడంపై అభ్యంతరం తాడేపల్లిగూడెం (టీఓసీ): మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పాతూరు శివారు హెడ్ వాటర్ వర్క్స్, ఫిల్టర్ ప్లాంట్లు వద్ద పోటీ కార్మికులను దింపారన్న విషయాన్ని తెలుసుకున్న ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సాయంత్రం నిరసన శిబిరం వద్ద నుంచి బైక్ ర్యాలీగా స్థానిక హెడ్ వాటర్స్ వర్క్స్ గేటు వద్దకు చేరుకున్నారు. పోటీ కార్మికులను తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిరసన కార్యక్రమం వద్దకు పోలీసులు చేరుకుని వాటర్ సప్లయ్‌ను అడ్డుకోవడం సరికాదని, ప్రజలు ఇబ్బందులను గుర్తించాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గబోమని, ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలుత స్థానిక పురపాలక సంఘం కార్యాలయం వద్ద మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం 8వ రోజు చేపట్టిన నిరసన దీక్షలకు సీఐటీయూ నేతలు సంఘీభావం తెలిపారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని నగరపాలక సంస్థల్లో, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలోని అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని మునిసిపల్ ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఆర్ పేట ఎస్ ఆర్ టు వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన గేటు మీటింగ్‌లో వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, కోశాధికారి బి నారాయణరావు, యూనియన్ నాయకులు నారా శ్రీను, కందుల శ్రీనివాస్, అప్పారావు తదితరులు నాయకత్వం వహించారు. నరసాపురంలో అర్ధనగ్నంగా జలదీక్ష నరసాపురం: స్థానిక వశిష్టగోదావరి వలంధర్‌రేవు గోదావరిమాత విగ్రహం వద్ద కార్మికులు సోమవారం వినూత్నరీతిలో ఆందోళన చేశారు. అర్ధనగ్నంగా గోదావరిలో దిగి జలదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రవమానికి జేఏసీ కమిటీ నాయకులు ఆర్ రత్నం, వి.ఫణి, ఎం.సత్యనారాయణ, కె.కాశీ, సీహెచ్ వాసు, ఎ.మధుబాబు, ఎం.సుజాత, టి.కళ్యాణి, ఎస్ దేవి, కె.అనంతలక్ష్మి నాయకత్వం వహించారు. ఇకపై పూర్తిస్థాయి సమ్మె తణుకు అర్బన్: ఇకపై పూర్తి స్థాయి సమ్మెకు దిగుతున్నట్లు మునిసిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు ఉండ్రాజవరపు శ్రీను, గెల్లా విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమ్మెలో భాగంగా మునిసిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శిబిరంలో కార్మికులు తమ నిరాహారదీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, పిండి పెద్ధిరాజు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు జంగారెడ్డిగూడెం: న్యాయమైన కోర్కెల కోసం మునిసిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనల్లో భాగంగా యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్‌కు సమ్మె నోటీస్ ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు కంతేటి వెంకట్రావు తెలిపారు. ఇకపై పట్టణంలో వీధిదీపాలు నిలుపుదల చేస్తామని, దశలవారీగా మంచినీటి సప్లయ్ కూడా నిలుపుదల చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమ్మెకు మద్దతుగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవి నాగరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్ ఇంజనీరింగ్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన పోరు ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వాటర్‌వర్క్స్, లైటింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కరి చొప్పున సహకరించామని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇకపై పూర్తిస్థాయి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమను పర్మినెంట్ చేసి టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలు, అర్ధ నగ్న ప్రదర్శనలు అధికారులకు సమ్మె నోటీసులు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక -
కాట్రేనిపాడు విద్యార్థికి శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 4వ ర్యాంకు
ముసునూరు: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన దేవరపల్లి మోక్షజ్ఞ అక్షిత్ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించినట్లు తండ్రి సురేష్ తెలిపారు. తమ కుమారుడు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఎస్సీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ లెవెల్ శ్రేష్ఠ ప్రవేశ పరీక్ష రాశాడన్నారు. నాలుగవ ర్యాంకుతో సీబీఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి మోక్షజ్ఞ అక్షిత్‌కు పలువురు అభినందనలు తెలియజేశారు. లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి పాలకోడేరు: లారీ ఢీకొని మోటార్‌సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గొల్లలకోడేరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాలకోడేరు తూర్పు పేటకు చెందిన ఆవాల వెంకటేశ్వరరావు (40) మోటార్‌సైకిల్‌పై గొల్లలకోడేరు వెళ్లి తిరిగి వస్తుండగా గొల్లలకోడేరు బ్రిడ్జి దాటిన వెంటనే ఎదురుగా టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా భీమవరం నుంచి వచ్చిన 108 అత్యవసర వాహన సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వరరావు భార్య దేవి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి ఏలూరు టౌన్ : ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మహిళ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం ఏలూరు బీడీకాలనీకి చెందిన లావేటి సోమేశ్వరరావు, మోహనమ్మకు 2024 ఆగస్టులో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగా సాగినా అనంతరం ఇద్దరి మద్య విభేదాలతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కానీ భర్తను జైలులో పెట్టలేదంటూ ఈనెల 26న మోహనమ్మ జిల్లా జైలు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోహనమ్మ మృతిచెందింది. -
సాగు.. జాగు
ఈ ఫొటోను గమనించారా? పాలకోడేరు మండలం మోగల్లులోని రేలంగి చానల్ దుస్థితి. తణుకు రూరల్ మండపాక నుంచి అత్తిలి, ఇరగవరం మండలాల మీదుగా పాలకోడేరు మండలం మోగల్లు వరకు దాదాపు 27 కి.మీ పరిధిలో వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రేలంగి చానల్ ద్వారా సాగునీరు అందుతుంది. ముందస్తు సాగు కోసం పశ్చిమ డెల్టాకు జూన్ 1నే సాగునీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటికీ శివార్లకు సాగు నీరందని దుస్థితికి ఈ చిత్రం అద్దం పడుతుంది. పూర్తిస్థాయిలో సాగు నీరందక కాలువ పరిధిలోని తొలకరి పనులకు ఆటంకం కలుగుతోంది. సాక్షి, భీమవరం : జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. ధాన్యం బకాయిలు విడుదల కాకపోవడం, పంట పెట్టుబడులకు సర్కారు నుంచి సాయం కొరవడటం, శివారు భూములకు సాగునీరు అందకపోవడం తదితర కారణాలతో జూన్ ముగిసిపోతున్నా తొలకరి పనులు ఇంకా జోరందుకోలేదు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుండగా 50 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 1318 రకం, 25 శాతం విస్తీర్ణంలో ఎంటీయూ 7029 రకం, మిగిలిన విస్తీర్ణంలో ఎంటీయూ 1293, పీఎల్ఏ 1100 తదితర రకాలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునే దిశగా గతంలో జూలై 15లోగా నాట్లు పూర్తిచేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేసేవారు. జూన్ నెలాఖరుకు నారుమడులు వేయడం చాలా వరకు పూర్తికావడంతో పాటు ముందుగా వరి కోతలు జరిగే తాడేపల్లిగూడెం ప్రాంతంలో నాట్లు జోరందుకునేవి. ఈ సీజన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జూన్ నెల ముగిసిపోతున్నా ఇంకా పనులు ముమ్మరం కావడం లేదు. ఇప్పటివరకు 3,120 ఎకరాలకు సంబంధించి నారుమడులు వేయగా, 2,680 ఎకరాల్లో మా త్రమే నాట్లు పడ్డాయి. విడుదల కాని ధాన్యం సొమ్ములు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా నెల రోజులైనా సొమ్ములు చేతికందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేయగా రూ.250 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని రైతులు వాపోతున్నారు. తొలకరి పెట్టుబడుల కోసం చేతిలో సొమ్ముల్లేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆదుకోని ‘అన్నదాత సుఖీభవ’ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలకరి ప్రారంభంలోనే రైతు భరోసాగా రూ.7,500 మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందించారు. విత్తనాలు, నారుమడుల తయారీ, ఎరువుల కొనుగోలుకు రైతులు అప్పులు చేయాల్సిన పని ఉండేది కాదు. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. ఈ ఏడాదీ సాయం విడుదలపై స్పష్టత లేదు. దీంతో రైతులు పంట పెట్టుబడులకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సాగునీరు.. అందని తీరు జిల్లాలో 11 ప్రధాన పంట కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీటి సరఫరా జరుగుతోంది. క్లోజర్లో భాగంగా సుమారు రూ.77 కోట్ల విలువైన 150 పనులతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో కొన్నింటికి అనుమతులు రాగా సకాలంలో పనులు పూర్తికాకపోవడం తొలకరి పనులపై ప్రభావం చూపుతోంది. ముందస్తు కోసమంటూ జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా క్లోజర్ పనులు పూర్తికాకపోవడంతో ఇప్పటికీ పలుచోట్ల శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలపైనే సాగుకు సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్.. లేదు రిలీఫ్ జిల్లాలో నత్తనడకన తొలకరి పనులు జూన్ ముగుస్తున్నా జోరందుకోని నారుమడులు సర్కారు నుంచి కొరవడిన సహకారం సాగునీటి సరఫరాలో జాప్యం రూ.250 కోట్ల మేర ధాన్యం బకాయిలు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు -
సిఫార్సులబదిలీలలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రంలో బదిలీలు అంటేనే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం పలు శాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్‌లు నిర్వహించింది. అయితే ఎక్కడా సజావుగా సాగలేదు. ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. తాజాగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వె ల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు సైతం బ దిలీల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేయడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోంది. వీరి బదిలీల్లో ఎమ్మెల్యేలు పెత్తనం చేయాలని చూడటంతో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. స్థానిక నాయకుల చెప్పుచేతల్లో పెట్టేలా.. గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలోని స్థానిక కూటమి నాయకుని సిఫార్సు ఉంటేనే లేఖలు ఇస్తున్నట్టు సమాచారం. స్థానిక నాయకుల సిఫార్సులు తీసుకుంటే ఆ తర్వాత తమ ఉద్యోగాలు ఆ స్థానిక నాయకుల వద్దే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వల్ల అర్హులైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముందని సెక్రటరీలు అంటున్నారు. అదీ కాక ఎంత మందికి స్థానిక నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని, అర్హత ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు పట్టించుకోరా? నియమ నిబంధనలు కాదని బదిలీల్లో సిఫార్సులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యో గాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాము ర్యాంకులు సాధించి ఏం ప్రయోజనమని వాపోతున్నారు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియార్టీ జాబితా లేకుండానే.. ఏ శాఖలో అయినా సీనియార్టీ జాబితా ప్రదర్శించి దాని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాలయ ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా రూపొందించకుండా తమను మూడు ప్రాంతాలు కోరుకోమని, వాటిని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. తాము కోరుకున్న మూడు ప్రాంతాలనే మరో పది మంది కోరుకుంటే తమకు ఎక్కడి స్థానాలు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాగే బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీల్లో కూడా జాబితా రూపొందించకుండా తమతో ఫారాలు నింపించుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల గగ్గోలు బదిలీల్లో ఎమ్మెల్యేల పెత్తనం స్థానిక నాయకుల సిఫార్సుల మేరకే లేఖలు కూటమి నేతల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ర్యాంకుల ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ సీనియార్టీ జాబితా లేకపోవడంపై ఆగ్రహం పారదర్శకంగా చేపట్టాలి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యమిస్తే అర్హులు నష్టపోతారు. బదిలీలకు సీనియార్టీ జాబితా తయారు చేయకుండా అధికారులు ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేస్తామనడం నిబంధనలకు విరుద్ధం. సొంత మండలాల్లోకి బదిలీలు చేయమనే నిబంధన అమలు చేస్తున్నప్పుడు ఇతర నిబంధనలు కూడా అమలు చేయాలి. – కె.అజయ్‌బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలు మర్చిపోయారు ప్రభుత్వం బదిలీలపై జీఓ ఇచ్చి మార్గదర్శకాలు మర్చిపోయింది. గత 30, 40 ఏళ్లలో ఇలాంటి బదిలీలు చూడలేదు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో బదిలీలు ముగిసినట్టు ప్రచారం జరుగుతుండటం సెక్రటరీలను కలవరపెడుతోంది. ఎమ్మెల్యేల లేఖలకే ప్రాధానమిస్తే ఇక బదిలీలకు కౌన్సెలింగ్ ఎందుకు. లేఖలు పొందిన వారు మినహా మిగిలిన వారంతా ఆందోళనలో ఉన్నారు. – ఈ.నరేష్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీవిధులకు దూరం.. ప్రదక్షిణల పర్వం సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీలు స్థానిక కూటమి నాయకుల ఇళ్ల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి విధులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఉద్యోగులకు స్థానిక నాయకులతో నేరుగా సంబంధాలు ఉండటంతో వారు తొలి ప్రాధానత్యగా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు అందుకున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో బంధుత్వమో, స్నేహమో ఉన్న వారిని వెంటబెట్టుకుని వారి చుట్టూ తిరిగి ఇప్పటికే ఎమ్మెల్యేల లేఖలను సంపాదించి సాంఘిక సంక్షేమ అధికారులకు పంపినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే 19 మంది అభ్యర్థులతో కూడిన సిఫార్సు లేఖను జిల్లా పంచాయతీ అధికారికి పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
డీఎస్సీ పరీక్షకు 455 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఆదివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 83 మంది, మధ్యాహ్నం 101 మందికి 94 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 115 మందికి 95 మంది, మధ్యాహ్నం 201 మందికి 183 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. 94 శాతం హాజరు భీమవరం: జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 210 మందికి 199 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
నరసాపురం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఆదివారం నుంచి వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా పనులను సైతం బహిష్కరించారు. తమ సమస్యలపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించే వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. నరసాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు న్యాయం చేయడంలో ప్రభు త్వం తాత్సారం చేయడం దారుణమన్నారు. కోటిపల్లి కాశీ, ఎం.రత్నం, సీహెచ్ సత్యనారాయణ, ఫణి నాయకత్వం వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి తణుకు అర్బన్: తణుకులో కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం శిబిరంలో జేఏసీ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను, కార్యదర్శి గెల్లా విజయ్‌కుమార్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి రావాలని కోరారు. 25 ఏళ్లకు పైబడి విధుల్లో ఉంటున్నా రూ. 13 వేల వేతనాలే అమల్లో ఉండటం బాధాకరమన్నారు. నాయకులు దాసరి సత్యనారాయణ, రాపాక సురేష్, ప్రసాద్, రాపాక రవి తదితరులు పాల్గొన్నారు. గూడెంలో ఏడో రోజుకు చేరిన దీక్షలు తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో కా ర్మికుల దీక్షలు ఆదివారం ఏడో రోజూ కొనసాగా యి. జేఏసీ నాయకులు మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని అన్నారు. -
పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ
● జిల్లాతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో నిర్వహణ ● ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదుల స్వీకరణ ● టోల్‌ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను వికేంద్రీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని అంటు న్నారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలకు పీజీఆర్ఎస్ను విస్తరించారు. ఈ మేరకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆన్లైన్లో సైతం ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు, ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 1100ను ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, డివిజన్ స్థాయి ల్లో పీజీఆర్ఎస్ను నిర్వహించనున్నారు. తాకిడిని తగ్గించేలా.. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లో జరి గే పీజీఆర్ఎస్కు హాజరయ్యేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేక్రమంలో అర్జీల తాకిడి కూ డా ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ కార్యక్రమం వి కేంద్రీకరణకు నిర్ణయించారు. స్థానికంగా పీజీఆర్ఎస్ నిర్వహించడం వల్ల ప్రజలకు వ్యయ ప్రయా సలు తగ్గడంతో పాటు సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. పీజీఆర్ఎస్ను పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుందని, స్థానిక సమస్యల పరిష్కారానికి అక్కడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని జిల్లా అధికారులు అంటున్నారు. స్థానికంగా అర్జీలు స్వీకరించడం వల్ల జిల్లాస్థాయిలో పని ఒత్తిడి తగ్గుతుందని, అర్జీలపై పర్యవేక్షణ పెరుగుతుందని చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా.. పీజీఆర్ఎస్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. హెచ్‌టీటీపీఎస్://మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి సమాచారం తెలుసుకునేందుకు ట్రోల్ ఫ్రీ 1100 నంబర్లో సంప్రదించవచ్చు. -
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: చింతలపూడి సబ్ జైలును ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శ్రీదేవి సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. హింసా మా ర్గాన్ని వీడాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమును తనిఖీ చేసి ఆహారాన్ని పరిశీలించారు. సబ్జై లు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్త కార్యదర్శి కె.రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు, సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యా నల్ లాయర్ టోకూరి వెంకటేష్, పీఎల్వీటీవీఎస్ రాజు, సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్‌కుమార్ ఉన్నారు. జిల్లాలో అమలుకాని విద్యాహక్కు చట్టం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాహక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. జిల్లాలో పూ ర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలను చేర్పించుకుంటున్నా వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి అనధికారికంగా రుసుములు వ సూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర విచారణ జరపాలని రవి కోరారు. ‘జన సురక్ష’పై ప్రచారం ఏలూరు(మెట్రో): జన సురక్ష పథకాల ద్వారా సామాన్యులకు భద్రత కల్పిస్తున్నట్టు లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.నీలాద్రి తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి సహకారంతో ఏలూరు జిల్లావ్యాప్తంగా మూడు నెలల పాటు పథకాల నమోదు కార్యక్రమంపై ప్రచారం నిర్వహించనున్నామన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుందన్నారు. పీఎం సురక్ష బీమా యోజనలో చేరితే రూ.2 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుందన్నారు. బ్యాంకు మిత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందే అవకాశం ఉందన్నారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. -
పేగు బంధం కాదన్నా.. మానవత్వం చాటి..
వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకుడుజంగారెడ్డిగూడెం: పేగు బందం కానరాలేదు. ఒడిదుడుకులు ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టిన వృద్ధురాలిని అనాథగా వదిలేశారు. ఆమె ఆఖరి మజిలీలోనూ పట్టించుకోకపోగా మాన వత్వం చాటుతూ ఆశ్రమ నిర్వాహకుడు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. కోడూరి శకుంతల అనే వృద్ధురాలిని నాలుగేళ్ల క్రితం జంగారెడ్డిగూడెంలోని సీతామహాలక్ష్మి వృద్ధుల, వికలాంగుల, అనాథ ఆశ్రమంలో కుటుంబసభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఆమె జీవనం సాగిస్తోంది. ఇటీవల శకుంతల అనారోగ్యం పాలుకాగా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్ ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు తెలియజేసినా స్పందించలేదు. చివరకు చికిత్స పొందుతూ శకుంతల (94) ఆదివారం కన్నుమూశారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తామని అప్పటివరకు చెప్పిన కుటుంబసభ్యులు చివరి నిమిషంలో ముఖం చాటేశారు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు శేఖర్ అన్నీ తానై వృద్ధురాలి అంత్యక్రియలను కుటుంబసభ్యులు, బంధువుల మధ్య నిర్వహించి సేవాతత్పరతను చాటారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జూలై 9న జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఏలూరు ఏరియా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత మే 20న జరగాల్సిన దేశవ్యాప్త సమ్మె యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడిందని గుర్తు చేశారు. తిరిగి జూలై 9న జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు నుంచి, వేతన ఒప్పందాల వరకు యజమానులకు అనుకూలంగా, కార్మికులకు కఠినతరంగా లేబర్ కోడ్లు ఉన్నాయని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యావత్తు కార్మిక వర్గం సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలే కాకుండా రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సమస్యలపై జరుగుతున్న ఈ సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ.అప్పలరాజు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి.కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్ మాట్లాడారు. సమావేశంలో ఏరియా నాయకులు బరగడ పోతురాజు, ఎలగాడ శివకుమార్ , పుప్పాల శ్రీనివాస్, బోడెం వెంకట్రావు, వీ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు తప్ప హామీల అమలేదీ?
భీమవరం: కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ కాదని, ట్రబుల్ ఇంజిన్ అని విమర్శించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో పాలనను సూపర్ ఫ్లాప్ చేశారని, ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఒక్కటిచ్చి పథకాలన్నీ అమలు చేశామని చెబుతున్నారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకం కింద 20 లక్షల మంది పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అన్నదాత దుఃఖీభవ చేశారని విమర్శించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి పాలక్ వర్మ, జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమారరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
నష్టాల ఊబిలో రొయ్య రైతు
గణపవరం: ఆక్వా రైతులను ప్రతికూల వాతావరణం ఇంకా వెంటాడుతోంది. దీంతో వేల ఎకరాలలో సాగులో ఉన్న రొయ్యలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నెలారంభం నుంచి ప్రతికూల వాతావరణ ప్రభావంతో రొయ్యలకు వైట్‌స్పాట్ (తెల్ల మచ్చ) వ్యాధితో పాటు ఈహెచ్‌పీ వ్యాధి కూడా తోడవడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి రొయ్యసాగు అంతంత మాత్రంగానే ఉంది. గత జనవరిలో చెరువులలో సీడ్ వేసిన రైతుల్లో 80 శాతం కౌంట్‌కు రాకుండానే పట్టేశారు. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. మే, జూన్ నెలల్లో ప్రతికూల వాతావరణం ఈ వేసవిలో రైతుల అంచనాలు తారుమారయ్యాయి. మే నెలలోనే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడిపోయింది. దీనితో రొయ్యలకు రకరకాల వైరస్లు సోకడంతో అర్ధాంతరంగా పట్టేసి అయినకాడికి అమ్ముకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలలో రొయ్య సాగు చేయగా సుమారు 8వేల ఎకరాలలో కనీసం 100 కౌంట్‌కు రాకుండానే పట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వాను ఆదుకుంటామని ఊదరగొట్టారు. రొయ్యలకు కనీస ధరలు ప్రకటించింది. మేతల ధరలు కూడా తగ్గిస్తున్నట్లు హంగామా చేశారు. ఇవేవీ రొయ్య రైతులకు అక్కరకు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు కొనుగోలు చేసిన దాఖలా లేదు. గత్యంతరం లేక అడిగిన ధరకే అమ్ముకోక తప్పని పరిస్థితి. 100 కౌంట్ రొయ్య రూ.220కు కొనాల్సి ఉన్నా రూ.200 లోపే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల కౌంట్ ధరలోనూ రూ.50 నుంచి రూ.70 వరకూ తగ్గించేశారు. వైరస్ విజృంభణతో రైతు కుదేలు ఈ ఏడాది వ్యాధులు విజృభించి ఆక్వా సాగును కుదేలు చేశాయి. ఏదైనా ఆయకట్టులో ఒక చెరువుకు వైరస్ వస్తే క్షణాల్లో ఆయకట్టులో మొత్తం చెరువులకు వ్యాపిస్తుంది. తక్షణం పట్టుబడి చేయకపోతే వ్యాధి సోకిన రొయ్యతోపాటు ఆరోగ్యంగా ఉన్న రొయ్యలూ దక్కకుండా పోతాయి. దీంతో రైతులంతా రొయ్యలు పట్టేసి అడిగిన ధరకు అమ్ముకున్నారు. గత పది రోజుల్లో గణపవరం, నిడమర్రు మండలాలలో వందల ఎకరాలలో చెరువులు ఖాళీ అయ్యాయి. వ్యాధులకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిప్పడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యాధుల విజృంభణతో అర్ధాంతరంగా పట్టేస్తున్న రైతులు వ్యాపారులు సిండికేటు మారి గిట్టుబాటు ధర ఇవ్వని వైనం ప్రభుత్వం ఆదుకోవాలి రెండేళ్లుగా రొయ్యల సాగు రైతులను కుదేలు చేస్తుంది. నాణ్యత లేని సీడ్, వ్యాధుల వ్యాప్తితో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం హడావుడిగా రొయ్యలకు ధర నిర్ణయించినా తర్వాత పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడంలేదు. ఒక పక్క లీజులు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు, డీజిల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవేళ పంట బాగుంటే వ్యాపారులు సిండికేట్‌గా తయారై రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు. సంకు నాని, రొయ్య రైతు నాణ్యమైన సీడ్ వేయాలి ప్రస్తుత వాతావరణంలో వైరస్ వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రొయ్య సాగు ఆరంభంలోనే సర్టిఫైడ్ హేచరీస్ నుంచి నాణ్యమైన సీడ్ తెచ్చుకోవాలి. వైట్‌స్పాట్, ఈహెచ్‌పీ పరీక్షలు చేయించుకున్నాకే సీడ్ తీసుకోవాలి. సక్రమ యాజమాన్య పద్ధతులతో కొంతవరకూ వ్యాధులు రాకుండా చూడవచ్చు. వైట్‌స్పాట్ వస్తే ఇమ్యూనిటీ పెంచడానికి విటమిన్ సీ, ప్రోబయోటిక్స్ వాడాలి. ఈహెచ్‌పీ వస్తే వెంటనే పట్టుబడి చేసుకోవాలి. – శివరామకృష్ణ, ఎఫ్‌డీవో, గణపవరం -
ప్రమాదాలకు ఎదురెళ్లి..
