breaking news
Eluru District News
-
వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు
పెనుగొండ: వైఎస్సార్సీపీ సర్పంచ్‌లను, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. నియోజకవర్గంలో సర్పంచ్‌లు, వైఎస్సార్ సీపీ నాయకులపై విచారణలు, కేసుల పేరుతో కూటమి నాయకులు చేస్తున్న వేధింపు చర్యలపై తూర్పుపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లను విచారణల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లేనిపోని ఫిర్యాదులు చేసి పార్టీ నాయకులను పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆచంట పంచాయతీలో రెండు కోట్లకు పైగా రికవరీ చేయాలంటూ ఆనాటి అధికారులు రిపోర్టు ఇస్తే అప్పుడు ఏమిచేసారంటూ ప్రశ్నించారు. ఎక్కడా అవినీతికి పాల్పడకపోయినా, వోచర్లు మాయం చేసి వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాలపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మార్కెట్ ధరలు విపరీతంగా ఉండడంతో ప్రభుత్వ ధర కన్నా అధికంగా కొనుగోలు చేశారన్నారు. దీనికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అనువైన చోట్ల కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేశారని చెప్పారు. దీనిని అవినీతిగా చిత్రీకరించడానికి కూటమి నాయకులు యత్నిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలపై ఎక్కడా ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడలేదన్నారు. ఏదోవిధంగా వేధింపులకు గురి చేయడానికి బురద జల్లుతున్నారన్నారు. టీడీపీ హాయాంలోనే మల్లిపూడి లాంటి గ్రామాల్లో ఇళ్ల స్థలాలను ఏటీఎంగా వినియోగించుకొన్నారని విమర్శించారు. వారు చేసిన అవినీతి ఇతరులపై జల్లుతున్నారన్నారు. ఇకపై వేధింపులకు గురి చేస్తే సమష్టిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే సమావేశాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అనాగరిక పదాలు వాడుతున్నారని, హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్రి వాసురెడ్డి, జడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణీ వేణుబాబు, వైస్ ఎంపీపీ తోలేటి శ్రీను, సర్పంచ్‌లు కోట సరోజనీ వెంకటేశ్వరరావు, సుంకర సీతారామ్, జక్కంశెట్టి చంటి, జక్కంశెట్టి శ్రీరాములు, మట్టా కుమారి రాము, బుర్రా రవికుమార్‌లు, పార్టీ ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబులు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనరు చిన్నం ఏడుకొండలు, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, గూడూరి దేవేంద్రుడు, పిల్లి నాగన్న, పార్టీ నాయకులు చిటికెన బాబీ, కొవ్వూరి చిన్న, సూర్యరెడ్డి, నారాయణ రెడ్డి, పోతూముడి రామచంద్రరావు, చింతపల్లి గురుప్రసాద్‌లు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు -
వ్యవసాయ ఉద్యోగులకూ వెన్నుపోటు
ఏలూరు (మెట్రో): రైతులకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు గురించి ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన విషయం. ఆ రైతులకు సేవలు అందించే ఉద్యోగులనూ చంద్రబాబు సర్కారు మోసం చేస్తుంది. మాయమాటలు చెప్పి పనులు చేయించుకుని ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన చందంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వ్యవసాయ ఉద్యోగులను సైతం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 520 రైతు భరోసా కేంద్రాలను రైతులకు సేవలు అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రైతు భరోసా కేంద్రాలను పేరు మార్చిన చంద్రబాబు సర్కారు రైతు సేవాకేంద్రాలుగా నామకరణం చేసింది. పేరు మార్పుపై చూపిన శ్రద్ధ రైతులకు సేవలు అందించడంలో మాత్రం ఏమాత్రం చూపడం లేదు. 520 రైతు సేవా కేంద్రాలలో 520 మంది అగ్రికల్చరల్ అసిస్టెంట్లు, హార్టీకల్చర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో రూ.50 లక్షల వరకూ బకాయి రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనేది గుర్తించేందుకు ఈ క్రాప్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రాప్ పూర్తి చేసిన అసిస్టెంట్లకు సర్వే నెంబరుకు రూ.10 చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు బహిరంగంగా చెప్పింది. సీజన్ల వారీగా సర్వే నెంబరుకు రూ.10 చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. 2 లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు, 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేస్తున్నట్లు ఈ క్రాప్ బుకింగ్‌లో అగ్రి అసిస్టెంట్లు తేల్చారు. సీజన్ పూర్తయినా నేటికీ ఈ సొమ్ములు చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకున్న పాపన పోలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లకు సుమారు రూ.40 లక్షల నుండి రూ.50 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. ఈ–క్రాప్ పూర్తిచేసిన ఉద్యోగులకు పైసా విదల్చని సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిధులు నిల్ ఖర్చులకు ఇస్తామన్న రు.10 వేల హామీ సైతం లేనట్లే జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాలలో ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం సేకరణకు కనీస అవసరాల కోసం రూ.10 వేలు అందిస్తామని చంద్రబాబు సర్కారు సేకరణ ప్రారంభం కాక ముందు చెప్పింది. దీన్ని ఏమాత్రం పట్టించుకోని సర్కారు ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఆయా కేంద్రాల్లో మంచినీరు, ట్రక్షీట్లు, ఇతర పేపర్ వర్కు పూర్తి చేసుకునేందుకు ఈ రూ.10 వేలు అందిస్తున్నామంటూ ప్రకటించింది. ఈ నిధులు ధాన్యం సేకరణ సమయంలో ఎంతో ఉపయోగపడతాయని రైతు సేవా కేంద్రాలు ఉద్యోగులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో చేతి సొమ్ములే ఖర్చు చేసుకుంటూ ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
అరకమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో కుంభకోణం జరిగిందనే కారణంతో సంబంధం లేని ఉద్యోగులను అక్రమంగా సస్పెండ్ చేయడం ఇతర ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తోందని, అధికారులు తక్షణమే స్పందించి అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 10వ రోజుకు చేరాయి. వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. ధర్నాలు చేసినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల్లో నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ టీచర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం అందిస్తామన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏలూరు నగరంలోని 7వ డివిజన్ మున్సిపల్ ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), ఏలూరు మండలంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (లెక్కలు ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం ఉర్దూ), కై కలూరు మండలం ఆటపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం), కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(హిందీ), నూజివీడు మండలం ముక్కోలుపాడు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(జీవ శాస్త్రం) ఖాళీలున్నాయన్నారు. ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లా పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలలోనే వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ చేయాలని జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు సీహెచ్ అమర్ కుమార్, జె.గోపి, సీహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిధిలోని వాహనాలను ఫిట్నెస్ రెన్యువల్ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలలోని ఏటీఎస్ సెంటర్లకు వెళ్లాలని ప్రకటించడం సరైనది కాదన్నారు. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల వెళ్లడం ఇబ్బందులకు గురిచేస్తుందదన్నారు. దెందులూరు: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీపర్రుకు చెందిన ఘంటసాల రంగరాజు (55), ఇందుకూరి సుబ్బారావులు రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కై కలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు ఢీకొట్టింది. రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కై కలూరు మండలం భుజబలపట్నంకు చెందిన సుఽధీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుదాం
ఏలూరు(మెట్రో): విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ పిలుపులినిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశం ఇస్తే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోను తమ ప్రతిభను నిరూపించుకోగలరన్నారు. అన్ని రంగాలలో ప్రోత్సాహం అందించాల్సిన మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా నవంబరు 25న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులను సత్కరించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌కుమార్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ పాల్గొన్నారు. -
దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలి
కై కలూరు: దివ్యాంగులను జాలితో కాకుండా ప్రేమతో ఆదరించాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కై కలూరు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు గోసాల రాజేష్‌ను బుధవారం సన్మానించారు. డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి పాలనలో దివ్యాంగులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో బోయిన సత్యనారాయణ, వడ్లాని పార్థసారథి, ఆకుమర్తి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
చినవెంకన్న హుండీ ఆదాయం రూ. 3.12 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 29 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,12,30,225 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 392 గ్రాముల బంగారం, 5.659 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 500, రూ. 2000 నోట్లు ద్వారా రూ. 26 వేలు వచ్చినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీల 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
తణుకు అర్బన్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మెడికల్ వర్తకుల భవన్లో జరిగిన ఓబీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీసీ ప్రజలు ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15, 16 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఈపనగండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాటపర్తి పోసి బాబు, రాష్ట్ర నాయకులు ముద్దాడ భవాని యాదవ్ మాట్లాడుతూ జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని ఓబీసీలోని అన్ని కులాల విద్యార్థులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఓబీసి మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనుబర్తి లలిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ముద్దాడ భవావీ యాదవ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ మాట్లీఆడారు. ఓబీసీ మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలిగా కటారి మమత, ఉపాధ్యక్షురాలిగా నెలపురి శివ తేజస్విని, సంయుక్త కార్యదర్శిగా కొనకల్ల జయలక్ష్మీ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పుచ్చకాయల శ్యామలక్ష్మి ఎన్నికయ్యారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పెదవేగి: తుపాను వల్ల ధాన్యం దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. బుధవారం పెదవేగి మండలంలోని ముండూరు, వేగివాడ గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుపాను వల్ల ధాన్యం దిగుబడులు తగ్గి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు పది నుంచి 15 బస్తాలకు పైగా దిగుబడి తగ్గిందని చెప్పారు. ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తగ్గిన దిగుబడి మేరకు పంటల బీమా పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన గోనె సంచులు అందించాలని కోరారు. తేమ శాతం వంటి నిబంధనలు సడలించి కల్లాలో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగుంట రామకృష్ణ, తిప్పాపట్ల పురుషోత్తం, చొదిమెళ్ళ యేసు రాజు, మహాలక్ష్ముడు, చొదిమెళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీవోస్ అడహక్ కమిటీ ఏర్పాటు
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎన్జీవోస్ అడహక్ కమిటీ ఏర్పాటులో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కమిటీని ఏర్పాటుచేశారు. స్థానిక త్యాగరాజ భవనంలో జరిగిన కార్యక్రమానికి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా ఉదిసి వెంకట పాండురంగారావు, కన్వీనర్‌గా పోతన సుకుమార్, ఫైనాన్స్ మెంబర్‌గా అల్లూరి శ్రీనివాస రాజు, మెంబర్లుగా ఎంఆర్కే రాజు, దేవాబత్తుల నాగదేవి, ఇంజేటి రమేష్, సుంకర వెంకటేష్‌ను నియమించారు. టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాసులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, ఎన్జీజీవో సంఘం రాష్ట్ర కార్యదర్శులు శివ ప్రసాద్, రామ్ ప్రసాద్, జెఏసి నాయకులు ఆర్ఎస్ హరనాథ్, రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాము శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాటుసారా రహిత జిల్లాగా రూపొందించాలి
ఏలూరు(మెట్రో): నాటు సారా రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం నాటుసారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి (మార్పు) కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారీదారులు నాటుసారా జోలికి వెళ్లకుండా గౌరప్రదమైన మార్గాన్ని ఎంపికచేసుకునేలా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. నాటుసారా తయారీ జోలికి మళ్లీ వెళ్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎ.సి.ప్రభుకుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎకై ్సజ్ శాఖ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ కోసం సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ కోసం అధికారులతో జూమ్ కాన్ఫరెనన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్టుల్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు యం.అచ్యుత అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ రెన్యువల్లో పాత విధానాన్నే కొనసాగించాలి
నూజివీడు: వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీ రాజు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ (సీఐటీయూ) యూనియన్ నాయకులు బుధవారం నూజివీడులోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీ రాజు మాట్లాడుతూ వాహనాల రెన్యువల్‌ను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం అవివేకమన్నారు. వాహనాల ఫిట్నెస్ సహేతుకంగా జరగకపోతే కాలం చెల్లిన, కండీషన్లో లేని వాహనాలు రోడ్లపై సంచరించి ప్రమాదాలు పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. రెన్యువల్ సదుపాయాన్ని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు దాటిన రవాణా వాహనాలకు ఫిట్నెస్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బెనర్జీ, కుమార్, సంసోన్, ధర్మారావు, జోజి, పండు, వివేక్ తదితరరులు పాల్గొన్నారు. -
అంకిత భావంతో పనిచేయాలి
ఏలూరు టౌన్: జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు రోగుల పట్ల ప్రేమతోనూ, మర్యాదగా నడచుకోవాలనీ, అంకిత భావంతో పనిచేయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం అన్నారు. ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. బోధకాలు వ్యాధి నివారణకు రాత్రివేళల్లో రక్త పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషీయన్లు రోగులకు రక్త పరీక్షలు చేసే సమయంలో అశ్రద్ధ చేయకుండా ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలనీ, అప్పుడే రోగికి న్యాయం జరుగుతుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గంగాభవానీ, అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు, పందిరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు. -
నీటి ప్రవాహానికి అడ్డంకులు
● ఎల్‌జీపాడు ఛానల్ మొగ పంట కాల్వపై అక్రమంగా వంతెనలు, అడ్డుకట్టలు ● ముంపు సమస్య ఎదుర్కొంటున్న చెరువుల రైతులు భీమవరం అర్బన్: పంట కాల్వపై అక్రమంగా వంతెనలు నిర్మించడం, తూములతో పూడ్చి వేయడం, గరికట్టులు కట్టడంతో ఎల్జీ పాడు ఛానల్ మొగ నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. దీంతో తుపాను, వర్షాల సమయంలో నీరు ఎగదన్ని పల్లపు ప్రాంతాల్లోని చేపలు, రొయ్యలు చెరువులు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శివారు గ్రామాలు సైతం ముంపు బారిన పడుతున్నాయి. ఛానల్ మొగలో అడ్డంకులు ఎల్‌జీపాడు ఛానల్ ద్వారా సుమారు 8 వేల ఎకరాలకు, చేపలు, రొయ్యల చెరువులకు, వరి పొలాలకు, రక్షిత మంచినీటి చెరువులకు తాగు, సాగు నీరందుతుంది. ఎల్‌జీపాడు ఛానల్ భీమవరం పట్టణం మీదుగా మండలంలోని గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి గ్రామాల మీదుగా సుమారు 22 కిలోమీటర్లు ప్రవహించి బందాల చేడు డ్రెయిన్‌లో కలుస్తుంది. యనమదుర్రు డ్రెయిన్ ఉప్పొంగినప్పుడు ఎల్జీ ఛానల్ నుంచి బందాలచేడు డ్రెయిన్ ద్వారా వరదనీరు ఉప్పుటేరులోకి నీరు ప్రవహిస్తుంది. అయితే కొందరు చేపల చెరువుల రైతులు తమ చెరువులకు తవుడు లారీలు వెళ్లేందుకు వీలుగా పంటకాల్వ మొగలో భారీ తూములు పెట్టి మట్టితో పూడ్చేశారు. అలాగే వంతెనలు, గరికట్టులు సైతం ఏర్పాటు చేశారు. ఇలా ఛానల్ వెంట పలువురు అడ్డంకులు ఏర్పాటు చేయడంతో నీటి ప్రవాహం సక్రమంగా సాగడం లేదు. అడుగడుగునా అడ్డంకులే.. దొంగపిండి పరిధిలో ఉన్న బోనకాల దిబ్బ నుంచి ఎల్జీ పాడు ఛానల్ బందాల చేడులో కలిసే వరకు సుమారు కిలోమీటరులో 2 వంతెనలు, 2 అక్రమ గరికట్టులు, 4 తూములతో అడ్డంకులు ఉన్నాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు దిగువకు లాగక గూట్లపాడు నుంచి దొంగపిండి వరకు మెయిన్ రోడ్డు మునిగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి గ్రామాల్లో పల్లపు ప్రాంతాలలో చేపలు, రొయ్యల చెరువులు మునిగిపోయి రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు పంటకాల్వ మొగలో అక్రమ వంతెనలు, గరికట్లు, తూములు పూడ్చి అడ్డంకులు పెట్టినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి తీరుపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటకాల్వలను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు మొగలో అడ్డంకులు తొలగించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. సమస్యను పరిష్కరిస్తాం ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ ప్రసాదరాజును వివరణ కోరగా తమ సిబ్బందిని పంపి అక్రమ వంతెనలు, తూములు పెట్టి అడ్డుకట్ట వేసిన వారికి నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
మేఘాకు ఎక్స్‌లెన్స్ అవార్డు
పోలవరం రూరల్: పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ ధ్రువపత్రాన్ని సాధించింది. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఒక్క పని దినం కూడా వృథా కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేసినందుకు ఏపీజెన్కో ఈ ధ్రువపత్రాన్ని ఎంఈఐఎల్కు అందచేసింది. ఎంఈఐఎల్ అసోసియేట్ మేనేజర్ ప్రగడ నంద నాగ కృష్ణ బుధవారం జెన్కో ఎస్ఈ కే రామభద్రరాజు నుంచి ఈ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు జల విద్యుత్ కేంద్రం ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ప్రసేన్ జిత్ మజుందార్ , భద్రతా విభాగం ఇన్చార్జి సబ్యసాచి రానా తెలిపారు. -
అప్పులు తాళలేక పురుగు మందు తాగి..
