రోడ్డు ప్రమాదంలోయువకులకు గాయాలు
నరసాపురం రూరల్: విహారయాత్ర ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం నరసాపురం మండలం రుస్తుబాద సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిన్నూరు గ్రామానికి చెందిన తాడి జోషి (20), గొట్టుముక్కల శామ్యూల్ రాజు (25) గాయపడ్డారు. ఈ ఇద్దరు యువకులు తమ బైక్‌పై పేరుపాలెం బీచ్‌ను సందర్శించి తిరిగి వస్తుండగా, రుస్తుంబాద సెవెంత్ డే స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వ్యాన్ వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తాడి జోషి కాలికి తీవ్ర గాయమైంది. మరో యువకుడు శామ్యూల్ రాజు కాలు విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. యువకులున మెరుగైన వైద్యం కోసం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయాలేదని పోలీసులు తెలిపారు.