తాడేపల్లిగూడెం రూరల్: వాహనదారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే లెవల్ క్రాసింగ్‌లు దాటుతున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రత్తిపాడు, మారంపల్లి, నవాబుపాలెం వద్ద రైల్వే లెవల్ క్రాసింగ్‌లున్నాయి. రైలు రాకపోకలను గుర్తించిన వెంటనే సంబంధిత సిబ్బంది లెవల్ క్రాసింగ్‌ల వద్ద ముందస్తుగానే గేట్లను మూసివేస్తుంటారు. కొందరు వాహనదారులు మాత్రం అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. గేటు వేసినా గేటు కింద నుంచి క్రాసింగ్లను దాటుతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే లెవల్ క్రాసింగ్లను దాటుతున్న సమయంలో రెప్పపాటులో ప్రమాదాలు తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. -
వరాహావతారంలో జగన్నాథుడు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జగన్నాథుడు శ్రీ వరాహావతారంలో సాక్షాత్కరించారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శంకు చక్రాలను ధరించి, అమ్మవార్లతో ఆశీనులై ఉన్న స్వామివారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దింట్లమ్మా.. చల్లంగా చూడమ్మా కై కలూరు: పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్పులు అందించమ్మా అంటూ భక్తులు అమ్మవారిని ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు చేసి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.68,010 ఆదాయం వచ్చిందని తెలిపారు. జూదరుల అరెస్టు దెందులూరు: దెందులూరులో పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి దెందులూరు యందంవారి వీధి డంపింగ్ యార్డ్ వద్ద పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిక
నూజివీడు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సుంకొల్లులో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో ప్రతాప్ అప్పారావు సమక్షంలో చేరాయి. వారికి ప్రతాప్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కొనకాల సీతారామయ్య, కొనకాల అజయ్, బుడిపూడి శ్రీనివాసరావు, బుడిపూడి శ్రీరాములు, పలగాని జమలయ్య, కొనకాల రమేష్, కొనకాల రామకోటేశ్వరరావు, వలిపి గోపి, లంకా పెదబాబు, గుడివాడ ఏసు లు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేశానని చెప్తున్నప్పటికీ వాస్తవంగా తూతూ మంత్రంగా అమలు చేసిందని విమర్శించారు. ఒకటో తరగతి విద్యార్థులు, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈనెల 20న అమలు చేస్తున్నామని, రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు ఈ పథకం లేదని చెబుతూ ప్రభుత్వం కోతలు పెడుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారిని తొలగించారన్నారు. ఇంటింటికి రేషన్ సరుకులను అందిస్తున్న రేషన్ వాహనాలను ప్రభుత్వం తొలగించి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కొన్ని చోట్ల మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఎక్కడని, మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడని ప్రతాప్ నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాలండర్‌ను ప్రకటించి దాని ప్రకారం చెప్పిన తేదీకి పథకాన్ని అమలు చేశారన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం గాని ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసే ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే కూటమి పార్టీలను రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. మట్టిని, ఇసుకను దోచేస్తున్నారన్నారు. తాను ఓడినా, గెలిచినా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమానికి ప్రతాప్ అప్పారావును బైక్ ర్యాలీతో గ్రామంలోకి తీసుకెళ్ళారు. కార్యక్రమంలో సర్పంచి దుడ్డు నాగమల్లేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, నాయకులు గబ్బర్, బసవా వినయ్, కంచర్ల లవకుమార్, బసవా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు -
విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గడువు అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో నూతన పాఠశాలల వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి వచ్చే ఏడాది వరకూ గడువు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. నూతన పాఠశాలల వ్యవస్థలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పన నియమిస్తూ మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారని, ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉండాలని నిబంధన విధించారన్నారు. వేసవి సెలవుల్లోనే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకున్నారని, బదిలీలు అనంతరం కొత్తగా వెళ్ళిన ఉపాధ్యాయులకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లలు లేరన్నారు. ఇప్పుడిప్పడే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు నియమించారన్న విషయాలను గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు తెలియజేసి, ప్రైవేటు పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అందువల్ల మోడల్ ప్రైమరీ స్కూల్లో 60 పైబడి ఉండాలన్న నిబంధన/లక్ష్యం వచ్చే విద్యాసంవత్సం వరకు పొడించాలన్నారు. ఉపాధ్యాయులు కొత్తగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 16న జాయిన్ అయ్యారని, అంటే వారు చేరి కేవలం పదమూడు రోజులు మాత్రమే అయ్యిందని, ఇంతలోనే పని సర్దుబాటు ద్వారా ఇప్పటి విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను ఉంచుతామన్న విధానం సరైంది కాదన్నారు. శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి విరాళాలు ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ముగ్గురు భక్తులు వేరువేరుగా ఆదివారం రూ. 3,11,351 విరాళంగా అందజేశారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంనకు చెందిన దండుబోయిన వీరవెంకట సర్వేశ్వరరావు రూ.1,00,116, ఖమ్మం జిల్లా సత్యన్నారాయణపురంనకు చెందిన చాపలమడుగు దానేశ్వరరావు రూ.1,00,116, ఏలూరుకు చెందిన మారుశీళ్ల కృష్ణారావు రూ.1,11,119 ఆలయ కార్యాలయంలో జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ హయగ్రీవాచార్యులు విరాళం బాండ్ పత్రాలను అందించారు. అనంతరం దాత కుటుంబాలకు స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించారు. గుంతల రోడ్డుపై వరి నాట్లు కలిదిండి(కై కలూరు): గుంతల రహదారికి మరమ్మత్తులు చేయాలంటూ సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. కలిదిండి మండలం మూలలంక నుంచి పెదలంక రోడ్డును వెంటనే నిర్మించాలంటూ ఆదివారం పెదలంక వరి నాట్లు వేశారు. సీపీఎం కలిదిండి ప్రాంతీయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లు మొత్తం బాగు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. మూలలంక– పెదలంక రోడ్డు గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. -
ఉద్యోగం ఒకచోట.. పెత్తనం మరోచోట
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆయన జిల్లాస్థాయి అధికారి.. సర్వీసులో ఎక్కువ కాలం ఒక్క పోస్టింగ్‌తో పాటు మరో రెండు ఇన్చార్జులు తీసుకోవడం ఆయనకున్న అలవాటు.. అయితే పదవులన్నీ ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చుట్టూనే తిరుగుతుంటాయి.. అలా అని ఆయన ఆ బ్యాంకులో పనిచేసే అధికారి కాదు.. కాని ఏలూరు జిల్లా సహకార శాఖలో మాత్రం ఎప్పుడూ కీలక బాధ్యతల్లోనే ఉంటారు. మూడు రోజుల క్రితం డీసీసీబీ బ్యాంకులో జరిగిన మహాజన సభతో సంబంధం లేకపోయినా హాజరై ప్రసంగించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధం లేకపోయినా.. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ ఆడిట్ అధికారిగా ఉన్న ఆరిమిల్లి శ్రీనివాస్‌ను ఈనెల 9న బదిలీల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారిగా నియమించారు. ఇప్పటికే ఆయన విజయవాడలో హౌస్‌ఫెడ్‌లో సేల్స్ ఆఫీసర్ గా ఇన్చార్జి హోదాలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. గతంలో జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా, ఆడిట్ ఆఫీసర్‌గా, డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఏళ్ల తరబడి పనిచేశారు. ఇటీవల భీమవరం బదిలీ అయ్యారు. గతేడాది అప్పటి జిల్లా సహకారశాఖ అధికారి పదవీ విరమణ అయితే ఏడాది కాలం ఇన్చార్జిగా శ్రీనివాసే పనిచేశారు. జిల్లా సహకార శాఖకు, డీసీసీబీకి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా జిల్లా సహకార శాఖ అధికారి హోదాలో బ్యాంకులోనూ ఆయన హవానే కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు ప్రస్తుతం భీమవరంలో పనిచేస్తున్నా మళ్లీ ఏలూరు జిల్లా అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈనెల 27న ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ గన్ని వీరాంజనేయులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొదటి మహాజన సభ నిర్వహించారు. వాస్తవానికి సమావేశానికి జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇతర కో–ఆపరేటివ్ సిబ్బందికి ఆహ్వానం కాని, హాజరుకావాల్సిన అవసరం కాని ఉండదు. గతంలో ప్రభుత్వ షేర్ బ్యాంకులో ఉన్న క్రమంలో ప్రతి మహాజన సభకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యేవారు. ప్రభుత్వం దానిని ఉపసంహరించుకోవడంతో బ్యాంకు వ్యవహారంలో సహకార శాఖ పాత్ర ఉండటం లేదు. అయినా భీమవరం డివిజనల్ కో– ఆపరేటివ్ అధికారి మాత్రం ప్రత్యేక శ్రద్ధతో బ్యాంకులో మహాసభకు హాజరుకావడంతో పాటు సమావేశాన్ని పూర్తిగా నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల క్రి తం కొందరు సదరు అధికారి తీరుపై ముఖ్యమంత్రి కే ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గతంలో సదరు అధికారి ఏలూరులో ఉన్నప్పుడు పలు సొసైటీల్లో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా వెళ్లి విచారణ పూర్తయినా నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదనే పేరు ఉంది. 258 సొసైటీలు జిల్లాలో ఉంటే సు మా రు 30 సొసైటీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించి, విచారణ నిర్వహించి మధ్యలోనే నిలిపివేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో సంబంధం లేకపోయినా బ్యాంకులో హడావుడి కొనసాగిస్తుండటం గమనార్హం. డీసీసీబీలో షాడో చైర్మన్ డీసీసీబీలో సహకార అధికారి పెత్తనం బ్యాంకులో సిబ్బంది వద్ద హడావుడి ఇప్పటికే రెండు పోస్టుల్లో సదరు అధికారి జిల్లా కో–ఆపరేటివ్ అధికారిగా మరో పోస్టు కోసం ప్రయత్నాలు ఆడిట్ విచారణల వ్యవహారంలోనూ పెద్ద పాత్ర -
మౌలిక వసతుల కోసం గిరిజనుల మొర
బుట్టాయగూడెం/ఏలూరు (మెట్రో): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు అధికారి రిషబ్ చతుర్వేది శనివారం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ముంజులూరు, పులిరామన్నగూడెం, చింతపల్లి తదితర గ్రామాల్లో జనభాగీదరీ అభియాన్, పీఎం జన్మాన్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గిరిజనులు తమ సమస్యలను ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇళ్ల నిర్మాణం వేగిరపర్చాలని, వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు మెడికల్ సబ్‌సెంటర్ భవనానికి మరమ్మత్తులు చేయించాలని పులిరామన్నగూడెం గిరిజనులు కోరారు. తమకు అదనపు ఓహెచ్ఎస్ఆర్ కావాలని, అంతర్గత రోడ్లు నిర్మించాలని చింతపల్లి గిరిజనులు అభ్యర్థించారు. అలాగే పులిరామన్నగూడెం నుంచి చింతగూడెం రోడ్డు నిర్మించాలని కోరారు. బుట్టాయగూడెం కొల్లుమామిడి గ్రామంలో మల్టీపర్పస్ సెంటర్, అంగన్వాడీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. అనంతరం కేఆర్‌పురం ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 30 వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఎంపీడీఓ కె.జ్యోతి, తహసీల్దార్ పీవీ చలపతిరావు ఉన్నారు. సాయంత్రం ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తన పర్యటన, గిరిజన గ్రామాల్లో సమస్యలను కలెక్టర్‌కు తెలియజేశారు. -
గళమెత్తిన పంచాయతీ కార్యదర్శులు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఏలూరు తరలివచ్చి ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ధర్నా చేసి కలెక్టర్, డీపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సచివాలయ సిబ్బందికి మధ్య విధుల్లో సమన్వయం కుదరడం లేదని, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యాలకు తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు సచివాలయ సిబ్బంది తమకు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఉన్నతాధికారులు తమను బాధ్యులను చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో సుమారు 200 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చింతలపూడి మండలంలో మూకుమ్మడి సెలవు చింతలపూడి: ఏలూరులో నిరసన, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు కావాలంటూ ఎంపీడీఓ మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మూకుమ్మడి సెలవు పెట్టామన్నారు. రోజూ ఉదయం 6 గంటలకే విధులకు హాజరై ఫొటో దిగి పంచాయతీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలంటూ మౌకికంగా ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం
ఏలూరులోని తమ్మిలేరులో దిగి ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు రక్షించారు. 8లో uగిరిజన ఆర్ఎస్కేఐల ధర్నా ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గిరిజన ప్రాంతాల్లోపని చేసే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టీ కల్చర్ అసిస్టెంట్ల (రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు) (ఆర్ఎస్కేఐ)ను గిరిజన ప్రాంతాల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని కేఆర్‌పురంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏలూరులోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం వద్ద శనివారం రాత్రి 10 గంటల నుంచి ధర్నాకు దిగారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా వివరణ కోరగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 461 రైతు సవా కేంద్రాలు ఉండగా, ఏలూరు జిల్లా పరిధిలో 172 అగ్రికల్చరల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని, రేషనలైజేషన్ ప్రకారం వాటిలో 140 ఏలూరు జిల్లాకు, మిగిలిన 32 పోస్టులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాయన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీలు నిర్వహించాల్సి ఉన్నందున నిబంధనల మేరకే బదిలీల కౌన్సెలింగ్ తలపెట్టామని వివరణ ఇచ్చారు. -
రాజీకి వెళితే తల పగలగొడతారా?
దెందులూరు: గతంలో జరిగిన గొడవ పరిష్కారం నిమిత్తం రాజీకి వెళితే తల్లిదండ్రుల ఎదుటే కొడుకు తలపగలగొట్టడం ఏం సంప్రదాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా అని ఆయన ప్రశ్నించారు. శనివారం టీడీపీ వర్గీయుల దాడిలో తలపగిలి తీవ్రంగా గాయపడిన ఈదా భార్గవ్‌ను, అతని కుటుంబ సభ్యులను రాయన్నపాలెంలోని వారి నివాసంలో అబ్బయ్య చౌదరి కలిసి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాలను పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని అబ్బయ్య చౌదరి చెప్పారు. అసలేం జరిగిందంటే.. గత ఆదివారం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మ ఆలయం వద్ద జరిగిన శుభకార్యానికి యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ యాదవ్ స్నేహితులు వెళ్లి తిరిగి వస్తుండగా రాయన్నపాలెం గ్రామం వద్ద కొంతమంది యువకులతో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో మహేష్ యాదవ్ తనపై, తన కారు డ్రైవర్‌పై రాయన్నపాలెం యువకులు వెంటబడి దాడి చేసి గాయపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహేష్ యాదవ్‌పై దాడి చేసిన వారి తల్లిదండ్రులు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో మహేష్ యాదవ్‌ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ క్రమంలో శనివారం దెందులూరులోని మహేష్ యాదవ్‌కు చెందిన దాబా వద్దకు దాడి చేసిన యువకులు, వారి తల్లిదండ్రులు వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, బొద్దు సురేంద్ర, మహేష్ యాదవ్ అనుచరులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హోటల్ వద్దకు వెళ్లి గాయపడిన బాధితులను పరామర్శించారు. తరువాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వారిని చికిత్స నిమిత్తం తరలించారు. పెదవేగి సీఐ రాజశేఖర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా దెందులూరు ఎస్సైని ఆదేశించారు. టీడీపీ వర్గీయుల తీరు మారదా? దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ధ్వజం -
ఆషాఢం ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంపై ఆషాఢం ఎఫెక్ట్ పడింది. దీంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. సాధారణంగా భక్తుల రాక ఎక్కువగా ఉండాల్సి ఉండగా సాధారణంగానే కనిపించింది. ఆలయంలో అన్ని విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. క్షేత్రంలో వ్యాపారాలన్నీ మందకొడిగా సాగాయి. కేంద్ర గ్రంథాలయానికి కొత్త భవనం ఏలూరు(మెట్రో): ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి, గ్రంథాలయ సంస్థల డైరెక్టర్ నుంచి అనుమతిని తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ప్రమాద స్థితిలో ఉన్న కా రణంగా కొత్త భవనం నిర్మించాల్సి ఉందన్నా రు. అలాగే గ్రంథాలయంలో వసతులు కల్పించాలని, స్థానిక సంస్థలు, వివిధ సంస్థల నుంచి గ్రంథాయాల సెస్సు బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్.శేఖర్‌బాబు, డీపీఓ కె.అనురాధ, వయోజన విద్య ఉపసంచాలకుడు ప్రభాకర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు.సురేంద్రనాథ్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 275 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని శనివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 275 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం సెషన్‌కు 100 మందికి 93 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 201 మందికి 182 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు జంగారెడ్డిగూడెం: లైంగిక దాడులు, వేధింపులు వంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ యు.రవిచంద్ర అన్నారు. పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారైన నేపథ్యంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరిలో పట్టణంలోని మందుల షాపు నిర్వాహకుడు షేక్ ఇబ్రహీం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఇబ్రహీంపై కేసు నమోదు చేయగా ఏలూరు స్పెషల్ స్పీడ్ ట్రైల్, పోక్సో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారన్నారు. ఇబ్రహీంకు 20 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించారని, అలాగే బాధితురాలికి రూ.50 వేలు పరిహారం అందించాలని న్యాయ స్థానం ఆదేశించిందన్నారు. తల్లితండ్రులు పర్యవేక్షించాలి బాలికలు, యువతులను తల్లితండ్రులు ఎప్ప టికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి జాగ్రత్తలు నే ర్పాలని డీఎస్పీ సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలన్నారు. ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే 112 లేదా శక్తి బృందానికి సమాచారం ఇవ్వాలన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష తణుకు అర్బన్: బెల్టు షాపులను అరికట్టి అక్రమ మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన తాటికల్లుపై ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ మద్యం, ఊరువాడా బెల్టు షాపుల్లో అమ్మకాలు చేస్తూ కల్లు అమ్మకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గీత వృత్తిపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి మా ట్లాడుతూ మద్యం విచ్చలవిడి అమ్మకాలతో ప లు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. జూలై 14న కల్లుగీత కార్మికుల వెతలు కలెక్టర్‌కు చెప్పుకుందాం కార్యక్రమానికి భీమవరం తరలిరావాలని కోరారు. -
చీటీల పేరుతో రూ.5 కోట్లకు టోకరా
భీమవరం అర్బన్: చీటీల పేరుతో తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర వెంకట సత్యనారాయణ రూ.5 కోట్ల వరకు మోసం చేసి పరారయ్యాడంటూ భీ మవరం రూరల్ స్టేషన్ ఎస్సై ఐ.వీర్రాజుకు శనివారం బాధితులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వీర వెంకటరమణ గ్రామంలో నమ్మకంగా ఉంటూ 15 ఏళ్ల నుంచి చీటీల వ్యాపారం చేస్తున్నాడన్నారు. తోకతిప్పతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఆయన చీటీల వ్యాపారం చేస్తున్నాడని, ఆయన కుమారుడు, కుమార్తె ప్రతినెలా వాయిదా సొమ్ములు వసూళ్లు చేసేవారన్నారు. ఇటీవల ఒక్కొక్కరూ 2 నుంచి 5 చీటీల వరకూ వేశామని, చీటీల గడువు ముగియగా వాయిదా ల సొమ్ము ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ రోజులు గడుపుతున్నాడన్నా రు. కొద్ది రోజులుగా వెంకటరమణ కనిపించడం లేదని, ఆయన భార్య పద్మా వతిని అడిగితే సమాధానం చెప్పకపోగా పోలీసు కేసు పెడతానని హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ కుటుంబంతో సహా కనిపించకుండా పో యాడని, చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్సైను అభ్యర్థించారు. కేసు విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ఎస్సై వీర్రాజు హామీ ఇచ్చారు. -
అంతా మా ఇష్టం
● వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారుల పెత్తనం ● ఉద్యోగులతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు ● పీహెచ్ ఉద్యోగుల విన్నపాలు బుట్టదాఖలు తాడేపల్లిగూడెం: వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అధికారుల పెత్తనాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్లో బదిలీల ప్రక్రియకు ఐచ్ఛికాలను ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నేరుగా హాజరు కావాలనేది ఉత్తర్వుల సారాంశం. రాష్ట్రవ్యాప్తంగా శనివారం బదిలీల ప్రక్రియ చేపట్టగా ఆయా జిల్లాల ప్రక్రియ ఇన్చార్జి వద్దకు ఉద్యోగులు నే రుగా హాజరయ్యారు. అయితే ఇందుకు భిన్నంగా జిల్లాలో బదిలీ ల ప్రక్రియ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగులు నేరుగా హాజరై ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం బదిలీల ఐచ్ఛిక పత్రాలపై ఉద్యోగుల సంతకాలు తీసుకుని ఇన్చార్జి అధికారికి ఆయా మున్సిపల్ కమిషనర్లు సమర్పించారు. కమిషనర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ము న్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో బదిలీల ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. వార్డు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, అడ్డిన్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలను బదిలీ చేయాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. భీమవరం కమిషనర్‌కు వెల్ఫేర్ సెక్రటరీలు, తణుకు కమిషనర్‌కు అడ్మిన్ సెక్రటరీలు, నిడదవోలు కమిషనర్‌కు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, పాలకొల్లు కమిషనర్‌కు శానిటేషన్ కార్యదర్శి బదిలీల ప్రక్రియను అప్పగించి, మిగిలిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను ఏలూరులోని ఇన్చార్జి అధికారి చూస్తున్నారు. సీనియార్టీ, మెరిట్, ఫిజికల్లీ ఛాలెండ్జ్ ప్రాతిపదికన జాబితాలు తయారు చేసి అధికారులకు నివేదించడంతో పాటు, ఆప్షన్ల కోసం అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంది. అంతా తూచ్ అభ్యర్థులు నేరుగా ఏలూరులోని ప్రక్రియ ఇన్చార్జి వద్దకు హాజరుకాకుండానే మున్సిపల్ కమిషనర్లు తమతో ఆప్షన్ ఫారాలపై సంతకాలు చేయించి జాబితాలను ఏలూరు పంపించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అభ్యర్థలను బుట్టదాఖలు చేశారని అంటున్నారు. ప్రస్తుత మున్సిపాలిటీలో పనిచేయాలంటే మూడు ఆప్షన్లను ఎంచుకోవాలని, మిగిలిన విషయాలు పర్యవేక్షక అధికారులు చూసుకుంటారని ఉన్నతాధికారులు చెప్పినట్టు సమాచారం. ఆప్షన్ ఫారమ్స్ ఇవ్వని ఉద్యోగులకు వారి ఆప్షన్లతో సంబంధం లేకుండా బదిలీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. పొలిటికల్ రిఫరెన్స్ లేఖలు, మెడికల్ సర్టిఫికెట్లు, స్పౌజ్ సర్టిఫికెట్లను ఆప్షన్ ఫామ్స్‌కు జత చేసి ఇవ్వాలని ఆదేశించారు. -
అంజన్నకు అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,42,813 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. పోక్సో కేసు కొట్టివేత బుట్టాయగూడెం: 13 ఏళ్ల క్రితం నమోదైన పోక్సో కేసు నేరారోపణ రుజువు కాకపోవడంతో జిల్లా జడ్జి కొట్టివేసినట్లు న్యాయవాది ఉద్దండం ఏసుబాబు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంకు చెందిన టి. పోతురాజు అదే గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు 2017 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. మొత్తం 18 మందిని విచారించి నేరారోపణ చేశారన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం పోక్సో స్పెషల్ కోర్టులో విచారణ జరిగిందని, ముద్దాయిపై నేరారోపణ రుజువు చేయలేకపోయినందున, ముద్దాయిపై పెట్టిన పోక్సో కేసును కొట్టి వేస్తూ జిల్లా జడ్జి కుమారి వాణిశ్రీ తీర్పు వెలువడించారని ఏసుబాబు పేర్కొన్నారు. మద్యం మత్తులో వ్యక్తిపై దాడి ముదినేపల్లి రూరల్: మద్యం మత్తులో దాడి చేసి వ్యక్తిని గాయపరచిన సంఘటన మండలంలోని సింగరాయపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గుజ్జు లాజర్‌బాబు కూలి పనికి వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా సాంబశివరావు మద్యం సేవించి లాజర్బాబును దూషించాడు. దీనిపై నిలదీసి అడగగా రాయితో తలపై దాడి చేసి గాయపరిచినట్లు లాజర్‌బాబు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే ఒక్కడు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిఽస్తున్నారు. -
దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం
భీమవరం: సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు. గత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు పట్ల ఆసక్తి చూపించారు. రైతులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడమేగాక పంటల బీమా పథకం, ఇన్‌ఫుట్ సబ్సిడీ వంటివి అమలు చేశారు. ప్రస్తుతం సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా, గత సార్వాసీజన్లో వర్షాలు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత సీజన్లో వరి సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. పథకాల మాటేలా ఉన్నా వరి సాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణ వంటి వాటిపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.08 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. విత్తన సేకరణ ఇలా పురుగులు, తెగుళ్లు ఆశించని పాలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శీలీంద్ర బీజాలు, పురుగు తుట్టెలను తీసివేసి శుభ్రం చేసి నిలువ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబందించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనాల మొలక శాతం తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. నాణ్యమైన విత్తనం అయినా ఎక్కువ ముంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగచేసే శీలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శీలీంద్ర నాశినులతో గానీ, పురుగు మందులు లేదా జీవ శీలీంద్ర నాశినులతో తప్పని సరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సస్ట్రేట్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. విత్తన శుద్ధి పద్ధతులు ● పొడి విత్తన శుద్ధి : డ్రమ్ముల్లో మూడింట రెండొంతులు విత్తనం వేసి సిఫార్సు చేసిన మోతాదులో మందు వేసి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుని విత్తనానికి రక్షణ కవచంగా ఏర్పడి చీడ పీడల నివారణకు సాధ్యమవుతుంది. ● తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని ఆ నీటిలో సిఫార్పు చేసిన మందు కలుపుకుని నీటిలో విత్తనాలను నానబెట్టడం ద్వారా చీడ పీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. జీవ శిలీంద్ర నాశినులతో కొన్ని రకాల జీవ శీలీంద్ర నాశినులతో ముఖ్యంగా ట్రైకోడెర్మావిరిడి. సూడోమోనాస్ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్లను కలుగచేసే శీలీంధ్రాలను నాశనం చేయడమేగాక వంట చివరి వరకు కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే అభివృద్ధి చెంది తరువాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలను చీడపీడల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు విత్తన శుద్ధితో పంటకు రక్షణ వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమేగాక పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిపై దృష్టిపెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులోని వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి. – డాక్టర్ ఎంవీ కృష్ణాజీ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త, మార్టేరు -
ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయం
ఏలూరు(టూటౌన్): దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయమని, దాడులను నిరసిస్తూ ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్లో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్ల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లు, చర్చిలపై దాడులు రాజ్యాంగ విరుద్ధమైన చర్యని ఇలాంటి సంఘటనలు ఖండిస్తున్నామన్నారు. ఫాదర్ ఇంజమాల మైఖేల్, కె.శాంతి సాగర్లు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, పెరికె వరప్రసాదరావు, దోమతోటి అబ్రహం, నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు. బైక్‌పై నుంచి పడిన వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: కుక్క అడ్డు రావడంతో బైక్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన కూచింపూడి నాగు(45) ఈనెల 23 న ఇసీ్త్ర పెట్టెలోని బొగ్గుల కోసమని పంగిడిగూడెంకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా, ఘటనా స్థలమైన సూర్యచంద్రరావుపేట జెర్సీ పార్లర్ వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా కుక్క అడ్డువచ్చింది. దాంతో కుక్కను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయిన నాగుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. సొమ్ముల రికవరీకి చర్యలు వీరవాసరం: నందమూరి గరువులో డ్వాక్రా సంఘాల్లో జరిగిన స్కాం నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎం కే.జ్యోతిరాణి శనివారం తెలిపారు. 2022 నుంచి 2025 మార్చి వరకు ఖాతాల నుంచి గ్రూపు సభ్యులకు తెలియకుండా పోతుల నాగ స్వాతి, బోడపాటి సత్యవాణి నగదును కాజేశారని వివరించారు. సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని, బోడపాటి సత్యవాణి నుంచి సుమారు రూ.18 లక్షల మేర రికవరీ చేశామన్నారు. నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించామన్నారు. యంత్రాలు ఇప్పిస్తానని మోసం భీమవరం: వ్యవసాయ యంత్రాలు రాయితీపై ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకుని మోసగించినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. పాలకొల్లుకు చెందిన కత్తుల వెంకటేశ్వరరావు భీమవరానికి చెందిన యింకి వెంకటేశ్వరరావు దగ్గర నాలుగు దఫాలుగా నగదు తీసుకున్నారన్నారు. రాయితీపై యంత్రాలు ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాశ్వత బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు
ఉంగుటూరు: నారాయణపురం ఆర్ అండ్ బీ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు నెలల్లో మొదలు పెట్టేందుకు చర్యలు చేపడతామని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీరు ఎల్.శ్రీనివాస్‌రెడ్డి రంధ్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ. 20 లక్షలతో తాత్కాలికంగా ఐరన్ షీట్ వేసి బెయిలీ బ్రిడ్జి నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. శాశ్వత బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపుతామని, అనుమతి రాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. 11 మీటర్ల రోడ్డు, ఇరువైపులా పాదచారులు నడిచేందుకు పుట్‌పాత్ డిజైన్ రూపొందిస్తామని తెలిపారు. పాడైపోయిన బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం రూ.60 లక్షల చేబ్రోలు –తల్లాపురం రోడ్డులో కలిసే పుంత రహదారి అభివృద్ధి కోసం తయారచేసిన ప్రతిపాదిత రహదారిని పరిశీలించారు. చేబ్రోలు పోలీస్టేషన్ నుంచి నారాయణఫురం ఊరిలోకి కాలువగట్టు రహదారిని పరిశీలించారు. త్వరలో పంపుతామని చీఫ్ ఇంజినీర్ వెల్లడి -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
రక్షించిన నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మహిళ తన ముగ్గురు చిన్నారులతో తమ్మిలేరులో దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వెంటనే నిమ్మకాయల యార్డు ముఠా కార్మికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట, డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన పందల లక్ష్మి, జాన్‌పాల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. భార్యాభర్తలు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. భర్తతో వివాదం నేపథ్యంలో పిల్లలను తీసుకుని శనివారం మధ్యాహ్నం జన్మభూమి రైలు ఎక్కిన లక్ష్మి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో దిగింది. సమీపంలోని తమ్మిలేరుులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కార్మికులు వెంటనే స్పందించి ఆమెను, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. పిల్లలు నీళ్ళు తాగారేమో అనే అనుమానంతో ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా.. ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లోగా భర్త జాన్‌పాల్, మహిళ అన్న ఏలూరు చేరుకున్నారు. రైల్వే పోలీసులు జీజీహెచ్‌కు చేరుకుని లక్ష్మి, ఆమె ఇద్దరు చిన్నారులను భర్త జాన్‌పాల్‌కు అప్పగించారు. -
గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత
కౌన్సెలింగ్‌కు ఏం కావాలి? పదో తరగతి హాల్ టిక్కెట్, మార్కుల లిస్టు, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీవకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఈడబ్ల్యుఎస్ కోటాలో సీటు పొందిన వారు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్, అభ్యర్థి, అతని తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి. ఎలా రావాలంటే ● ప్రకాశం, గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాలకు నూజివీడుకు బస్సులు ఉన్నాయి. విజయవాడ నుంచి నూజివీడుకు 40 కి.మీ. దూరం మాత్రమే. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. ● శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్‌జంక్షన్ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్లో గాని దిగితే అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు ఉన్నాయి. బస్సు ప్రయాణమే తక్కువ శ్రమ, సురక్షితం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి. నూజివీడు: గ్రామీణ పేద వర్గాలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనకు రూపమే ట్రిపుల్ ఐటీలు. ఈ ట్రిపుల్ ఐటీలను ఆర్జీయూకేటీ నిర్వహిస్తోంది. ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్ ఐటీ సొంతం. విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిల్లో కూడా శిక్షణనిస్తారు. ఉదయం అల్పాహారం అనంతరం అసెంబ్లీ, 8 నుంచి 12 గంటల వరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరామం, మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6 గంటల వరకు ఆటలు, రాత్రి 7 గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్.. ఇవీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 30, వచ్చే నెల ఒకటిన 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రవేశం పొందనున్న విద్యార్థుల, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం. కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో భాగంగా ఈనెల 30న 550 మంది అభ్యర్థులకు, వచ్చే నెల 1న 550 మంది అభర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్‌కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్‌లెటర్లు పంపడంతో పాటు వారి సెల్ఫోన్లకు మెసేజ్‌లు కూడా పంపారు. ట్రిపుల్ ఐటీ ఆవరణలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. ● ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ● ట్రిపుల్ ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.45 వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ● అన్ని సబ్జెక్టులకు ప్రతి నెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ 24 వారాలు ఉంటుంది. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఎంపీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్లుంటాయి. ఇంజినీరింగ్‌లో కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచిలున్నాయి. ● సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్ళకు పంపుతారు. ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. ● విద్యార్థుల ఆరోగ్యంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ట్రిపుల్ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ● ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కిందకు రాని అభ్యర్థులు మొత్తం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి శ్రీ డైరెక్టర్, ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ నూజివీడుశ్రీ పేరున డీడీని ఏజాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి. ● రిజిస్ట్రేషన్ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ ఎస్టీలు రూ.500 చెల్లించాలి. గ్రూపు ఇన్సూరెన్స్ కింద రూ.1200, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కింద ప్రతి అభ్యర్థి వెయ్యి రూపాయలు, హాస్టల్ మెయింట్‌నెన్స్ చార్జి వెయ్యి రూపాయలు అడ్మిషన్ సమయంలో చెల్లించాలి. ఈ నెల 30, జూలై 1న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