భీమడోలు: అప్పులు బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి మృతి చెందాడు. కోడూరుపాడుకు చెందిన అంబటి యాకోబు (35) వ్యవసాయ కూలీ. తాగుడు, ఇతర వ్యసనాలకు బానిసై శక్తికి మించిన అప్పులు చేశాడు. ఈ విషయంలో భార్య,భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య రాణి భర్తకు నచ్చచెప్పినా ఆమె మాటలను పట్టించుకోలేదు. గత నెల 6వ తేదీన పురుగు మందు సేవించి ఉంగుటూరులోని బంధువులు ఇంటికి వెళ్లాడు. అపస్మారక స్థితిలో ఉండడంతో ఆతడ్ని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి యాకోబు మృతి చెందాడు. యాకోబు భార్య రాణి ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చందన బ్రదర్స్ 25వ వార్షికోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని చందన బ్రదర్స్ వస్త్ర దుకాణం 25వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులతో కళకళ లాడింది. చందన బ్రదర్స్ మేనేజర్లు ఏ.జగదీష్, ఎం.దుర్గా ప్రసాద్ మాట్లా డుతూ తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా రూ.2500 విలువ గల వస్త్రాల కొనుగోలు చేసిన వారికి ఒక వెండి నాణెం ఉచితంగా ఇస్తున్నామన్నారు. అలాగే రూ.1,500 విలువ గల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్, టాప్స్, మెన్స్ టీషర్ట్స్, సూరత్ శారీ ఏదైనా ఒకటి రూ.25కే ఇస్తున్నామన్నారు. 92.5 సిల్వర్ జ్యూయలరీపై 25 శాతం తగ్గింపు ఉందని, ఇవే కాకుండా మహిళలు, పురుషులు, పిల్లల వస్త్రాలపై కూడా అనేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు. పెదవేగి: కొప్పులవారిగూడెంలో కోడి కత్తులు తయారు చేస్తున్నారన్న స్థావరంపై పెదవేగి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో బుధవారం రాత్రి దాడి చేశారు. కత్తులు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 500 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కత్తులు తయారు చేసే రెండు యంత్రాలను కూడా సీజ్ చేశారు. -
దొంగ నోట్ల డిపాజిట్ కేసులో ఐదుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏటీఎంలో దొంగనోట్లు పెట్టి ఒక మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను ఏలూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గతంలో ఏలూరు రూరల్ మండలం చాటపర్రులోని కెనరా బ్యాంకు ఆవరణలో ఉన్న ఏటీఎంలో దొంగనోట్లు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించారు. బ్యాంకు అధికారులు నోట్లను గుర్తించి సొమ్ము ఏ సమయంలో జమ చేశారో సీసీ ఫుటేజీతో గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుడివాకలంక గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఏలూరు తూర్పువీధిలో నివాసం ఉంటోన్న సైదు సతీష్, చాటపర్రు ప్రాంతానికి చెందిన కొలుసు జయంత్, ఏలూరు తూర్పువీధికి చెందిన వేమాల శివ, వైఎస్సార్ కాలనీకి చెందిన గొరిపర్తి నాగబాబు, తణుకు రూరల్ మండలం గరగపర్రుకు చెందిన చెన్నా వెంకట సూర్యనారాయణను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. -
సికిలే స్కూల్ వద్ద ఉద్రిక్తత
● భవానీమాల ధరించిన విద్యార్థినిని అనుమతించడం లేదంటూ ఆరోపణ ● భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల ఆందోళన నరసాపురం: స్థానిక జేసికిలే స్కూల్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలిక భవానీ మాల ధరించి స్కూల్‌కు రావడంతో యాజమాన్యం అడ్డుకుందని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భరజరగదళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఆఫీసు రూమ్ వద్దకు చేరుకుని భజనలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ సుచరితను సస్పెండ్ చేయాలని, యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టౌన్ సీఐ యాదగిరి, తహసీల్దార్ అయితం సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులు, యాజమాన్యంతో మాట్లాడి సమస్యను సర్ధుబాటు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ సికిలే పెర్సిపాల్ మాట్లాడుతూ మాల ధరించి వచ్చిన విద్యార్థి తండ్రిని పిలిచి ఎన్నిరోజులు మాలతో వస్తుందో లెటర్రాసి ఇమ్మని, అన్ని రోజులకు పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అయినా కూడా గొడవ చేశారన్నారు. మరోవైపు ఈ స్కూల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
భక్తాంజనేయ గ్రామోత్సవం
వీరవాసరం: నందమూరిగరువు శ్రీ రామ భక్తాంజనేయ స్వామి ఆలయ 60వ వార్షికోత్సవ, హనుమద్ వ్రత మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.45 గంటలకు ఉత్సవాలకు కొప్పినీడి శ్రీనివాసరావు దంపతులు కలశస్థాపన నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. అమ్మవార్ల వేషాలు, బుట్ట బొమ్మల ప్రదర్శన, అయోధ్య రామయ్య ప్రదర్శనలు, అఘోరా నృత్యాలు వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. బాణసంచా కాల్పులు అలరించాయి. ఏలూరు రూరల్: ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకూ కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో వైద్య కళాశాలల సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ పోటీలు జరగనున్నాయని ఆశ్రం మెడికల్ కళాశాల పీడీ వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టు ఎంపిక పోటీలను మంగళవారం ఆశ్రం కళాశాల ఆవరణలో చేపట్టామన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఈ త్రిమూర్తి, కె వెంకటేశ్వరరావు, వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు 14 మంది జట్టు సభ్యలతో పాటు నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లతో ఎంపిక పక్రియ పూర్తి చేశారన్నారు. ఆశ్రం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేబ్రోలు, సీఈఓ కె హనుమంతురావు, వైస్ ప్రిన్సిపాల్ వి శివప్రబోద్ తదితరులు పరిశీలించారని వివరించారు. కొయ్యలగూడెం: గవరవరం గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం గ్రామంలో రోడ్డు మీద వెళుతున్న వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారం వ్యవధిలో సుమారు 50 మంది పిచ్చికుక్క కాటుకు గురయ్యారని స్థానికులు తెలిపారు. పంచాయతీ వెంటనే స్పందించి పిచ్చికుక్కను పట్టుకోవడానికి సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
గోతులమయం.. జర భద్రం
● ప్రమాదకరంగా 516డి జాతీయ రహదారి ● గోతులతో నిత్యం ప్రమాదాల బారిన వాహనదారులు జంగారెడ్డిగూడెం: జాతీయ ప్రధాన రహదారి 516డి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోడ్డుపై ఏర్పడిన గోతులతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతన్నారు. కొందరు ఈ గోతుల కారణంగా మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు దగ్గర దారి రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ దేవరపల్లి నుంచి తల్లాడ వరకు జాతీయ ప్రధాన రహదారి 516డి విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు దగ్గరి దారి కావడంతో ఈ రహదారిపై నిత్యం అత్యధిక వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఈ రహదారి ఉంది. అయితే ఈ రహదారిపై గోతుల కారణంగా ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఉన్న పెద్ద గోతిలో ద్విచక్రవాహనం పడటంతో, వాహనం వెనుక కూర్చొన్న జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెంకు చెందిన వ్యక్తి నిమ్మకూరి కొండయ్య(27) ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కొండయ్యను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం మగదిక్కు లేకుండా పోయింది. రాత్రి సమయాల్లో.. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి సమయాల్లో చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు పై ఉన్న గోతులు ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్ కారణంగా కనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారి వెంబడి జీలుగుమిల్లి, రమణక్కపేట, దర్భగూడెం, తాడువాయి, వేగవరం, జంగారెడ్డిగూడెం మెట్ట, నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదంలో వాహనదారులు గాయపడటమో, మృత్యువాతకు గురవడమో జరుగుతోంది. గోతుల కారణంగా వాహనాలు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుపై పడుతున్న గోతులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జాతీయ ప్రధాన రహదారి 516డిపై పడుతున్న గోతులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. గోతుల కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతలకు చర్యలు చేపట్టాలి – ఆర్.హరి, జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల మరమ్మతులు నిర్వహించే వరకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో గోతులు తెలిసేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. – పి.శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం -
భళా.. శిల్పకళ
చిన్నతిరుపతి దివ్య క్షేత్రంలో నూతన అనివేటి మండపంలో శిల్పకళా వైభవం ఉట్టిపడుతోంది. దేవతామూర్తుల విగ్రహాలతో శోభిల్లుతోంది. దేవస్థానం రూ.12 కోట్ల వ్యయంతో ఏడాది క్రితం చేపట్టిని అనివేటి మండపం (జంటగోపురాల వరకు) విస్తరణ పనులు ఇటీవల పూర్తి కాగా, రంగులు వేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. మండప ముఖ ద్వారంలో నిర్మించిన రాజ భటులు, గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి, ఏనుగుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే మండప సీలింగ్‌పై దశావతారాలను తీర్చిదిద్దారు. మండపం చుట్టూ పలు దేవతామూర్తుల విగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా నిర్మించారు. భక్తులు ఈ మండపంలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం శుక్ర మౌఢ్యమి కావడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాతే ఈ మండప ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. – ద్వారకాతిరుమలఅనివేటి మండపం సీలింగ్‌పై దశావతారాలు -
మిర్చి సాగు చేయలేం
లింగపాలెం: మెట్ట ప్రాంతంలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది పంట నేటికీ గోడౌన్లలో మగ్గుతోంది. మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సరైన ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. దీంతో ఈ సంవత్సరం మిర్చి సాగు విస్తీర్ణం గతేడాది కంటే సగానికి పైగానే తగ్గింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మిర్చి సాగు చేయలేమని రైతులు ఖరాకండీగా చెబుతుండడం గమనార్హం. మిర్చి పంటకు ప్రసిద్ధి మిర్చి తోటల సాగుకు జిల్లాలోనే మెట్ట ప్రాంతమైన లింగపాలెం మండలం ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి మిర్చి నారును కొనుగోలు చేసుకువెళతారు. ఎకరం మిర్చి సాగు వేయటానికి 9 వేల నుంచి 10 వేల వరకు మిర్చి మొక్కలు అవసరం కాగా, పెట్టుబడులు రూ.లక్షా యాభై వేలు నుంచి రూ.2 లక్షల వరకు అవుతాయని రైతులు అంటున్నారు. లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం, కొత్తపల్లి, శింగగూడెం, కొణిజర్ల, భోగోలు గ్రామాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు. ఎకరం పొలంలో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇక్కడ పండించిన పచ్చిమిర్చి కాయలను బొంబాయి, ఢిల్లి, పూనే వంటి ఇతర రాష్ట్రాలకు వ్యాపారస్తులు ఎగుమతులు చేస్తారు. పచ్చిమిర్చి 60 కేజీల బస్తా వచ్చి అప్పటి రేట్లును బట్టి రూ 1,500 నుంచి రూ.2 వేల వరకు ధర పలుకుతుంది. కొందరు రైతులు పచ్చికాయను కోసి అమ్మకాలు చేయగా మరికొందరు పండుకు ఆపి ఎండిమిర్చికి ఉంచుతారు. సగానికి పైగా తగ్గిన విస్తీర్ణం గతేడాది సరైన ధర లేకపోవడంతో కొందరు రైతులు పండించిన మిర్చిని నేటికీ విక్రయించలేదు. దీంతో ఈ ఏడాది లింగపాలెం మండలంలో సైతం రైతులు మిర్చి తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. గతేడాది మండలంలో సుమారు 635 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 300 ఎకరాల వరకు మాత్రమే రైతులు మిర్చిసాగు చేసినట్లు అధికారుల అంచనా. ధర్మాజిగూడెం ఏరియాలో గతేడాది సుమారు 137 ఎకరాల్లో సాగుచేస్తే, ఈ ఏడాది కేవలం 85 ఎకరాల వరకు సాగుచేశారు. నాణ్యతను బట్టి ఈ ఏడాది మిర్చి క్వింటా రూ.13 నుంచి రూ.14 వేల లోపు ఉందని, కనీసం రూ 20 వేలు పలికితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో షాపుల్లో ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి మిర్చి పంటను సాగు చేస్తున్నాం. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, పైరుకు తెగుళ్లు సోకినా మిర్చి సాగులో నష్టాలు తప్పవు. గతేడాది సరైన ధర కూడా రాలేదు. రైతుల పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రభుత్వం గిట్టుపాటు ధర కల్పిస్తేనే మిర్చి సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారు. – సీహెచ్ మారేశ్వరరావు, రైతు, కొణిజర్ల గత రెండేళ్లగా మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. దీంతో మిర్చి సాగుపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. నేను గతంలో 6 ఎకరాలు సాగు చేసేవాడిని. ప్రస్తుతం రెండు ఎకరాలు సాగు చేశా. ఎకరం కౌలుకు రూ 2.5 లక్షలు పెట్టుబడులు అవుతున్నాయి. ఎరువులు, కూలీలు, పురుగు మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. – ఎస్ సాంబయ్య, కౌలు రైతు, ధర్మాజీగూడెం మెట్ట రైతుల అనాసక్తి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై నిరుత్సాహం గోడౌన్లలో మగ్గుతున్న గతేడాది పంట అప్పుల పాలైన రైతులు -
టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా..