గ్రీన్‌ఫీల్డ్ పనులను అడ్డుకున్న రైతులు
జంగారెడ్డిగూడెం: గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద రైతులు రాస్తారోకో చేసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా సర్వీసు రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. అలాగే హైవే పక్కనే ఉన్న కొంగల చెరువు సర్ప్లస్ వాటర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే మురుగు కాలువను పూడ్చడంతో వరద నీరు పొలాలను ముంచెత్తుతోందన్నారు. వ్యవసాయ పనులకు సీజన్ ప్రారంభమైందని, పొలాలకు వెళ్లే మార్గం లేకుంటే నష్టపోతామన్నారు. రైతులు వామిశెట్టి హరిబాబు, గొల్లపూడి శ్రీనివాసరావు, సీలం వెంకటరాజు, బొచ్చు శ్రీను పాల్గొన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలపై ప్రత్యేక శ్రద్ధ ఏలూరు(మెట్రో): అంగన్వాడీ కేంద్రాల్లోని ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్ర భుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం జీరో ఎన్రోల్మెంట్ కలిగిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీరో నమోదు ఉన్న పాఠశాలల హెచ్ఎంలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. హేబిటేషన్‌లో పిల్లలు లేరని పేర్కొన్న మండల విద్యాశాఖ అధికారులు, సీడీపీఓలు ఈ మేరకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, డీవైఈఓలు, ఎంఈఓలు సీడీపీఓలు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 503 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో శుక్రవారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 503 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 74 మంది, మధ్యాహ్నం 100 మందికి 81 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 204 మందికి 173 మంది, మధ్యాహ్నం 205 మందికి 175 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమావేశాన్ని ఏలూరులో యూనియన్ జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ ఎస్క్రో అకౌంట్‌ను తక్షణమే ఓపెన్ చేయాలని, మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూ పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పి.జాకబ్ మాట్లాడుతూ మీటర్ రీడర్లు కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సహాయ కార్యదర్శులు ఎ.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కోకో రైతులకు ప్రోత్సాహం ఏలూరు(మెట్రో): ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహం ద్వారా కోకో గింజలు అమ్మే రైతులు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎస్.రామ్మోహన్ ప్రకటనలో తెలిపారు. కిలోకు కిలో కంపెనీలు రూ.450, ప్రభుత్వ ప్రోత్సాహం రూ.50 మొత్తంగా రూ.500 చెల్లిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,536 టన్నుల కోకో గింజలను కొనుగోలు చేశారన్నారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వినియోగించుకోవాలన్నారు. -
డీఈడీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ
భీమవరం: భీమవరానికి చెందిన సంగడి ఏదిత హాసిని డీఈడీ (టీచర్స్ ట్రైనింగ్) కోర్సు ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి శ్రీకృష్ణ మావుళ్లయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 8లోవిలీనం.. అవస్థల మయం ● కై కలూరు మండలంలో గతంలో 12 అప్పర్ ప్రైమరీ పాఠశాలలుండగా నేడు ఆ సంఖ్య 1కి చేరింది. మండలంలో వింజరం, గోపవరం, రామవరం, ఆచవరం, వెలంపేట, కై కలూరులో రెండు పాఠశాలలు ఇలా యూపీ స్కూల్స్‌లో 6,7,8 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. దీని వల్ల విద్యార్థులకు దూరాభారం పెరిగింది. గోపవరం యూపీ స్కూల్లో గతేడాది వరకు 6,7,8 తరగతుల్లో చదివిన విద్యార్థులు ఈ ఏడాది 5 కిలోమీటర్ల దూరంలోని ఆరుతెగళ్లపాడు హైస్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. కై కలూరు మండలం అయి నా రైల్వేట్రాక్, హైవే రహదారి కావడంతో ఇబ్బందులు పడుతూ కొందరు స్కూళ్లకు వెళ్తుండగా మరికొందరు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. ఒక్క గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులే 70 మంది దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ● ముదినేపల్లి మండలంలో 9 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను రెండు హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసి 7 పాఠశాలలను సమీప హైస్కూళ్లలో విలీనం చేశారు. వీటిలో కోడూరు, కొరగుంటపాలెంకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోడూరులోని 6, 7, 8 తరగతుల విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాలపర్రు లేదా ముదినేపల్లి హైస్కూళ్లకు వెళ్తున్నారు. కొరగుంటపాలెం యూపీ పాఠశాలలను ఎత్తివేయడంతో 5 కిలోమీటర్ల దూరంలో అల్లూరు లేదా బొమ్మినంపాడు హైస్కూళ్లకు వెళ్లాల్సి పరిస్థితి. ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో గందరగోళం నడుమ విలీన ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టించింది. -
మత్స్య విద్య ఎదురీత
ఆర్‌బీకేనే తరగతి..! రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి వస్తున్న వీరంతా రైతులు కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ విద్యార్థులు వీరు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కళాశాల నిర్వహిస్తున్న తాత్కాలిక భవనంలో సెకండ్ బ్యాచ్ విద్యార్థులకు గదుల్లేవు. ఫలితంగా పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని చాలీచాలని హాల్లోనే వీరికి తరగతులు నిర్వహించారు. సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని నరసాపురంలో ఏర్పాటు చేసిన ఫిషరీస్ యూనివర్సిటీ వసతుల్లేక సతమతమవుతోంది. మత్స్య విద్య ఏటికేడు ఎదురీదుతోంది. దీనికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో ఫిషరీస్ యూనివర్సిటీ. యూనివర్సిటీ క్యాంపస్ కోసం నరసాపురం పక్కనే 40 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసింది. రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే.. తొలుత ఏడాది కాలానికి నరసాపురంలోని తుపా ను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా 66 సీట్లతో 2023 జూన్‌లో నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కోర్సును ప్రారంభించారు. 2024 నాటికి క్యాంపస్‌లో తరగతులు నిర్వహించాలన్న లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి నాటికే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు చేరుకోగా, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల పునాదులు పూర్తయ్యాయి. దాదాపు రూ.35 కోట్ల విలువైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను అటకెక్కించింది. నిధులివ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుంచి తాత్కాలిక భవనంలోనే తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకే భవనంలో సెకండ్ బ్యాచ్ ప్రస్తుత తాత్కాలిక భవనంలోని 12 గదులు 66 మంది స్టూడెంట్స్ కలిగిన ఒక బ్యాచ్‌కు మాత్రమే తరగతులు, ల్యాబ్ నిర్వహణకు సరిపోతున్నాయి. 2024 జూలై నుంచి మరో 66 మందితో సెకండ్ బ్యాచ్ మొదలు కావడంతో పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని హాల్‌ను తరగతి గదిగా, స్టాఫ్ రూ మ్ ను కంప్యూటర్ ల్యాబ్‌గా వినియోగిస్తున్నారు. ప్రైవేటు మెస్‌లు, అద్దె గదులే గతి! క్యాంపస్ హాస్టల్ లేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు మెస్‌లు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. గదులను బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతోంది. విద్యార్థినులు భద్ర తాపరంగా ఆందోళన చెందుతున్నారు. కళాశాలకు వచ్చే వెళ్లే దారిలో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కళాశాల వద్ద క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొత్త బ్యాచ్ పరిస్థితి ఏమిటి? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు 132 మంది ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి జూలై నుంచి 66 మందితో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీ జరగనుంది. కొత్త బ్యాచ్‌కు అక్టోబరులో తరగతులు ప్రా రంభమవుతాయి. ఈ నేపథ్యంలో వీరికి క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ప్రైవేట్ విద్యాసంస్థలో తరగతుల నిర్వహణకు యత్నాలు జరుగుతున్నట్టు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. నరసాపురంలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి నిర్లక్ష్యపు గ్రహణం కూటమి నిర్వాకం వల్ల ఏడాదిగా నిలిచిన వర్సిటీ నిర్మాణం రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే కళాశాల నిర్వహణ సెకండ్ బ్యాచ్‌కు గదుల్లేక ఆర్బీకేలో తరగతులు హాస్టల్ వసతి లేక విద్యార్థుల ఇక్కట్లు సెక్యూరిటీ లేదు క్యాంపస్ హాస్టల్ సదుపాయం లేక బయట అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. భద్రతాపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆకతాయిల బెడద ఉంటోంది. – సి.ధరణి, కర్నూలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చాలా ఇబ్బంది పడుతున్నాం క్యాంపస్ సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. హాస్టల్ నిమి త్తం నెలకు రూ.7 వేల వరకు ఖర్చరవుతున్నాయి. కాలేజీకి కిలోమీటరు పైగా నడవాల్సి వస్తోంది. – వి.రాకేష్, ఒంగోలు, మొదటి సంవత్సరం విద్యార్థి హాస్టల్ వసతి కల్పించాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. క్యాంపస్ హాస్టల్ ఉంటే బా గుంటుంది. వర్సిటీ భవనా లు వేగంగా పూర్తిచేయాలి. క్రీడా మైదానం, ల్యాబ్ వసతులు కల్పించాలి. – దేవీ ప్రసాద్‌దొర, పార్వతీపురం, మొదటి సంవత్సరం విద్యార్థి -
జయ జయహో జగన్నాథ
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్ర దత్తత ఆలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథరుని దివ్య రథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా పూరీలో మాదిరిగా ఇక్కడ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి రథయాత్ర నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని దారు విగ్రహాలను రథంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథం ముందుకు సాగింది. ఆలయ యాగశాలలో స్వామివారు మత్స్యావతార అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి దంపతులు ఆలయంలో పూజలు చేయించారు. వచ్చేనెల 6 వరకు రోజుకో అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. -
మాజీ ఎమ్మెల్యే దృష్టికి కొల్లేరు సమస్యలు
దెందులూరు: కొల్లేరులోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, కొల్లేరు నాయకులు తెలియజేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు ఆయన్ను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్లో వివక్ష, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అబ్బయ్యచౌదరి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రావు, మాదేపల్లి సర్పంచ్ కొరపాటి ప్రభుదేవా, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రేమ్‌బాబు, కొల్లేరు నాయకులు ఉన్నారు. -
కోకో గింజలను పూర్తిగా కొనాలి
పెదవేగి:కోకో రైతులు వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహంతో కలిపి లక్ష్యాలతో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం విజ యరాయి గాంధీనగర్‌లోని సీతారామ కల్యాణ మండపంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా కోకో గింజల కొనుగోలు సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కోకో రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని పలుచోట్ల రైతులు దరఖాస్తులు ఇచ్చినా కంపెనీలు గింజలు కొనుగోలు చేయ డం లేదన్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు రూ.500 ధర చెల్లించేలా చూడాలన్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చేలా వెంటనే ఫార్ములా రూపొందించాలని కోరారు. ఆయిల్‌పామ్ రైతులకు సంఘీభావం పెదవేగి ఆయిల్‌ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయిల్‌పామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటించారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కోరారు. విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతు సంఘం నాయకులు పాలడుగు నరసింహారావు, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు పాల్గొన్నారు. -
బడి దూరం.. చదువు భారం
జల విద్యుత్ కేంద్ర పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్‌కుమార్ అన్నారు. 8లో uశనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: విలీనం పేరుతో విద్యాలయాలు విచ్ఛిన్నం చేశారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అనే రీతిలో ఒక్కో విద్యార్థిని ఒక్కో బడిలో చేర్చారు. అది కూడా సమీపంలో కాదు 5, 8, 10 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేయడంతో పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పూర్వంలో కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చదువుకున్నారనే విషయాన్ని పెద్దలు చెబుతుంటారు.. మళ్లీ కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మొదలు టీచర్ల వరకూ సర్వత్రా మండిపడుతున్నారు. విలీనం పేరుతో ఏలూరు జిల్లాలో 297 పాఠశాలలను విజయవంతంగా మాయం చేశారు. 1,788 బడులు.. 1,27,699 మంది పిల్లలు జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1,788 ప్రభుత్వ పాఠశాలల్లో 1,27,699 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశారు. వందల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పాఠశాలల రూపురేఖలు మొదలు బోధనా రంగం వరకు అన్ని వ్యవస్థల్లో గుణాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రధానంగా బడికి పిల్లలు వెళితే తల్లుల ఖాతాల్లో ఏటా అమ్మఒడి పేరుతో నాలుగేళ్ల కాల వ్యవధిలో రూ.1,069.26 కోట్లకుపైగా జమ చేశారు. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ మొదలు యూనిఫామ్స్ వరకు ఉచితంగా అందజేశారు. నాడు–నేడు పేరుతో జిల్లాలో రెండు విడతల్లో రూ.414.48 కోట్ల వ్యయంతో 1,488 పాఠశాలల రూపురేఖలను మార్చారు. ఇవి కాకుండా విద్యార్థులకు ట్యాబ్‌లు, ఇంగ్లిష్ విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి సమూల మార్పులు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంపై కక్ష కట్టింది. కొత్త కొత్త నియమ నిబంధనలు, అడ్డగోలు విఽధి విధానాలతో పాఠశాలల విలీనానికి తెరతీసింది. న్యూస్రీల్ఇష్టానుసారం విలీనం.. విద్యార్థులకు దూరాభారంజిల్లాలో 297 పాఠశాలలను అడ్డగోలు నిబంధనల పేరుతో విలీనం చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను 9 రకాల పాఠశాలలుగా మార్చారు. వీటిలో శాటిలైట్ పాఠశాలలు 7, ఫౌండేషన్ పాఠశాలలు 127, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు 928, మోడల్ ప్రైమరీ పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలలు 78, ఉన్నత పాఠశాలలు 241లుగా మార్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని, ఒకే ఊరిలో రెండు స్కూల్స్ ఉంటే వాటిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఒకే స్కూల్‌కు మార్చడం ఇలా ఇష్టానుసారంగా మార్చడంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సమస్యలు మొదలయ్యాయి. దీనిపై మండల స్థాయిలో తల్లిదండ్రులు అభ్యంతరాలు తెలిపి స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించని పరిస్థితి.విద్యార్థులకు విలీన కష్టాలు విలీనం పేరుతో పాఠశాలలు విచ్ఛిన్నం జిల్లాలో 297 బడులు విలీనం కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లల్లోకి కొన్ని.. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోకి మరికొన్ని.. విలీన వ్యవహారంపై సర్వత్రా మండిపాటు ఫిర్యాదుల వెల్లువ.. స్పందించని అధికారులు -
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తృటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్థయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలు దేరింది. వారు శుక్రవారం రాత్రి పెదకాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు. పలు వురి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలా నికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. -
పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తును 45 నుంచి 41 అడుగులకు తగ్గించారని, 80 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. విభజన హామీల అమలులో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు, పవన్ ఆ పార్టీతోనే కూటమి కట్టారని, మోదీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాసోహం అంటున్నారని మండిపడ్డారు. -
రోడ్ల అవస్థపై గ్రామస్తుల నిరసన
కొయ్యలగూడెం : రహదారి అధ్వానంపై పొంగుటూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పొంగుటూరు, యర్నగూడెం గ్రామాల మధ్య పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న రహదారి భారీ గోతులు పడి ప్రమాదకరంగా మారింది. గ్రీన్ ఫీల్డ్ హైవే వాహనాలు పరిమితికి మించి మెటీరియల్ రవాణా చేయడం వల్లే రోడ్డు పాడైంది. రెండేళ్ల క్రితం సుమారు రూ.30 లక్షలతో కన్నాయగూడెం నుంచి పొంగుటూరు వరకు రహదారిని నిర్మించగా పూర్తిగా పాడైంది. స్కూల్ బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని యాజమాన్యం రాకపోకలు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి రహదారి అభివృద్ధి చేపట్టాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్విని మహిళలు కోరారు. ఈ ఆందోళనకు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడిగా మురళీకృష్ణ భీమవరం : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తాడేపల్లిగూడెం సాక్షి విలేకరి యడ్లపల్లి మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఒంగోలులో మూడు రోజుల పాటు నిర్వహించిన యూనియన్ 36వ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీఎస్ సాయిబాబా, గజపతి వరప్రసాద్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు బెల్లంకొండ బుచ్చిబాబు, ముత్యాల శ్రీనివాస్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. గేదెలను చంపిన దుండగులు లింగపాలెం: మండలంలోని మఠంగూడెం శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేదెలను దుండగులు తలలు నరికి చంపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో తొర్లపాటి రవి పశువుల పాకలో మూడు గేదెలను గురువారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా తలలు నరికి చంపారు. శుక్రవారం ఉదయాన్నే గుర్తించిన రైతు రవి ధర్మాజీగూడెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. -
దేవుడి విగ్రహాల ఏర్పాటుపై రగడ
నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో దేవుడి విగ్రహాల రగడ ఉద్రిక పరిస్థితులకు దారితీసింది. గ్రామంలోని ప్రధాన సెంటర్లో ఉన్న పంచాయతీకి చెందిన లైబ్రరీ బిల్డింగ్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక వర్గం వారు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టారు. మూడు రోజులైనా విగ్రహాన్ని తీయకపోవడంతో గ్రామస్తులంతా కలిసి అదే లైబ్రరీలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వినాయకుడి విగ్రహం, అమ్మవారి విగ్రహాలను వేదమంత్రాల నడుమ మేళతాళాలతో ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విగ్రహాల ఏర్పాటు విషయం వర్గపోరుగా మారి లైబ్రరీ వద్దకు వందలాది మంది గ్రామస్తులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఈ విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగారు. మాజీ సర్పంచి బసవరాజు నగేష్ అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పంచాయతీ భవనంలో విగ్రహాలు పెట్టడమేంటని ప్రశ్నించారు. రూరల్ ఎస్ఐ జ్యోతిబసు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. గ్రామ పెద్దలు ఎంతగా సర్ది చెప్పినా.. ఆయా వర్గీయులు ఏమాత్రం వినకుండా విగ్రహాలు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. మాజీ సర్పంచ్ ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసుల బందోబస్తు మధ్య విగ్రహాలను తొలగించడంతో సమస్య తొలగిపోయింది. -
అచ్చియ్యపాలెంలో విషాద ఛాయలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెం(చిన్నరవ్వారిగూడెం)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈతకొట్టేందుకు వెళ్ళి మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతి చెందిన తెల్లం సీతారామరాజు, తెల్లం కిశోర్‌లు అన్నదమ్ములు. తండ్రి తెల్లం పోసీరావు గోపాలపురం మండలం సాకిపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడు సీతారామరాజుకు 2021 కరోనా సమయంలో వివాహమైంది. సీతారామరాజుకు భార్య, 4 నెలల పాప ఉంది. చిన్న కొడుకు కిశోర్ జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరు కుమారుల మృతితో తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. మృతుడు మాడి దేవేంద్రకుమార్ తండ్రి మాడి సోమరాజు వ్యవసాయ కూలీ. సోమరాజుకు ఇద్దరు కుమారులు. సోమరాజు మొదటి కుమారుడు చిన్నతనంలోనే కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. దేవేంద్ర విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సరదా కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. యువకుల మృతి సమాచారం తెలుసుకున్న జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వారు మాట్లాడుతూ ఈతకు ఐదుగురు వెళ్ళారని ఈత రాని కారణంగా ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించామని చెప్పారు. దండిపూడి సమీపంలో ఉన్న కాల్వ సమీపానికి ఎవరూ కూడా ఈత కోసం వెళ్ళొద్దని సీఐ చెప్పారు. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని, వర్షాల కారణంగా అవి కొట్టుకుపోయాయని చెప్పారు. మళ్లీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం తరలించామని తెలిపారు. -
జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి జల విద్యుత్ కేంద్రాన్ని కూడా సిద్ధం చేయాలని ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) ఎం.సుజయ్‌కుమార్ అన్నారు. నిర్దేశిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జెన్కో అధికారులు కాంట్రాక్టు సంస్థకు సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫరం వాల్, ఈసీఆర్ఎఫ్ పనులకు సమాంతరంగా విద్యుత్ కేంద్రం పనులు చేపట్టాలన్నారు. శుక్రవారం పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలకమైన 150/30 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రేన్ పనితీరును పరీక్షించి పూజలు చేసి సుజయ్‌కుమార్ ప్రారంభించారు. జల విద్యుత్ కేంద్రంలో టర్బయిన్లు, జనరేటర్ వంటి కీలకమైన పరికరాలను బిగించేందుకు ఈ క్రేన్‌ను ఉపయోగిస్తారు. త్వరలో 225/40 టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు క్రేన్లను ఏర్పాటు చేస్తామని ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర తెలిపారు. టర్బయిన్లు, జనరేటర్లను బిగించే పని త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్కో హెచ్‌పీసీసీ ఈ.నాగరాజు, సీఈ (సివిల్) రవీంద్రారెడ్డి, ఎస్ఈ (సివిల్) రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
బస్టాండ్‌కాదు..బురదగుంట
ఉండి: ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని ఊదరగొట్టే అధికారులు ఉండి బస్టాండ్ దుస్థితిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉండిలో ఒకరోజు వర్షం కురిస్తే బస్టాండ్‌కు వెళ్ళే ప్రయాణికులకు వారం రోజులు కష్టాలు తప్పవు. బస్టాండ్ ప్రాంతం, రోడ్లు బురదమయంగా మారిపోతాయి. బస్టాండ్‌లో భీమవరం వైపు బస్సులు వెళ్ళాలంటే బురద, గణపవరం, ఆకివీడు వైపుగా వెళ్ళాలంటే బస్సులు తిరగబడిపోతాయేమోనని భయపడేంత పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తాయి. ఉండి బస్టాండ్ ఇక్కట్లపై ఎన్నిసార్లు మొరపెట్టుతున్నా ఫలితం శూన్యం. తాగేందుకు నీరు ఉండదు. బస్టాండ్ చుట్టూ మురుగు నీరే. బస్టాండ్‌లో బస్సు దిగాలంటే బురదలో కాలుపెట్టాల్సిందే. దీనివల్ల మహిళా ప్రయాణికులు, విద్యార్థులు, వృద్దులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బస్సులో నుంచి దిగేటప్పుడు ఒక్కోసారి కాలుజారి పడిపోతున్నారు. బస్సులు బస్టాండ్ నుంచి బయటకు వెళ్ళాలంటే డ్రైవర్లు తీవ్రంగా శ్రమించాల్సిందే. ఒకవైపు బురద, మరోవైపు గోతుల వల్ల బస్సులు తిప్పడం ఇబ్బందిగా ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస మౌలిక వసతులపై దృష్టిపెట్టడంతో పాటు.. రోడ్లు వేసేలా తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
స్పీడ్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఏలూరు టౌన్ : బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట కాలనీలో ఏడాదిన్నర క్రితం బాలికపై లైంగిక దాడికి పాల్పడిన షేక్ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏలూరు స్పెషల్ కోర్టు ఫర్ స్పీడ్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ అండర్ పోక్సో యాక్ట్ కోర్టు న్యాయమూర్తి కే.వాణిశ్రీ తీర్పు చెప్పారు. బాధిత బాలికకు రూ.50 వేల నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం సాయిబాబా గుడి వెనుక సుబ్బంపేట కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను బాధిత బాలిక పాఠశాలకు, ట్యూషన్‌కు వెళ్ళే సమయాల్లో తినుబండారాలు ఇస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2024 ఫిబ్రవరి 6కు ముందు అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావటం గమనించిన నానమ్మ బాలికను ప్రశ్నించగా.. భయపడుతూ విషయాన్ని చెప్పింది. 2024 ఫిబ్రవరి 10న నానమ్మ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.ధనుంజయడు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. పోక్సో కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది వీ.అమర శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఇబ్రహీంకు 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడడంతో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు. -
షూటింగ్ పోటీల్లో బంగారు పతకాలు
నూజివీడు: నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మనుమడు మేకా జై నృసింహా ప్రతాప్ అప్పారావు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ అండర్–18 విభాగంలో రెండు బంగారు పతకాలు సాధించాడు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న 11వ రాష్ట్ర షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. అండర్–18 యూత్ మెన్స్ కేటగిరిలో నృసింహ ప్రతిభ కనబరిచి ట్రాప్, డబుల్ ట్రాప్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న నృసింహ అక్టోబర్‌లో చైన్నెలో నిర్వహించే సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొననున్నాడు. స్కూల్లో బాస్కెట్‌బాల్ జట్టుకు సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించిన బాస్కెట్‌బాల్ పోటీల్లో తమ స్కూల్ జట్టు తృతీయ స్థానంలో నిలవడంలో ప్రతిభ కనబరిచాడు. భారతదేశానికి ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. శిల్పి కరుణాకర్‌కు తానా ఆహ్వానం పెనుమంట్ర: అమెరికాలో మిచిగన్‌లో జూలై 3 నుంచి మూడు రోజులు పాటు జరిగే తానా మహాసభలకు పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెనుగొండ కరుణాకర్‌కు ఆహ్వానం లభించింది. ఈ నెల 30న అమెరికాకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో బాలికకు గాయాలు భీమవరం: భీమవరం రెండో పట్టణంలోని డాక్టర్ బీవీ రాజు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న అక్కాచెల్లెళ్లను శుక్రవారం వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. సైకిల్ వెనుక కూర్చొన్న బాలిక చేతికి, కాలికి గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ జి. కాళీచరణ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వాగునే మింగేశారు
నూజివీడు : అధికారం ఉందనే అహంకారం.. మా జోలికి ఎవరొస్తారనే ధీమాతో ఏకంగా వాగునే ఆక్రమించేశారు. దాదాపు 40 అడుగుల వెడల్పు ఉన్న వాగును 50 మీటర్ల పొడవునా పెద్ద ఎత్తున మట్టిపోసి వాగు ఏ మాత్రం కనబడకుండా చెరబట్టారు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకులు. నూజివీడు గుండా వెళ్తున్న 216హెచ్ హైవే రోడ్డును ఆనుకొని ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నుబడిన అధికార పార్టీ నాయకులు ఇరువురు పావులు కదిపారు. చెరువులో మట్టి తోలకాలకు అనుమతులు పొంది ఆ మట్టితో వాగును పూడ్చేసి ఆక్రమించేశారు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరద నీరు వెళ్లడానికి దారి లేక పొలాలన్నీ ముంపునకు గురవుతాయని వాగుకు చుట్టుపక్కల ఉన్న రైతులు ఆందోళన చెంది అభ్యంతరం వ్యక్తం చేసినా వారినెవరిని లెక్కచేయకుండా తమ పనిని కానిచ్చేశారు. కళ్లు మూసుకున్న అధికారులు పట్టణంలోని పెద్ద చెరువు ఆయకట్టు మధ్యలో నుంచి వెళ్తున్న వాగుకు అడ్డుగా మెరకతోలి యథేచ్ఛగా పూడ్చేసి ఆక్రమించేసినా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కళ్లు మూసుకొని కూర్చోవడం గమనార్హం. పట్టణంలో రెండు వార్డులకు ఒక వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్లు ఉన్నప్పటికీ వారెవరికి ఆక్రమణలు పట్టవు. ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ఇరిగేషన్ అధికారులకు ఏమాత్రం కనబడదు. గాంధీనగర్, స్టేషన్తోట, సబ్‌కలెక్టర్ కార్యాలయం, భువనగిరిపేట, 30, 31, 32 వార్డుల్లో వర్షం కురిసినప్పుడు వచ్చే వరద నీరంతా ఈ వాగులోకి చేరి పొలాల మధ్య గుండా ప్రవహించి ఊటవాగులోకి చేరుతుంది. 216హెచ్ హైవేను ఆనుకునే ఉన్న ఈ ఆక్రమించిన వాగు విలువ కోట్లలోనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ హైవేను నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి కానుండటంతో ఆక్రమణకు గరైన వాగు స్థలం విలువ ఇప్పటి కంటే మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంత విలువైన స్థలాలు అన్యాక్రాంతం కావడంతో పాటు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులను ఆక్రమించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాలకు చుట్టుపక్కల ప్రదేశాలకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమించిన వాగులోని మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఆక్రమణలో అధికార పార్టీ నేతల పర్వం మాజోలికి ఎవరొస్తారనే ధీమాతో దురాక్రమణలు వరద వస్తే పొలాలు మునిగిపోతాయని రైతుల ఆందోళన -
కర్తవ్య నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు : కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మాదక ద్రవ్యాలు (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఆ ఇద్దరు అధికారులు అశువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉన్నాడన్న సమాచారంతో అతడ్ని పట్టకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఆలమూరు ఎస్సై అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామి, డ్రైవర్ జి.రమేష్ కారులో హైదరాబాద్ బయలు దేరారు. కోదాడ సమీపంలోని దుర్గాపురం వద్దకు వచ్చేసరికి వారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. నరసాపురంలో విషాదఛాయలు నరసాపురం: ఆలమూరు ఎస్సై ముద్దాల అశోక్ మృతిపై నరసాపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మృతేహాన్ని గురువారం సాయంత్రం స్వస్థలమైన నరసాపురం తీసుకొచ్చారు. పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అశోక్‌కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వశిష్ట గోదావరి గట్టున ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ వారంరోజుల క్రితం ఇక్కడకు వచ్చాడని, ఆ రెండు రోజులుచాలా సరదాగా గడిపినట్టు గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన -
లారీ రూపంలో కబళించిన మృత్యువు
భీమడోలు, మండవల్లి: మోటార్‌సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. పూళ్ల పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామృష్ణ, సీతామహాలక్ష్మి పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో నివాసముంటున్నారు. కుమార్తె మోరు లక్ష్మీతిరుపతమ్మ ఆనారోగ్యం కారణంగా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ, సీతామహాలక్ష్మి మోటార్‌సైకిల్‌పై ఏలూరుకు బయలుదేరారు. మార్గమధ్యమైన పూళ్ల పంచాయతీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీతామహాలక్ష్మి (61) అక్కడిక్కడే మృతి చెందింది. భర్త రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి మృతితో ఎంఎంపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న లారీ భార్య మృతి, భర్తకు గాయాలు -
కనులపండువగా శివ కల్యాణం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణ మహోత్సవం గురువారం కన్నులపండువగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కనులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. -
జగన్నాథ ఉత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథని ఆలయం రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా పూరీలో వలె ఈ ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు నిర్వహించనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం 6 గంటల నుంచి జగన్నాథ రధయాత్ర ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రం వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే ఈ సారి స్వామివారి దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. దేవస్థానం అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఇత్తడితో దశావతారాల రూపాలను తయారు చేయించారు. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని జగన్నాథుడు శుక్రవారం ఆలయ యాగశాలలో మత్స్యావతార అలంకారంలో దర్శనమిస్తారని, భక్తులు దర్శించి తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. -
చేదు మిగిల్చిన మామిడి
నూజివీడు : ఏ ఏటికాయేడు లాభాలను పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు మామిడి చేదునే రుచిచూపిస్తోంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటం, ధర లేకపోవడంతో రైతులు కు ఆదాయం లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. పండ్లలో రారాజుగా మామిడికి పేరున్నప్పటికీ అదే మామిడిని సాగుచేస్తున్న రైతులు మాత్రం తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ ఏడాదైనా పరిస్థితి బాగుంటుందనే ఆశాభావంతో మామిడి రైతు ముందుకు సాగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోగా ఏడాదికేడాదికి మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధర లభిస్తుందని రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. దీనిలో నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉంది. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్ద రసాలు వంటి రకాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మామిడి పంట లక్షణం ఒక ఏడాది కాపు బాగా ఉంటే మరో ఏడాది దిగుబడి ఉండదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ సహజ లక్షణానికి భిన్నంగా మామిడి దిగుబడి ఉంటోంది. గత నాలుగైదేళ్లుగా ప్రతిఏటా కాపు తక్కువగానే ఉంటోంది. పూత సమయంలో ఎక్కడ చూసినా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ పిందెగా మారే శాతం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. పూత దశలో ఆశిస్తున్న నల్లతామర రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతోంది. పతనమైన ధరలు రైతులు ఎక్కుగా బంగినపల్లి, తోతాపురి(కలెక్టర్), రసాల తోటలను సాగుచేస్తుండగా ఈ ఏడాది అన్ని రకాల దిగుబడి చాలా తక్కువగా ఉంది. కాపు పది నుంచి 20శాతం లోపు మాత్రమే ఉండటంతో మామిడికి సీజన్ ప్రారంభంలో మంచి ధర లభించింది. బంగినపల్లి రకం కాయలకు టన్నుకు ముంబాయి మార్కెట్లో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర లభించింది. అయితే రానురాను కొంతమేరకు ధర తగ్గుముఖం పట్టినప్పటికీ టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధర నిలబడింది. నూజివీడు, నున్న, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లోని కమీషన్ షాపుల్లో టన్ను రూ.10 వేల నుంచి రూ.15 వేల లోపు మాత్రమే ఉంది. తోతాపురి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి ప్రారంభంలో టన్ను 12 వేల ధర లభించినప్పటికీ రానురాను పతనమవుతూ టన్ను రూ.3 వేలకు పడిపోయింది. అంతేగాకుండా మే నెల అంతా వర్షాలు కురవడం వల్ల కాయల్లో నాణ్యత సైతం తగ్గిపోయింది. దీంతో రైతులకు కోతఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. నష్టాలు మిగలడంతో ఖరీఫ్ సీజన్లో మామిడి తోటల్లో దుక్కిదున్ని ఎరువులు వేసే పరిస్థితి లేదు. పట్టించుకోని ప్రభుత్వం మామిడి ధరలు పతనమైనా రైతులను ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కనీసం ధరలు పతనమవ్వకుండా చర్యలు తీసుకోలేదు. నున్న మామిడి మార్కెట్లో మామిడి కాయలను కొనుగోలు చేసి దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసే సేట్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పే అధికారి కూడా ఎవరూ లేకపోవడంతో మామిడి ధర పతనమై రైతులకు ఈ ఏడాది చేదును పంచింది. రూ.15 లక్షల నష్టం వాటిల్లింది ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా మామిడి ధరలు పతనమయ్యాయి. తోతాపురి టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చులు రాకపోవడంతో కాయలను కోయకుండా వదిలేశా. బంగినపల్లి ధర సైతం టన్ను రూ.10 వేలకు పడిపోయింది. 40 ఎకరాల్లో మామిడి కాపును కొంటే ధర లేక రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ఆదుకోవాలి. – బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం ధర లేక నిరాశలో రైతులు కోత ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏటా నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన -
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాణిక్యరావు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఏలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఎంటీవీ యూ ట్యూబ్ ఛానల్ చైర్మన్ కాగిత మాణిక్యరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఒంగోలులో నిర్వహించిన సంఘ 36వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కంచర్ల జయరాజు, ఐజేయూ జాతీయ కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్, అభినందంచారు. అలాగే మాణిక్యరావు ఎన్నికపట్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి మండవల్లి: గూడ్స్ రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైకలూరు–మండవల్లి రైల్వే స్టేషన్ల మధ్య 68–17 కిలో మీటరు నెంబర్ వద్ద ఒక వ్యక్తి అజాగ్రత్తగా రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా కై కలూరు వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే గుడివాడ రైల్వే ఎస్సై ఫోన్ 94406 27570 లేదా 98662 21412 నంబర్లలో తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.యువతి అదృశ్యంపై కేసు నమోదు ఆకివీడు : యువతి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై హెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి మండలం కాళ్లపాలెంకు చెందిన యువతి (19) స్థానిక ఎస్ టర్నింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తాత ఇంటి వద్దకు ఇటీవల వచ్చింది. ఈనెల 24వ తేదీ ఉదయం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదని, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించక పోవడంతో యువతి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సర్కారు నిర్ణయం.. డీలర్లకు భారం
భీమడోలు: కూటమి సర్కారు నిర్ణయం రేషన్ డీలర్లకు భారంగా మారింది. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను తొలగించి ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఒక అడుగు వెనక్కు వేసి 65 ఏళ్లు నిండిన వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఇంటికే రేషన్ సరఫరా చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించింది. జూలై నెల రేషన్‌ను ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముందుగానే ఇంటింటికీ వెళ్లి డీలర్లు పంపిణీ చేయాలని పౌరసరఫరాల విభాగం అధికారులను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. డీలర్లకు కష్టాలు రేషన్ డీలర్లలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులుండడం.. కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధుల ఇంటింటికీ వెళ్లి రేషన్ సరఫరా చేయాల్సి రావడం వారికి తలకు మించిన భారంగా మారింది. వృద్ధుల ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే గానీ బియ్యం, సరుకుల పంపిణీకి వాహనాన్ని కేటాయించలేదని, ఒక్క సంచి కూడా ఇవ్వలేదని, కమీషన్ సైతం పెంచలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 20 వేల రేషన్ కార్డులుండగా... 65 ఏళ్లు నిండిన వృద్ధుల రేషన్ కార్డులు 2406 ఉన్నాయి. వారందరికీ ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి రేషన్ పంపిణీకి మండలానికి కొన్ని వాహనాలు కేటాయించాలని, దూరాభారాన్ని ఎదుర్కొంటున్న డీలర్లకు పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా భీమడోలు సీఎస్ డీటీ భరత్‌కుమార్ మాట్లాడుతూ వయోభారంతో ఉన్న డీలర్లు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
డయల్ 112 సేవలు వేగవంతం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో అసాంఘిక శక్తుల ఆట కట్టించటం.. డయల్ 112 సేవలు మరింత వేగవంతం చేయడం.. ట్రాఫిక్ నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన హైటెక్ బుల్లెట్ వాహనాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బుధవారం ప్రారంభించారు. ప్రజలకు ఈ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా బుల్లెట్ నడుపుతూ.. నగరంలో సిబ్బందితో కలిసి ర్యాలీ చేశారు. ట్రాఫిక్ పరిస్థితులు స్వయంగా పరిశీలించటంతోపాటు, ఆధునిక బుల్లెట్ వాహనాల పనితీరు ప్రజలకు తెలియజేసేందుకు కొద్దిసేపు నగర వీధుల్లో పర్యటించారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోడౌన్ తనిఖీ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్న్కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. మా పాఠశాలను విలీనం చేయొద్దు సార్ భీమవరం అర్బన్: మా పాఠశాలను విలీనం చేయొద్దని దెయ్యాలతిప్పలోని ఎస్సీ పేటకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలక్టరేట్‌లోని డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ పేటలో ఉన్న పాఠశాలను బీసీ పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు మొర పెట్టుకున్నారు. గతంలో బీసీ పేటలోని వ్యక్తులకు తమ పేటలోని వ్యక్తులకు గొడవలు అయ్యాయని, ఇప్పుడు విలీనం చేయడం వల్ల మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందని వినతిపత్రంలో ఎస్సీ పేట వాసులు తెలిపారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు. ఎంఈఓ విచారణ దెందులూరు: గోపన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో ఏవీఎన్వీ ప్రసాద్ బుధవారం విచారణ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు ఆటలాడుతుండగా ఒక విద్యార్థి వేలుకి గాయమైంది. దీనిపై సమాచారం అందిన ఎంఈవో ప్రసాద్ పాఠశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని ఎంఈఓ తెలిపారు. హెచ్ఎం డాక్టర్ ఎం మనోహర్, యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి మహేష్ యాదవ్, మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు) తదితరులు ఉన్నారు. -
గ్యాస్ నొప్పితో మహిళ మృతి
చాట్రాయి: గ్యాస్ నొప్పితో ఓ మహిళ మృతి చెందింది. పోతనపల్లికి చెందిన వడిత్యా కామాక్షి (35) బధవారం గ్యాస్ నొప్పిగా ఉందని భర్తతో కలిసి చాట్రాయి ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. టిఫిన్ చేసి రావాలని ఆర్ఎంపీ వైద్యుడు సూచించారు. అనంతరం టిఫిన్ చేసి వచ్చిన తరువాత బీపీ చూస్తుండగా ఆమె అకస్మాత్తుగా వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పీహెచ్సీ వైద్యురాలు విజయలక్ష్మి చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత కారంగుల వాసు సందర్శించి నివాళులర్పించారు. -
చివరికి దక్కని ధర
బకాయిలు వాస్తవమే ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన తరువాత పంటను అమ్ముకుని ఆ సొమ్మును మరో పంట పెట్టుబడి కోసం వాడేందుకు ఎదురుచూస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ఒక దెందులూరులోనే రూ.10 లక్షలకు పైగా నగదు రైతులకు బ్యాంకు ఖాతాలకు జమ అవ్వలేదు. వస్తాయని నేటికి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వెంటనే బకాయిలు బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. – కొలుసు గణపతిరావు, రైతు, దెందులూరు కో–ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ ●సాక్షి ప్రతినిధి, ఏలూరు: నెలన్నర క్రితం రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు ఇంకా రైతు ఖాతాల్లో పడలేదు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడం, పనులు ముమ్మరం అవుతున్న తరుణంలో రబీ డబ్బులు లేక పెట్టుబడులకు అప్పులబాట పట్టాల్సిన పరిస్ధితి. కొనుగోలు చేసిన ధాన్యాన్నికి 24 గంటల్లో నగదు జమ చేస్తామని చేసిన ప్రకటన, మంత్రుల సమీక్షలు అంతా ప్రచార ఆర్భాటాలకే పరిమితం తప్ప క్షేత్ర స్ధాయిలో అమలుకాలేదు. జిల్లాలో 2400 మంది రైతులకు రబీ సీజన్‌కు సంబంధించి రూ.40 కోట్ల మేర నగదు చెల్లించాల్సి ఉంది. మాటల్లో తప్ప చేతల్లో శూన్యం జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. గత రబీ సీజన్లో 77,466 ఎకరాల్లో వరి సాగు జరగగా 3.53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 1.90 లక్షల ఎకరాల్లో సాగు జరగనుంది. ఈ క్రమంలో గత రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తోలుకుని విక్రయించుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని, 24 గంటల వ్యవధిలోనే నగదును ఖాతాలో జమ చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరుకు ముగించారు. జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 3.53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా ప్రభుత్వం 50 శాతం మేర కొనుగోలు చేస్తామని ప్రకటించి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తరువాత రైతులు అడుగుతున్నారని 1.80 లక్షలకు, ఆ తరువాత 2 లక్షలకు, ఆ తరువాత 2.50 లక్షలకు టార్గెట్‌ను పెంచారు. 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేస్తామని మే మొదటి వారంలో ప్రకటించారు. రూ.40 కోట్ల బకాయి మే 9కి ముందు వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు జమ చేశారు. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.590 కోట్లు కాగా రైతులకు రూ.550 కోట్లు మాత్రమే చెల్లించారు. అది కూడా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి చెల్లించి 2400 మంది రైతులకు రూ.49 కోట్ల వరకు మే 10 నుంచి బకాయిలు ఉండిపోయాయి. దీనిపై అనేకమార్లు విన్నవించినా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా స్పందన శూన్యం. నిధుల కొరతని, సాంకేతిక కారణాలని ఇలా అనేక రకరకాల సాకుతో నెలన్నరగా నగదు చెల్లింపులు నిలిపివేశారు. ఖరీఫ్ ప్రారంభమైనా ఖాతాల్లో పడని రబీ సొమ్ములు జిల్లాలో 2,400 మంది రైతులకు రూ.40 కోట్ల మేర బకాయి మే 9 తరువాత కొన్న ధాన్యానికి జమకాని నగదు -
జయహో జగన్నాథా
ద్వారకాతిరుమల: పూరి క్షేత్రంలో వలే జగన్నాథ రధోత్సవాలను శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథుని ఆలయంలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామివారు ఆలయ యాగశాలలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్వనమివ్వనున్నారు. దీన్ని పురస్కరించుకుని యాగశాల ప్రాంతాన్ని ముస్తాబు చేస్తున్నారు. అలాగే స్వామివారి రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించారు. అదేవిధంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. ఉత్సవాల ప్రారంభం రోజు శుక్రవారం సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు రథ వాహనంలో కొలువుదీరి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లనున్నారు. అలాగే వచ్చేనెల 6 న ఆలయం నుంచి సమీప గ్రామమైన తిమ్మాపురం వైపు రథయాత్ర సాగనుంది. ఉత్సవాలు జరిగే పదిరోజులు జగన్నాథుని దశావతారాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించాలని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి కోరారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో ప్రత్యేక అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఆలయ విశిష్టత ఈ ఆలయాన్ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పూరీ వాస్తవ్యులు, మఠాధిపతులైన మంత్రరత్నం అమ్మాజీ అనే లక్ష్మీ అమ్మవారు 130 ఏళ్ల క్రితం నిర్మించారు. అందులో జగన్నాథునితో పాటు, వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కల్యాణోత్సవ, పవిత్రోత్సవాలతో కై ంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న తరువాత జీర్ణోద్ధరణ గావించి మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవుల సన్నిధి, ఆళ్వారుల సన్నిధి, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధి ఉన్నాయి. రేపటి నుంచి లక్ష్మీపురం ఆలయంలో జగన్నాథ రధోత్సవాలు -
‘ఎస్’ వెనుక ఎవరు?
సాక్షి టాస్క్‌ఫోర్స్: నూజివీడు నియోజకవర్గంలోని మద్యం బెల్టుషాపులకు మద్యం సిండికేట్ సరఫరా చేస్తున్న మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్ ఉండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊరూరా పదుల సంఖ్యలో బెల్టుషాపులు, మద్యం దుకాణాల వద్ద బార్లను తలపించేలా అనధికార సిట్టింగ్లతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఇష్టారాజ్యంగా సిట్టింగ్లతో మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ అనధికార సిట్టింగ్‌ల వైపు ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ‘ఎస్’ స్టిక్కర్‌తో మద్యం సీసాలను సరఫరా చేస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ స్టిక్కర్ అర్థం ఏమిటి, దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మద్యం షాపుల నుంచి బెల్టుషాపులకు మద్యం సీసాలు రవాణా అవుతుంటే స్టిక్కర్ వేయాల్సిన అవసరమేముందనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తోంది. అలా కాకుండా ఇంకేదైనా మద్యంను సరఫరా చేస్తున్నారా అనే అనుమానాలు ప్రబలడానికి ఆస్కారం ఏర్పడింది. బెల్టుషాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ.40 అధికం ఏ గ్రామంలోనైనా బెల్టుషాపు పెట్టాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే. బెల్టుషాపులకు అనుమతి లేదని, ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఒక్కో సీసాపై రూ.20 నుంచి రూ.40 అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ బెల్టుషాపులకు ఏ మద్యం బ్రాండ్ అయినా సరే ఒక్కో సీసాపై ఎమ్మార్పీపై అదనంగా రూ.20కు విక్రయిస్తుండగా బెల్టుషాపుల నిర్వాహకులు మరో రూ.20 వేసుకొని మందుబాబులకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో సీసాకు ఎమ్మార్పీ కంటే రూ.40 అదనంగా చెల్లించి మందుబాబులు మద్యంను సేవించాల్సి వస్తోంది. పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తూ ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేస్తూ బెల్టుషాపుల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రకటనలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారు. మద్యం సీసాలపై ‘ఎస్’ స్టిక్కర్‌పై సర్వత్రా చర్చ -
ఇంకా వెలగని ‘దీపం’
దెందులూరు: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేశారు. రెండో విడత పూర్తిగా విస్మరించారు. 2024 నవంబర్‌లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీంను అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో పైసా కూడా జమ కాలేదు. జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 55 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు కలిపి 6,92,825 ఉన్నాయి. మొదటి విడత జిల్లా వ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నారు. 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు బ్యాంకు ఖాతాల్లో జమైంది. రూ.49,78,950 బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరుకు వరకు రెండో విడత గడువు నిర్ణయించారు. దీనికి సంబంధించిన నిధులు ఇంతవరకూ అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలుగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించారు. ఫిర్యాదులు బుట్టదాఖలు దీపం పథకం సిలిండర్ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి నగదుకి సంబంధించిన సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వ నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు. రెండు నెలలైనా అందని గ్యాస్ సబ్సిడీ రెండో విడత సుమారు రూ.19.81 కోట్ల బకాయిలు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
భీమడోలు: సూరప్పగూడెంలోని పాత సుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరాబత్తుల సాయిబాబు (30) పాత షుగర్స్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 24వ తేదీన ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల షిఫ్ట్‌లో పని చేసేందుకు వెళ్లాడు. అయితే రాత్రి 10 గంటలకు షిఫ్ట్ దిగవలసి ఉండగా రిలీవర్‌కు ఆతను కనిపించలేదు. ఫ్యాక్టరీలో ఉన్న చెరువు పక్కన దుస్తులు కనిపించడంతో అతని కోసం చెర్వులో వెతకగా బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. కాగా మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సాయిబాబు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. -
● మావుళ్లమ్మకు ఉయ్యాల సేవ
భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు బుధవారం అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి, మెంటే వంశస్తులచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఈ కార్యక్రమాన్ని జరిపారు. అలాగే అమావాస్య సందర్భంగా మావుళ్లమ్మ దేవస్థానంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 60 మంది దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశం చౌక్) -
ఏం సమాధానం చెబుతారు
మహిళలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలు ఏం సమాధానం చెబుతారు. ఎన్నికల ముందు నాది హామీ అంటూ అన్ని ప్రచార సభల్లో హామీలిచ్చారు. ఇప్పుడు వంట గ్యాస్ విషయంలో కూడా మోసం చేస్తే ఎలా? – నిట్టా లీలా నవకాంతం, జెడ్పీటీసీ దెందులూరు సూపర్ సిక్స్ అమలు చేస్తారా? కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? అన్ని వర్గాల ప్రజలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. సంవత్సరం పూర్తయింది. గ్యాస్ కాకుండా ఉచిత బస్సు.. ఆడబిడ్డ నిధి ఎప్పుడు అమలు చేస్తారు. – అప్పన పద్మావతి, వైస్ ఎంపీపీ, పెదపాడు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఎన్నికల ముందు అన్ని ప్రచార సభల్లో సూపర్ సిక్స్ పేరిట హామీలిచ్చారు. సంవత్సరం గడిచినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకాలు. అమలు చేయనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – పర్వతనేని శ్రావణి, సర్పంచ్, రామారావుగూడెం సబ్సిడీ జమ చేస్తున్నాం 3.30 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ సబ్సిడీ కోసం ఆన్లైన్ చేశారు. సబ్సిడీ జమ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము త్వరలోనే జమ అవుతుంది. – విలియమ్స్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఏలూరు -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
బుట్టాయగూడెం/చింతలపూడి: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగం ఆర్టీఐ వింగ్ సెక్రటరీగా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంకు చెందిన తగరం రాంబాబు నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కార్యదర్శిగా లింగపాలెం మండలం ముడిచర్ల గ్రామానికి చెందిన ముల్లంగి వేణురెడ్డిని నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వేణురెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తమను రాష్ట్రస్థాయి పదవుల్లో నియమించినందుకు వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీ పరీక్షకు 541 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో బుధవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మెత్తం 541 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షలకు 100 మందికి 88 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 100 మందికి 97 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 179 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 199 మందికి గాను 177 మంది హాజరయ్యారు. వెలిగిన వీధి లైట్లు ద్వారకాతిరుమల: ‘చెరువు వీధిలో చిమ్మ చీకట్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. వీధిలైట్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడిన లోపాన్ని సరిచేశారు. దాంతో వీధిలైట్లు పూర్తి స్థాయిలో వెలిగాయి. ఈ క్రమంలో డ్రైనేజీలను శుభ్రం చేసే పనులను కూడా ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలు డ్రెయిన్లను శుభ్రం చేశారు. -
9 కిలోల గంజాయి పట్టివేత
నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ ఏలూరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుల నుంచి 9 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, రూ.4,100 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి సీఐ వి.కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామ పరిధిలోని ఏలూరు జాతీయ రహదారి–16 సర్వీస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారని తెలియటంతో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఎస్సై రాంబాబు, సిబ్బంది చాకచక్యంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్–1985 మేరకు కేసు నమోదు చేశామన్నారు. విలాసాలు, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. నిందితులు బాపట్ల జిల్లా అద్దంకి మండలం ప్రాంతానికి చెందిన సైడ వేణు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన సింబత్తుల సాయి, అదే గ్రామానికి చెందిన అలుగుల నాగవర్థన్గా గుర్తించామని, వీరితోపాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. -
సూర్యఘర్ యోజనపై సమీక్ష
ఏలూరు(మెట్రో): జిల్లాలో పీఎం సూర్య ఘర్ కింద సోలార్ ప్యానల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు, స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి మంచి ప్రగతిని సాధించాలని కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సూర్య ఘర్ యోజన పథకంపై విద్యుత్తు శాఖ అధికారులు, బ్యాంకర్లు, సోలార్ కంపెనీలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5 లక్షలు కుటుంబాలు ఉండగా కనీసం లక్ష దరఖాస్తులు రావాలని, 70 వేలు లక్ష్యం కాగా ఇంతవరకు 52 వేలు దరఖాస్తులు అందాయన్నారు. లక్ష్యం మేరకు సాగకపోవడంపై కారణాలను సమీక్షించారు. సూర్య ఘర్ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు పి.సాల్మన్‌రాజు, లీడ్ బ్యాంకు మేనేజరు డి.నీలాద్రి, ఈఈ ఎ.రాధాకృష్ణ, డీఈ నోడల్ అధికారి ఏ.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ప్రవేశాలకు నేడు, రేపు కౌన్సెలింగ్ ఏలూరు (టూటౌన్): ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న బీ.ఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో మిగిలిన ఇంటర్మీడియట్ సీట్ల అడ్మిషన్ కోసం ఈ నెల 26, 27 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారిణి బి.ఉమాకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు ఈ నెల 26న వట్లూరు గురుకులంలో, 27న బాలురకు పెదవేగి గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. -
కూటమి ప్రభుత్వానివి ఓటు బ్యాంకు రాజకీయాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలను కోవడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం జిల్లా అధ్యక్షుడు కడలి రామాంజనేయులు విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవనంలో హేతువాద సంఘం నాయకుడు కోడూరి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. సైంటిఫిక్ టెంపర్‌ను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మహిమల పేరుతో ప్రసిద్ధుడైన సత్య సాయిబాబా జయంతిని అధికారికంగా జరపాలను కోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు బాబాల పట్ల చూపిన గౌరవం, మహాకవి శ్రీ శ్రీ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువాల పట్ల చూపకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ముందుగా ఇటీవల మరణించిన హేతువాది, నటుడు అల్లం గోపాలరావు, అవయవ దాన ఉద్యమ నాయకురాలు పేరేచర్ల లక్ష్మీకాంతంలకు ఘనంగా నివాళులు అర్పించారు. సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు, ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, హేతువాద సంఘ నాయకులు పాల్గొన్నారు. -
● మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బారులుదీరి స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.2,15,016 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. సుమారు 1200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారని ఈవో తెలియజేశారు. -
ఖైదీల సౌకర్యాలపై ప్రతి నెలా తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలును ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి కారాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతి నెలా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో తనిఖీలు ఉంటాయని, మూడు నెలలకు ఒకసారి జిల్లా చైర్మన్ తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు. జిల్లా జైలులోని ఖైదీల వివరాలు తెలుసుకుని, ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందడంలో సమస్యలు ఏర్పడితే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి, జైలర్ కే.శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ పీవీఎన్. మునీశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి -
దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
పెదవేగి : ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత చర్యలు, వికృత చేష్టలతో హద్దులు దాటి విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దుగ్గిరాల ప్రధాన కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటును స్థానిక కూటమి నాయకులు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చిన తరువాత మహానేత వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టి, తల వెనుక భాగంలో కర్ర పుల్ల గుచ్చి అవమానించడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. దీనిపై జిల్లా పోలీస్ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, వారు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. విగ్రహ ధ్వంసం సరైంది కాదు దుగ్గిరాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఖండించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే విధానం సరైంది కాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు దైవంగా భావిస్తారని, అటుంవంటి మహనీయుని విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అధికారులు స్పందించకపోతే ఉద్యమిస్తామని వెల్లడి -
నకిలీ మద్యం తయారీ గుట్టు రట్టు
పాలకొల్లు సెంట్రల్: ఎకై ్సజ్ పోలీసులు పట్టణంలో నకిలీ మద్యం తయారీ ముఠా గట్టును రట్టు చేశారు. శంభునిపేటలో నివాసం ఉంటున్న పులి శీతల్ అనే వ్యక్తి ఇంటిలో నకిలీ మద్యం తయారవుతుందని వచ్చిన సమాచారంపై ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శీతల్ ఇంటిలో 130 లీటర్ల స్పిరిట్తోపాటు ప్రమాదకర ఎసెన్స్, నకిలీ మద్యం తయారీ యూనిట్, మద్యం సీసాలకు మూతలు బిగించే మిషన్, ఖాళీ మద్యం సీసాలు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ నడుపుతున్న పులి శీతల్‌ని అరెస్ట్ చేశారు. పాలకొల్లు ఎకై ్సజ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిందితుడికి స్పిరిట్, ఎసెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. శీతల్‌పై గుట్కా కేసు కూడా ఉందన్నారు. అమలాపురంలో ఈ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అజయ్ సింగ్, ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో పాలకొల్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్, భీమవరం స్క్వాడ్ సీఐ కల్యాణ చక్రవర్తి ఎస్సైలు రఘు, మహేష్, రమాదేవి ఈ దాడుల్లో పాల్గొన్నారు. -
బడ్జెట్లో దళితులకు తగ్గిన కేటాయింపులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో 2018–19 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.2,450 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.341 కోట్లు మాత్రమే కేటాయించి దళితులను మోసం చేశారని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సొంగ మధు అన్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకటించిన పథకాలు దళితుల జీవన విధానాలకు, ఉపాధికి ఎటువంటి సబంధంలేనివని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చిన పథకాలు – భూమి కొనుగోలు పథకం, వ్యవసాయ పనిముట్లు, రూ.50 లక్షల వరకు బ్యాంక్ లింకుడ్ స్కీమ్స్, నాన్ బ్యాంక్ స్కీమ్స్, వనరబుల్ లోన్స్, చర్మకారులకు రుణాలు, పూర్తి సబ్సిడీ రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇచ్చే రుణాలు ఉన్నాయన్నారు. వీటితో పాటు కార్లు, గూడ్స్ వెహికల్స్, క్రేన్లు, పొక్లెయినర్లు, లారీలు, ట్రాక్టర్లు ఆటోలు, పారిశుద్ధ్య వాహనాలు, ఎస్సీల సాంప్రదాయ వ్యాపారాలు, పనులకు సంబంధించిన పథకాలు ఉండేవన్నారు. అయితే ప్రస్తుత ఎస్సీ కార్పొరేషన్లో ఆయా పథకాలు లేకపోవడం, అదే సమయంలో వీరికి ఎటువంటి సంబంధంలేని వ్యాపార పథకాలు ఇవ్వడం అంటే ఎన్నికల హామీ తప్పటమే అవుతుందన్నారు. ఈ మేరకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్‌కు విడుదల చేయాలని, ప్రస్తుతం కార్పొరేషన్ ప్రకటించిన స్థానంలోనే గతంలో అమలు పరచిన 27 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మాదిగ చర్మకారులకు గతంలో రూ. 60 కోట్లు ప్రకటించిన మాదిరిగానే ప్రస్తుతం రూ.100 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి చర్మకారులకు చెప్పుల షాపులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్సీ నాయకుడు మాముడూరి మహంకాళి ఉన్నారు. చంద్రబాబు మోసం చేశారని, న్యాయం చేయాలని డిమాండ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వినతి -
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు
కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. 8లో uమూలనపడిన ఆక్వా ల్యాబ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలంగా సేవలు నిలిచిపోయాయి. 8లో uమంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని పరిరక్షించాలి ఏలూరు (టూటౌన్): పెదవేగిలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిరక్షించాలంటూ కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి సహకరించిన అవినీతి ఏపీ ఆయిల్‌ఫెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీపై కా ర్పొరేట్ శక్తులు కన్ను వేశాయన్నారు. ముందు గా భారీ ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చే రా రు. ఐఎఫ్టీయూ నగర ప్రధాన కార్యదర్శి య ర్రా శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. తల్లికి వందనం ఇవ్వాలి ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయాలంటూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు సమర్పించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడుతూ తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు పథకాలు అమలు చేయకపోవడం శోచనీయం అన్నారు. గర్జించిన అంగన్వాడీలు ఏలూరు (టూటౌన్): తమకు సంక్షేమ పథకా లు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మా ర్చాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం ఇస్తామని ప్రకటించి అంగన్వాడీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు టి.మాణిక్యం, ఎంఏఎన్ తులసి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి నాయకత్వం వహించారు. సొంత ప్రాంతాల్లో అవకాశమివ్వాలి ఏలూరు (టూటౌన్): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో సొంత మండలం, సొంత మున్సిపాలిటీల్లో అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగుల జేఎసీ చైర్మన్ జీవీఎస్ శ్రీనివాస్ కోరారు. ఏలూరులో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు బదిలీల సమస్యలపై జేఏసీగా కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీఓ 5తో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, సొంత ప్రాంతాల్లో అవకాశమిచ్చేలా జీఓను సవరించాలని కోరారు. జేఎసీ నాయకులు కేఎస్సీ దు ర్గాప్రసాద్, ఎం.సునీత, పి.ప్రసన్న, సీహెచ్ శ్రీ నివాస్, కె.అబ్రహం తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 802 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సోమవారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 183 మందికి 176 మంది, మధ్యాహ్నం 181 మందికి 149 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం 134 మందికి 103 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 210 మందికి 200 మంది, మధ్యాహ్నం 198 మందికి 174 మంది హాజరయ్యారు. విద్యుత్ అధికారుల బదిలీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ పరిధిలో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్ ఇమ్మడి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెదవేగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐవీ మల్లేశ్వరరావును భీమడోలుకు, భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణను పెదవేగికి బదిలీ చేశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు టౌన్: ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు నిపుణుడని, రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా చేస్తూ రివేంజ్ రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సోమ వారం ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరులో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్‌లోని ఆరు హామీలు పూర్తి చేశా నని చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారన్నారు. జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు 20 ఏళ్లు ముఖ్యమంత్రి అయినా ఒకటేనని, కేవలం ఐదేళ్లలోనే జగన్మోహన్రెడ్డి రూ.3 లక్షల కోట్ల మొత్తాన్ని సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచితే చంద్రబాబు మాత్రం ఒక ఏడాదికే 1.30 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. చంద్రబాబు గతంలో హామీలు అమలు చేయాల్సిన సమయంలోనూ హ్యాపీ సండే, దోమలపై దండయాత్ర అని డైవర్షన్ రాజకీయాలు చేశారని, ఇప్పుడేమో పథకాలడిగితే యోగాంధ్ర, ఊపిరి బాగా తీసుకోవాలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టిన దాని కంటే పోలవరం ప్రాజెక్టును అందరికీ చూపించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని, పని కంటే పబ్లిసిటీ ఎక్కువని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువతకు రూ.10 లక్షల చొప్పున ఇస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించారని, దానిని ఆయన మరచిపోయారన్నారు. కనీసం మీడియా, ప్రజలైనా దీనిపై ప్రశ్నించాలని సిద్ధార్థరెడ్డి కోరారు. నిరుద్యోగ భృతి రూ.57 వేల కోట్ల బకాయి రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కొడుకుకు మాత్రం ప్రతిసారీ ఉద్యోగం ఇస్తున్నాడు గానీ నిరు ద్యోగ యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులను వంచించారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఈ ఏడాదికి సంబంధించి రాష్ట్రంలోని నిరుద్యోగ యు వతకు రూ.57 వేల కోట్లు చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ యువత పోరును నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2.50లక్షల మంది వలంటీర్లను తొలగించారని, ఎండీయూలో పనిచేస్తున్న 15 వేల మందికి ఉపాధి తీశారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, నేడు కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. బాబు పాలనలో ప్రజలకు కష్టాలే.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారనీ, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, చివరకు వ్యాపారులు సైతం నష్టాల్లో ఉన్నారని పార్టీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ అన్నా రు. కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకు ఇంజనీరింగ్ ఫీజులు సైతం పెంచేశారని ఆరోపించారు. తల్లికి వందనం పథకంలో 87 లక్షల మంది తల్లులు అర్హులు కాగా 57 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూర్చడం కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. కదం తొక్కి.. నిరసన తెలిపి.. వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ ఎత్తున యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు పోటెత్తారు. వేలాదిగా తరలిరావడంతో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ స్తంభించింది. ఉదయం 9.30 గంటలకే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి శ్రేణులు తరలివచ్చారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, ప్లెక్సీలతో యు వత కేరింతలు కొడుతూ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యు వజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి, ఏలూరు పా ర్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్, సమన్వయకర్తలు మామిళ్లపల్లి జయప్రకాష్ (ఏలూరు), కంభం విజయరాజు (చింతలపూడి), పుప్పాల వా సుబాబు (ఉంగుటూరు), తెల్లం బాలరాజు (పోలవరం) దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా ఎన్ఆర్పేట, జెడ్పీ కార్యాలయం రోడ్డులో నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద ౖబైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసు లు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజయ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు మణికంఠ కిషోర్, కోటగిరి సందీప్, బసవ వినయ్, దాలి వెంకటేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, జెడ్పీ వైఎస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ జి.కృష్ణంరాజు, జెడ్పీటీసీలు నిట్టా లీలా నవకాంతం (దెందులూరు), భవానీ (భీమడోలు), కోడే వెంకట కాశీ విశ్వనాథ్ (నిడమర్రు), జయలక్ష్మి (ఉంగుటూరు), హేమ కుమారి (పోలవరం), కడిమి రమేష్ (కామవరపుకోట), పోల్నాటి బాబ్జీ (జంగారెడ్డిగూడెం), జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు పిల్లా చరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, అంగన్వాడీ అధ్యక్షురాలు శైల స్వాతీ యాదవ్, లీగల్‌సెల్ అధ్యక్షుడు అల్తి శ్రీనివాసరావు, సోషల్ మీడియా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్, బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్‌కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు చిలుకూరి జ్ఞానరెడ్డి, ఆర్టీఐ అధ్యక్షుడు స్టాలిన్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు జైబాబు, దెందులూరు యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, కై కలూరు యువజన అధ్యక్షుడు చార్లెస్, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకీ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అప్పనవీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ బెదిరింపులు, అక్రమ కేసులు, జైళ్లతోనే పాలన కూటమి పాలనలో తలలు నరికితే తప్పు లేదా? వైఎస్సార్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఏలూరులో యువత పోరుకు కదం తొక్కిన నిరుద్యోగులు భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా -
బెల్టుషాపులపై దాడి
నూజివీడు: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు మండలాల్లో సిబ్బంది సోమవారం దాడులు చేసి 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన మల్లెల శివనాగరాజు వద్ద 10 మద్యం సీసాలు, ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన పలగాని విమల వద్ద 10 మద్యం సీసాలు, చెక్కపల్లికి చెందిన చెంగల వెంకటేశ్వరరావు వద్ద 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టుషాపులకు మద్యంను సరఫరా చేస్తే సంబంధిత షాపుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలన్నారు. అలాగే బెల్టుషాపుల నిర్వహణకు అనుమతులు లేవని, బెల్టుషాపులు నిర్వహించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మళ్లీ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు ఎస్పీ వి.భీమారావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను అదనపు ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. పలు సమస్యలపై మొత్తం 17 అర్జీలను అదనపు ఎస్పీ స్వీకరించారు. గర్భిణి అనుమానాస్పద మృతి ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఏలూరు శ్రీరామ్‌నగర్ 9వ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తోన్న కాళిదాసు దేవి(30) భర్తతో కలిసి జీవిస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు సమాచారంతో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భిణీ ఆత్మహత్యపై సందేహాలు వ్యక్తం కావటంతో త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కుంగుతున్న జాతీయ రహదారి ఆకివీడు: రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడంతో జాతీయ రహదారి ఉండి పంట కాల్వలోకి కుంగిపోతోంది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక తెల్ల వంతెన వద్ద నుంచి చెరుకువాడలోని వెంకటేశ్వరస్వామి గుడి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల రోడ్డు ఎత్తు పల్లాలతో ఉడడంతో తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే గానీ రహదారి పటిష్టానికి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మించి రహదారి పటిష్టానికి చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
దళితవాడల్లోని స్కూళ్ల విలీనంపై ఆగ్రహం
పెనుమంట్ర : మోడల్ స్కూళ్ల పేరుతో దళితవాడల్లో ఎంతోకాలంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను, యూపీ పాఠశాలలను డౌన్ గ్రేడ్ చేసి వేరే పాఠశాలల్లో విలీనం చేయడం ద్వారా ఆ పాఠశాలల రద్దు దిశగా ప్రభుత్వ ప్రయత్నిస్తోందని, పెనుమంట్ర మండలంలోని పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెనుమంట్ర మండలంలోని అనేక పాఠశాలలను దూర ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేశారు. పెనుమంట్రలోని దళితవాడలో ఎల్ఈ పాఠశాలను డౌన్ గ్రేడ్ చేసి 3, 4, 5 తరగతులను పెనుమంట్రలో దళితవాడకు దూరంగా ఉన్న పెనుమంట్ర (ఆర్) పాఠశాలలో విలీనం చేయడం పట్ల ఆ గ్రామ దళితులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఓడూరు పాఠశాల ఉన్న విద్యార్ధులను మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న నెలమూరు గ్రామంలో యూపీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి ఆ పాఠశాలలో విలీనం చేయడంతో ఓడూరు గ్రామస్తులు కూడా ఆందోళన చేపట్టారు. నెలమూరుకు కేవలం అరకిలో మీటరు దూరంలో కొమ్ముచిక్కాల జడ్పీ ఉన్నత పాఠశాల ఉండగా నెలమూరు యూపీ పాఠశాలను అప్‌గ్రేడ్ చేయడంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఇది దళితులను విద్యకు దూరం చేయడం కోసం జరుగుతున్న కుట్రలో భాగమేనని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓడూరు పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉండగా నెలమూరు పాఠశాలను అప్‌గ్రేడ్ చేయడం పట్ల ఆందోళన చేపడుతున్నారు. సోమవారం రెండు గ్రామాలకు చెందిన దళితులు పాఠశాలల వద్ద ఆందోళన చేయడమే కాకుండా పెనుమంట్ర తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. తమ పిల్లలను వేరొక పాఠశాలకు పంపించేదిలేదని పేర్కొన్నారు. ఇంతవరకు పెనుమంట్ర మండలంలో జుత్తిగ, పొలమూరు, మాముడూరు, ఆలమూరు, మార్టేరులోని బాసంతిదేవి జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించారు. ఈ పాఠశాలలో 3 నుంచి 5 తరగతులు ఉన్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో విలీనం చేయగా ఎస్.ఇల్లిందలపర్రు గ్రామంలోని యూపీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మండలంలోని ఎస్.ఇల్లిందలపర్రు గ్రామం మినహా అన్ని గ్రామాలలో చేసిన విలీనాల విషయంలో అధికారులు అడ్డుగోలుగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఈవో యు నాగేశ్వరరావును వివరణ కోరగా ఆయా పాఠశాలల విద్యార్ధుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విలీనం చేయడం అప్గ్రేడ్లు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్ని గ్రామాలలో తరగతి గదుల కొరత ఉండటం వల్ల సమీప పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను బట్టి ఆ పాఠశాలల్లో విలీనం చేశామన్నారు. -
మూలనపడిన ఆక్వా మొబైల్ ల్యాబ్
30 వేల ఎకరాల చెరువులకు పరీక్షలు ప్రశ్నార్థకం దెందులూరు: మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్ల క్రితం మత్స్యశాఖ ఆధ్వర్యంలో దెందులూరు, ఏలూరు రూరల్, పెదపాడు మండలాలకు సంబంధించి ఆక్వా రైతుల పొలాల మేత, ఇతర పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రైతులు ఏలూరులోని ల్యాబ్‌కు రానవసరంలేకుండా గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన సమావేశంలో సదస్సులు నిర్వహించి మేత, నీరు ఇతర శాంపిల్స్ తీసుకుంటారు. మొబైల్ వ్యాన్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి మొబైల్ ల్యాబ్‌లో ఉన్న టెస్టులు చేస్తారు. మిగిలిన టెస్టులకు శాంపిల్స్ తీసుకొని ఏలూరు మత్స్య శాఖ కార్యాలయానికి వచ్చి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసి రిపోర్టులను రైతులకు పంపుతారు. కొంతకాలంగా ఈ సేవలు నిలిచిపోయాయి. దీంతో దెందులూరు ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లోని 30 వేల ఆక్వా రైతుల చెరువుల్లో పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. నామమాత్రంగా ల్యాబ్ సేవలు ఆక్వా మొబైల్ ల్యాబ్ సేవలు బాటలోనే ఏలూరు మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో ఉన్న ఆక్వా ల్యాబ్ లో కూడా పరీక్షలు తూతూ మంత్రంగా ఉన్నాయి. ఆక్వాకు సంబంధించి మేత పరీక్ష ప్రాధాన్యమైంది. మేతకు సంబంధించి నాలుగు పరీక్షలు ఈ ల్యాబ్‌లో జరగాల్సి ఉండగా ఒక పరీక్ష మాత్రమే చేస్తున్నారు. మిషన్లు పనిచేయని కారణంగా పరీక్షలు జరగటం లేదని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవి జరగటం లేదు. పరీక్షలు జరగకపోతే ఎలా? ఆక్వాలో నీరు, మేత, ఇతర పరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఇవే లేకపోతే ఆక్వా సాగు లేనట్టే. ప్రభుత్వం ఆక్వా సాగుకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు కేటాయింపు ఇస్తామని ఊదరగొడుతోంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం. – డీబీఆర్కే చౌదరి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఆక్వా రైతుల గోడు పట్టదా? మొబైల్ ల్యాబ్ పనిచేయకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏమనాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు సైతం అరకొరగా జరుగుతున్నాయి. వెంటనే మొబైల్ ల్యాబ్ రిపేరుకు చర్యలు తీసుకోవాలి. జిల్లా కార్యాలయంలో ఉన్న ల్యాబ్‌లో అన్ని పరీక్షలు జరిగేలా చూడాలి. – నిట్టా లీలా నవకాంతం, దెందులూరు జడ్పీటీసీ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని ముక్కొల్లుపాడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వ్యక్తి మృతిపై మృతుడి తల్లి బండారు దుర్గమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరరావు(44) పొక్లైయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నూజివీడు రామాయమ్మరావుపేటకు చెందిన ప్రమీలతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రమీలకు అదే గ్రామానికి చెందిన ఇర్ల మహేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై ప్రమీలకు ఆమె భర్త కోటేశ్వరరావుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తల్లి దుర్గమ్మ కొడుకును నిద్ర లేపగా ఎంతకీ లేవకపోయే సరికి పరీక్షించగా.. మృతిచెంది ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఇర్ల మహేష్ తల్లి జమలమ్మ, మహేష్ తమ్ముడు భార్య హైమావతి కలిసి కోటేశ్వరరావుతో గొడవ పడ్డారు. కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి భోజనం పెట్టమని అడగగా భార్య పెట్టకపోవడంతో తన అన్న ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. భోజనం చేసిన కొద్దిసేపటికే కోటేశ్వరరావు వాంతులు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లి పడుకున్నాడు. తన కుమారుడి మృతి విషయంలో కోడలు ప్రమీల, ఇర్ల మహేష్‌పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల రాజీకి కృషిచేయాలి భీమవరం: పట్టణంలో జూలై 5వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ చేయడానికి కృషి చేయాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల రాజీకి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్లో ఎన్ని రాజీపడదగ్గ కేసులున్నాయనే వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న కేసుల రాజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఎం.సుధారాణి, 1వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ పి.హనీష, 2వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ ఎన్.జ్యోతి, బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె సుజాత, వివిధ పోలీసుస్టేషన్ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యువత జీవితాలతో కూటమి ఆటలు
భీమవరం: యువతను నిండా మోసం చేసిన కూట మి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ యువజన విభాగం పశ్చి మగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ హెచ్చరించారు. భీమవరంలో చేపట్టిన యువత పో రు నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని, అయినా లక్షల కోట్లు అప్పులు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆర్బాటాలు చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ ప్ర చారం చేసిన సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూ డా అమలుచేయకుండా యువత జీవితాలను ఆటలా డుకుంటున్నారని దుయ్యబట్టారు. 20 లక్షల ఉ ద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, పె ద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకా శా లు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్ర శ్నించారు. ఏడాదిలో జిల్లాలో యువతకు నిరుద్యోగ భృతి బకాయిలు రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారన్నారు. వలంటీర్ల వ్యవస్థకు మంగళం వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడిందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలంటూ మోసం చేసి గొప్పల కోసం డబ్బును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను కూడా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో కొర్రీలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ఊసేలేదన్నారు. విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యాలీగా.. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సా ర్ సీపీ యువత విభాగం నాయకులు, కార్యకర్తలు భీమవరంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి ర్యా లీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో సందీప్, వీరన్న, బంధం పూర్ణచంద్రరావు తదితరులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పార్టీ భీమవ రం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ అధ్యక్షుడు కోడే యుగంధర్, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ మంతెన సునీల్‌వర్మ, జాయింట్ సెక్రటరీ సత్తి రాజశేఖరరెడ్డి, కార్యదర్శి బలం శ్రీను, మానుకొండ ప్రదీప్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తమనంపూడి సూర్యారెడ్డి, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్, అరిగెల అభి షేక్, బేతల సంతోష్, జోగాడ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీలు, తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలతో ఇబ్బంది పెట్టారు. కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడం కోసం వైఎస్సార్సీపీ యువత విభాగం నాయకులు పట్టణంలోని విస్సాకోడేరు వంతెన వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో షామియానా వేసి కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 50 మందికి మించి వెళ్లడానికి వీల్లేదంటూ కలెక్టరేట్‌కు కిలోమీటరు దూరంలోనే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అలాగే అంగన్వాడీలను విస్సాకోడేరు వంతెన వద్ద పోలీసులు నిలువరించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ అంగన్వాడీల కార్యకర్తలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ‘పశ్చిమ’ జిల్లా అధ్యక్షుడు సందీప్ భీమవరంలో ర్యాలీ, ధర్నా -
శాస్త్రోక్తంగా రుద్రహోమం
పాలకొల్లు సెంట్రల్: స్థానిక పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి పురస్కరించుకుని రుద్రహోమం శాస్త్రోకంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తులు గోపూజ, స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు, అనంతరం రుద్రహోమం చేశారు. ఏడుగురు దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారి మాడవీధుల్లో భక్తులు ఏడు మారేడు దళాలను చేత పట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేశారు. రాత్రి స్వామివారికి లీలా కల్యాణం, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ పి.వాసు, అర్చకులు పాల్గొన్నారు.పేకాట స్థావరంపై పోలీసుల దాడితాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని కుంచనపల్లి ఎంవీఆర్ టౌన్షిప్ సమీపం ఒక భవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు రూరల్ సీఐ రమేష్, ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, ఆరు మోటారు సైకిళ్లు, ఒక కారు, తొమ్మిది సెల్ఫోన్లు, రూ.1.63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. -
పెదవేగి కర్మాగారం ప్రైవేటీకరిస్తే ఊరుకోం
పెదవేగి: ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటీయు జిల్లా నాయకులు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరించి రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఆలోచన చేయడం తగదన్నారు. ఫ్యాక్టరీ జోన్ పరిధిని, ఫ్యాక్టరీని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని కోరారు. దేశంలోనే అత్యధిక ఆయిల్‌పామ్ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఉందన్నారు. ఆయిల్ పామ్ గెలల ధర ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వచ్చే ఆయిల్ రికవరీ శాతం( ఓ ఇ ఆర్ ) ప్రామాణికంగా ఉందని చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో భవిష్యత్తులో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చర్యలు ఆపి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ రైతులు సంఘటితంగా పోరాడి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. -
ఫ్రైడ్ ఆఫ్ ఇండియాలో ప్రతిభ
ఏలూరు(మెట్రో): జూన్ 16న బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కి.మీ. ఇంగ్లిష్ చానల్‌ను ఆరుగురి బృందంతో కూడిన ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఎ టీమ్ స్విమ్మింగ్ చేస్తూ 13 గంటల 37 నిమిషాలు వ్యవధిలో విజయవంతంగా ముగించారు. ఏలూరుకు చెందిన బలగ గణేష్ కూడా ఆ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బలగ గణేష్‌ను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారు. గణేష్ ఏప్రిల్ 18న శ్రీలంక నుంచి ఇండియా వరకు 28 కి.మీ దూరం పాక్ జలసంధిని 10 గంటల 30 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి తెలుగు రాష్ట్రాల్లోనే మొట్ట మొదటి పారా స్మిమ్మర్గా రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. గణేష్‌ను అభినందించిన వారిలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. తాడిచెట్టు కూలి ఇల్లు ధ్వంసం దెందులూరు : గాలాయగూడెంలో ఆదివారం రాత్రి భారీ ఈదురు గాలులకు పెండ్లి ఇస్సాకు ఇంటిపై తాడిచెట్టు పడింది. తాడిచెట్టు పడే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. కూలిన భారీ వృక్షం భీమడోలు: ఆదివారం రాత్రి వీచిన గాలి వానకు పలు గ్రామాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. మండల వ్యాప్తంగా చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. విద్యుత్ తీగలపై పడడంతో పలు చోట్ల కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండుగొలను సంతమార్కెట్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో విద్యుత్ వైర్లు తెగి గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. తీగలు తెగడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు చర్యలు చేపట్టింది. పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు చెట్టును తొలగించి విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. -
‘సూర్య ఘర్’ పథకంపై అవగాహన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సోలార్ విద్యుత్ మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకమని, ఒక్కసారి ఖర్చుపెడితే ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులు చెల్లించే పని ఉండదని ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పీ సాల్మన్‌రాజు తెలిపారు. సోమవారం స్థానిక విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిపై సోలార్ ప్యానళ్లను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, దీనికి అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాలలో చెల్లించేలా రుణాలు అందిస్తున్నాయన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉండాలంటే సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ పానళ్ల ఏర్పాటుకు కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీగా ఇస్తుందన్నారు. సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకునే విద్యుత్‌లో వినియోగదారులు తాము వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను యూనిట్ రూ.2.09కు విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తాయని, దాని ద్వారా అసలు బిల్లు చెల్లించకుండా ఆదాయం కూడా వస్తుందన్నారు. ఈ సందర్భంగా సూర్యఘర్ పథకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ పీ.రాధాకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కమర్షియల్ అండ్ టెక్నికల్ ఏ.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్ తొందరపాటు వల్లే ప్రమాదం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి డ్రైవర్ కంగారు, తొందరపాటే కారణమని తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక గుడిసెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరిన ఏపీ16జెడ్ 215 నెంబర్ ఆర్టీసీ బస్సు డీసీసీబీ బ్రాంచి ఎదురుగా ఉన్న దేవస్థానం స్ట్రీట్‌లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం బస్సు బ్రేక్‌లు విఫలం కావడం వల్లే జరిగిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సును నిశితంగా పరీక్షించిన తణుకు డిపో మెకానికల్ సిబ్బంది బస్సుకు ఏ విధమైన కంప్లైంట్లు లేవని, బ్రేక్‌లు బాగానే ఉన్నట్టు తేల్చారని డిపో మేనేజర్ తెలిపారు. గుడి సెంటర్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ కొద్దిపాటి కంగారు, తొందరపాటు వల్లే బస్సు డ్రైనేజీలోకి జారి ఈ ప్రమాదం జరిగిందన్నారు. గత పది రోజులుగా ఈ బస్సుకి ఏ విధమైన కంప్లైంట్లు లేవని తెలిపారు. విచారణ అనంతరం ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. -
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంతవరకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నప్పటికీ ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదని, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఇఫ్టూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ 2023 జూలై నుంచి అమలు కావలసిన పన్నెండో పీఆర్సీకి వెంటనే కమిషన్ నియమించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి బీ.రెడ్డి దొర మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల నమోదు ప్రక్రియ అన్ని పాఠశాలల్లో జరుగుతున్నందున అన్ని రకాల ట్రైనింగ్‌ను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని బదిలీల్లో రిలీవర్ లేక నిలిచిపోయిన ఉపాధ్యాయులను తగు ఏర్పాటు చేసి వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి యూవీ నరసింహరాజు, ఉపాధ్యక్షుడు ఎస్.దొరబాబు, రాష్ట్ర కౌన్సిలర్ కుటుంబరావు, సబ్ కమిటీ సభ్యులు కే.కొండయ్య, పీ.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం నూజివీడు: బెల్ట్ షాపులకు అనుమతి లేదని, బెల్టు షాపుల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ ఆవులయ్య హెచ్చరించారు. పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో బెల్ట్ షాపులకు సంబంధించి 425 కేసులు నమోదు చేశామని, వీటిల్లో 227 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బెల్ట్ షాపులకు సంబంధించి 1207 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డీఎస్సీ పరీక్షకు 979 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మెత్తం 979 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం పరీక్షలకు 180 మందికి 173 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 168 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 140 మందికి గాను 135 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 140 మందికి 120 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 207 మందికి 193 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 200 మందికి గాను 190 మంది హాజరయ్యారు. ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష భీమవరం: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 3 పరీక్షా కేంద్రాల్లో ఉదయం షిఫ్ట్‌కు 310 మందికి 296 మంది, మధ్యాహ్నం షిప్ట్‌లో 310 మందికి 238 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. స్పెషల్ స్క్వాడ్ టీం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. ‘దారితప్పుతున్న కూటమి’ బుక్లెట్ విడుదల భీమవరం : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 143 హామీలిచ్చి కేవలం 20 హామీలలోపే అమలు చేశారని జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలనన్ విమవర్శించారు. దారితప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన బుక్లెట్ని ఆదివారం భీమవరంలో విడుదల చేశారు. ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వం పనిని సమీక్షించి సీపీఎం పార్టీ ఈ బుక్లెట్ని ముద్రించి విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీలలో 20లోపే అమలు చేశారన్నారు. అత్యధిక హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి రేటింగ్, గ్రేడింగ్ ఇవ్వాల్సి వస్తే ఈ సంవత్సర కాలంలో చాలా తక్కువ మార్కులే వచ్చాయన్నారు. 10కిగాను 1.75 మార్కులు వచ్చాయన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని కోరారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: పెద్దింట్లమ్మ నామస్మరణతో కొల్లేటికోట దేవస్థానం ఆదివారం మార్మోగింది. సమీప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, కేశఖండన, లడ్డూ ప్రసాదం, అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.79,710 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
యువత, విద్యార్థులకు వెన్నుపోటు
యువత పోరును జయప్రదం చేయాలి కై కలూరు : నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రాలు సమర్పించే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆదివారం పిలుపునిచ్చారు. కై కలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆటపాక డీఎన్నార్ ఐస్ ఫ్యాక్టరీకి సోమవారం ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు. అక్కడ నుంచి ఏలూరు బయలుదేరుతామన్నారు. యువత పోరుకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరవుతున్నారన్నారు. ఉద్యోగాలు ఎప్పుడిస్తారు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : మోసం, వెన్నుపోటు ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. ఎన్నికలకు ముందు సూపర్‌సిక్స్‌తో పాటు అనేక హామీలను గుప్పించి ప్రజలను నమ్మించి వారి మద్దతుతో అధికారంలోకి వచ్చాక.. ఏడాదిగా అదిగో ఇదిగో అని కాలం వెళ్ళదీసింది. యువత, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. సూపర్ సిక్స్ పథకాల్లోని ఇంటింటికీ ఉద్యోగం, లేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాని గురించి ప్రభుత్వం ఇప్పుడు కనీసం నోరు కూడా మెదపడంలేదు. ఒక్క ఉద్యోగమూ లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాల్లోని ఇంటింటికీ ఉద్యోగం, లేని పక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. వలంటీర్లను తొలగించబోమని, ప్రతి వాలంటీర్కూ నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయకుండా వలంటీర్లను మోసం చేస్తూ వారి ఉద్యోగాలను పీకేసి రాక్షసానందం పొందింది. క్లాప్ ఆటోలు, ఎండీయూ వాహనాలను నిలిపి వేసి వాటిపై ఉపాధి పొందుతున్న నిరుద్యోగుల పొట్ట కొట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే సచివాలయాల్లో సుమారు 700 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించగా మరో 10,500 మందికి వలంటీర్లుగా అవకాశం కల్పించింది. దీంతో పాటు పాతికేళ్ళుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డీఎస్సీ అర్హులకూ టీచర్లుగా ఉద్యోగాలిచ్చింది. ఒక్కో స్కిల్ హబ్‌కు రూ. 11 లక్షల నిధులు మంజూరు చేసి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌హబ్‌లు ఏర్పాటు చేసింది. ఆయా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు, పారితోషికం, శిక్షణ పొందే ప్రతి అభ్యర్థికి రూ.1000 స్టైఫండ్ ఇచ్చింది. స్కిల్ హబ్‌లలో శిక్షణ పొందిన సుమారు 3 వేల మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా కృషి చేసింది. కూటమి ప్రభుత్వం రూ.540 కోట్ల బాకీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వాలి. అది ఎలాగూ నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సుమారు 1.50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఇస్తానన్న నిరుద్యోగ భృతిని 12 నెలలకు లెక్క వేస్తే ఇప్పటి వరకూ ఒక్కొక్కరికీ రూ.36 వేలు చొప్పున రూ.540 కోట్లు బకాయిపడింది. ఫీజు రీయింబర్స్మెంట్ రాక అవమానాల పాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థుల చదువు రాచమార్గంలో పయనించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం ఒక్క రూపాయి కూడా జమ చేయక పోవడంతో విద్యార్థులు అవమానాలపాలతున్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని తరగతి గదుల్లో అందరి ముందూ నుంచోబెట్టి ఫీజుల గురించి నిలదీస్తుంటే విద్యార్థులు అవమానభారంతో తలెత్తుకోలేకపోతున్నారు. నేడు వైఎస్సార్సీపీ యువత పోరు కూటమి పాలనలో మోసపోయిన యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకులు సోమవారంయువత పోరు పేరిట ఆందోళనకు దిగుతున్నారు. నిరుద్యోగ భృతి మాటేంటి ఏడాది దాటినా ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైనం నిరుద్యోగ భృతిపై నోరు మెదపని ప్రభుత్వం నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రూ.540 కోట్ల బాకీ రీయింబర్స్మెంట్ బకాయి రూ.168.75 కోట్లు యువత, విద్యార్థులకు అండగా నేడు వైఎస్సార్సీపీ యువత పోరు రీయింబర్స్మెంట్ బకాయి రూ.168.75 కోట్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెనగా ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం 2019–20 సంవత్సరంలో 36,527 మంది విద్యార్థులకు రూ.95.78 కోట్లు, 2020–21 సంవత్సరంలో 37,148 మందికి రూ 77.97 కోట్లు, 2021–22లో 38,677 మంది విద్యార్థులకు రూ.105.67 కోట్లు, 2022–23లో 33,655 మందికి రూ.81.53 కోట్లు, 2023–24 సంవత్సరంలో 29,111 మంది విద్యార్థులకు రూ.22.45 కోట్లు జమ చేసింది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం ఏడాదిలో ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థుల ఫీజుల బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. ఈ మేరకు జిల్లాలో సుమారు 37,500 మంది విద్యార్థులకు సగటున రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ నిమిత్తం కూటమి ప్రభుత్వం మొత్తం రూ.168.75 కోట్లు బకాయి పడింది. ప్రభుత్వాన్ని నిలదీయడానికే యువత పోరు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే. సంక్షేమ పథకాల అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకూ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఊసే ఎత్తడం లేదు. దీనిపై నిలదీయడానికే యువతకు అండగా యువత పోరుబాట ఆందోళన చేపడుతున్నాం. – కామిరెడ్డి నాని, ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడుప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలి రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. నిరుద్యోగ భృతి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే వారిని అస్సలు పట్టించుకోవడంలేదు. ఫీజులు చెల్లించడం కోసం తల్లిదండ్రులు అప్పుల కోసం తొక్కని గడప లేదు. వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. బకాయిలను, నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలి. – కోడె కాశి, వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు -
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
కౌన్సెలింగ్‌కు హాజరైన ఎంటీఎస్ టీచర్లు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఎస్సీ 1998, 2008 ఉపాధ్యాయులకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 2008 డీఎస్సీకి సంబంధించిన 191 మంది ఎంటీఎస్ టీచర్లు, 1998 డీఎస్సీకి సంబంధించిన 199 మంది టీచర్లు పాల్గొన్నారు. వీరికి విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలోని 700 ఖాళీలను చూపారు. సీనియారిటీ ప్రాతిపదికన తొలుత 2008, అనంతరం 1998 ఎంటీఎస్‌లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌ను సెంటర్‌కు దగ్గరగా ఉండే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించకుండా సెంటర్‌కు దూరంగా ఉన్న జీఎంసీ బాలయోగి సైన్స్పార్కులో ఏర్పాటు చేయడంతో ఎంటీఎస్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారి కోసం కేంద్రంలో ఎలాంటి టెంట్లు వేయకపోవడంతో ఎక్కువ మంది తలోదిక్కున, చెట్ల నీడల్లో ఉండాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తమయింది. -