నరసాపురం: రోడ్డు దాటుతున్న వ్యక్తి మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై జయలక్ష్మి తెలిపిన వివరాలు ఇవి. మొగల్తూరు మండలం కాళీపట్నం పల్లెపాలెంకు చెందిన రామాని గోపాలకృష్ణ(51) ఫైనాన్స్ చెల్లింపు నిమిత్తం ఉదయం నరసాపురం వచ్చాడు. మిస్సమ్మ ఆసుపత్రి వద్ద టీ తాగేందుకు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా, మొగల్తూరు వైపు వెళుతున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు గాయాలైన గోపాలకృష్ణను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై చెప్పారు. పాలకోడేరు: మైగ్రేన్ తలనొప్పి భరించలేని స్థితిలో మంచినీళ్లు అనుకుని పొరబాటున పురుగుల మందు తాగి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే మోగల్లు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి దుర్గారావు (43) భీమవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తరచూ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీ రాత్రి తీవ్రమైన తలనొప్పి రాగా చీకటిలో మంచినీళ్ల బాటిల్ అనుకుని పురుగుల మందు బాటిల్ మూత తీసుకుని తాగాడు. దీంతో కడుపునొప్పి ఎక్కువై కేకలు వేయగా భార్య రాధ వెంటనే భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 1వ తేదీన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం అందడంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. ద్వారకాతిరుమల: క్షేత్రంలోని బైపాస్ రోడ్డు మార్జిన్లో డ్రెయినేజీపై కాంక్రీటు దిమ్మలు పోసే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక కొత్త బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కామవరపుకోట వైపునకు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ సెంటర్ నుంచి సూపర్ బజార్ వరకు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మీదగానే ప్రయాణిస్తాయి. పాత రోడ్డు ధ్వంసం కావడంతో గతేడాది అక్టోబర్ 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.40 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేశారు. అయితే మార్జిన్‌లోని డ్రెయినేజీకంటే రోడ్డును ఎత్తుగా నిర్మించడంతో, వాహనాలు ఎదురూ బదురు అయినప్పుడు అవి మార్జిన్ దిగే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై అక్టోబర్ 7న ‘సాక్షి’లో ‘మార్జిన్ దిగితే.. అంతే’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు డ్రెయినేజీపై కాంక్రీటు దిమ్మలను నిర్మించే పనులు చేపట్టారు. దాంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: లాడ్జిలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమవరం ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణంలోని నాచువారి సెంటర్‌కు చెందిన అడబా శివ అలియాస్ పైరు శివ(40) ప్రస్తుతం గొల్లలకోడేరు సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. రొయ్యల వ్యాపారం చేస్తూ ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. సోమవారం లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం సాయంత్రం లాడ్జి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్సై బీవై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నూజివీడు: పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థినులకు క్రీడా కోటాలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. పట్టణానికి చెందిన బేతాళ ప్రభుదీపిక, షేక్ ఆశ్రా, బుర్రె ప్రణవి క్రీడా కోటా కింద ట్రిపుల్ ఐటీలో సీటు కోసం ఈ ఏడాది జూన్ నెలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాప్ నిర్లక్ష్యం కారణంగా వీరికి సీట్లు రాలేదు. దీనిపై వీరు బాస్కెట్‌బాల్ కోచ్ సాయంతో తమకు జరిగిన అన్యాయాన్ని శాప్ ఎండీ ఎస్ భరణి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎండీ పునర్విచారణ చేసి ట్రిపుల్ ఐటీకి సీట్లు ఇవ్వమని లెటర్ పంపడంతో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ముగ్గురికి అడ్మిషన్లు ఇచ్చారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థిని వాడవలస దివ్యశ్రీ (8వ తరగతి), జాతీయస్థాయి జూనియర్ రగ్బీ, విద్యార్థి కంచర్ల రామచైతన్య (9వ తరగతి) జూనియర్స్‌లో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గన్నవరం, కొవ్వూరులో జరిగిన నేషనల్ క్వాలిఫైయింగ్ పోటీల్లో వీరు ప్రతిభ కనబర్చారు. మంగళవారం హైస్కూల్లో జరిగిన అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ విద్యార్థులను, పీడీలు భూదేవి కామేశ్వరిని అభినందించారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ, ఫిజికల్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు. ద్వారకాతిరుమల: కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ మీదకు దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి తన కారులో భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి, రోడ్డు మధ్యలోని డివైడర్ మీదకు దూసుకెళ్లింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో, ప్రమాదం జరిగిన సమయంలో ఏవిధమైన వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అలాగే కారులో ఉన్న వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. -
ఆందోళన ఆవరించే
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర ధాన్యాగారంగా ఖ్యాతిగాంచిన ఉమ్మడి పశ్చిమలో వరి సాగు రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. రెండు సీజన్లలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసి లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధిస్తారు. అనేక తుపానులు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులను అన్నింటిని తట్టుకుని అప్పులు తెచ్చి మరీ వరిని సాగు చేస్తూ ఉన్న రైతులు జిల్లావ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. అలాంటి రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లా పర్యటనలో వరి ఒక పంటే పండించాలంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీలు మొదలుకొని ఎలాంటి పరిహారాలు లేకపోయినా ఎంతటి నష్టం వచ్చినా సంప్రదాయ సాగుగా వరిని జిల్లాలో సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీ సాగులలో ప్రధానమైన పంట వరి. ఏలూరు జిల్లాలో ఖరీఫ్‌లో వరిసాగు చేస్తుండగా రబీలో వరితో పాటు వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాగు 2.10 లక్షల ఎకరాల్లో ఉండగా ఉద్యానపంటలు 2.90 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అదే విధంగా రబీ సీజన్లో 2.80 లక్షల ఎకరాలకు పైచిలుకు ఉద్యాన పంటలు ఉండగా 2.25 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు వంటి పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. గతేడాది రబీ(2023–24)లో ధాన్యం ఉత్పత్తి 2.40 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి కాగా, 2024–25లో 3.53 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. దీనికి సిద్ధంగా 4.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లల్లో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ధాన్యాన్ని వదిలేయాలి అనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదా వరి జిల్లాలో ఖరీఫ్‌లో మొత్తం సాగు 3.65 లక్షల ఎకరాల్లో చేస్తుండగా దీనిలో 2.41 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. రబీలో 1.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా 2.20 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లో కేవలం వరి సాగు 4.60 లక్షల ఎకరాలకు పైబడి సాగు చేస్తూ లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తూ సుమారు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉమ్మడి జిల్లా రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి చేస్తున్న సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ధాన్యాగారంగా పేరు పొందింది. అయితే ప్రస్తుతం వరి వద్దు.. ఇతర పంటల ముద్దు అనే ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వరి ఒక్క పంటకే పరిమితం చేయమన్న సీఎం వ్యాఖ్యలపై కలకలం ధాన్యాగారంగా పశ్చిమకు ఖ్యాతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో సాగు డెల్టా, మెట్టల్లోనూ 60 శాతానికిపైగా వరి పంట ఖరీఫ్, రబీ కలిపి ఏటా 15 లక్షల టన్నులకు పైగా దిగుబడి సోమవారం ఉంగుటూరు నియోజకవర్గం నల్లమాడులో పెన్షన్ పంపిణీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తానని మాట్లాడి.. వరి పంట వేస్తే కొనేవారే ఉండరు. రైతులందరూ గుర్తు పెట్టుకోవాలి. ఒక పంట తప్పదు కాబట్టి వరి వేద్దాం. మరో పంట మారుద్దాం..మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకోవాలన్న వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. వందేళ్ళకు పైబడి వరిసాగు జరిగే జిల్లాలో పంట మార్పుపై అది కూడా సీఎం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. -
ప్రతిపక్షంగా రాజీలేని పోరాటం
కై కలూరు: ప్రతిపక్షంగా రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలపై వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో మొదటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అధ్యక్షతన మండవల్లి మండలం పెరికేగూడెం డాల్పిన్ ఫ్యాక్టరీలో మంగళవారం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం, నియోజకవర్గాలో పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై సమన్వయకమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కోటి సంతకాల కాగితాలను ఈ నెలలోనే గవర్నర్‌కు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో కలిసి అందిస్తామన్నారు. నూతన ఏడాది నుంచి ప్రతి నియోజకవర్గంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం పదేపదే కలుసుందాం అని చెప్పడంలోనే వారి డొల్లతనం బయట పడుతుందన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ రూ.2000 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. మరో రూ.600 కోట్లు ఫైనాన్స్ అటాచ్ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ సమన్వయకర్తలు ఒక మెట్టు దిగి అందరినీ కలుపుకుని వెళ్ళాలన్నారు. అధికారంలో ఉన్నప్పటికంటే వైఎస్ జగన్‌ను ఇప్పుడు మరింతగా ప్రజలు అభిమానిస్తున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు త్వరగా పార్టీ కమిటీల నియామకాలు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ సమష్టిగా కృషి చేస్తే వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్నారు. ప్రజల్లో అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై ఎంతో అభిమానం ఉందన్నారు. రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ పార్టీ విజయంలో అనుబంధ కమిటీల పాత్ర గొప్పదన్నారు. కమిటీలలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ ప్రసంగిస్తూ 18 నెలల పాలనలో చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గుర్నాథరావు మాట్లాడుతూ కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. పార్టీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. నూజివీడు, ఏలూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మామిళ్ళపల్లి జయప్రకాష్, తెల్లం బాలరాజు, కంభం విజయరాజు, ఈసీ సభ్యులు గోపాలరావు పార్టీ కార్యక్రమాలను వివరించారు. ఏకపక్షంగా కేసులు మాఫీ చేసుకున్న ఏకై క సీఎం చంద్రబాబే దేశ రాజకీయాల్లో తనపై ఉన్న కేసులను ఏకపక్షంగా మాఫీ చేసుకున్న ఏకై క సీఎం చంద్రబాబునాయుడేనని, ఆయనకు నిజంగా దమ్ముంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సమావేశంలో బొత్స మాట్లాడుతూ చంద్రబాబు సాక్షులను, అధికారులను బెదిరించి కేసులను క్లోజ్ చేయించుకున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగంలోని చిన్న చిన్న సాంకేతిక మార్గాలను తనకు అనుకూలంగా మలచుకుని చంద్రబాబు ఆయనపై ఉన్న మద్యం దోపిడీ కేసు క్లోజ్ చేయించుకున్నారని మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్, అవసరమైతే కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. సీఎం తీరు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని దుయ్యబట్టారు. బాబు ధనవంతుల కోసం ఆలోచిస్తాడు చంద్రబాబు ధనవంతుల కోసం తప్ప పేదల కోసం ఎన్నడూ ఆలోచించడని బొత్స మండిపడ్డారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్ల అప్పు తెచ్చిన చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించడానికి రూ.6,000 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం కుదేలైందని, అప్పుల్లో మాత్రం టాప్‌లో ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తుపానులకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలన 18 నెలల్లో లైంగిక దాడులు, కిడ్నాప్‌లు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనతో పోల్చితే క్రైం రేటు ఎంతో పెరిగిందన్నారు. చంద్రబాబుకు పరిపాలనపై పట్టులేదన్నారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్లపాటు కలిసి ఉంటామనడం భ్రమ అని ఎద్దేవా చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు రాజీనామాలు చేసిన వారి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. కొల్లేరు సమస్యను మానవీయ కోణంలో చూస్తున్నామని, అక్కడ పేదలకు న్యాయం చేయాలని పార్టీ సైతం భావిస్తోందని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నాయకుల్లో ఉత్సాహం నింపిన జిల్లా పార్టీ సమావేశం తరలివచ్చిన నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు -
భారీగా నాయకుల హాజరు
జిల్లా మొట్టమొదటి సమన్వయ సమావేశానికి జిల్లా నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, పార్టీ ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు చేబోయిన వీర్రాజు, నౌడు వెంకటరమణ, చిట్టూరి మురళీకృష్ణ, రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, చందన ఉమామహేశ్వరరావు, సయ్యపురాజు గుర్రాజు, అయినాల బ్రహ్మాజీ, కూసంపూడి కనకదుర్గ రాణి, గంటా సంధ్య, బలే నాగరాజు, గరికముక్కు జాన్ విక్టర్, మొట్రు యేసుబాబు, దుగ్గిరాల నాగేశ్వరరావు, చిలుకూరి జ్ఞానరెడ్డి, శింగంశెట్టి రాము, బోయిన రామరాజు, బేతపూడి ఏసేబురాజు, తిరుమాని రమేష్, శ్రీనివాసరావు, మంతెన రామరాజు, సీవీఆర్.చౌదరీ, మేకా లక్ష్మణరావు, నీలిమా, ముంగర సంజీవ్‌కుమార్, పంజా రామారావు, పాము రవికుమార్, సమయం అంజి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాయామ ఉపాధ్యాయులను కోచ్‌లుగా నియమిస్తాం
ఏలూరు రూరల్: ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమితులైన క్రీడాకారుల సేవలను ఉపయోగించుకుంటామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. మంగళవారం ఆయన అల్లూరి సీతారామరాజు స్టేడియం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వ్యాయామ ఉపాద్యాయులను డిప్యూటేషన్‌పై స్టేడియంలో తాత్కాలిక కోచ్‌లుగా నియమించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. 2026లో రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటుచేసి క్రీడాకారులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏలూరు జిల్లాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసి గ్రామీణ బాలబాలికలకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు(మెట్రో): ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రుల పర్యటన సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞపులను పరిశీలించి పరిష్కరించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ప్రజల వ్యక్తిగత సమస్యలపై నిబంధనలు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యతతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, జిల్లా సీఈఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పెదవేగి: పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని, నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పెదవేగిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన తగదన్నారు. నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా పెదవేగిలోని పాత ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో నూతన కర్మాగారం నిర్మించేందుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోళ్ళ అర్జునరావు, మెతుకుమెల్లి రాంబాబు, కూచిపూడి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని కై కలూరు, నగరంలోని పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తోన్న ఉత్తమ సిబ్బందికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సిబ్బందికి ఎస్పీ నగదు బహుమతులు అందించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని రవాణా వాహనాలకు ఫిట్నెస్ చేయించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్‌ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల ఫిట్నెస్ కోసం మచిలీపట్టణం, రాజమండ్రి, అమలాపురం లేదా తమకు దగ్గరలో ఉన్న ఏటీఎస్ సెంటర్లలో వాహన ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. -
ర్యాగింగ్ ఘటనలో 16 మంది సస్పెన్షన్
హైవేలో డీజిల్ దందా అక్రమ డీజిల్ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం శివారు హైవే ప్రాంతం నిలయంగా మారింది. 2లో uఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వివాదంపై ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి సీరియస్ అయ్యారు. జూనియర్ వైద్య విద్యార్థుల ఫిర్యాదుపై తక్షణమే చర్యలు చేపట్టారు. 16 మంది సీనియర్ వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్ వ్యవహారంపై విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు. కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇటీవల ఒక వైద్య విద్యార్థి అధిక మోతాదులో మందుబిళ్ళలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థి సైతం ర్యాగింగ్‌తోనే ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. వీటన్నిపైనా సమగ్రమైన విచారణ చేస్తామని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రిన్సిపల్ హెచ్చరించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు తత్కాల్లో ఫీజులు చెల్లించే అవకాశం అభ్యర్థులకు కల్పించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా ఉరుసు ఉత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని మెయిన్ బజార్ బిర్లాభవన సెంటర్లో ఉన్న (ఫకీర్ తకియా) ఖాదర్ జండా హజరత్ ఖాదర్‌వలీ గంజ్–ఏ–సవాయి మహాత్ముని 369వ ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా నిషాన ముబారక్ గోమ్ ఆవిష్కరణ, అనంతరం ఫాతెహా ఖానీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఖుర్ఆన్ ఖానీ అనంతరం దీపారాధన కార్యక్రమంతో ప్రధాన ఫాతెహా ఖానీ కార్యక్రమాన్ని ఏలూరు ప్రభుత్వ ఖాజీ షేక్ హుస్సేన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా వంశపారంపర్య ముజావర్లు మహమ్మద్ అబ్దుల్ రహీమ్, మహమ్మద్ ఇబ్రాహీమ్, షేక్ మస్తాన్, సిరాజ్, కరీముల్లా, ఆలీ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడికి..
జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఒక మత్య్సకారుడు మృతిచెందాడు. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడువాయి గ్రామానికి చెందిన నబిగిరి వెంకటేశ్వరరావు (62) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం చేపల వేట కోసం కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లాడు. చేపలు పడుతుండగా డోనె అదుపు తప్పి ప్రమాదవశాత్తూ జలాశయంలో మునిగి మృతిచెందాడు. కుటుంబసభ్యుల సమాచారంతో తోటి మత్స్యకారులు పడవల సహాయంతో వెళ్లిచూడగా చేపల వలలో చిక్కికున్న వెంకటేశ్వరరావు మృతదేహం కనిపించింది. దీంతో వారు జంగారెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. దీనిపై మృతుడి వెంకటేశ్వరరావు భార్య గంగారత్నం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యథేచ్ఛగా హైవేలో డీజిల్ దందా
కొయ్యలగూడెం: అక్రమ డీజిల్ దందాకు కేరాఫ్ అడ్రస్‌గా అచ్యుతాపురం శివారు హైవే ప్రాంతం నిలయంగా మారింది. ఏలూరు జిల్లా సరిహద్దు, తూర్పుగోదావరి జిల్లా ప్రారంభం ప్రాంతంలో కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి రాకపోకలు సాగించే లారీల నుంచి డీజిల్‌ని కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేటు కంపెనీలకు చెందిన లారీలను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్లు క్లీనర్లను అక్రమ డీజిల్ విక్రయదారులు తమ దందా కొనసాగిస్తున్నారు. ఆయిల్ బంకుల్లో కంటే రూ.15 నుంచి రూ.20 మేర లారీ సిబ్బంది నుంచి తక్కువకు కొనుగోలు చేస్తారు. అనంతరం అదే డీజిల్ ని ఆయిల్ బంకులలోని ధర కంటే రూ.పది నుంచి రూ.15 తక్కువకు ఇతర వాహనదారులకు అక్రమ విక్రయిస్తూ డీజిల్ దందాదారులు లబ్ధి పొందుతున్నారు. ప్రతిరోజు రమారమి 200 లీటర్ల నుంచి 300 లీటర్లు మేర డీజిల్ విక్రయిస్తున్నారు. దీంతో లారీలు నిలిచిపోతుండడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ కలుగుతోందని వాహనదారులు గగ్గోలు చెందుతున్నారు. రెండేళ్లుగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దాడులు నిర్వహించిన సమయాల్లో డీజిల్ దందా దారులు భారీ మొత్తంలో మామూళ్లు సమర్పిస్తుండడంతో అంతా గుంభనంగా సాగిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ప్రమాదవశాత్తూ పురుగు మందు తాగి..
పెదవేగి: మంచినీళ్లు అనుకొని పురుగు మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మేడికొండ పవన్‌కుమార్ (32) గత నవంబర్ 27న పొలంలో మందు కొట్టే ప్రక్రియలో మంచినీరు అనుకొని ప్రమాదవశాత్తు పురుగుల మందు తాగేశాడు. విషయం గమనించిన స్థానికులు హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం గుడివాడ తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 1న పవన్ మృతిచెందాడు. శవపంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ మేరకు పవన్ తండ్రి మేడికొండ వెంకటకృష్ణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
నూజివీడు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి
నూజివీడు: జిల్లాలో ఎక్కడా లేనివిధంగా గత ప్రభుత్వం నూజివీడులోని ఏరియా ఆస్పత్రిలో రూ.24 కోట్లతో ఆధునిక భవనాన్ని నిర్మించి వైద్య సేవలకు అందుబాటులోకి తీసుకువస్తే దానిని నిర్వహించడం కూడా ప్రస్తుత పాలకులకు చేతకావడం లేదని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం తాను ఆస్పత్రికి వెళ్లి పరిశీలించగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. నూతన భవన నిర్మాణం అందుబాటులోకి రావడంతో ఏరియా పెరిగిందని, ఈ పరిస్థితుల్లో గతం నుంచి పనిచేస్తున్న 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం పెరిగిందన్నారు. మరో 20 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. జిల్లాలో ఏలూరు జిల్లా ఆస్పత్రి మెడికల్ కాలేజీగా మారిన నేపథ్యంలో నూజివీడు ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఈ మేరకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. 300 బెడ్లు ఏర్పాటు చేయడానికి బెడ్లు, 8 ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వార్డు ఉన్నందున పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 17 మంది వైద్యులే ఉన్నారని, ఇంకా పలు విభాగాలకు స్పెషలిస్టు వైద్యులు లేరన్నారు. జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే పలువురు స్పెషలిస్టు వైద్యుల నియామకం జరుగుతుందన్నారు. అలాగే ఆస్పత్రి ప్రాంగణంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, కంకర తేలి గుంతలమయం కావడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రాంగణంలోని రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే పాలకులకు ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలన్నారు. దీనిలో భాగంగానే గత ప్రభుత్వంలో ఏరియా ఆస్పత్రిలో నూతన భవనంతో పాటు పట్టణంలో మరో రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాలు, గ్రామగ్రామానా విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు భవనాలను నిర్మించామన్నారు. -