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు (టూటౌన్) : పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకీ ఆయిల్‌పామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వస్తున్న రికవరీ శాతం ఆధారంగానే ధర నిర్ణయం జరుగుతుందని చెప్పారు. కర్మగారాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని, రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు. -
రోజువారీ సేవలు బంద్
●పర్మినెంట్ చేయాలి ఆప్కాస్ విధానాన్ని ఉంచాలి. తీసేయాల్సివస్తే పర్మినెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయాలి. వేతన సవరణ చేసి పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా మాకు కనీస వేతనాలు అందచేయాలి. – ఉండ్రాజవరపు శ్రీను, ఏకార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తణుకు శాఖ అధ్యక్షుడు ఉద్యోగ భద్రత కల్పించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో చాలా కష్టంగా ఉంది. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విధుల్లోకి వచ్చినప్పటి నుంచి ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తున్న తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. – గెల్లా విజయకుమార్, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ కార్యదర్శి తణుకు అర్బన్ : గత సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మున్సిపల్ ఇంజినీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళలనలు ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎలాంటి న్యాయం జరగలేదని నిరాహారదీక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని మున్సిపాలిటీల అధికారులు, స్థానిక శాసనసభ్యులకు సమ్మె నోటీసులు అందచేశారు. ఈ నెల 20 నుంచి మునిసిపల్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, చర్చలకు పిలవకపోవడంతో పూర్తిస్థాయి సమ్మెలోకి దిగుతున్నారు. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాటర్ వర్క్స్, వర్క్ ఇన్స్పెక్టర్లు, పార్కు మజ్దూర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సెక్యూరిటీ, అటెండర్స్ సేవలు నిలవనున్నాయి. 2023 డిసెంబర్ నెలలో జరిగిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఏడు లక్షలకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75,000, దహన సంస్కారాల ఖర్చులు 20,000, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్నారు. నిలిచిపోనున్న సేవలు వాటర్‌వర్క్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో కార్మికులు అందుబాటులో లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా విభాగాల్లో ఏ సమస్య వచ్చినా ఫిర్యాదుచేసిన వెంటనే కార్మికులు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. సమ్మె కారణంగా ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 310 మంది కార్మికులు భీమవరంతో పాటు తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు మున్సిపల్ కార్యాలయాల్లో నగర పంచాయతీగా ఉన్న ఆకివీడులో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో 310 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రూ.15 వేలు వేతనం కాగా కేవలం రూ.13,080లు మాత్రమే చేతికి అందుతుంది. ఆందోళన బాటలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు నేటి నుంచి పూర్తి స్థాయి సమ్మెలోకి కార్మికులు సమ్మె ఒప్పందాల్ని అమలు చేయాలని డిమాండ్ పశ్చిమలో 310 మంది ఇంజినీరింగ్ కార్మికులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇంజినీరింగ్ సెక్షన్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది కదా అనే ఆశతో చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న అంశాన్ని కూడా పట్టించుకోవడంలేదు. మా సమస్యలు ప్రభుత్వం పట్టిచుకోవడంలేదనే ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సివచ్చింది. – కొపనాతి వెంకటకృష్ణ, నరసాపురంకార్మికుల ప్రధాన డిమాండ్లు టెక్నికల్ రూ.29,200, నాన్ టెక్నికల్ రూ.24,500 జీతం అమలుచేయాలి. షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్, చనిపోయినా, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలి. చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి. ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీతో పాటు కనీస పింఛన్ రూ.10 వేలు ఇవ్వాలి. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. -
ఎల్ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి
ఏలూరు (టూటౌన్): భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో పనిచేస్తున్న ఏజెంట్ల సంక్షేమానికి కృషి చేయడంలో ఎల్ఐసీ ఏఓఐ సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘ సౌత్ సెంట్రల్ జోనల్ (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు) ప్రధాన కార్యదర్శి పీఎల్ నరసింహారావు అన్నారు. ఆ సంఘ మహాసభ ఆదివారం ఏలూరులో పవర్ పేట ఉద్దరాజు రామం భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు మాట్లాడుతూ ఎల్ఐసీ ఏజెంట్ల కమిషన్లు తగ్గించటపై సంఘం ఉద్ధృతంగా పోరాడుతోందన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులను సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తాళం సురేష్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ కోడే రాంబాబు, మెంబర్ వైఎస్ కనకారావు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు, భీమడోలు బ్రాంచ్ మేనేజర్ ఎన్.భువన దీప, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఎల్ఐసీ ఏవోఐ రాష్ట్ర అధ్యక్షుడు టి.కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ జి రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
వానా కాలం.. వ్యాధుల కాలం
భీమవరం(ప్రకాశం చౌక్): వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. డ్రెయినేజీల పారుదల సక్రమంగా లేక రోజుల తరబడి మురుగు నీరు నిలిచిపోవడం, పారిశుద్ధ్యం మెరుగ్గా లేని ప్రాంతాల్లో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులకు కారకాలుగా మారతాయి. దీంతో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి జీ,గీతాభాయి సూచిస్తున్నారు. ప్రతి ఏడాది జ్వరాల వల్ల చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను ఆశ్రయించాలని అంటున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. సాధారణ జ్వరం, జలుబు సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తిచెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. జ్వరం మాత్రమే కాకుండా కొందరికి దగ్గు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వైరల్ జ్వరం 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. చికెన్ గున్యా తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్షణాలు. ఈ జ్వరం దోమ కాటు వల్ల వస్తుంది. చికెన్ గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది. మలేరియా తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణం. జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటుతో వ్యాప్తి చెందుతుంది. దోమ కాటు వల్ల దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్ శరీరం లోపలికి వెళ్తాయి. 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది. ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. డెంగీ లక్షణాలు ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ పగటి పూట కుడుతుంది. దోమ కుట్టినప్పుడు ఒళ్లుంతా దద్దుర్లు కనిపిస్తాయి. వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తల నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో ఎముకలు విరిగేటంత నొప్పి కలిగిస్తుంది. ఒక్కోసారి శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. దాని వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్లుగా చినచిన మొటిములు కనిపిస్తాయి. ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. హెపటైటిస్ ఎ వర్షాకాలంలో హెపటైటిస్ ఎ ( కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాలేయకణాల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదార్థాల నుంచి, తాగునీటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. శరీర భాగాలు పసుపు రంగులో కనిపిస్తాయి. టైఫాయిడ్ వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా వల్ల వస్తుంది. మురుగునీరు తాగడం, కలుషితమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నివారణకు చర్యలు శూన్యం జిల్లాలోని పట్టణాల్లో గాని పల్లెల్లో గాని దోమల నివారణ చర్యలు అధికార యంత్రాంగం చేపట్టకపోవడంలో ప్రజలు మండిపడుతున్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుందని, పల్లెల్లో కచ్ఛా డ్రెయిన్లు తవ్వడం, డ్రెయినేజీల పూడిక పనులు నిర్వహించడం లేదని అంటున్నారు. దోమల నివారణకు ఫాంగింగ్ చేయడం లేదని, ఎక్కడా కనీసం బ్లీచింగ్ పౌడర్ జల్లడం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు కలుషిత ఆహారం, కలుషిత నీరు తాగకుండా ఉండడం ద్వారా వ్యాధులు సోకుండా రక్షణ పోందవచ్చు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. – జీ,గీతాభాయి జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి దోమల విజృంభణతో డెంగీ, మలేరియా సోకే ప్రమాదం పరిసరాల, వ్యక్తిగత శుభ్రతే ప్రధానమని వైద్యుల సూచనతీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పెంటకుప్పులు, చెత్తాచెదారం ఇంటికి దూరంగా వేయాలి. ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇంటిలో అన్ని గదుల్లో దోమలు రాకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడడం శ్రేయస్కరం. శరీరం మొత్తం కప్పేలా ఉన్న దుస్తులు ధరించాలి. వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. వర్షంలో తడవరాదు. తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండకూడదు. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. నిల్వ పదార్థాలు తినరాదు. వేడి ఆహార పదార్థాలు తినడం మంచిది. తాజా పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనుమంట్ర: నవుడూరు– పొలమూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమూరుకు చెందిన కడలి నాగార్జున (33) మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై భీమవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న నాగార్జునను 108 లో తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పైలట్ బాలకృష్ణ తెలిపారు. నాగార్జున ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడని, అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అతని బంధువులు తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన పెయ్యేరు సమీపంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కానుకొల్లుకు చెందిన ఆకేటి శ్రీహరి(38) బైక్‌పై శనివారం రాత్రి కానుకొల్లు నుంచి ముదినేపల్లి వస్తున్నాడు. పెయ్యేరు సమీపానికి రాగానే రహదారి పక్కన నిలిపివున్న లారీ వెనుక భాగాన్ని చీకట్లో గమనించకుండా బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుబ్బల మంగమ్మతల్లి గుడికి భక్తుల తాకిడి
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలలో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సిల్వర్ సెట్లో ప్రతిభ భీమడోలు: ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిల్వర్ సెట్ ఫలితాల్లో బీఎస్సీ లెక్కల విభాగంలో పయ్యావుల చిరు హాసిని మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఉమ్మడి రాష్ట్రాల్లో సిల్వర్ జూబ్లీ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలకు ప్రతి ఏటా సిల్వర్ సెట్‌ను నిర్వహిస్తుంది. శనివారం ఫలితాలు విడుదల కాగా.. చిరు హాసిని ప్రతిభ చాటింది. ఇందులో సీట్ సాధిస్తే మూడేళ్ల పాటు రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశం ఉంటుంది. చదువుతో పాటు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. నేడు తణుకులో ఉమ్మడి జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫెన్సింగ్ టీం సెలక్షన్లు ఈనెల 23వ తేదీన తణుకు విద్యా వ్యాలీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు మినీ (అండర్ 12) విభాగంలో 2014 నుంచి 2015లోపు పుట్టిన ఫెన్సర్లు, చైల్డ్ (అండర్ 10) విభాగంలో 2016 నుంచి 2018 మధ్యలో పుట్టిన ఫెన్సర్లు హాజరుకావాల్సిందిగా కోరారు. ఎంపికై న జట్లు ఈ నెల 28, 29 తేదీల్లో కాకినాడ జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో నిర్వహించే ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 11వ చైల్డ్, మినీ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. వివరాలకు 96802 34566 నంబరులో సంప్రదించాలని కోరారు. కారును ఢీకొట్టిన బైక్.. బాలుడికి తీవ్ర గాయాలు ద్వారకాతిరుమల: రోడ్డుపై ఆగి ఉన్న కారును బైక్ ఢీకొట్టిన ఘటనలో బైక్ నడుపుతున్న బాలుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఈ ఘటన స్థానిక ద్వారకా రెసిడెన్సీ సమీపంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని దొరసానిపాడు గ్రామానికి చెందిన కూచింపూడి వంశీ గరుడాళ్వార్ సెంటర్లోని పెట్రోల్ బంకు నుంచి గుడి సెంటర్ వైపునకు బైక్‌పై వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలైన వంశీని స్థానికులు హుటాహుటీన పీహెచ్‌సీకి తరలించారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్ : చెరువు యజమాని మందలించాడనే మనస్తాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వైవాకలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన చేబోయిన శ్రీనివాసరావు (55) స్థానికంగా చేపల చెరువుపై కాపలా ఉంటూ మేతలు చల్లేవాడు. ఈ నేపథ్యంలో మేతల బస్తాలు దొంగతనానికి గురవుతున్నాయని, ఇందుకు శ్రీనివాసరావు కారకుడని యజమాని మందలించడంతో పాటు గ్రామంలోని పెద్దలకు విషయాన్ని తెలియజేస్తానని యజమాని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య, కుమారుడు గమనించి వెంటనే గుడివాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతుడి కుమారుడు సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.తమ్మిలేరులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యంచింతలపూడి: చేపల వేటకు వెళ్లి గల్లంతైన చింతలపూడి నగర పంచాయతీ ఛార్లెస్ నగర్‌కు చెందిన యువకుడి మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. మండలంలోని నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరులో శనివారం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన గడ్డం శాంతకుమార్(29) ప్రమాదవశాత్తూ గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలుపుదల చేసిన అధికారులు ఆదివారం ఉదయం కొనసాగించి మృతదేహాన్ని కనుగొన్నారు. ఎస్సై కె సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది శాంతకుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పంచనామ అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. శాంతకుమార్ మృతితో ఛార్లెస్ నగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు విఫలం
ద్వారకాతిరుమల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో రోడ్డు పక్కనున్న స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. ద్వారకాతిరుమల క్షేత్రంలో డీసీసీ బ్రాంచి ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్ధురాలు తీవ్ర గాయాలుపాలు కాగా, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు క్షేత్రంలోని గుడి సెంటర్ నుంచి సుమారు 70 మంది యాత్రికులతో తణుకుకు బయల్దేరింది. ప్రారంభంలోనే బస్సు బ్రేక్‌లు విఫలమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బస్సును పక్కకు తిప్పాడు. దాంతో బస్సు దేవస్థానం స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది. బస్సులో ఉన్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనతో కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన వృద్ధురాలు ప్రభావతి తీవ్రంగా, డ్రైవర్ శ్రీనివాస్ స్వల్పంగా గాయపడ్డారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ఎలివేషన్ కొంత భాగం, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రభావతికి స్థానిక పీహెచ్సీ వైద్యుడు ప్రవీణ్‌కుమార్ ప్రథమ చికిత్స చేశారు. కాగా స్థానికులు, భక్తులతో రద్దీగా, పల్లంగా ఉన్న ఈ ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాత్రికులంతా వేరువేరు బస్సుల్లో స్వగ్రామాలకు తరలివెళ్లారు. స్ట్రీట్ లైట్ స్తంభాన్ని, షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ఢీకొట్టిన బస్సు వృద్ధురాలికి తీవ్ర, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం -
కూలి రేట్లు పెంచాలంటూ ధర్నా
ఏలూరు (టూటౌన్): నగరంలో కిరాణా షాపుల్లో లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ కూలి రేట్లు పెంచాలని కోరుతూ శనివారం ధర్నా నిర్వహిం చారు. వన్‌టౌన్ గడియార స్తంభం వద్ద నుంచి హోల్ సేల్ షాపుల మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చర్చలు జరపడానికి మర్చంట్ చాంబర్స్ అసోసియేషన్ నిరాకరించడం బాధాకర విషయమన్నారు. హమాలీ కార్మికుల కూలి రేట్ల పెంపుదల పోరాటానికి ఏఐటీయూసీ జిల్లా కమిటీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. ఇఫ్టూ సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తక్షణం కూలీ రేట్ల పెంపుదల చర్చల తేదీని ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఎఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏలూరు ఏరియా అధ్యక్షుడు కే కృష్ణ్ణమాచార్యులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి.కిషోర్, బి.జగన్నాథం, పోలా భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. 10 గంటల పని విధానం ఉపసంహరించాలి ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 10 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాత్రివేళల్లో మహిళలతో పని చేయించాలని నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయుసీ, ఐఎఫ్టీయు, సీఐటీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నారని, దానిలో భాగంగానే కార్మికుల 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. మహిళలకు పట్టపగలే రక్షణ లేకుంటే, రాత్రి సమయాల్లో రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. 8 గంటల పని విధానాన్ని ప్రపంచ కార్మిక వర్గం అనేక ప్రాణ త్యాగాలు చేసి సాధించుకుందని గుర్తు చేశారు. తక్షణమే 10 గంటల పని విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పల్లెం కిషోర్, కడుపు కన్నయ్య, బుగత జగన్నాథరావు, పోలా వెంకట భాస్కరరావు, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిప్లమో కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు పెనుమంట్ర: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లమో కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ టి.శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలిపారు. సందేహాలుంటే మారుటేరు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చన్నారు. సచివాలయ ఉద్యోగుల నిరసన ఏలూరు (టూటౌన్): సచివాలయ ఉద్యోగులను ఆయా మున్సిపాల్టీలు, మండలాల పరిధిలోనే బదిలీలు చేయాలని కోరుతూ ఏలూరు కార్పొరేషన్ ఎదుట సచివాలయ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. సీనియారిటీ జాబితా ప్రకటన చేపట్టాలని, కేటగిరీల వారీగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 79 సచివాలయాల పరిఽధిలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కమిషనర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. -
ఏలూరు శాయ్‌లో లైంగిక వేధింపులు
ఏలూరు టౌన్: ఏలూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారింది. తమను తీర్చిదిద్దాల్సిన గురువులే కీచకులుగా మారితే... తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలంటూ వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు భరించలేక స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ ఇండియాకు మహిళా క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారించారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కనే ఏర్పాటు చేసిన శాయ్ కేంద్రంలో మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవడంతో వారంతా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఏకంగా 10 మంది మహిళా క్రీడాకారిణులు శాయ్ నిర్వాహకులు, వెయింట్ లిఫ్టింగ్ కోచ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శాయ్ ఇన్‌చార్జ్‌తో పాటు వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శాయ్‌లో అథ్లెటిక్స్‌లో బాలురు, బాలికలు తర్ఫీదు పొందుతూ ఉండగా, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బాలికలు అధికంగా ఉన్నారు. బాలికలకు శాయ్ హాస్టల్లోనే వసతి సౌకర్యాలు కల్పిస్తారని సమాచారం. బాలురకు అల్లూరి సీతారామరాజు స్టేడియంలోని గదుల్లో వసతి కల్పిస్తారు. ఈ నేపథ్యంలో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేయటంపై వారంతా శాయ్ కేంద్ర కార్యాలయాన్ని ఆశ్రయించారు. బెంగుళూరు బృందం విచారణ క్రీడాకారిణుల ఫిర్యాదుపై కేంద్రం శాయ్లోని ఇద్దరు సభ్యుల బృందం గత కొద్దిరోజులుగా రహస్య విచారణ చేపట్టి ఆరోపణలు వాస్తవమేని నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణ అధికారులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించి దానిపై ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నట్లు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. శాయ్ ఇన్చార్జ్, వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ కోచ్‌పై కేసు నమోదు విషయంలో రాజకీయ ఒత్తిడులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగుళూరు శాయ్ బృందం దర్యాప్తులో వెల్లడి 10 మంది మహిళా క్రీడాకారిణుల ఫిర్యాదు -
పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దాలి
గడువు దాటితే ముప్పే గ్యాస్ సిలిండర్లకూ కాలపరిమితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గడువు తేదీ ముగిసిన సిలిండర్లు వినియోగిస్తే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉందంటున్నారు. 8లో uఏలూరు(మెట్రో): రాష్ట్రంలో లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి మెప్మా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలలో నివసించే నిరుపేద మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సి ఉందన్నారు. డ్వాక్రా సంఘాలకు స్వయం ఉపాధి రుణాలు అందించి, ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుచేయాలని, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడేలా కృషిచేయాలన్నారు. కోకో కొనుగోలు ప్రక్రియ తనిఖీ పెదవేగి: జిల్లాలో రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందిస్తుందని కలెక్టరు రైతులకు భరోసానిచ్చారు. శనివారం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో కోకో కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. రైతులతో మమేకమై సమస్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టరు మాట్లాడుతూ కోకో రైతులకు కేజీకి అదనంగా రూ.50 సబ్సిడీగా అందజేస్తున్నామన్నారు. జిల్లాలో కోకో 1800 టన్నులు ఉండగా ఈరోజు వరకు 1250 టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. ఈ నెల 30 నాటికి మిగతా 550 టన్నులు కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. ఇంతవరకు కొబ్బరి తోటలోనే కోకో సాగు ఉండేదని, ఇక నుంచి పామాయిల్ తోటలో కూడా కోకో పండించేలా ప్రమోట్ చేస్తున్నామన్నారు. చిన్న రైతులకు కోకో ఎండబెట్టుకోడానికి టార్పాలిన్లు, సిమెంటు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
ఘనంగా యోగాంధ్ర
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా జరిగాయని కలెక్టర్ కే. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం స్థానిక సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5,617 ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, యోగాంధ్ర కార్యక్రమంలో 9.59 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, మేయర్ షేక్ నూర్జహాన్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డీఆర్ఓ విశ్వేశ్వర రావు, ఇడా చైర్మన్ వాణి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఒప్పందాల అమలు ఎప్పుడు?
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 12 నుంచి ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు మున్సిపాల్టీల పరిధిలో నిరసన దీక్షలు చేస్తున్నారు. జీతాలు పెంచాలని కోరుతూ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన 9వ రోజుకు చేరింది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు జీవో నెంబర్ 36 ప్రకారం పెంచి అమలు చేయాలని, 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.21 వేలు ఇస్తూ ఇంజనీరింగ్ కార్మికులకు రూ.15 వేలు జీతాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్ నెలలో జరిగిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఏడు లక్షలకు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.75,000, దహన సంస్కారాల ఖర్చులు 20,000, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే అమలు చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరుతున్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు జీఓ నెంబర్ 36 ప్రకారం రూ.21,000, రూ.24,500 జీతాలు చెల్లించాలి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్, చనిపోయినా, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆప్కాస్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలి చట్టబద్ధమైన సెలవులు అమలు చేయాలి. ఏలూరు నగరంలో 250 మంది, నూజివీడు మున్సిపాలిటీలో 60, జంగారెడ్డిగూడెం 60,చింతలపూడి మున్సిపాలిటీలో 30 మంది ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆందోళన బాట పట్టిన మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు 9 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లాలో 400 మంది ఇంజినీరింగ్ కార్మికులు -
తీవ్ర అన్యాయం చేస్తున్నారు
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు గత ఆరేళ్లుగా తీవ్ర అన్యాయాన్ని గురయ్యారు. ఒక్కో ఇంజనీరింగ్ కార్మికుడు ఈ ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు లక్షలకు పైగా నష్టపోయాడు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – బి.సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ టెక్నికల్ జీతాలు ఇవ్వాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ జీతాలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో పాటు పర్మినెంట్ చేయాలి, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరం. తక్షణం మున్సిపల్ ఇంజనీరింగ్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. – కొత్తూరు లక్ష్మణరావు, వాటర్ వర్క్స్ విభాగం నాయకులు, జంగారెడ్డిగూడెం దిగొచ్చేంత వరకు ఆందోళన ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే నైపుణ్యం గల వారికి నైపుణ్యం లేని వారి కంటే తక్కువ జీతాలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తాం. – జి.నాగరాజు, వాటర్ వర్క్స్ విభాగం నాయకుడు, చింతలపూడి ఒప్పందాలు అమలు చేయాలి 2023లో చేసిన 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. కానూరు సత్యనారాయణ, వాటర్ వర్క్స్ విభాగం నేత, ఏలూరు ● -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలని ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) తణుకు శాఖ అధ్యక్షుడు ఉండ్రాజవరపు శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమను ఆప్కాస్ నుంచి తొలగించవద్దని, ఒకవేళ తొలగించాల్సి వస్తే తప్పకుండా పర్మినెంట్ చేయా లని కోరారు. ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అమలుచేయాలని, జీతాలు పెంచాలని, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. -
తమ్మిలేరులో యువకుడి గల్లంతు
చింతలపూడి: చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి నగర పంచాయతీ ఛార్లెస్నగర్కు చెందిన గడ్డం శాంతకుమార్(29) స్నేహితులతో కలిసి నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టడానికి జలాశయం లోనికి దిగిన శాంతకుమార్ ప్రమాదవశాత్తూ జలాశయంలో మునిగిపోయాడు. మిగిలిన స్నేహితులు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న మత్స్యకారులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ప్రాజెక్టు వద్దకు చేరుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానిక ఎస్సై కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ నూజివీడు: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ప్రసాదం ట్రస్టుకు నూజివీడు నుంచి శనివారం 12 టన్నుల కూరగాయలను భక్తులు పంపారు. మండలంలోని దేవరగుంటకు చెందిన నక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి భక్తులు కూరగాయలను సేకరించి టీటీడీ ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపించారు. అలాగే ద్వారకాతిరుమల ఆలయంలో అన్నదానం నిమిత్తం నాలుగు టన్నుల కూరగాయలను పంపారు. చిత్రలేఖనంలో విద్యార్థుల ప్రతిభ యలమంచిలి: మేడపాడు హైస్కూల్ విద్యార్థులు యోగాంధ్ర చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం యనా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల భీమవరంలో జరిగిన పోటీల్లో మేడపాడు హైస్కూల్ విద్యార్థులు డి.కోటేశ్వరి ప్రథమ, ఎ.శివార్షిణి ద్వితీయ స్థానం సాధించినట్లు ఆయన వివరించారు. వారిద్దరికీ కలెక్టర్ నాగరాణి, డీఈఓ బహుమతులు అందజేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు అడ్డాల శివరామకృష్ణంరాజును అభినందించారు. -
మోకాలి లోతు నీటిలో వెళ్లాలి
మాది రాజమండ్రి ప్రస్తుతం కుక్కునూరు మండలంలో 4వ కేటగిరీ ప్రాంతమైన ఉప్పరమద్దిగట్లలో పని చేస్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి 12 కిలోమీటర్లు వాహనాలు వెళ్లవు. పైగా రోజూ మోకాలి లోతు నీటిలో దిగి వెళ్ళాలి. వాగు పొంగితే ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటాల్సివస్తోంది. ఈ సారి కౌన్సిలింగ్లో మా సొంత మండలానికి బదిలీ చేయాలి. – కే.శ్రీలత ఎంటీఎస్ టీచర్ 200 కిలోమీటర్లు ప్రయాణించాలి మాది భీమవరం. కుక్కునూరు మండలం పెదరావిగూడెంలో రెండేళ్లుగా పని చేస్తున్నాను. మా ఊరి నుంచి పాఠశాలకు వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. నాకు ఆరోగ్యం సరిలేదు. అక్కడి వాతావరణం పడడంలేదు. చాలా అనారోగ్యానికి గురయ్యాను. ఈ సారి కౌన్సెలింగ్‌లో స్పౌజ్ సరౌండింగ్ ఏరియాకు బదిలీ చేయాలి. – వై.మెర్సీ, ఎంటీఎస్ టీచర్ అత్తమామల బాధ్యత నాపైనే నేను కుక్కునూరు మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో సింగిల్ టీచర్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను. మా స్వగ్రామం నుంచి అక్కడికి 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అనారోగ్యంతో ఉన్న అత్తమామల బాధ్యత నాపైనే ఉంది. పని భారం ఎక్కువ, జీతం తక్కువ. 4వ కేటగిరీ ఏరియాలో విధులు నిర్వహించడం భారంగా ఉంటోంది. – ఎం.భాగ్యలక్ష్మి, ఎంటీఎస్ టీచర్ సహకరించని ఆరోగ్యం మాది తాళ్ళపూడి మండలం. ప్రస్తుతం 140 కిలోమీటర్ల దూరంలోని ఎర్రబోరు పాఠశాలలో పని చేస్తున్నారు. నాకు 58 ఏళ్ల వయసు. మరో రెండేళ్లలో పదవీ విరమణ చేస్తాను. వయోభారంతో ఆరోగ్యం సహకరించడం లేదు. నేను పని చేస్తున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా లేదు. కనీస వైద్య సదుపాయం కూడా లేని ప్రాంతం. – బట్టు సత్తెమ్మ, ఎంటీఎస్ టీచర్ ● -
గురుకుల పాఠశాలలో విజిలెన్స్ తనిఖీలు
ద్వారకాతిరుమల: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శనివారం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీ చేశారు. గురుకులంలో ఉంటున్న పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినుల సంఖ్య తదితర వివరాలను ప్రిన్సిపాల్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథక అమలు తీరును స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తేవాలని విద్యార్థినులకు సూచించారు. అన్ని వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తానని ఆయన తెలిపారు.అంజన్నకు అభిషేకంజంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై స్వామి వారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వరకు పలు సేవలు, విరాళాల రూపంలో రూ.1,93,724 ఆదాయం ఆలయానికి సమకూరినట్లు ఈఓ ఆర్వీ చందన తెలిపారు. -
గడువు దాటితే ముప్పే
ఇవి తెలుసుకోవాలి గ్యాస్ సిలిండర్‌పై వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు. అయితే డీలర్ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీలేదు. అంతేగాక గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు సిలిండర్ ఉచితంగా డోర్ డెలివరీ చేయాలి. ద్వారకాతిరుమల : గ్యాస్ మీద వంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో.. సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం. గ్యాస్ సిలిండర్లకూ కాలపరిమితి ఉంటుందని, దానిని గమనించాలని నిపుణులు చెబుతున్నారు. గడువు తేదీ ముగిసిన సిలిండర్లు వినియోగిస్తే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతి సిలిండర్‌పై గడువు తేదీ కోడ్ విధానంలో మెటల్ ప్లేట్‌పై ముద్రిస్తాయి. సిలిండరు మార్చుతున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకుని వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్‌పై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని గుర్తించాలి. గడువు తేదీ ముగిసినా.. నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్‌పై ఉంటే దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్‌ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారులకు ఉంది. ఇలా గుర్తించాలి ఉదాహరణకు సిలిండర్ మెటల్ ప్లేట్‌పై ఏ–28 అని ఉంటే, ఆ సిలిండర్ 2028 మార్చికి ఎక్స్పైర్ అవుతుందని అర్థం. 28 అంకె సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఏ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బీ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలలను సూచిస్తాయని గుర్తించాలి. పదేళ్ల గడువు సిలిండర్ తయారైనప్పటి నుంచి పదేళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. బీఐఎస్ అనుమతులు తీసుకున్న తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే చర్యలు కాలం చెల్లిన సిలిండర్లు సరఫరా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు చేపడతామని తహసీల్దార్ జేవీ సుబ్బారావు తెలిపారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు తీసుకునేటప్పుడు వాటిపై కోడ్ రూపంలో ఉండే ఎక్స్పైరీ డేట్లను చూసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. వంట గ్యాస్ సిలిండరుకు కాలపరిమితి గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి -
నడిరోడ్డుపై యువకుడి హత్య
దెందులూరు: ఏలూరు వెళ్లే రహదారిపై వీరభద్రపురం వద్ద శనివారం యువకుడి దారుణహత్య కలకలం రేపింది. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పాములదిబ్బకు చెందిన ఎం.ఎర్రబాబు (30) ద్విచక్ర వాహనంపై గోపన్నపాలెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారులో వచ్చిన కొంతమంది వీరభద్రపురం వద్ద ఎరబ్రాబును కిరాతకంగా నరికి చంపారు. సంఘటన స్థలాన్ని పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ యువకుడి హత్యపై కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎర్రబాబును నిందితులు గోపన్నపాలెం నుంచి కారులో అనుసరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారులో మొత్తం ఆరుగురు ఉన్నారని, హత్య తర్వాత వారు ఏలూరు వైపు వెళ్లిపోయారని తెలుస్తుంది. పాతకక్షల నేపథ్యంలో ఎర్రబాబు హత్య జరగిందని, నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు సమాచారం.రైలు నుంచి జారి పడి వృద్ధుడి మృతిభీమడోలు: రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన అల్లూరి సత్యనారాయణ(69) రైలులో ప్రయాణిస్తుండగా జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధాయించారు. ఘటన స్థలంలోని మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా
తణుకు అర్బన్: స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల నాలుగు నెలల వేతన బకాయిలు, 36 నెలల పీఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంటాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం యూనియన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ధర్నా నిర్వహించి డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణకు అందజేశారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికలకు ఇస్తున్న వేతనాలే తక్కువని వాటిని కూడా నెలా నెలా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సక్రమంగా రాకపోవడంతో కార్మికులు పస్తులతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 60 మందికి తగ్గకుండా పారిశుద్ధ్య కార్మికులను నియమించి కార్మికుల పనిభారాన్ని తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధర్మాని పుష్పలత, డి.ప్రసన్న కుమారి, మెండి శ్రీను, పి.లక్ష్మి, పి.రేణుక, ఎం.బేబి, ఇ.హైమావతి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం: స్థానిక ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడో రోజు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవాద్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లా డుతూ ఏరియా హాస్పిటల్ సానిటరీ వర్కర్స్‌కి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ వేతనాలతో చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వేముల రాజు, సంజీవ్, మేరీ, చంద్రకళ, దయామని, జె.దుర్గారావు, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్‌కు అప్పగించొద్దు
పెదవేగి: పెదవేగి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రావలసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు పామాయిల్ గెలలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేపట్టారు. శనివారం పెదవేగిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఆ మూడు మండలాల నుంచి పామాయిల్ గెలలు వస్తే పెదవేగి యూనిట్‌కు మనుగడ ఉంటుందని అన్నారు. పామాయిల్ తోటలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పితే ఉద్యోగ కార్మికుల మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మిక కర్షక ఐక్య ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంఽధించిన వినతిపత్రాన్ని సీనియర్ మేనేజర్ సుధాకర్‌కి అందజేశారు. కార్యక్రమంలో ముక్కు సుబ్బారావు, మానికొండ ప్రసాద్, సంపంగి ప్రసాద్, తాతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంటీఎస్ టీచర్ల ఆక్రందన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీ అర్హులకు ఉపాధ్యాయులుగా మినిమం టైం స్కేల్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి ఆదుకుంది. జగన్ తీసుకున్న కీలక నిర్ణయంతో డీఎస్సీల్లో అర్హులైన మొత్తం 390 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. కలగా మిగిలిపోతుందనుకున్న ఉద్యోగం రావడంతో వారు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పని సర్దుబాటు ప్రక్రియలో ఎంటీఎస్ టీచర్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో వీరిని సొంత మండలాల పరిధిలోనే చేయాల్సి ఉండగా సుమారు 140 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు మార్చారు. వీరిలో కొంతమందికి ఏడాది, మరికొంత మంది రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. 2008 డీఎస్సీ అర్హుల్లో సైతం కొంతమంది మరో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. పని సర్దుబాటు ప్రక్రియలో వీరిని చాలా దూరానికి బదిలీ చేయడంతో ఒక పక్క పిల్లల చదువులు, మరో పక్క వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఆయా బాధ్యతలు నెరవేర్చలేక మానసికంగా కుంగిపోతున్న వారికి అన్నిటికీ మించి దీర్ఘకాలిక అనారోగ్యాలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు. దీంతో పాటు తమకు అలవాటులేని వాతావరణంలో పని చేయాల్సి రావడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. వాస్తవానికి ఈ నెల 20న ఎంటీఎస్ టీచర్ల బదిలీ జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో బదిలీలు వాయిదా వేశారు. కౌన్సిలింగ్ ఆదివారం చేపట్టనున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటించారు. ఈ బదిలీల్లో ముందుగా వృత్తిలో చేరిన 2008 డీఎస్సీ అర్హులను సీనియారిటీ జాబితాలో పైకి చేర్చి అనంతరం వృత్తిలో చేరిన 1998 డీఎస్సీ అర్హులను తరువాత వరుస క్రమంలో చేర్చారు. ఈ కారణంగా ఈ సారి బదిలీల్లో కూడా తమకు అన్యాయం జరుగుతుందని 1998 అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కనికరించాలని వేడుకోలు మరో ఏడాది, రెండేళ్లలో పదవీ విరమణ చేసే తమను మళ్లీ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేస్తే తమకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని 1998 డీఎస్సీ అర్హులు వాపోతున్నారు. ఈ బదిలీల్లో సీనియారిటీ కంటే వయసు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని వయసు రీత్యా 60 ఏళ్లకు దగ్గరలో ఉన్న తమకు బదిలీల్లో సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యత కల్పించి కోరుకున్న ప్రాంతాల్లో పని చేసేలా చూడాలంటున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు తమ కంటే చిన్న వారు కాబట్టి పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న తమకు సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. సొంత ఊళ్లకు 200 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం ఈ సారి దగ్గర మండలాలకు బదిలీ చేయాలని వేడుకోలు -
మార్టేరు పరిశోధన స్థానంలో పదోన్నతులు
పెనుమంట్ర: మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానంలో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా పరిశోధన స్థానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆత్మీయ సమావేశంలో బంగారు పతకం అందుకున్న డాక్టర్ టి.శ్రీనివాస్ తో పాటు డాక్టర్ బి.సహదేవరెడ్డి ( పంటల యాజమాన్య విభాగం), డాక్టర్ ఎస్.దయాకర్, డాక్టర్ పి.రాధిక (కీటక శాస్త్ర విభాగం) సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందగా.. డాక్టర్ ఎం.గిరిజా రాణి, డాక్టర్ వై సునీత(మొక్కల ప్రజనన విభాగం) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. డాక్టర్ పీవీ రమేష్ బాబు(పంటల యాజమాన్య విభాగం). డాక్టర్ వీ రోజా (మొక్కల ప్రజనన విభాగం) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. -
5,616 వేదికల్లో యోగా
ఏలూరు(మెట్రో): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 5,616 వేదికల్లో, 9 లక్షల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసనలో పాల్గొంటున్నారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9,59,635 మంది యోగాంధ్ర యాప్‌లో నమోదు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్కిట్ అండ్ రోల్ ప్లే, యోగా స్లొగన్స్ విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విజేతలకు విశాఖలో ప్రధాని మోదీ చేతులమీదుగా బహుమతులు అందిస్తారన్నారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశా ల గ్రౌండ్స్, ఇన్డోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియం ప్రాంతాల్లో ఒక్కోచోటా 5 వేల మంది యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.రహదారుల నిర్మాణంపై సమీక్షఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, తదితర సమస్యలను అధిగమించి త్వరితగతిన రహదారుల నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో ఆమె సమీక్షించారు. పట్టిసీమ–జీలుగుమిల్లి 365 బి.బి. 40 కి.మీ. రహదారికి సంబంధించి త్వరగా భూసేకరణ చేసి నిర్మాణదారులకు స్వాధీనం చేయాలని ఆదేశించారు. అలాగే ఖమ్మం, దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి సంబంధించి ఆయా అంశాలపై సమీక్షించారు. తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొయ్యలగూడెం పరిధిలోని రైతుల కు పరిహారం చెల్లించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని నిర్మాణదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పామర్రు–ఆకివీడు 165 జాతీయ రహదారికి సంబంధించి గోనేపాడు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన భూమి విషయంలో రైతులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఉత్తమ సేవలతోనే గుర్తింపుఏలూరు(మెట్రో): ప్రజలకు ఎక్కువగా సేవలందించే రెవెన్యూ శాఖలో పనిచేయడం గర్వంగా ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఉత్తమ సేవలందిస్తే ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలకు ఉత్తమ సేవలందించి రోల్ మోడల్‌గా నిలవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నిబంధనలపై అవగాహన పెంచుకుని పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన రంగోలి పోటీలు, రెవెన్యూ చట్టాల పుస్తక ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, సూపరింటెండెంట్లు చల్లన్న దొర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలందించి పదవీ విరమణ చేసిన జగన్మోహనరావు, బన్నీ, పోతురాజు, రాజశేఖర్, రాజశేఖర్ రాయుడు, చంద్రశేఖర్ తదితరులను దుశ్శాలువాతో కలెక్టర్ సన్మానించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కలెక్టర్, జేసీని రెవెన్యూ సిబ్బంది సత్కరించారు.మున్సిపల్ కార్మికుల దీక్షలుతణుకు అర్బన్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) జిల్లా కార్యదర్శి గెల్లా విజయకుమార్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్మికులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. -
23న వైఎస్సార్సీపీ యువత పోరు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడచినా హామీల అమలులో ఘోర వైఫల్యంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని, సూపర్–6 హామీల్లో నిరుద్యోగ భృతి ని అమలు చేయలేదని.. నిరుద్యోగ యువత, విద్యా ర్థుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈనెల 23న చేపట్టనున్న వైఎస్సార్సీపీ యువత పోరు పోస్టర్లను ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వీటిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వీటిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈనెల 23న ఏలూరులో వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుంటామని, అక్కడ దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం శాంతియుత ర్యాలీ చేపడతామన్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరువుతారని చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ ఏలూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్, ఏలూరు నగర యువజన అధ్యక్షుడు గంటా సాయిప్రదీప్, కై కలూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు చార్లెస్, పోలవరం నియోజకవర్గం యువజన అధ్యక్షుడు తోట జైబాబు, దెందులూరు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పెద్దిరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, యువజన విభాగం కార్యదర్శి కిట్టు, రాష్ట్ర కార్యదర్శి గాలి వెంకటేష్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి గంటా మోహన్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, నాయకులు సురేష్, జానంపేట బాబు, బండ్లమూడి సునీల్, దినేష్, శ్యామ్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ వెల్లడి గత ప్రభుత్వంలో పక్కాగా ఫీజు పథకం ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున 13 నెలల కాలానికి రూ.36 వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కాగా అమలుచేస్తే కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని మాట్లాడుతూ ఏలూరులో యువత పోరు కార్యక్రమానికి రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరవుతారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏడాది గడిచినా కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. -
బస్సులు లేక.. ప్రయాణం సాగక
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: లక్షలాది మంది ప్రజల రాకపోకలతో బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి కీలక వారధిగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ శుక్రవారం స్తంభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 60 శాతానికిపైగా బస్సులు విశాఖ జిల్లాకు తరలించడంతో బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరోవైపు చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలే దిక్కు అయ్యాయి. శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా డేకు జిల్లాలోని బస్సులు తరలించడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. 7 డిపోలు.. 355 బస్సులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 7 డిపోల నుంచి 355 బస్సులను విశాఖ సభకు ప్రభుత్వం కేటాయిం చింది. అన్ని డిపో మేనేజర్లకు ఉత్తర్వులు రావడంతో గురువారం సాయంత్రం నుంచే విడతల వారీగా బస్సులను పంపారు. మొత్తంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల్లో కలిపి 305 సర్వీసులు, అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 305 సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం అన్ని బస్టాండల్లో ప్రయాణికుల రద్దీతో పాటు గంటలతరబడి పడిగాపులు అనివార్యంగా కొనసాగాయి. 80 శాతం ఆక్యూపెన్సీతో ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి రోజూ సగటున 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. దీనిలో ఆర్టీసీలోనే సుమారు 25 వేల మందికిపైగా రాకపోకలుంటాయి. అలాగే కళాశాల విద్యార్థులు కూడా అత్యధికంగా ప్రజా రవాణానే వినియోగిస్తుంటారు. ఈ పరిణామాల క్రమంలో బస్సులన్నీ విశాఖకు తరలించడంతో అన్ని ప్రాంతాల్లో రాకపోకలు కొంతమేర స్తంభించాయి. ప్రయాణికులకు చుక్కలే.. ఏలూరు బస్టాండ్ నుంచి విజయవాడకు రోజూ 72 ట్రిప్పులు నాన్‌స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు అన్నీ కలుపుకుని ఏలూరు నుంచి 150 వరకు సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం దాదాపు 70 శాతం సర్వీసులకు బస్సులు లేకపోవడంతో నామమాత్రంగా సర్వీసులను నడిపారు. అలాగే ఏలూరు నుంచి రాజమండ్రి, రావులపాలెంకు 6 సర్వీసులుండగా వాటిని రెండింటికి పరిమితం చేశారు. రోజూ ఒక్క ఏలూరు డిపో నుంచి 19 నుంచి 20 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది విద్యార్థులకు ఆటోలే దిక్కయ్యాయి. అలాగే విజయవాడకు ప్రైవేట్ ట్రా వెల్స్ వాహనాలే అనివార్యమయ్యాయి. ఏలూరు జిల్లాలో ని ఏలూరు డిపో నుంచి 80 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 52 బస్సులు, నూజివీడు డిపో నుంచి 38 బస్సులు విశాఖకు పంపారు. అవసరమైతే మరో 50 బస్సులు పంపడానికి అధికారులు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు. న్యూస్‌రీల్‘పశ్చిమ’లోనూ ఇదే పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో 305 బస్సులకుగాను 185 బస్సులను విశాఖకు తరలించారు. భీమవరం డిపో నుంచి 51, నరసాపురం డిపో నుంచి 41, తాడేపల్లిగూడెం డిపో నుంచి 41, తణుకు డిపో నుంచి 52 బస్సులు శుక్రవారం విశాఖకు పంపారు. ప్రధానంగా భీమవరం నుంచి విజయవాడ, ఏలూరుకు 40 బస్సులు, భీమవరం నుంచి తణుకు, తాడేపల్లిగూడెంకు మరో 40 బస్సులు 90 శాతం ఆక్యూపెన్సీతో రాకపోకలు సాగిస్తుంటారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలు కావడంతో పల్లె వెలుగు సర్వీసులపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సగటున రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భీమవరం–పాలకొల్లు, భీమవరం–నరసాపురం, తాడేపల్లిగూడెం–తణుకు మధ్య తప్పని పరిస్థితుల్లో రెండు రోజులపాటు ఆటో ప్రయాణాలే ప్రజలకు దిక్కయ్యాయి. రవాణా కష్టాలు బస్సులన్నీ విశాఖకు తరలింపు ఉమ్మడి పశ్చిమ నుంచి 355 బస్సులు బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు గంటల తరబడి ఎదురుచూపులు కళాశాల విద్యార్థులకు ఆటోలే దిక్కు జిల్లాలో 40 శాతమే నడిచిన సర్వీసులు -
సార్వాకు సన్నద్ధం
భీమవరం: జిల్లాలో రైతులు సార్వా వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల నారుమడుల పనులు చేస్తుండగా.. మరికొందరు విత్తనాల సేకరణ, దుక్కుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో సార్వా సీజన్లో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా, ఈ మేరకు 10,400 ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపు 1,500 ఎకరాల్లో నా రుమడులు పూర్తిచేసినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గత దాళ్వా సాగు చేపట్టిన రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజంట్లు పంటకు తక్కువ ధర చెల్లించడంతో తీవ్రంగా నష్టపోయారు. నేటికీ కోట్లాది రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండటంతో ప్రస్తుత సార్వా సాగు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 52 వేల క్వింటాళ్ల విత్తనాల అవసరం జిల్లాలో వరి సాగుకు 52,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా దాదాపు 41,600 క్వింటాళ్లు రైతుల వద్దనే ఉంటాయనే అంచనా. 225 క్వింటాళ్ల విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై రైతులకు అందించనుంది. 4,600 క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. సన్న రకాలను ప్రోత్సహించేందుకు ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అన్ని మండలాల్లో దాదాపు 175 ఎకరాల్లో విత్తన పంటగా వేయించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. 58,900 టన్నుల ఎరువులు జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సాగుకు 58,905 టన్నుల ఎరువులు అవసరముంటుంది. దీనిలో యూరియా 20,990 టన్నులు, కాంప్లెక్స్ 35,059 టన్నులు, డీఏపీ 2,700 టన్నులు అందుబాటులో ఉన్నాయి. వరిపైరుపై నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించడానికి జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు అవసరమైన నానో యూరియా, డీఏపీ ప్రైవేట్ మార్కెట్లో అందుబాటులో ఉంచారు. భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి అధికంగా ఎరువులు వాడకాన్ని తగ్గించడానికి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు భూసార పరీక్షల కార్డులు అందిస్తున్నారు. వీటి ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించడం ద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ఈ ఏడాది 16,150 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలకు తాడేపల్లిగూ డెం ల్యాబ్‌కు పంపించారు. వ్యవసాయ భూముల్లో నత్రజని, కర్బన శాతం, జింకు తక్కువగా గుర్తించారు. ఈ మేరకు రైతులకు భూసార పరీక్షల కార్డులు అందించి వాటి ఆధారంగా ఎరువులు వాడకంపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు 10,400 ఎకరాల్లో నారుమడులకు 1,500 ఎకరాల్లో పూర్తి అందుబాటులో విత్తనాలు, ఎరువులు ముందస్తు నాట్లతో మేలు సార్వా పంటకు ముందస్తు నాట్లు వేయడం వల్ల మంచి దిగుబడులు సా ధించవచ్చు. ఇప్పటికే కా లువల్లో సంవృద్ధిగా నీరు ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నందున రైతుల త్వరితగతిన నారుమడులు వేసుకోవాలి. దాదాపు 1,500 ఎకరాల్లో నారుమడులు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. – జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం -
ఎఫెక్ట్
తల్లికి వందనంపై స్పందించిన అధికారులు కామవరపుకోట: కరెంట్ బిల్లు సాకుతో ‘తల్లికి వందనం ఎగనామం’ పేరిట సాక్షి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. స్థానిక కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ ఇద్దరు పిల్లలు తల్లికి వందనం పథకానికి అర్హులయినప్పటికీ ఆమెకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ బిల్లు వచ్చినట్లు చూపించి అనర్హులుగా చూపించారు. దీంతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి కెఆర్‌పురం ఐటీడీఏ అధికారులు స్పందిస్తూ చౌటూరి కోటమ్మను అర్హురాలుగా ప్రకటించారు. కూతురే కొడుకై .. జంగారెడ్డిగూడెం: కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణం బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో జరిగింది. ఆదిమూలపు వెంకటేశ్వరరావు (55) అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు కొడుకులు లేరు. దీంతో కుమార్తె ముప్పన జ్యోతి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యలమంచిలి: పాలకొల్లు యడ్లబజారు సెంటర్లోని ఫైర్‌స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యలమంచిలి మండలం కాజ పడమర గ్రామానికి చెందిన సత్తినీడి వీరన్న(69) మరణించారు. ఆయన కాజ పడమర నుంచి తన బైక్‌పై పాలకొల్లు వెళ్తుండగా యడ్లబజారు సెంటర్లో ఫైర్ స్టేషన్ వద్దకు వచ్చాక వెనుకగా లారీ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో అతని బైక్ లారీ ముందు భాగంలోకి దూసుకుపోయింది. లారీ బైక్‌తోపాటు వీరన్నను కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఆయన ప్రమాద స్థలంలోనే మరణించారు. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో వాహన సిబ్బంది వచ్చి వీరన్నను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాలకొల్లు పట్టణ ఏఎస్సై శలా మార్లింగం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
112 బస్సులపై కేసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రవాణా కమిషనరు ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి.. 112 కాంట్రాక్టు క్యారేజ్ బస్సులు, వాణిజ్య, వాణిజ్యేతర వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనరు కేఎస్‌ఎంవీ కృష్ణారావు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు బస్సులను తనిఖీ నిర్వహించి పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. వాణిజ్య వాహనాలపై పన్ను చెల్లించకుండా, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెనన్స్ వంటి లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఇన్చార్జ్ ఆర్టీవో ఎస్.రంగనాయకులు, వాహన తనిఖీ అధికారులు జీ ప్రసాదరావు, జీ స్వామి, వై సురేష్ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, డీ ప్రజ్ఞ పాల్గొన్నారు. -
ఆక్వాకు వాతావరణ గండం
గణపవరం : పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ఈ వాతావరణం రొయ్య సాగుకు పూర్తి ప్రతికూలం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా పడిపోయిన రొయ్యల ధరలు కొద్దిగా పెరిగి ఆక్వా సాగు కుదుట పడుతున్న సమయంలో గత రెండు వారాలుగా మళ్లీ రొయ్య ధర తగ్గిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పది రోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పగలు ఉక్కబోత, విపరీతమైన ఎండలు ఓ పక్క, సాయంత్రానికి మబ్బులు కమ్మి, వర్షపు జల్లులు మరో పక్క ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేల రూపాయల డీజిల్ కొనాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో వర్షాలతో చల్లబడిపోగా, జూన్ విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో మొదలైంది. ఉక్కబోత కారణంగా రొయ్యల చెరువుల్లో డీవో సమస్య ఏర్పడి సరిపడా ఆక్సిజన్ అందక నీటి ఉపరితలంపై తేలియాడుతున్నాయి. ఈ సమస్య మరీ తీవ్రమైతే రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో రైతులు ఆఘమేఘాల మీద రొయ్యల పట్టుబడి చేసి, నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా 50 శాతం చెరువుల్లో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్‌లో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టుబడి చేసినట్లు అంచనా. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవాలంటే.. రొయ్య సీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్ స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరి చూసుకుంటూ ఉండాలి. నీటి క్షార స్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెరువులో ప్రమాదకరమైన విష వాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెరువుల్లో రొయ్య పిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్చగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల సూచనలు చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీ సైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపం నివారణకు పొటాషియం పర్మాంగనేట్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెరువుల్లో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెరువుల్లో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానేయాలి. చెరువుల్లో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెరువులలో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి. పగలంతా ఎండ, సాయంత్రం భారీ వర్షాలతో అనర్థం విద్యుత్ కోతలతో ఆయిల్ ఇంజిన్లు వాడుతున్న రైతులు -
కాలినడక భక్తులకు సౌకర్యాల కల్పన
ద్వారకాతిరుమల : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో కాలినడక భక్తులకు దేవస్థానం పెద్దపీట వేసింది. వృద్ధ, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం కొండపైన డార్మెటరీలో సుమారు 50 మంచాలను ఏర్పాటు చేసింది. చిన వెంకన్న దివ్య క్షేత్రానికి ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన వస్తున్నారు. వారంతా శనివారం ఉదయం స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. కాలినడక భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించిన దేవస్థానం డార్మిటరీల ద్వారా వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే వృద్ధ, దివ్యాంగ భక్తులకు డార్మెటరీలో మంచాలు ఏర్పాటు చేసింది. ఒక్కో భక్తుడి నుంచి రూ.20 నామమాత్రపు రుసుం వసూలు చేస్తోంది. వస్తువులను భద్రపరచుకునేందుకు లాకర్ సదుపాయం కల్పించారు. -
నాటుసారాపై దాడులు
ఏలూరు టౌన్: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ నాగప్రభుకుమార్ హెచ్చరించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ అజయ్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ భోగేశ్వరరావు, తన సిబ్బందితో నాటుసారా తయారీపై దాడులు చేశారు. శుక్రవారం లింగపాలెం మండలం మఠంగూడెం పరిధిలో నాటుసారా తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల నాటుసారా, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు. తలార్లపల్లి గ్రామానికి చెందిన దేశవతు వేణు నాటుసారా తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మఠంగూడెం గ్రామానికి చెందిన జెర్రిపోతుల మారేశు, తొచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన పెనమలూరి చంటమ్మను ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణు సమాచారం మేరకు అతని ఇంటి సమీపంలో, పొలంలో తనిఖీలు చేయగా 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ భోగేశ్వరరావు తెలిపారు. ప్రగడవరం అడ్డరోడ్డులో కిరాణాషాపు నిర్వహిస్తున్న అద్దంకి విశ్వేశ్వరరావు బెల్లం విక్రయించినట్లు అంగీకరించటంతో 5 కిలోల బెల్లం స్వాధీనం చేసుకుని, అతనిపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. -
యోగాసనం.. ఆరోగ్య రహస్యం
కై కలూరు/పాలకొల్లు సెంట్రల్: శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారతదేశంలో వేల ఏళ్ల నుంచి యోగాకు ప్రాచుర్యం ఉంది. 2014 డిసెంబరు 11న జరిగిన ఐక్యరాజ్య సమితి 69వ జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తీర్మానించారు. ఏటా జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది శ్రీయోగా ఒక భూమి, ఒక ఆరోగ్యంశ్రీ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. యోగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇది మనసును నియంత్రించడంతో పాటు మెదడును ఉత్తేజ పరుస్తోంది. పూర్వకాలంలో చరక, సుశ్రుత, ధన్వంతరి, పతంజలి, కపిలుడు వంటి రుషుల నుంచి, ఆధునిక యుగంలో రమణ మహర్షి, అరవింద యోగి, రామకృష్ణ పరమహంస, శివానంద, యోగానంద, బాబా రామ్‌దేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వంటి ఎందరో యోగా విశిష్టతను చాటి చెప్పారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 10 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగా పేరుతో సంగం, బంధన్, పార్క్, సమావేశ్, ప్రభావ, కనెక్ట్, హరిత్, అన్ప్లగ్డ్, మహాకుంభ్, సంయోగ పేరుతో వీటిని రూపొందించారు. ప్రధానంగా మహాసంగం పేరుతో 1,00,000 ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు ఇస్తున్నారు. అష్టాంగ మార్గం.. అనుసరణీయం యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని 8 అంశాలు ఉంటాయి. నేటి సమాజంలో సూర్య నమస్కార ఆసనాలు ప్రాధాన్యత పొందాయి. వీటిలో ప్రణమాసనం, హస్త ఉత్థానాసనం, పాద హస్తాసనం, ఆశ్వ సంచాలనాసనం, పర్వతాసనం, భుజంగాసనం, సాష్టాంగాసనం ముఖ్యమైనవి. ఇక స్థూలకాయ నివారణకు త్రికోణ, హలన శలభ, నిద్రలేమికి హలాసనం, శీర్షాసనం, శీతలి, ప్రాణాయామం, మలబద్దకానికి తాడ, చక్ర, మయూర, మత్య్సాసనాలు, నెలసరి ఇబ్బందులకు హల, గోముఖ, భద్ర, చంద్ర నమస్కారాలు వంటి ఉపయోగపడుతున్నాయి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు యోగాతో లాభాలు ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువు, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. దృష్టి ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ప్రశాంత కలుగుతోంది. ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రాణాయామం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతోంది. యోగాసనాలకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం కేటాయించాలి. -
సందిగ్ధంలో ఎంపీడీఓ పోస్ట్
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవోగా కె.కిరణ్‌కుమార్ విధులు నిర్వహిస్తుండగా, ఆయన స్థానంలో మరో ఎంపీడీఓకి పోస్టింగ్‌ని ఇస్తూ సిఫార్సు లెటర్ అందినట్లు తెలిసింది. అయితే సిఫార్సు లెటర్ తీసుకున్న ఎంపీడీవో ఇటీవలే దేవరపల్లి నుంచి తాళ్లపూడి ఎంపీడీవోగా బదిలీ అయ్యి అక్కడ చార్జీ తీసుకోవడం, అనంతరం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే హఠాత్తుగా కొయ్యలగూడెం ఎంపీడీవోగా సిఫార్సు లెటర్ తీసుకోవడం, ఆగమేఘాలపై జెడ్పీ ద్వారా కొయ్యలగూడెం ఎంపీడీవో పోస్టింగ్ చేయించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుండడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఉద్యోగ వర్గాల్లో కలకలం లేపుతోంది. కిరణ్‌కుమార్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు కూడా గడవకముందే మరో ఎంపీడీవోని అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నియమించడం వెనుక ఎంపీడీవో కార్యాలయంలోని ఓ సీనియర్ ఉద్యోగి చక్రం తిప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏవిధమైన ఒత్తిళ్లకు లొంగకుండా ఎంపీడీవో విధులు నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తెలియకుండానే బదిలీల ప్రక్రియ కొనసాగిందంటూ ఎంపీడీవో కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలను ఎంపీడీవో అడ్డుకుంటున్న నేపథ్యంలో చేసేదిలేక సీనియర్ ఉద్యోగి రాజకీయ పెద్దలను ఆశ్రయించినట్లు తద్వారా తనకు అనుకూలంగా ఉన్న వేరొక ఎంపీడీవోకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్ చేపట్టి పది నెలలు గడవకుండానే వేటు? రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడమే కారణమా! -
కామ్రేడ్ సుధాకర్ సేవలు ఎనలేనివి
పెదపాడు: మండలంలోని సత్యవోలులో కామ్రేడ్ తెంటు సుధాకర్ సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. సీపీఐఎంల్ సానుభూతిపరులు, విరసం నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిగా, డాక్టర్‌గా, కామ్రేడ్‌గా సుధాకర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేద, బడుగు, పీడిత ప్రజల కోసమే సుధాకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కృష్ణ లావేటి శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టరు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్షఉండి: హత్యాయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో మండలంలోని కోలమూరు గ్రామంలో కొమ్మర కనకారావు మీద జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు సిర్ర కనకారావుపై నేరం రుజువు కావడంతో అతడికి భీమవరం అసిస్టెంట్ సెషన్స్‌కోర్టు జడ్జి ఎం సుధారాణి మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. కేసు విచారణకు సహకరించిన సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి అభినందించినట్లు ఎస్సై తెలిపారు. -
యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా
తణుకు అర్బన్: యానాం మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.సుందరరాజు రూ.లక్ష జరిమానా విధించినట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ఇటీవల రెండు పర్యాయాలు యానాం మద్యంతో దొరికిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7న కంతేరు గ్రామంలో కారులో 43.1 లీటర్ల యానం మద్యం తరలిస్తూ తణుకు ఎకై ్సజ్ శాఖ దాడుల్లో పట్టుబడ్డాడని, దీంతో అతడిని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. సత్ప్రవర్తన బాండ్‌ను ఉల్లంఘించి తిరిగి మే 26న యానాం నుంచి మద్యాన్ని కారులో రవాణా చేస్తూ తణుకు ఎక్సైజ్ శాఖకు మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. దీంతో ఈనెల 11న ఇరగవరం తహసీల్దార్ వద్ద హాజరపరచగా దీనిపై విచారణ అనంతరం విధించిన జరిమానాను ముద్దాయి గురువారం చెల్లింపు చేసినట్లు వివరించారు. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు ముదినేపల్లి రూరల్ : యువకుడి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం మండలంలోని పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లికి చెందిన మద్దాల మరియమ్మ కుమారుడు కిరణ్‌బాబు గుంటూరులోని ఒక స్వీటు షాపులో పనిచేసేవాడు. ప్రమాదవశాత్తూ గాయపడడంతో కర్షకపాలెంలోని ఇంటి వద్దకు వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తరువాత ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయపాలెం గ్రామాల్లోని స్వీటుషాపుల్లో పనిచేసేవాడు. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో మద్యం సేవించి తల్లిని దుర్భాషలాడుతూ బాధపెట్టేవాడు. ఈ ఏడాది మార్చి 30న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని తల్లి మరియమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో తల్లిని తూలనాడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి కిరణ్‌బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కూటమి పాలనలో మట్టి దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. కోర్టు నుంచి స్టే ఉన్నా వారు లెక్క చేయని పరిస్థితి. ఉంగుటూరు మండలం నల్లమాడులో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు తరాల నుంచి ఒక పేద కుటుంబం హక్కు భుక్తంలో ఉన్న మెరసుకుంటను ఆనుకొని ఉన్న సుమారు ఒకటిన్నర ఎకరం కంకర బీడులో 15 రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కంకరను జేసీబీలు, పొక్లయినర్ల సాయంతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముసనబోయిన అంజమ్మకు చెందిన ఈ భూమి విషయంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూటమి నాయకలు లెక్కచేయడం లేదు. పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు ఆ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి అధికారుల జేబులు నింపుతున్నారని వినికిడి. కంకర తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజుని వివరణ కోరగా కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు. -
ఈ సమ్మర్ చాలా కూల్ గురూ..
● వేసవిలో గోదావరి జిల్లాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ● రోహిణి కార్తెలో కూడా ఎండలు ప్రభావం చూపని వైనం ● రుతుపవనాలు విస్తరించడంతో చల్లబడ్డ వాతావరణం నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. ఉమ్మడి పశ్చిమలో ఫిబ్రవరి నెలలోనే 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా భానుడు ప్రతాపం చూపించాడు. దీంతో ఈఏడాది వేసవిలో ఎండల ప్రతాపం దారుణంగా ఉంటుందని అంచనా వేశారు. వేసవిలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని జనవరి నెలలోనే విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అందుకు భిన్నంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో అయితే ఉమ్మడి పశ్చిమలో ఎక్కడా కూడా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. జూన్ మొదటి వారంలో అత్యధికంగా 41 డిగ్రీలు, అత్యల్పంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా దాదాపు 20 రోజులు ముందుగానే రావడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 2005 తరువాత వేసవిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో గోదావరి జిల్లాల వాసులు ఈ ఏడాది వేసవి తాపం తెలియకుండానే వర్షాకాలంలోకి ప్రవేశించారు. రోహిణీ కార్తె ప్రభావం కూడా కనిపించలేదు ఈ ఏడాది మే 24 వతేదీ నుంచి రోహిణీ కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని నానుడి ఉంది. రికార్డు స్థాయిలో ఉండే రోహిణి కార్తె ఎండలకు జనం బెంబేలెత్తుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రోహిణి కార్తె కూడా సాధారణ ఉష్ణోగ్రతలో కూల్‌గా గడిచిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ ఏడాది వేసవి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా కూల్‌గా గడిచిపోవడం విశేషం. అప్పుడు కరోనా కారణంగా ఇళ్లలో ఉండి.. కరోనా కారణంగా వేసవిలో వరుసగా రెండేళ్లపాటు జనం ఇళ్లకే పరితమై వేసవి ప్రభావం పడకుండా తప్పించుకున్నారు. 2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం, లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలలు మొత్తం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక 2021లో కూడా మార్చి నెలలోనే కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం ప్రారంభమైంది. ఏప్రిల్, మే నెలల్లో కల్లోలంగా మారడంతో దీంతో జనం పెద్దగా రోడ్కెక్కలేదు. ఆ రకంగా రెండేళ్లు అధిక మొత్తంలో జనం ఇళ్లపట్టునే ఉండి భానుడి ప్రతాపాన్ని చాలా వరకూ తప్పించుకున్నారు. నిజానికి ఈ రెండేళ్లు కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లోనే నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవడంతో జనం కూల్ కూల్‌గా ఖుషీ అయ్యారు. మే మొత్తం కూల్.. జూన్‌లో కొంత ప్రభావం ఈ ఏడాది మే నెల మొత్తం ఉమ్మడి పశ్చిమలో ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు. అంతేకాకుండా మే 16, 17 తేదీల్లో వర్షాలు పడ్డాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇదే సమయంలో వర్షాలు పడ్డాయి. అయితే తరువాత వడగాగాలలు దుమ్మురేపాయి. గత ఏడాది పడగాలులకు ఉమ్మడి జిల్లాలో 16 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఏడాది వడగాలుల మరణాలు నమోదు కాకపోవడం విశేషం. ఇక మేనెల ఎండంటే తెలియకుండా గడిపేసిన జిల్లా వాసులకు జూన్ మొదటి వారంలో కొంత ప్రభావం కనిపించింది. జూన్ 2, 3 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు దాటి ఉఫ్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ తరువాత అంతకు మించి ఉఫ్ణోగ్రతలు నమోదు కాలేదు. -
యోగా మంత్రం.. ఒత్తిడిలో యంత్రాంగం
పాలకోడేరు: కూటమి ప్రభుత్వం కొన్ని రోజలుగా నిరంతరం యోగా మంత్రం జపిస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా పోయింది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీ, రిజిస్ట్రేషన్, యోగ ప్రొటోకాల్ ఆసనాలు పూర్తి చేసినప్పటికీ జిల్లాస్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కానీ అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాలు పేర్కొనడంతో కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇవేం పోటీలు? జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 పైబడి అంటూ మూడు భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. వారంతా పోటీలో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం తదితర ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణమత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడనాసనం ఇచ్చారు. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అనిపించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సమయం వృథా అంటూ ఆవేదన యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతిరోజు కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబ్క్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్ది సమయం వృథా అవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇప్పుడు యోగాంధ్ర కోసం నెలరోజుల పాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణలో తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో పని ఒత్తిడి భరించలేక సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులు అంతా నరకం చూస్తున్నారు. యోగాంధ్ర విజయవంతానికి ప్రభుత్వం కుస్తీలు ఉద్యోగులు, సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి -
భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
కొయ్యలగూడెం: భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన గురువారం కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు పూజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెంలో ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చిట్యాల గ్రామానికి చెందిన పూజితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే మగపిల్లాడు కావాలని పూజితను అత్తమామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త కోర్టును ఆశ్రయించగా కోర్టు పూజితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో బంధువులు, మహిళ మండలి సంఘాల మద్దతుతో గురువారం పూజిత శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగా అదే సమయంలో భర్త మరో మహిళతో విహహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడని తెలియడంతో అవాక్కయింది. పైగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు ఆరు నెలల పాప ఉందని తెలియడంతో ఆమెను కూడా తీసుకొని బ్యాంకు వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. దీంతో శ్రీనివాసరావు, పూజితల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మహిళా సంఘాలు బంధువులు కలిసి శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావుని, పూజితను స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పూజిత కోరుతోంది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంపై ఆవేదన -
ఏడాది చివరికి ఎలక్ట్రిక్ బస్సులు
నూజివీడు: రాష్ట్రానికి ఈ ఏడాది చివరి నాటికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో వాటిలో జోన్–2 పరిధిలోని విజయవాడకు 100 బస్సులు, కాకినాడకు 50, రాజమండ్రికి 50 బస్సులు చొప్పున కేటాయించనున్నట్లు ఆర్టీసీ జోన్–2 ఈడీ జీ విజయరత్నం పేర్కొన్నారు. నూజివీడులోని ఆర్టీసీ బస్సు డిపోను గురువారం ఆయన సందర్శించి అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించడంతో పాటు బాధ్యతాయుతంగా పనిచేసి డిపోను లాభాల్లో నడపాలన్నారు. బస్సులు సైతం సమయపాలనతో నడిచేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఆర్టీసీపై డీజిల్ భారం సైతం తగ్గుతుందన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో బాగుంటే నూజివీడు డిపో నుంచి దూర ప్రాంతాలకు కచ్ఛితంగా బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. బెంగళూరు, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు ఇప్పటికే సర్వీసులు నడుపుతున్నామన్నారు. నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందని, పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తిరిగే సర్వీసులు కచ్ఛితంగా సమయానికి బయలుదేరి వెళ్లాల్సిందేనన్నారు. బస్టాండ్‌లో ఉండే కంట్రోలర్లు బస్సులు సమయానికి వెళ్తున్నాయా, లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సీహెచ్ సూర్యపవన్ కుమార్, ట్రాఫిక్ సీఐ జీ రాంబాబు, పలు యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
యోగా డేకు భారీ ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లావ్యాప్తంగా ఈనెల 21న యోగా దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి యోగా దినోత్సవం, తల్లికి వందనం పథకంపై అధికారుతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల మంది యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ఏలూరులో మూడు ప్రదేశాల్లో 5 వేల మంది చొప్పున యోగాభ్యాసన చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కార్యక్రమాల వివరాలను యోగాంధ్ర యాప్‌లో వెంటనే నమోదు చేయాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని అర్హులైన తల్లులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న తల్లుల ఈ–కేవైసీ వెంటనే పూర్తి చేయాలనీ, అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.ముఖ్యమంత్రి సమీక్షసీఎం చంద్రబాబు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి యోగాంధ్ర కార్యక్రమం, తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, అధికారులు హాజరయ్యారు.నేడు రెవెన్యూ దినోత్సవంఏలూరు(మెట్రో): రెవెన్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేడుకలు నిర్వహించనున్నట్టు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రమేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సభా ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ రెండు శతాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. -
కొందరికే అన్నదాత సుఖీభవ!
సాగు భారమైంది.. మామిడి ధర భారీగా పతనమైంది.. కోకో ధర నేలచూపులు చూస్తోంది.. పొగాకు, మిర్చి, వాణిజ్య పంటలతో పాటు ధాన్యానికి సైతం గిట్టుబాటు ధర లేక అన్నదాత ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏడాది క్రితం వరకు రికార్డు స్థాయిలో ధరలు పలికిన పంటలు పతనం కావడం, పెట్టుబడులు పెరగడం, అప్పుల తిప్పలతో అన్నదాత సుఖీభవ సాయంపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో 40 శాతానికిపైగా రైతుల సంఖ్యలో కోత విధించి అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. అయినా పథకం అమలు, ఎప్పుడు సాయం జమ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. శురకవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే ఖ్యాతి గడిచింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంటుంది. దీంతో పాటు ప్రధాన వాణిజ్య పంట అయిన కోకో, మామిడి కూడా సాగు విస్తీర్ణంలో జిల్లానే రాష్ట్రంలో నంబర్‌వన్. ఇక పొగాకు, ఇతర వాణిజ్య పంటలు కూడా జిల్లాలో గణనీయంగా సాగులో ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో గతేడాదిగా ధాన్యంతో సహా పంటలకు ఆశించిన ధరలు లేకపోవడంతో అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. ప్రధానంగా జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉంది. అలాగే 36,156 ఎకరాల్లో కోకో, 52 వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి, 33 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. గతేడాది రూ.1,150 పలికిన కిలో కోకో గింజలు ప్రస్తుతం కిలో రూ.300 నుంచి రూ.400కు పరిమితమైంది. అలాగే గతేడాది రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలికిన టన్ను మామిడి ప్రస్తుతం రూ.10 వేలకే పరిమితమై సీజన్ ముగింపులో ఉంది. మామిడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అలాగే పొగాకు కూడా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో రూ.411 పలికిన గ్రేడ్–1 పొగాకు నేడు రూ.270కు పరిమితమైంది. ఇలా వరుసగా ప్రధాన పంటలు ధరలు పతనమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఏడాది పాటు పట్టించుకోలేదు. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో జిల్లాలో గందరగోళం నెలకొంది. 1.62 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ అమలుపై స్పష్టమైన ఆదేశాలు అందలేదు. అయితే అర్హుల జాబితాను స్థానిక యంత్రాంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2.35 లక్షల మందికి రైతు భరోసా సాయం అందితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 1,62,085 మందిని మాత్రమే అన్నదాత సుఖీభవకు అర్హులుగా గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలోని 64,873 మందికి పథకం వర్తించదు. అలాగే జిల్లాలో ఇప్పటివరకూ 1,56,461 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 3.42 లక్షల మంది రైతులు ఉన్నారు. న్యూస్రీల్రైతులను దగా చేశారు దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదు. ఎన్నో ఆశలు పెట్టుకుని రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూశారు. పాలన చేపట్టి ఏడాది అయినా రైతులకు ప్రభుత్వ సహాయం అందలేదు. నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. పెట్టుబడి సాయం కోసం అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితికి రైతులు వచ్చారు. – కొలుసు గణపతిరావు, రైతు సొసైటీ మాజీ చైర్మన్ దెందులూరు గతంలో రైతే రాజు గత వైఎస్సార్సీపీ ప్రభు త్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రాజుగా చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఏటా వ్యవసాయ సీజన్ సమయానికి పెట్టుబడి సాయం అందించారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశారు. – ఎం.రంగబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్షకులపై కక్ష జిల్లాలో కొందరు రైతులకే వర్తింపు అర్హుల జాబితా సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం కౌలు రైతులకు దక్కని భరోసా 40 శాతం మేర తగ్గిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలో జిల్లాలో 2.24 లక్షల మందికి పథకం కూటమి ప్రభుత్వంలో 1.62 లక్షల మందికే వర్తింపు పథకం అమలుపై లేని స్పష్టత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల సాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏటా మూడు విడతల్లో ప్రతి రైతుకూ నగదు జమ చేసేవారు. జిల్లాలో నాలుగేళ్లలో 2 లక్షల మందికిపైగా రైతులకు రూ.1,830 కోట్ల సాయం చేశారు. అలాగే సున్నా వడ్డీ రుణాల కింద రూ.22.29 కోట్ల లబ్ధి చేకూర్చారు. -
● ప్రాణాలతో సదరంగం
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అవస్థలు తప్పడం లేదు. సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలంటూ అధికారులు కొర్రీలు పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో దివ్యాంగులు, మానసిక వికలాంగులు నానా ప్రయాసలు పడుతూ ఏలూరు జీజీహెచ్‌లో సదరం క్యాంపునకు హాజరవుతున్నారు. మండుటెండల్లో దూర ప్రాంతాల నుంచి సహాయకులను తీసుకుని ఆందోళనతో వస్తున్నారు. బుధవారం ఇలానే ఓ వృద్ధుడు జీజీహెచ్‌కు వచ్చి గుండె ఆగి ప్రాణాలు విడిచాడు. అయినా అధికారుల్లో చలనం లేదు. సదరం కేంద్రాలు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయాలని పింఛన్‌దారులు కోరుతున్నారు. గురువారం ఏలూరు జీజీహెచ్ వద్ద కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు వృద్ధుడికి తప్పని తిప్పలు -
మున్సిపల్ కార్మికుల దీక్షకు సంఘీభావం
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల దీక్షలకు ఇఫ్టూ సంఘీభావం తెలిపింది. గురువారం ఇఫ్టూ ప్రదర్శనగా వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇఫ్టూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, కనీస వేతనాలు రూ.29 వేలు ఇవ్వాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అలాగే ఐఎఫ్టీయూ నాయకులు కూడా మద్దతు తెలిపారు. డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో గురువారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 1,030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 174 మందికి 171 మంది, మధ్యాహ్నం 189 మందికి 180 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది, మధ్యాహ్నం 140 మందికి 138 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 197 మందికి 193 మంది, మధ్యాహ్నం 215 మందికి 207 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. నేడు ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు శుక్రవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని జీఎంసీ బాలయోగి సైన్స్పార్క్లో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని కేడర్లనూ చూపించాలి ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో అన్ని కేడర్ల ఖాళీలను బ్లాక్ చేయకుండా చూపించాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గురువారం డీఈఓ వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ ఖాళీలను మాత్రమే కాకుండా హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను కూడా కోరుకునేలా అవకాశం కల్పించాలన్నారు. జేఏసీ నాయకులు ఎం.ఆదినారాయణ, జి.మోహన్, టి.రామారావు ఉన్నారు. సాగుదారుల చట్టంపై ప్రచారోద్యమం ఏలూరు (టూటౌన్): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ జా యింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చేతులమీదుగా పంట సాగుదారులు చట్టంపై ప్రచారోద్యమం కరపత్రాలను గురువారం విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బా షా మాట్లాడుతూ జిల్లాలో డీబీఆర్సీ 2025– 26కి గాను భూమి ఉన్న రైతులకు, కౌలుదారులకు మధ్య అవగాహనా కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. కౌలు కార్డు ల ద్వారా పథకాలు పొందవచ్చన్నారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాలు విడుదల ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల మెరిట్ కార్డులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్సైట్లో అందుబాటులో ఉంచారన్నారు. మెరిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్, లాగిన్ (డీఎన్ఓ) ద్వారా అప్లికేషన్‌ను ధ్రువీకరించుకోవాలని కోరారు. -
సచివాలయాల్లో.. కూటమి బదిలీలలు
సాక్షి, భీమవరం: నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తిచేసేందుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరవు నాటికి ఒకే చోట ఐదేళ్ల కాలం పూర్తిచేసుకున్న వారి బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు పూర్తికాకున్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థన బదిలీ కావాలనుకునే వారు ఈనెల 22 నుంచి 24వ తేదీలోపు రిక్వెస్ట్ ట్రాన్సఫర్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలోని సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించింది. ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను ఇప్పటికే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారు. 25 నుంచి 29లోపు ప్రాధాన్యతను అనుసరించి బదిలీలు పూర్తిచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి పనిచేసే విభాగాన్ని బట్టి సంబంధిత శాఖల పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయి. సచివాలయ ఉద్యోగులపై కక్ష: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. సర్వేల పేరిట తిప్పడం, గతంలో వలంటీర్లు చేసిన పనులను వీరికి అప్పగించడం ద్వారా పనిభారం పెంచేసింది. క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. కేవలం రూ.29 వేల నుంచి రూ.31 వేల జీతంపై పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదన్న కూటమి ఆదేశాలు ఇవ్వడం, బదిలీలపై స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఇబ్బంది పెట్టేందుకేనని పలువురు ఉద్యో గులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా.. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపధికన సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఉద్యాన అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ తదితర పోస్టులను నియమించించారు. తద్వారా జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.సిఫార్సుల పర్వం ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ఎత్తుగడ బదిలీల నిర్వహణపై స్పష్టత లేని జీఓ మెరిట్‌ను పక్కనపెట్టి సిఫార్సు లేఖలున్న వారికే ప్రాధాన్యం ఈ మేరకు ప్రొఫార్మాలో వీఐపీ కాలమ్ సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు ఉద్యోగుల ప్రదక్షిణలు చెప్పినట్టు పనిచేసే వారికే ఎమ్మెల్యేల లేఖలు -
విత్తన ఎంపికే కీలకం
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సార్వా వరి సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకపోవడం, గత దాళ్వా సీజన్ ధాన్యం సొమ్ములు ఇంకా చెల్లించపోవడంతో వరిసాగుకు రైతులు మీనవేషాలు లెక్కించాల్సిన పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 24 గంటల లోపు సొమ్ములు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకున్న ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దాదాపు రూ.290 కోట్లు బకాయిపడినా నోరుమెదపపోవడం పట్ల రైతన్నలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం అందకున్నా, సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించపోయినా వరిసాగు తప్పనిసరికావడంతో సార్వా సాగుకు విత్తనాల సేకరణ, భూములు దుక్కులు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. సార్వా పంటకు అనువైన విత్తనాలు వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.60 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నందున విత్తన ఎంపిక కీలకం.. సార్వా వరి సాగు ప్రారంభం ఉమ్మడి పశ్చిమగోదావరిలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు చీడ పీడలు తట్టుకునే రకాలు ఎంచుకోవాలి వరిసాగులో రైతులు విత్తన ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం, భూసార పరిస్థితులకు అనువైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. చీడ, పీడలను తట్టుకునే వరిరకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. – ఎంవీ కృష్ణాజీ, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనాస్థానం, మార్టేరు -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ఆగిరిపల్లి : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థులు ప్రహర్ష, రోహిత్, అభిలాష్ ఎంపికయ్యారు. విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు శివ నాగేంద్ర, సుగుణరావును హెచ్ఎం, గ్రామస్తులు అభినందించారు. బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు భీమడోలు : గుండుగొలనులో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుండుగొలనుకు చెందిన చిట్టిబొమ్మల మోక్షశ్రీ 16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసింది. 350 మార్కులతో ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి వచ్చిన మోక్షశ్రీతో మంగళవారం తండ్రి పోతురాజు పాఠశాలకు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కుమార్తె మోక్షశ్రీను మందలించాడు. టెన్త్‌లో సక్రమంగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చేవని, ఇలాగే ఇంటర్లో కూడా చదివితే ఇబ్బందులు పడతావంటూ మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోక్షశ్రీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చలపతిరావు తెలిపారు. -
పాటించాల్సిన జాగ్రత్తలు
● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండరాదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్టు కింద అస్సలు ఉండకూడదు. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది. ● వర్షపు సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమేరాలు, సెల్ఫోన్లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి. ● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది. -
కరెంటు బిల్లు సాకుతో తల్లికి ఎగనామం
కామవరపుకోట కొత్తూరు యానాదుల కాలనీకి చెందిన చౌటూరి కోటమ్మ , భర్త సురేష్ గ్రామంలో కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తమ పిల్లలు దుర్గాప్రసాద్ ఏడవ తరగతి, దీప్తి 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం సొమ్ములు జమకాలేదు. దీంతో స్థానిక సచివాలయానికి వెళ్లి అడిగితే 300 యూనిట్లు పైబడి కరెంటు వాడారని.. అందుకే తల్లికి వందనం డబ్బులు పడలేదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లి లబోదిబోమంది. మాది రెండు గదులు గల చిన్న ఇల్లని, ఇంటా బయట ఎల్ఈడీ బల్బులు రెండు వాడతామని దానికి 300 యూనిట్ల బిల్లు ఎలా వస్తుందని ఆమె వాపోయింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. – కామవరపుకోట -
స్కూళ్లలో పుస్తకాల అమ్మకం అడ్డుకోవాలి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చట్టవిరుద్ధంగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని అడ్డుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. బుధవారం శాంతినగర్‌లోని పలు విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండగా ఎంఈఓ రవిప్రకాష్, హర్ష కుమార్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా లెనిన్ మాట్లాడుతూ మార్కెట్ ధరల కన్నా 150 శాతం అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతూ బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించడాన్ని అవకా శంగా తీసుకున్న విద్యాసంస్థలు తల్లితండ్రుల రక్తాన్ని తాగుతున్నాయని ఒకపక్క అధిక ఫీజులు మరోపక్క పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ట్యూషన్ ఫీజులు ఇలా అనేక రూపాలలో తల్లిదండ్రులను దోచుకు తింటున్నాయన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 28 రోజులకు నగదు రూపేణా స్వామివాకి రూ. 3,68,88,156 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 317 గ్రాముల బంగారం, 7.877 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ. 49 వేలు లభించినట్టు చెప్పారు. యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు ఏలూరు(మెట్రో): యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీ లలో ఏలూరు జిల్లా రెండు బహుమతులు గెలుచుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విజేతలకు అభినందనలు తెలిపారు. యోగా స్కిట్ అండ్ రోల్ ప్లే జూనియర్ కేటగిరీలో, సీనియర్ కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలుచుకున్నారు. సమగ్రశిక్ష సిబ్బంది బదిలీలకు అవకాశం భీమవరం: జిల్లాలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ సిబ్బంది బదిలీలకు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్‌సుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న ఐఇఆర్పీ, పీటీఐ, సీఆర్ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్, సైట్ ఇంజనీర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మేసెంజర్స్, ఆఫీసు సబార్టినేట్స్ తదితర సిబ్బంది రిక్వెస్ట్, సరస్పర ప్రతిపాదనల దరఖాస్తులను ఈనెల 19 నుంచి 21 లోగా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని శ్యామ్‌సుందర్ తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలి భీమవరం: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలు, రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా మిగులు ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోనన్ గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 41 డ్రోన్లను కేటాయించినట్లు చెప్పారు. 709 మంది సన్న, చిన్నకారు రైతులకు రూ.8.99 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలకు రూ.3.84 కోట్లు రాయితీపై పంపిణీ చేశామన్నారు. -
ద్వారకాతిరుమలలో అదుపు తప్పిన కారు
ద్వారకాతిరుమల : శ్రీవారి దర్శనార్థం క్షేత్రానికి నలుగురు యువకులతో వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం దాటిన తరువాత మలుపులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. భీమవరంనకు చెందిన కె.విష్ణు తన అన్న కారును తీసుకుని, అదే పట్టణానికి చెందిన తన స్నేహితుడు మనోజ్‌తో కలసి ద్వారకాతిరుమల క్షేత్రానికి ధైవదర్శనార్థం పయనమయ్యాడు. మార్గ మద్యలో గణపవరం మండలం పిప్పరలో మరో ఇద్దరు స్నేహితులు బండారపు మోహన వెంకట సాయి, వడ్డీల ప్రభాకర్‌ను కారులో ఎక్కించుకున్నాడు. అతి వేగంగా వెళుతున్న కారు ఘటనా స్థలం వద్ద మలుపులోకి వచ్చేసరికి అదుపుతప్పి, రోడ్డు మార్జిన్‌లోని చెట్లలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న టైల్స్ షాపుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు, మోహన్ వెంకట సాయి, ప్రభాకర్లకు తీవ్ర గాయాలు కాగా మనోజ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రులను 108 ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై టి.సుధీర్ పరిశీలించారు. ముగ్గురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలు -
గుండుగొలను వంతెన పనుల్లో కదలిక
భీమడోలు: గోదావరి కాల్వపై గుండుగొలను వద్ద చేపట్టిన వంతెన నిర్మాణ పనుల్లో బుధవారం కదలిక వచ్చింది. వంతెన శ్లాబ్ పనులు పూర్తి కాగా.. నిధులు లేమితో చివరి దశ పనులు నిలిచిపోయాయి. దీంతో కొల్లేరు వాసుల ‘కలల వారధి ఇంకెన్నాళ్లు?’ అనే శీర్షికన ఈనెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. మాజీ ఎంపీపీ శిరిబత్తిన కొండబాబు, గ్రామ పెద్ద గొర్రెల పవన్‌ల ఆధ్వర్యంలో వంతెన ఆఖరి పనుల చేపట్టేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చవుతున్నందున, ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దీంతో వారంతా సుముఖత వ్యక్తం చేయడంతో పనులు పునః ప్రారంభించారు. వంతెనకు ఇరువైపులా జేసీబీ సాయంతో ఎర్ర కంకర వేసి పటిష్టం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యిన తర్వాత భారీ వాహనాల మినహా ఇతర వాహనాలను వంతెనపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. -
చోరీ కేసులో మహిళ అరెస్ట్
ద్వారకాతిరుమల : బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుంచి పర్సును దొంగిలించిన ఒక మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 23.92 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఎస్సై టి.సుధీర్ వివరాలను వెల్లడించారు. పెరవలి మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నాగమణి గతేడాది అక్టోబర్ 26న భీమడోలు బస్టాండులో బస్సు ఎక్కుతుండగా, ఆమె భుజానికి ఉన్న బ్యాగ్‌లోనుంచి పర్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై టి.సుధీర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీనివాస్, సిబ్బంది ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్‌బాబు బృందంగా ఏర్పడి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన జడ్డు ముత్యవతి (ముత్యాలమ్మ) చోరీకి పాల్పడినట్టు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ద్వారకాతిరుమలలోని గరుడ బొమ్మ సెంటర్ వద్ద నిందితురాలు ముత్యవతిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 15.360 గ్రాముల బంగారు గొలుసు, 2.740 గ్రాముల చిన్నపిల్లల బంగారు చుట్లు (జత), 5.820 గ్రాముల బంగారు చెవి హ్యాంగిల్స్(జత)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గతంలో కూడా అనేక దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించినట్టు తమ విచారణలో తేలిందని ఎస్సై సుధీర్ తెలిపారు. రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి.. ఉంగుటూరు: రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ద్వారకాతిరుమల మండలం లైను గోపాలపురంనకు చెందిన కూటమి నాయకుడు చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో తల్లాపురం రోడ్డును ఆనుకుని కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో మెరక పనులు చేస్తున్న నేపథ్యంలో లారీ రివర్స్ చేస్తుండగా లారీ కింద పడి అక్కడ పనిచేస్తున్న గాది గంటయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు. గంటయ్యకు భార్య, వివాహం అయిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కొల్లేరు సమస్యలపై మొర
పిడుగులు.. తస్మాత్ జాగ్రత్త వర్షాకాలం పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. తగు జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు ప్రమాదాన్ని నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 10లో uగురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరుపై కేంద్రం నియమించిన సాధికారత కమిటీ బుధవారం కొల్లేరు వాసులు, నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొల్లేరు ప్రాంతంలోని ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. కేంద్ర సాధికారత కమిటీ గౌరవ సభ్యుడు చంద్రశేఖర్ గోయల్, సభ్య కార్యదర్శులు జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్‌లకు విన్నవించుకున్నారు. జి రాయితీ, డీ–ఫాం భూములు మినహాయించాలి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానికులకు జీవనోపాధితో పాటు భూములపై హక్కులు ఉండేలా చూడాలని వినతి పత్రాలు అందజేశారు. అభయారణ్యంలోని జిరాయితీ డీ–ఫామ్ భూములు మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు మాట్లాడుతూ.. కొల్లేరులో పర్యావరణ, పక్షులను కాపాడేది రైతులేనని, కొల్లేరు అభయారణ్యం నోటిఫికేషన్ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో పరిణామాలపై ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవగాహన కలిగించలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కొల్లేరు ప్రాంతంలోని కాలువలు, డ్రెయిన్లలో చెత్తను తొలగించని కారణంగా, సరైన నిర్వహణ పనులు చేపట్టక ఏటా వరదల సమయంలో కొల్లేరు ప్రాంతం ముంపునకు గురవుతుందన్నారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ప్రజల పౌర హక్కులకు, జీవన విధానాలకు ఎలాంటి భంగం కలగకుండా మానవీయ కోణంతో చూడాలన్నారు. శివాజీ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలున్నారన్నారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదన్నారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనినిబట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారన్నది స్పష్టం అవుతుందన్నారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి కై కలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కమిటీని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలోని 14 వేల ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20 వేల ఎకరాల డీ–ఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలన్నారు. కాంటూర్ పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, అటవీ ప్రిన్సిపాల్ చీఫ్ కన్ఝర్వేటర్ అజయ్ కుమార్ నాయక్, మత్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, డీఎఫ్ఓలు శుభం, విజయ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పిన కారు ద్వారకా తిరుమల వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి, టైల్స్ షాపును ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. 10లో uఅధికారులతో సమీక్ష కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ఉప్పుటేరులోకి కలిసే ఇరిగేషన్ డ్రెయిన్లు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి వచ్చే కాలుష్యం నివారణకు తీసుకుంటున్న చర్యలు, డ్రెయిన్ల డీసిల్టింగ్‌పై నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నాగార్జునరావును ఆదేశించారు. కొల్లేరు వన్యప్రాణి అభ్యయారణ్యంగా ప్రకటించక ముందు కొల్లేరు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్ రోడ్లు, ప్రస్తుతం వాటి నిర్వహణ, కొత్తగా నిర్మించిన, నిర్మించే రోడ్లపై, కొల్లేరు అభయారణ్య పరిధిలో రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్వహణలపై ఉన్న సమస్యలపై నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ రమణమూర్తిని కమిటీ సభ్యులు ఆదేశించారు. అనంతరం ఏలూరులో పారిశుద్ధ్య వ్యర్థాలు, వ్యర్థాల శుద్ధీకరణ సామర్థ్యం, కొల్లేరులో కలిసే ఏలూరు నగరంలోని పారిశుద్ధ్య వ్యర్థాలు వివరాలపై నివేదిక సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. కొల్లేరు పరిధిలో పర్యావరణం, కాలుష్య పరిస్థితులు, చేపల పెంపకానికి వినియోగించే నీరు, తాగునీటి కాలుష్యం, పరిశ్రమల ద్వారా కొల్లేరులోకి వెళ్లే వ్యర్థాల కారణంగా కాలుష్యం తదితర వివరాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కొల్లేరులో చేపల పెంపకం, కాలుష్య నీటిలో ఉత్పత్తియ్యే చేపల వినియోగం కారణంగా అనారోగ్య సమస్యలు, చేపల పెంపకానికి వినియోగించే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వివరాలు, వాటి కారణంగా కొల్లేరులో కలిగే కాలుష్యం తదితర విషయాలపై నివేదిక సమర్పించాలని మత్స్యశాఖ అధికారులను సూచించారు. న్యూస్‌రీల్ సీఈసీ బృందానికి వినతుల వెల్లువ ఏలూరు కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున కొల్లేరు వాసులు భూములపై హక్కులుండేలా చూడాలని విజ్ఞప్తి -
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తాం
పెదవేగి: ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 15 వేల హెక్టార్లలో ఆయిల్ పాం విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. బుధవారం పెదవేగిలోని ఆయిల్ పాం పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర పంటలపై అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ పాం ప్రోత్సహించడం వంటి వాటిపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది 5 వేల నుంచి 15 వేల హెక్టార్ల వరకూ ఆయిల్ పాం సాగు అదనంగా చేపట్టాలని టార్గెట్‌గా నిర్ణయించామన్నారు. పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారం అందరితో పాలుపంచుకోవడంలో జాప్యం కనిపిస్తుందన్నారు. దీనిని పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్రం నుంచి సబ్సిడీలను అందిపుచ్చుకుని మన ప్రాంతంలో మెరుగైన ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఆయిల్ పాం పరిశోదనా కేంద్రం డైరెక్టర్ కంచర్ల సురేష్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పనికి వెళ్లినా.. నమోదు కాని హాజరు
ముసునూరు: ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయులతో బెదిరింపులకు పాల్పడడంతో ఓ ఉపాధి కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన చలపాటి రాణి, ఆమె భర్త తంబి ప్రతి రోజూ ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. కాని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ దేవరపల్లి రవితేజ గ్రామస్థాయి రాజకీయాల నేపథ్యంలో గత రెండు వారాలుగా వీరికి హాజరు వేయడం లేదు. దీంతో వారు ఫీల్డ్ అసిస్టెంట్‌ను హాజరు విషయంపై ప్రశ్నించారు. రెచ్చిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ రోజూ పనికి వచ్చినా మీకు హాజరు వేయనని తెగేసి చెప్పాడు. నిర్ఘాంత పోయిన బాధితులు ఈ విషయంపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భయపడిన ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలోని తన అనుయాయులు, పనిలో పాల్గొనకుండా హాజరు పొందుతున్న మరికొందరిని బాధితుల ఇంటి మీదకు ఉసిగొల్పాడు. దుక్కిపాటి విజయకుమార్, కొడవలి ఆంద్రెయ, రాజేష్, సర్వేశ్వరరావు తదితరులు తంబి ఇంటి వద్ద లేని సమయంలో బాధితుల ఇంటికి వెళ్లి దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా నీ భర్తను చంపేస్తామంటూ రాణిని బెదిరించారు. భయభ్రాంతురాలైన ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను నూజివీడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, అతని అనుయాయుల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై తమకు సమాచారం అందలేదని ఎస్సై ఎం. చిరంజీవి చెప్పారు. ఫీల్ట్ అసిస్టెంటును నిలదీసిన ఉపాధి కూలీలు తన అనుయాయులతో బెదిరింపులకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్ భయభ్రాంతులతో మహిళ ఆత్మహత్యాయత్నం