కనీస వేతనాల అమలులో అన్యాయం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయం చేశారని మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ట్రిబ్యునల్ తీర్పులు, కౌన్సిల్ తీర్మానాల అమలు కోసం స్కూల్స్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేశారు. సోమయ్య మాట్లాడుతూ నెలంతా పనిచేస్తే ఒక స్కూల్ స్వీపర్‌కు రూ.4 వేలు, స్కూల్ శానిటేషన్ వర్కర్‌కు రూ.6 వేలు ఇవ్వడం దారుణమన్నా రు. స్కూలు స్వీపర్లు, శానిటేషన్ వర్కర్ల శ్రమను గుర్తించి ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాలు అ మలు చేసి ఫుల్ టైం వర్కర్‌గా గుర్తించాలని, జీఓ 7 ప్రకారం రూ.15,000 కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఈనెల 8,9, జనవరి 5, 6, 7 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బాలు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినతి పత్రం, సమ్మె నోటీసులను అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు అందించారు. -
పర్సంటేజీల బాగోతం
నరసాపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం మున్సి పాలిటీకి బదిలీపై వచ్చిన ముఖ్య అధికారి వ్యవహార తీరు మొదటి నుంచీ వివాదంగా మారింది. 1956లో నరసాపురం మున్సిపాలిటీ ఏర్పడగా, మున్సిపాలిటీ చరిత్రలో ఓ ముఖ్య అధికారి చుట్టూ మున్సిపల్ రాజకీయం, భారీ అవినీతి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఏరికోరి ఆయన్ను ఇక్కడకు తీసుకువచ్చినట్టు ప్రచారం ఉంది. మున్సిపాలిటీకి వైఎస్సార్సీపీ ప్రా తినిధ్యం వహిస్తోంది. అయితే తాను ఎమ్మెల్యే మనిషినని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని సదరు అధికారి బహిరంగంగానే అవినీతి సాగి స్తూ.. వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు మున్సిపల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సదరు అధికారి ముడుపుల రూపంలో వసూలు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని ప్రతినెలా ఎమ్మెల్యే కార్యాలయానికి చేర వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి వ్యవహారాలతో చెడ్డ పేరు వస్తుందని కొందరు అనుచరులు ప్రస్తావించినా ఎమ్మెల్యే పట్టించుకోని పరిస్థితి. దీంతో ముడుపుల ఆరోపణలు నిజమేనేమోనని నియోజకవర్గంలో జనసేన వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బాక్స్ టెండర్ల పనుల్లో గోల్మాల్ సదరు అధికారి కనుసన్నల్లో ఏడాదిగా మున్సిపాలి టీ జరుగుతున్న బాక్స్ టెండర్ల పనుల్లో భారీగా గో ల్మాల్ జరిగినట్టు తేటతెల్లమైంది. గతేడాది టన్ను రూ.35 వేలకు కొనుగోలు చేసిన చీపుర్లను ఇటీవల రూ.65 వేల చొప్పున 5 టన్నులను చైర్పర్సన్కుగానీ, కౌన్సిలర్లకు గానీ తెలియకుండా కొనుగోలు చేసి బిల్లు చేసేశారు. సదరు ఫిరాయింపు కౌన్సిలర్ల బినామీల ద్వారా ఈ కొనుగోలు జరిగినట్టుగా తెలుస్తోంది. చెట్లు నరికి అక్రమంగా తరలించి సొమ్ములు చేసుకున్నారు. ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినవి ఈ రెండు అంశాలైనా కూడా ఏడాది కాలంలో బాక్స్ టెండర్ల ద్వారా సుమారు రూ.2.90 లక్షల ప్రజాధనం లూటీ జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గాడి తప్పిన పాలన : నరసాపురంలో డంపింగ్ యార్డ్ సమస్యతో 15 రోజులుగా పట్టణంలో చెత్త సేకరణ జరగడం లేదు. రోడ్డు మొత్తం చెత్తకుప్పలుగా మారి, దుర్గంధంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోని దుస్థితి. మరోవైపు ముఖ్య అధికారి వ్యవహార తీరుతో మున్సిపల్ పాలన మొత్తం గాడి తప్పింది. పాలకవర్గం వైఎస్సార్సీపీ కావడంతో ప్రజాసంక్షేమాన్ని పక్కన పెట్టి కక్షపూరిత వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయాలు పట్టణంలో వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పీఎఫ్ రుణం కోసం ఫైల్‌ను ముఖ్య అధికారి వద్దకు తీసుకువెళ్లగా.. రూ.2 లక్షల రుణంలో 10 శాతం కమీషన్ రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా గత్యంతరం లేక సదరు ఉద్యోగి ఇచ్చిన పరిస్థితి. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల సమయంలో వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సెలవు కావాలని అభ్యర్థించగా.. డబ్బులు డిమాండ్ చేయడంతో ఒక్కొక్కరూ రూ.20 వేలు సమ ర్పించుకున్నారు. పట్టణంలో రూ.లక్ష ల్లో ఆస్తి బకాయి ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ య జ మాని వద్ద రూ.1,500 తీసుకుని నిబంధనలు మీరి పారిశుద్ధ్య సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి ఇచ్చారు. పట్టణంలో బిల్డింగ్ ప్లాన్‌కు అప్రూవల్ రావాలంటే నిర్మాణ వ్యయాన్ని బట్టి పర్సంటేజీ ఇవ్వాల్సిందే. లేదంటే సదరు అధికారి చాంబర్ చుట్టూ నెలల తరబడి తిరగాల్సిందే. పట్టణంలో పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు బిల్లులు కావాలంటే 10 శాతం వాటా ఇవ్వాల్సిందే. ప్రజలు ఏదైనా సంతకం కోసం కార్యాల యానికి వచ్చినా టెన్ పర్సెంట్ వాటా ఇవ్వ నిదే పని జరగని దుస్థితి. కనీసం రూ.500 అయినా ఇవ్వకుంటే సంతకం అసంభవం. చివరకు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయాలన్నా ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి.రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన ఇద్దరు ఫిరా యింపు కౌన్సిలర్లు ముందుండి నడిపిస్తుండ గా, ముఖ్య అధికారి మొత్తం వ్య వహారం సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవ ల మోంథా తుపానుతో పట్టణంలో నేలకొరిగిన చెట్లను అక్రమంగా తరలించడం, గోదావరి గట్టున లేని చెత్తను ఎత్తినట్టు చూపించి రూ.లక్షల్లో బిల్లులు చేసుకోవడం, పట్టణంలో ఎక్కడ కట్టడాలు జరుగుతున్నా.. భవన యజమానులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, అక్రమ లేఅవుట్లకు ఆసరాగా నిలవడం, చివరకు డ్రెయిన్లలో సిల్టు తీయకుండా పనులు చేసినట్టు బిల్లులు దండుకోవడం ఇలా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి కోకొల్లలు. చేయి తడపాల్సిందే ఎమ్మెల్యే మనిషినంటూ అవినీతి తాండవం ఏ ఫైల్ కదలాలన్నా 10 శాతం ఇవ్వాల్సిందే.. సొంత శాఖ ఉద్యోగులపైనా కనికరం లేదు నరసాపురం మున్సిపాలిటీలో ముఖ్య అధికారి లీలలు ఇద్దరు ఫిరాయింపు కౌన్సిలర్లతో వ్యవహారాలు ? చెట్లు అక్రమ నరికివేత, బాక్స్ టెండర్ల కుంభకోణం అంశాలతో మున్సిపల్ సాధారణ సమావేశం అజెండా ఆమోదం కాకుండా రెండుసార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. -
ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే
గణపవరం: కూటమి ప్రభుత్వానికి మరో పదిహేనేళ్లు అవకాశం ఇవ్వాలని ఉంగుటూరు సభలో ము ఖ్యమంత్రి చంద్రబాబు కోరడంపై ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసి ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజలను వంచించినందుకు మరో పదిహేనేళ్లు అవకాశం ఇవ్వాలా అని ప్రశ్నించారు. మహి ళలు, రైతులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను కూటమి పార్టీలు మోసం చేశాయన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి రోడ్లను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత సంక్రాంతి నాటికే రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయని చెప్పిన మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, నిలువెత్తు గోతులతో భయపెడుతున్నాయన్నారు. ఉంగుటూరుకు ఏం చేశారో చెప్పకుండా.. ఉంగుటూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఎన్నో అబద్ధాలు వల్లెవేశారని వాసుబాబు అన్నారు. ఉంగుటూరు అభివృద్ధికి ఏంచేస్తారో చెప్పకుండా వైఎస్సార్సీపీని ప్రజల్లో దోషిగా చూపడానికి ప్రాధాన్యమిచ్చారన్నారు. కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన 17 నెలల కాలం గంజాయిని అరికట్టడానికి సరిపోదా అని ప్రశ్నించారు. గంజాయి స్మగ్లింగ్‌లో మహిళా డాన్లు కూడా ఉన్నారని, ఇందుకు గత వైఎస్సార్సీపీ పాలనే కారణమంటూ చంద్రబాబు అనడాన్ని వాసుబాబు ఖండించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కోనసీమ పర్యటనలో రైతులతో మాట్లాడు తూ ఇక్కడ కొబ్బరిచెట్లు పాడవడం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందా అని ప్రశ్నించగా.. లేదు అంతకుముందు ప్రభుత్వంలోనే ఉందని రైతుల చెప్పడంతో ఆయన అభాసుపాలయ్యారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ఏ సమస్య వచ్చినా గత జగన్ పాలనే కారణమంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వీరి మాటలు నమ్మే అమాయకులు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. జగన్ పర్యటనలకు పోటెత్తుతున్న జన సందోహమే కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తోందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేవాసుబాబు ధ్వజం -
మూడు సంస్థలతో నిట్ ఒప్పందం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏపి నిట్) సోమవారం మూడు ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైద్రాబాద్‌కు చెందిన మిల్టన్ సోనిక్ డిఫెన్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.వి.రమణరావు మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెంచేలా పలు కంపెనీలు, విద్యాసంస్ధలతో అవగాహనా ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. సంస్థలో చదువుకుంటున్న విద్యార్థలు పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాంగణ ఎంపికలు, ప్రాజెక్టుల ఎంపికల అభివృద్ధి నిమిత్తం ఇప్పటి వరకు నిట్ 35 కంపెనీలలో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. కార్యక్రమంలో టాటా ప్రతినిధి టీవీ సూర్యప్రకాశరావు, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, మిల్టన్ ప్రతినిధి బి.మహేందర్‌తో పాటు నిట్ అధికారులు పాల్గొన్నారు. వీరవాసరం : ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు కాలవలోకి జారి తిరగబడిపోయింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ రాజనాల పెద్దిరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాలేపల్లి నుంచి వీరవాసరం రైస్ మిల్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ధాన్యం బస్తాలు నీట మునిగి ముద్దయ్యాయి. చుట్టుపక్క రైతులంతా ట్రాక్టర్‌ను బయటకు లాగేందుకు సాయపడ్డారు. ధాన్యం మిల్లుకు పంపగా తడిసిపోయాయని ఆరబెట్టుకుని రావాలని మిల్లర్లు పేర్కొనడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీరవాసరం: డిసెంబర్ 2, 3, 4న మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీరవాసరంలో జరగాల్సిన 69వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర అంతర జిల్లాల సాఫ్ట్‌బాల్, అండర్ 17 బాల బాలికల టోర్నమెంట్ కమ్ స్టేట్ టీం సెలక్షన్‌న్స్ తుపాను కారణంగా వాయిదా వేశామని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు డి.సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు తెలిపారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) జిల్లా నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికై ంది. నూతన అధ్యక్షుడిగా గుడిమెల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా గుండె వెంకటరమణ ఎన్నికయ్యారు. కార్యవర్గంలో పలువురిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు బి.మనోజ్ కుమార్, పరిశీలకులుగా రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూపతి రామారావు వ్యవహరించారు. -
కొల్లేరు సమస్యలు కొలిక్కి వచ్చేనా?
● స్పష్టమైన హామీ ఇవ్వని సీఎం చంద్రబాబు ● నిరాశగా వెనుదిరిగిన కొల్లేరు ప్రజలు, నాయకులు ● నల్లమాడులో ప్రజావేదిక కార్యక్రమం కై కలూరు: కొల్లేరు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ వస్తుందని భావించిన కొల్లేరు ప్రజలకు నిరాశ ఎదురైంది. సోమ వారం ఉంగుటూరు మండలం నల్లమాడులో సీఎం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) సభ్యులు జి.భానుమతి, రమన్లాల్భట్, సునీల్ లిమాయే, చంద్రప్రకాష్ గోయల్ ఈ ఏడాది జూన్ 17, 18వ తేదీల్లో కొల్లేరులో పర్యటించారు. ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక సీఈసీకి ఇప్పటికీ చేరలేదు. మరోపక్క కొల్లేరులో ‘జీరో’ పాయింట్ సైజు చేపల పెంపకానికి సన్నాహాలు జరుగుతున్నా యి. ఫారెస్టు అధికారులు అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో కొల్లేరు ప్రజలకు నిరాశే మిగిలింది. కొల్లేరులో సాగు జరిగేనా.. కొల్లేరు అభయారణ్యం 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలుగా నిర్ణయించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 31,120 ఎకరాల్లోని అక్రమ చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎక రాల డీ–ఫాం భూములు ఉన్నాయి. వీటిని మినహాయించాలనే ప్రధాన డిమాండ్ కొల్లేరు ప్రజల్లో వినిపిస్తుంది. ఆటవీశాఖ ఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాల్లో అక్రమ చేపల సాగు కొల్లేరు అభయారణ్యంలో ఉందని నివేదిక ఇచ్చింది. వీటిలో 9,500 ఎకరాల చెరువులకు గండ్లు పెట్టామని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఉంగుటూరు మండల సమీపంలో కొల్లేరులో వరిసాగు చేసే రైతులను ఈ ఏడాది అటవీ అధికారులు అనుమతించలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుప్రీంకోర్టు ని బంధనలు అతిక్రమించవద్దని అటవీ సిబ్బంది నచ్చజెప్పి వారిని పంపించి వేశారు. జీరో పాయింట్ సాగు కోసం.. కొల్లేరులో శీతాకాలంలో ‘జీరో పాయింట్’ చేపల సాగు చేస్తారు. కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసం చేసిన చెరువుల్లో వీటి సాగు అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ పర్యటించిన నేపథ్యంలో అక్రమ సాగు చేస్తే కేసు మరింత జఠిలమవుతుందని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబుతో చెప్పించి అయిన సరే జీరో పాయింట్ సాగునకు అనుమతించాలని కొల్లేరు పరీవాహక నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అక్ర మ సాగు జరిగితే వీటినే సాక్షాలుగా సుప్రీంకోర్టుకు అందించడానికి పర్యవరణవేత్తలు సిద్ధంగా ఉన్నా రు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో అటవీశాఖ ఎలా వ్యవహరిస్తుందనే అంశం చర్చగా మారింది. సమస్యలపై సీఎం ఆరా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు స్టాల్స్ పరిశీలన సందర్భంగా కొల్లేరు అంశాన్ని కై కలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావనకు తీసుకువచ్చారు. కొల్లేరు సమస్య ఏ మైందని చంద్రబాబు అడిగారు. ఈనెల 4న సీఈసీ సభ్యుడు చంద్రప్రకాష్ గోయల్‌ను కలిసి సుప్రీంకోర్టులో నివేదిక అందిస్తామని కామినేని చెప్పారు. నివేదిక ఇచ్చిన తర్వాత తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. ఒకేసారి కొల్లేరు సమస్య పరిష్కారమయ్యేలా ప్రణాళికతో వెళ్లాలని సీఎం అన్నారు. -
వెచ్చటి నేస్తంతో ఉపాధి
● ఊరూరా శీతాకాలపు దుస్తుల విక్రయం ● మధ్యప్రదేశ్ యువకుల జీవనోపాధి భీమడోలు: చలికాలంలో వెచ్చటి నేస్తాలు రగ్గులు, స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు. వీటిని విక్రయించేందుకు మధ్యప్రదేశ్ యువకులు వందల కిలోమీటర్ల దాటి వస్తుంటారు. శీతాకాలంలో ఊరూరా ఉన్ని వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేసి రగ్గులు, స్వెట్టర్లు, మంకీ కా్య్ప్ల విక్రయంతో జీవనోపాధి పొందుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జీన్ జిల్లా మిలేనియాకు చెందిన యువకులు ప్రతి ఏటా చలి కాలంలో మూడో నెలల పాటు భీమడోలు జంక్షన్లో ప్రాంతంలో చిన్న టెంట్లు వేసుకుని ఉన్ని దుస్తులు విక్రయిస్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత తమ సొంత ఊర్లకు తిరిగి వెళుతుంటారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్ని దుస్తులను విక్రయించేందుకు తమ ప్రాంతం నుంచి వందలాది మంది వస్తుంటారని చెబుతున్నారు. చలి పెరిగితే.. వ్యాపారం జోష్ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నంతసేపు తమ వ్యాపారం జోష్‌గా సాగుతుందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. కొద్దిపాటు సొమ్ముతో స్టాకు తెచ్చుకుని వ్యాపారం చేస్తుంటామని, డిమాండ్‌ను బట్టి అదనపు స్టాక్ కోసం ఆర్దర్లు పెట్టడం జరుగుతుందని చెబుతున్నారు. స్విట్టర్లు రూ.350 నుంచి రూ.500, మంకీ క్యాంపులు రూ.100 నుంచి రూ.150, దుప్పట్లు ధర రూ.600కు పైగా విక్రయిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చలి ఇప్పుడిప్పుడే పెరుగుతుందని, దీంతో ఇంకా వ్యాపారాలు ఊపందుకోలేదని చెబుతున్నారు. -
విషాద ఛాయలు
గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందడంతో అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. 8లో uకై కలూరు: వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు కైకలూరులో ని ర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సోమవారం తెలిపారు. సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏలూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్, జిల్లాలో ని యోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య ప్ర ధాన నాయకులు హాజరవుతారన్నారు. పార్టీ విధి విధానాలపై చర్చ జరుగుతుందన్నారు. భీమవరం: స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులు ఆదేశించారు. పలు ప్రాంతాలకు చెందిన 13 మంది ఫిర్యాదులు అందించారు. -
ఇసుక అక్రమ రవాణా
బుట్టాయగూడెం: రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకపక్క సరిహద్దుల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ లారీలను సీజ్ చేస్తున్నప్పటికీ మరో పక్క అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం సత్తుపల్లిలో, దమ్మపేటలో, జీలుగుమిల్లిలో ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న లారీలను పట్టుకుని పోలీసులు సీజ్ చేసిన విషయం పాఠకులకు విధితమే. మళ్లీ ఆదివారం రాత్రి ఏపీ నుంచి తెలంగాణ వైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను జీలుగుమిల్లి పోలీసులు దర్భగూడెం సమీపంలో పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలు పట్టుబడినట్టు ఆయన తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. -
కొరగుంటపాలెంలో అగ్నిప్రమాదం
ముదినేపల్లి రూరల్: మండలంలోని కొరగుంటపాలెంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 5 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన పరసా నాగేశ్వరరావు, మాధవరావుకు చెందిన గడ్డివాముకి మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై కై కలూరు అగ్రిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిస్థాయిలో అదుపుచేసి పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చేశారు. సుమారు రూ.80వేల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా. భీమవరం: మద్యం మత్తులో తల్లిని కుమారుడు గాయపరచిన ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. శీలం మంగాయమ్మ కుమారుడు ముత్యాలు మద్యం తాగి వాగ్వాదానికి దిగారు. కుమారుడు తల్లిని తలపై కొట్టి గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ బీవై కిరణ్‌కుమార్ చెప్పారు. -
మాక్ అసెంబ్లీ విద్యార్థులకు అభినందన
భీమవరం (ప్రకాశంచౌక్): భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నవంబర్ 26న మాక్ అసెంబ్లీ నిర్వహణలో ప్రజా ప్రతినిధులుగా ప్రతిభ చూపిన జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులను కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క విద్యార్థి ప్రజాప్రతినిధిగా హాజరై అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థులకు చట్టసభలలో బిల్లులు ఎలా పాస్ చేస్తారు, జీరో అవర్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా ఆమోదిస్తారు తదితర విషయాలను అవగాహన చేసుకోవడానికి వీలు కలిగిందన్నారు. వీరికి మొమెంటో, మెడల్ బహుకరించి కలెక్టర్ అభినందించారు. -
గంగానమ్మ జాతరకు 200 ఏళ్ల చరిత్ర
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో గంగానమ్మవారి జాతరకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని, తరతరాలుగా వస్తున్న ఆచారమిదని వక్తలు అన్నారు. నగరానికి చెందిన హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎంహెచ్ఏ హాలులో అట్టహాసంగా జరుగుతున్న జాతరపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేటి తరం జాతర నియమావళిపై సంపూర్ణ విశ్వాసం, అవగాహనతో భావితరాలకు జాతర ప్రాశస్త్యాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఉత్సాహంగా, కృతజ్ఞతాపూర్వకంగా జాతరలో పాల్గొనాలని కోరారు. తూర్పు వీధి, పడమర వీధి, దక్షిణపు వీధి, పవరుపేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేట, తంగెళ్లమూడి కొలుపుల కమిటీల ప్రతినిధులు జాతర విశేషాలను పంచుకున్నారు. తొలుత గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవార్లను కళావేదికపై కొలువు తీర్చారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రా సోమలింగేశ్వరరావు, కేవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇరదల ముద్దుకృష్ణ, మజ్జి సూర్యకాంతరావు, వేణుగోపాల్ లునాని, వీవీ బాలకృష్ణారావు, జవ్వాజీ మోహన్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
గోసంరక్షణ శాలలో మహా శాంతి హోమం
ద్వారకాతిరుమల: శ్రీవారి గోసంరక్షణశాలలో సోమవారం ఉదయం అర్చకులు మహాశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. క్షేత్రంలో ఇటీవల వరుస గో మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మృత్యుదోష పరిహారార్ధం, ఇకపై గో మరణాలు జరగకుండా ఉండేందుకు ఈ హోమాన్ని జరిపారు. ముందుగా అర్చకులు గోసంరక్షణశాలలో యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి, పసుపు, కుంకుమలతో తీర్చిదిద్దారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛరణల నడుమ విష్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనను నిర్వహించారు. అనంతరం వాస్తుపూజ చేసి, హోమకుండంలో అగ్నిప్రతిష్ఠాపన జరిపి, మహాశాంతి హోమాన్ని చేశారు. ఆఖరిలో అర్చకులు, ఆగమ విద్యార్థులు వేద మంత్రోచ్ఛరణలతో మహా పూర్ణాహుతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
విశాఖ ఉక్కుపై ద్వంద్వ వైఖరి తగదు
పెనుగొండ : విశాఖ ఉక్కుపై ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి, నేడు కార్మికులను, విశాఖ ఉక్కును అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కర్రి నాగేశ్వరరావు విమర్శించారు. సీఐటీయూ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ సోమవారం జరిగిన సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కుకు సొంత గని కేటాయించాలంటూ బీరాలు పలికారని, నేడు తెల్ల ఏనుగు అంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఇలానే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖ పట్నంలో జరగబోయే అఖిల భారత సీఐటియూ 18వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కోశాధికారి పీవీ ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపారాధన
ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ షష్ఠి ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సహస్ర దీపారాధన, సహస్ర లింగార్చన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఉత్సవకమిటీ సభ్యులు స్వామివారికి పూజలు నిర్వహించి సహస్ర దీపారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిసర గ్రామాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై తిలకించారు. ఉదయం వేళ స్వామి, అమ్మవార్లకు లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకం కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు తోలేటీ వీరభద్రశర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా సహాయ కమిషనర్, ఉత్సవకమిటీ సభ్యులు పర్యవేక్షణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న సుబ్రహ్మణ్య హవనం నిర్వహిస్తామని సహాయ కమిషనర్ తెలిపారు. ఈ హవనంలో పాల్గొనే భక్తులు రూ.1516 రుసుంగా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ హవనంలో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని కోరారు. -
‘తల్లి’డిల్లి.. కొడుకు చితికి నిప్పు పెట్టి..
పాలకొల్లు సెంట్రల్: తల్లంటే పేగు బంధం.. తనువును చీల్చుకుని బిడ్డలకు ప్రాణం పోస్తుంది.. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది.. వారి ఎదుగుదలలో ఆనందం పొందుతుంది.. అలాంటి మాతృమూర్తి వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మరణంతో తల్లడిల్లిపోయింది.. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడి చితికి నిప్పు పెట్టింది. సాధారణంగా కొడుకులు లేని తల్లిదండ్రులకు కుమార్తెలు తలకొరివి పెట్టడం చూస్తుంటాం. అయితే అయినవాళ్లు ఎవరూ లేకపోవడంతో కుమారుడికి కన్నతల్లే తలకొరివి పెట్టిన సంఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. పాలకొల్లులోని బంగారు వారి చెరువుగట్టుకు చెందిన వల్లూరి సత్యవాణి వృద్ధురాలు. ఆమె భర్త 18 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కుమార్తె బ్రెయిన్‌కి సంబంధిత వ్యాధితో పదేళ్ల క్రితం మృతిచెందింది. కుమారుడు శ్రీనివాస్‌కు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్న తల్లి సత్య వాణి వద్దే శ్రీనివాస్ ఉంటున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయినవాళ్లు ఎవరూ లేకపోవడతో తల్లి సత్యవాణి, పినతల్లి ఇద్దరూ కలిసి హిందూ శ్మశాన వాటికకు కైలాస రథంపై తీసుకువచ్చి కర్మకాండలు నిర్వహించారు. తల్లి సత్యవాణి తలకొరివి పెట్టగా.. బొండా చంద్రకుమార్ అనే వ్యక్తి ఆర్థికంగా వారికి సహకారం అందించారు. కొందరు స్థానికులు శ్మశాన వాటిక వద్దకు వచ్చి సంతాపం తెలిపారు. భీమవరం(ప్రకాశం చౌక్): మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లు వేగిరపర్చాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. భీమవరం మున్సిపాలిటీలో సోమవారం ఆయ న సమీక్షించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను వ సూలు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, ఈ–ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై సమీక్షించారు. మున్సిపాలిటీ పరిధిలో పన్ను, పన్నేతర వసూళ్లను సకాలంలో పూర్తిచేసి ఆదాయం పెంచాలన్నారు. పారిశుద్ధ్య పురోగతిపై సమీక్షించి పట్టణంలో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటిని నూరుశాతం ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్, పురమిత్ర ఫిర్యాదులను సకాలంలో సరైన పద్ధతులు పరిష్కరించాలన్నారు. క మిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆర్ఐలు, మున్సిపల్ హెల్త్ అధికారి పాల్గొన్నారు. నరసాపురం రూరల్: తుపాను పేరు చెబితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికంది వచ్చే సమయంలో తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులతో పంట నష్టపోకుండా ఒబ్బిడి చేసుకుంటున్నారు. సోమవారం పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లోని ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడం, కోసిన వరిని ఒబ్బిడి చేసుకునే దృశ్యాలే కనిపించాయి. ఈ ఏడాది సాగుచేపట్టిన రైతులు ఆరంభంలో అధిక వర్షాలతో ఇబ్బందులు పడ్డారు. పంట చివరి దశలో వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి వీస్తున్న చలిగాలులు, వర్షాలకు యంత్రాలతో కోతలు కోసి ఒబ్బిడి చేసిన ధాన్యాన్ని ఒడ్డుకు చేరుస్తున్నారు. నరసాపురం నియోజకవర్గవ్యాప్తంగా వరిసాగు చేసిన రైతులు తుపాను నుంచి గట్టెక్కించాలని దేవుడికి మొక్కుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం కూడా తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. నరసాపురం, మొగల్తూరు తహసీల్దార్లు తీర ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు జాగ్రత్తలు సూచించారు. -
మత్స్య కళాశాల తరగతులు ప్రారంభం
నరసాపురం రూరల్: మత్స్య కళాశాల విద్యార్థులు ఇంతవరకూ సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డారని, ఇక మీదట ఇబ్బందులు తొలగినట్లేనని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. సోమవారం నరసాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని అద్దె భవనంలో తరగతులు ప్రారంభమయ్యాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ, అనుబంధంగా ఆక్వా కళాశాలను మంజూరు చేశారు. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో నరసాపురం మండలంలోని సరిపల్లి లిఖితపూడి గ్రామాల మధ్య ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం ఆక్వా కళాశాల తరగతులను అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని తుపాను షెల్టర్ భవనంలో ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. మూడో బ్యాచ్ రావడం, విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకుని తరగతులను అక్కడ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆక్వా యూనివర్సిటీ ఓఎస్డీ సుగుణ, అసోసియేట్ డీన్ కె.మాధవి, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యాసంస్థల చైర్మన్ కొండవీటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెంలో విషాద ఛాయలు
యలమంచిలి: దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం గ్రామాలకు చెందిన 15 మంది ఆదివారం గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అంగుళూరు వద్ద ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అబ్బిరాజుపాలెం పంచాయతీ బండి వారి గట్టుకు చెందిన ఆదివారం కాండ్రేకుల నరసింహమూర్తి (40) మరణించగా, చికిత్స పొందుతూ దొడ్డిపట్ల గ్రామానికి చెందిన గెద్దాడ రాజేష్ (40) కూడా మరణించాడు. ఇద్దరి మృతదేహాలు సోమవారం అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల గ్రామాలకు చేరుకున్నాయి. మృతదేహాలను సోమవారం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంథి పవన్‌కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రమాదంలో వారిలో ఇద్దరు మరణించగా మిగతా వారికి రాజమండ్రిలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. స్వల్పంగా గాయపడిన మరొక ముగ్గురికి చికిత్స అందించి ఇంటికి పంపినట్లు వివరించారు. వాహన డ్రైవర్ కడిమి శ్రీనివాస్ దేవీపట్నం పోలీస్‌స్టేషన్ విచారణలో ఉన్నారన్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని వివరించారు. -
ర్యాపిడ్ చెస్ విజేతగా లక్ష్మణరావు
ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో ఏలూరు చెస్ ఆర్బిటర్ డి.లక్ష్మణరావు విజేతగా నిలిచాడు. సోమవారం ఏలూరు శివారు వట్లూరు సిద్ధార్ధ క్వెస్ట్ స్కూల్లో చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాలకు చెందిన చెస్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో లక్ష్మణరావు ప్రథమస్థానం, జి.అభిషేక్ రెండో, జె.అక్షిత్ మూడో స్థానం సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో స్కూల్ డైరక్టర్ కె.సిద్దార్ధ, అనసూయ చెస్ అకాడమీ డైరక్టర్ ఎం.కిషోర్,తదితరులు సర్టిఫికెట్లు, మొమెంటోలు అందజేశారు. పెదవేగి: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పెదవేగి మండలం రామసింగవరంలో సోమవారం జరిగింది. పెదవేగి మండలం కూచిపూడికి చెందిన దిమ్మిటి చిన్నరాటాలు (36) సోమవారం పామాయిల్ తోటలో గెలలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు ఘటన స్థలంలోనే అతను మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారని రూరల్ ఎస్సై జేవీఎన్. ప్రసాద్ తెలిపారు. మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన అడపా వెంకటేష్‌పై అడపా నారాయణ, అడపా విష్ణు 2018లో దాడి చేశారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా నేరం రుజువు కావడంతో నారాయణ, విష్ణుకు 15 నెలలు జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారని ఎస్సై తెలిపారు. -
అన్నదానం జమాఖర్చులపై రగడ
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసంలో అన్నదానానికి భక్తులు విరాళాలు అందించారు. ఆ అన్నదానం నిమిత్తం వచ్చిన ఆదాయం, ఖర్చులను కరపత్రాన్ని విడుదల చేశారు. విరాళాల ద్వారా రూ.10,91,500, నగదు, ఫోన్‌పేల ద్వారా రూ.17,49,937, చిల్లరగా డొనేషన్లు రూ.71,930 వచ్చారు. ఖాళీ పెరుగు డబ్బాలు, నూనె డబ్బాలు, సంచులు విక్రయించగా వచ్చిన ఆదాయం రూ.23 వేల కలిపి మొత్తం ఆదాయం రూ.29,36,367 వచ్చింది. మొత్తం ఖర్చు రూ.30,36,367గా తేల్చారు. ఉచిత అన్నదానం పెట్టడం వల్ల వచ్చిన నష్టం రూ.99,931 అని కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో భక్తులకు పెట్టే అన్నదానం వల్ల సుమారు లక్ష నష్టం వచ్చిందని పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాంతో దేవస్థానం గ్రూపులో పెట్టిన జమాఖర్చుల పత్రాన్ని తొలగించారు. ఈ జమాఖర్చులతో అనేక అనుమానాలు తలెత్తాయి. కిరాణా సరుకులు హోల్‌సేల్‌గా కాకుండా రిటైల్ షాపులో ఎలా కొన్నారు? వాటర్ ప్యాకెట్లు, బియ్యం హోల్‌సేల్‌గా కొన్నారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. రసీదు పుస్తకాలకు రూ.8655 ఖర్చు రాసారని, బ్యానర్లు నిమిత్తం రూ. 42 వేలు ఖర్చు చేసినట్లు రాసారాని, అంత ఖర్చవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. భక్తులే వడ్డన చేశారని, మరి సప్లయర్స్ ఖర్చు ఎందుకయ్యిందని అడుగుతున్నారు. టిప్‌టాప్ షామియానా కోసం నాలుగు రోజులకు రూ. 60 వేలు ఖర్చయ్యిందా అని పలువురు ప్రశ్నలు సందిస్తుండడంతో పెట్టిన జమాఖర్చుల పత్రాన్ని ఆలయ అధికారులు తొలగించారు. -
బీసీలకు బాబు వెన్నుపోటు
నిడమర్రు: సీఎం చంద్రబాబు పర్యటనలో బీసీల సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లకుండా గృహ నిర్భందం చేయడం దారుణమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకట రమణ అన్నారు. సోమవారం సాయంత్రం పత్తేపురంలోని ఆయన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణకు, అభివృద్ధికి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక చట్టంతో రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని హామీలు గుప్పించి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన ఆదిశగా ఒక్క అడుగు పడలేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి నేడు రిక్త హస్తం చూపించారన్నారు. బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ హామీ అటకెక్కినట్లేనా అన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని బీసీ విభాగం అభివృద్ధి కోసం తిరుగుబాటు చేయాలని సూచించారు. గొల్లగూడెం వస్తున్న చంద్రబాబును కలిసేందుకు పలువురు బీసీ నేతలతో వెళుతున్న వెంకట రమణను నిడమర్రు పోలీసులు పత్తేఫురంలోని ఆయన నివాసంలో సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. -
దిత్వాగుబులు
● మేఘావృతం.. చిరుజల్లులు ● అన్నదాతల కలవరం ● పంటను కాపాడుకునేందుకు పాట్లు గణపవరం/నూజివీడు : దిత్వా తుపాను బలపడుతూ తీరానికి దగ్గరగా వస్తుండటంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో తుపాను హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటికే వేసిన కుప్పల్లోకి వర్షం నీరు దిగకుండా పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారు. మరికొందరు రైతులు కోతకు వచ్చిన వరి పంటను కోయకుండా వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు యంత్రాలతో కోతలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు నాలుగురోజుల నుంచి వరి గడ్డి లేకపోయినా, పంట చేతికొస్తే చాలనే భావనతో మెషీన్లతో కోతలు కోయిస్తున్నారు. కూలీల కొరతతో కొందరు వరి పనలు కుప్ప వేయకుండా అలాగే ఉంచారు. 20 వేల ఎకరాల్లో.. నూజివీడు నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో కలిపి 20 వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. నూజివీడు మండలంలో 2,500 ఎకరాలు, ముసునూరు మండలంలో 3,500 ఎకరాలు, ఆగిరిపల్లి మండలంలో 6 వేల ఎకరాలు, చాట్రాయి మండలంలో 8 వేల ఎకరాల్లో సాగుచేశారు. దీనిలో 50 శాతానికి పైగా వరి కోతలు కోయగా మిగిలిన పంట కొంత పనలపైన, మరికొంత కోయకుండా ఉంది. తుపాను హెచ్చరికలతో శని, ఆదివారాల్లో రైతులు హడావుడిగా కుప్పలు వేశారు. కుప్పలు వేయడానికి కుదరకుంటే పనలు, కంకులు పాడవకుండా వాటిపై ఉప్పునీళ్లు చల్లుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపు 50 శాతం మాసూళ్లు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో మూడు వంతులకు పైగా కోతలు పూర్తికాగా, గణపవరం, నిడమర్రు మండలాల్లో కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. తుపాను హెచ్చరికలతో ఆదివారం మధ్యాహ్నం నుంచే చిరుజల్లులు పడటంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పాట్లుపడుతున్నారు. చాలా మంది రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి రాశులు చేసి ఉంచారు. కొందరు రైతులు దళారులకు బస్తా రూ.1,380 చొప్పున విక్రయిస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 22 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయగా 12 వేల హెక్టార్లలో కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయి. యంత్రాలతో కోతల వల్ల తేమ శాతం ఉండటంతో ధాన్యాన్ని రోడ్డు, పుంతల వెంబడి ఆరబెడుతున్నారు. ఇదిలా ఉండగా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడి రాకపోవడంతో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు నష్టం తప్పదని అంటున్నారు. ముసురు వాతావరణం మామిడికి నష్టమేనని రైతులు అంటున్నారు. మామిడిలో పూతలు రావాలంటే రాత్రిపూట చలి, పగటి పూట వేడి వాతావరణం ఉండాలి. ముసురుతో తోటల్లో తెగుళ్లు వ్యాపిస్తాయని, పూతలు ఆలస్యమవుతాయని అంటున్నారు. అలాగే రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి 15 రోజుల దశలో పంట ఉంది. కొన్నిచోట్ల రెండు రోజులుగా విత్తనాలను నాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ వర్షాలు పడితే పంట దెబ్బతింటుందని అంటున్నారు. -
వసతి.. అధోగతి
ఏలూరు (మెట్రో): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. అసలే చలికాలం, ఆపై నేలమీద నిద్ర, నాణ్యతలేని భోజనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు హాస్టళ్లలో వసతుల లేమి కనిపిస్తోంది. 3వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వరకూ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే వీరంతా సమస్యల సుడిగుండంలోనే విద్యను కొనసాగిస్తున్నారు. సుమారు 16 వేలకు పైగా.. జిల్లాలో సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిధిలో సుమారు 16 వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 58 బాలురు, బాలికల వసతి గృహాలు, 38 బీసీ బాలబాలికల వసతి గృహాలు, 6 ఎస్టీ బాలబాలికల వసతిగృహాలు ఉన్నాయి. మొత్తంగా 102 హాస్టళ్లు ఉండగా వీటిలో కొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, అద్దె భవనాల్లో అరకొర వసతులు ఉన్నారు. 3, 4 తరగతి విద్యార్థులకు డైట్ చార్జీల పేరుతో రూ.1,150, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,400, కాస్మోటిక్ చార్జీల రూపంలో నెలకు రూ.200, రూ.150 ఇచ్చేవారు. అయితే చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్మోటిక్ చార్జీలకు ఎగనామం పెట్టింది భోజనం.. నాసిరకం జిల్లావ్యాప్తంగా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నా చిమిడిన అన్నం, ఉడకని అన్నంతోనే విద్యార్థులు కడుపు నింపుకుంటున్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు కూడా అందడం లేదు. కొన్నిచోట్ల ఆర్ఓ ప్లాంట్లు ఉన్నా మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయని విద్యార్థులు అంటున్నారు. అమలు కాని మెనూ కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బీసీ హాస్టళ్లు 7, ఎస్సీ హాస్టళ్లు 6 ఉన్నాయి. వీటిలో బీసీ బాలుర 5, బాలికలు 2,ఎస్సీ బాలికలు 4, బాలుర 2 వసతి గృహాలు ఉన్నాయి. మొత్తంలో బీసీ 2, ఎస్సీ 2 కాలేజీ హాస్టళ్లు నడుస్తున్నాయి. మండవల్లి ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం దొండకాయ వేపుడు, అరటిపండు పెట్టలేదు. అక్కడ విద్యార్థులు కేవలం పప్పు, పలచని రసం మాత్రమే వడ్డించారని చెప్పారు. బాలికలకు రక్షణ కరువు ముసునూరు: ముసునూరులోని ఎస్సీ బాలికల హాస్టల్లో వసతుల లేమితో పాటు విద్యార్థినులకు రక్షణ కరువైంది. హాస్టల్ ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండడం, హైస్కూల్‌కు ఆనుకుని ఉండటంతో రాత్రిళ్లు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ పనిచేసే వారంతా స్థానిక అధికార పార్టీకి చెందిన వారని, దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. గుడ్డు, పాలు, అరటి పండు అప్పుడప్పుడూ మాత్రమే ఇస్తున్నారని తెలిసింది. నైట్ వాచ్ ఉమన్ లేకపోవడం ఇబ్బందిగా ఉందని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. సంక్షోభంలో హాస్టళ్లు వసతి గృహాల్లో అరకొర వసతులు వేధిస్తున్న సౌకర్యాల కొరత విద్యార్థులకు అందని కాస్మోటిక్స్ సాయం నేలపైనే నిద్ర, భోజనం సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కారు 25 ఏళ్ల నుంచి బీసీ బాలుర హాస్టల్‌ను అద్దెకు తీసుకుని పాత భవనంలో నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో కిటికీలు, తలుపులు సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం. సరైన డ్రైనేజీ లేక వర్షం నీటితో నిండిపోతుంది. ప్రభుత్వం నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. –మారుబోయిన గౌతమరాజు, 10వ తరగతి, కామవరపుకోట జంగారెడ్డిగూడెంలో బీసీ హాస్టల్‌కి దారిలేక ఇబ్బదులు పడుతున్నాం. పలుమార్లు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు రోడ్డు గురించి ఫిర్యాదు చేశాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్‌కి వె వెళ్లే రోడ్డు నిర్మించాలి. – గుమ్మళ్ల ప్రశాంత్, 9వ తరగతి, జంగారెడ్డిగూడెం -
శ్రీవారి క్షేత్రంలో కానిస్టేబుల్ కుటుంబంపై దాడి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి కొండపైన దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ ఫాన్సీ దుకాణంలో ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ కు, షాపు నిర్వాహకులకు మధ్య జరిగిన గొడవ, కొ ట్లాటకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వలవల గంగరాజు కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీస్‌స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. చినవెంకన్న దర్శనార్థం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ దుకాణంలో బొమ్మలు కొనుగోలు చేసి, రూ.500 ఇచ్చారు. ఆ తరువాత తీసుకున్న వాటిలో ఒక బొమ్మ వద్దని అన్నారు. అయితే తీసుకుని తీరాల్సిందేనని షాపు నిర్వాహకులు ఆయనపై దౌర్జన్యం చేశారు. ఆ సమయంలో గంగరాజు తల్లి త్రివేణి కలుగజేసుకుని నచ్చితే కొంటాం.. లేకపోతే లేదు.. మా డబ్బులు తిరిగి ఇవ్వండని అనడంతో షాపులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను గెంటేశారు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఇదేంటని అడిగిన గంగరాజుపై సైతం ఆ ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, వారికి మద్దతుగా మరికొందరు వ్యాపారులు కుర్చీలు, కర్రలు, ఇనుప వస్తువులతో దాడి చేశారు. అక్కడున్న స్వాములు వారిని అడ్డుకుని గంగరాజు, ఆయన తల్లి, భార్య, పిల్లలను జంటగోపురాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాధితులు హోంగార్డులకు జరిగిన విషయం చెబుతున్న సమయంలో మళ్లీ వ్యాపారులు దాడికి తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోంగార్డులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో కానిస్టేబుల్ గంగరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
అధ్వానం.. నిర్వహణ ఘోరం
● జిల్లా కేంద్రం ఏలూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల హాస్టళ్లు కలిపి మొత్తం 17 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులు పరిశీలించేందుకు వెళ్లాలంటే కలెక్టర్ అనుమతితోనే రానిస్తామంటూ హాస్టల్ నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. దీంతో అక్కడ ఉండే విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ● దెందులూరు నియోజకవర్గం కొవ్వలిలోని హాస్టల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత వైఎస్సార్సీపీ హయాంలో 300 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ● చింతలపూడి నియోజకవర్గంలోని కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సరైన వసతులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ● పోలవరంలోని బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అసలే అద్దె భవనం, అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ● గణపవరంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఒక భవనం శిథిలావస్థకు చేరడంతో పాత భవనాన్ని మూసివేశారు. -
చీకటిని తరిమి.. వెలుగు వైపు పయనం
● నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం ● జిల్లాలో వ్యాధి నియంత్రణ దిశగా చర్యలు సఫలీకృతంపెదవేగి: ఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. గతంలో జిల్లా జనాభాలో 3.5 శాతంగా ఉన్న హెచ్ఐవీ వైరస్ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం 0.1 శాతం కంటే తక్కువకు చేరుకోవడం వెలుగు వైపు పయనంగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 8745 మంది బాధితున్నారు. వీరిలో అధికశాతం యాంటీ రెట్రో వైరస్ థెరపీ(ఏఆర్టీ) మందులను వాడుతున్నారు. వైద్యం పొందుతున్న వారిలో 3511 మంది పురుషులు కాగా.. 4952 మంది మహిళలు ఉన్నారు. 21 మంది ట్రాన్స్‌జెండర్స్, 261 మంది చిన్నారులు ఏఆర్టీ మందులను తీసుకుంటున్నారు. వీరికి ఏఆర్టీ మందులను ఇవ్వడంతోపాటు, వాటిని వాడుతున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఏఆర్టీ సెంటర్లు, చింతలపూడి, భీమడోలు, నూజివీడు, కొయ్యలగూడెం, కై కలూరులో లింక్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ముందస్తు నియంత్రణ చర్యలు కీలకం హెచ్ఐవీని నివారించాలంటే అసురక్షిత లైంగిక పద్ధతులను అరికట్టాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరిస్క్‌గా గుర్తించిన ఫీమెల్ సెక్స్ వర్కర్లు, కొందరు ఎల్జీబీటీ కమ్యూనిటీ వారికి తరచూ సుఖవ్యాధుల పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిఫిలిస్, హెచ్ఐవీ టెస్టులు చేయడం ద్వారా వారి ప్రవర్తనలో మార్పులను తీసుకొచ్చేందుకు ఎన్జీవోల ద్వారా పర్యవేక్షణ కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా లెప్రా ఇండియా ఆధ్వర్యంలో 35 పౌష్టికాహార కిట్లు దిశ బృందం ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి బాధితులకు ఆదివారం అందించారు. అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి నెలా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ రోజుల్లో ఏ సిబ్బందిని ఏ ప్రాంతాలకు పంపించాలో ప్రణాఽళికతో సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు నెలవారీ నివేదికలు పరిశీలిస్తూ , ఇంకా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. డాక్టర్ లక్ష్మీనారాయణ డీఎల్‌ఏటీఓ, ఏలూరు జిల్లా -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పోలవరం రూరల్/యలమంచిలి: తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ తల్లిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా.. పోలవరం అంగుళూరు సమీపంలో కొండ వద్ద బొలేరో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే సమీపంలోని పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అంబులెన్స్‌లో వీరిని పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరంతా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం గ్రామాలకు చెందిన వారు. వీరిలో అబ్బిరాజుపాలెం పంచాయతీ బండివానిగట్టు ప్రాంతానికి చెందిన కాసురేకుల నరసింహమూర్తి (37) ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మిగిలిన వారిని పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిలో జి.శ్రీనివాస్, ఎం.సురేష్‌ను అంబులెన్స్‌లో రాజమండ్రి తరలించగారు. ఎం.సురేష్, జి.వరప్రసాద్, జి.రాజులు పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన ఏడుగురికి చికిత్స అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం వైద్యశాలకు తరలించారు. పోలవరం సీఐ బాల సురేష్ బాబు క్షతగాత్రులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఐదుగురికి గాయాలు -
రూ.2,495 కోట్ల వర్జీనియా అమ్మకాలు
● ముగిసిన పొగాకు వేలం ప్రక్రియ ● కిలోకు అత్యధిక ధర రూ.456 జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియ ముగిసింది. దేవరపల్లి , జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–2, గోపాలపురం కేంద్రాల్లో దశల వారీగా వేలం నవంబర్ 29తో ముగిసింది. మొత్తంగా రూ.2,495.52 కోట్ల విలువైన 83.88 మిలియన్ కిలోల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కిలోకు రూ.456 ధర లభించింంది. వేలం ప్రారంభంలో కిలో ధర రూ.290 పలకగా రైతులు నిరాశ చెందారు. అయితే వేలం ప్రక్రియ కొనసాగుతుండగా విదేశీ ఎగుమతుల ఆర్డర్లు రావడంతో క్రమేపీ ధర పెరిగింది. వాస్తవానికి ఎన్ఎల్ఎస్ పరిధిలో 62.11 మి.కిలోల పంట పండించేందుకు పొగాకు బోర్డు అనుమతివ్వగా, రైతులు 83.88 మి.కిలోల పంట పండించారు. పరిమితికి మించి పంట పండించినా రైతులకు గణనీయమైన ధర లభించింది. కాగా కిలోకు అత్యధికంగా సగటు ధర రూ.297.50 దక్కింది. కేంద్రాల వారీగా దేవరపల్లిలో రూ.386.12 కోట్లు, జంగారెడ్డిగూడెం–1లో రూ.554.75 కోట్లు, కొయ్యలగూడెంలో రూ.530.32 కోట్లు, జంగారెడ్డిగూడెం–2లో రూ.576.67 కోట్లు, గోపాలపురంలో 446.93 కోట్ల అమ్మకాలు జరిగాయి. వేలం మార్చి నెలలో ప్రారంభం కాగా, సుమారు 8 నెలల పాటు ప్రక్రియ సాగింది. సగటున 190 రోజులు వేలం కొనసాగగా, మొదట దేవరపల్లి వేలం కేంద్రంలో 175 రోజులకు ముగిసింది. చివరగా జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 200 రోజులకు ముగిసింది. ఈ ఏడాది వేలం ఆలస్యం కావడానికి అత్యధిక పంట పండటమే కారణమని అంటున్నారు. వేలం కేంద్రం అనుమతించిన అమ్మిన సగటు గరిష్ట కనిష్ట వేలం పంట పంట ధర ధర ధర జరిగిన (మి.కి) (మి.కి) (కిలో) (కిలో) (కిలో) రోజులు దేవరపల్లి 11.51 13.18 292.96 455 50 175 జంగారెడ్డిగూడెం–1 12.64 18.57 299.06 456 50 198 కొయ్యలగూడెం 12.62 17.88 296.60 456 48 193 జంగారెడ్డిగూడెం–2 13.37 19.18 300.66 456 50 200 గోపాలపురం 11.97 15.07 296.57 455 49 186 -
శ్రీవారి క్షేత్రంలో ఆన్లైన్ సేవలు విస్తృతం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు విస్తృతం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అధికారులతో ఈనెల 29న ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో ఆన్లైన్, డిజిటల్ సేవలను విస్తృతపరిచే అంశాలపై చర్చించారు. కమిషనర్ ఉత్తర్వుల్లోని నియమ నిబంధనల ప్రకారమే నెయ్యి కొనుగోలు చేయాలని, ఆన్లైన్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆన్లైన్ ద్వారా ప్ర సాదాలు కొనుగోలు చేసేవారికి ప్రత్యేక కౌంట ర్ ద్వారా త్వరితగతిన వాటిని అందించే ఏ ర్పాట్లు చేయాలన్నారు. భద్రతలో భాగంగా ఆలయాల్లోకి సెల్ఫోన్లను అనుమతించవద్దన్నారు. పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పనలో చినవెంకన్న దేవస్థానం 3వ స్థానంలో ఉందని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూ చించారు. ముఖ్యంగా మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, సెంటెడ్ ఫినా యిల్ వాడేలా చూడాలన్నారు. నిత్య కల్యాణాలు, ప్రసాదాలు, దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు పొందే భక్తులు ఆన్లైన్ సౌకర్యాన్ని వినియోగించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. సేవలు సులభతరం భక్తులు స్వామివారి దర్శనం, వసతి, డొనేషన్లు, కేశఖండన, ప్రసాదాలు, ఇతర సేవా టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్ (వెబ్సైట్), వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి సూచించారు. httpr:// www.aptemples.org వెబ్సైట్ ద్వారా, మన మిత్ర వాట్సాప్ +91 9552300009 ద్వారా సులభంగా సేవలు పొందవచ్చన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీసీల రక్షణ, అభివృద్ధికి బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రత్యేక చట్టంతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకట రమణ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రిక్తహస్తం చూపారన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీని అటకెక్కించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేషన్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు హామీ ఏమైందని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిన హామీ కూడా గాలిలో కలిపేశారన్నారు. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తామని చెప్పి అన్యాయం చేశారన్నారు. స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించలేదన్నారు. బూటకపు హామీలతో మో సం చేసిన చంద్రబాబుకు బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీసీలు ఉప ముఖ్యమంత్రి పదవికి పనికిరారా అని ప్రశ్నించారు. టీడీపీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం భ్రమ మాత్రమే అని, అభివృద్ధి కలే అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం పచ్చి అబద్ధమన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. టీడీపీ, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు చేస్తున్న అన్యాయానికి, అణచివేతకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడుదామని నౌడు పిలుపునిచ్చారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కలెక్టర్, జేసీ అందుబాటులో ఉండరని, డీఆర్వో, ఇతర అధికారులు వినతులు స్వీకరిస్తారన్నారు. పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆ లయంలో ఆదివారం విశేష పూజలు జరిగా యి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి పూజా రుసుం ద్వారా రూ.26,270, విరాళాల రూపంలో రూ.700, లడ్డూ విక్రయం ద్వారా రూ.12120, ఫొటోల అమ్మకంపై రూ.1,375 మొత్తంగా రూ.40,465 ఆదాయం లభించిందని దేవస్థానం ఈఓ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. -
బాడీ బిల్డింగ్ పోటీలు
భీమవరం: భీమవరం త్రీ టౌన్‌లోని కె.12 జిమ్‌లో ఆదివారం న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ భీమవరం బాడీ బిల్డింగ్ – ఫిజిక్ మోడలింగ్ పోటీలు నిర్వహించారు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం ఈ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మానవతా సంస్థ అధ్యక్షుడు చింతలపాటి రామకృష్ణంరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి పాల్గొన్నారు. విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి పంటకాలువలో పడిన ఘటనలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ధాన్యం లోడుతో వస్తున్న లారీ తేతలి వద్దకు వచ్చాక అదుపుతప్పి సమీపంలో ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తణుకు కొమ్మాయిచెర్వు గట్టు ప్రాంతంలో నివసిస్తున్న లారీ డ్రైవర్ వట్టిపులుసు సూరిబాబు(43) మృతిచెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
ఘనంగా హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనరు ఆర్వీ చందన పర్యవేక్షించారు. స్వామిని కొవ్వూరు 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.అనురాధ కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. కొయ్యలగూడెం: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన కన్నాపురంలో ఆదివారం జరిగింది. దళితవాడలో ఉంటున్న యువకుడు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఎలక్ట్రికల్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై అక్కడే మృతి చెందాడు. యువకుడు ఇంటర్ చదువుతున్నట్లు తెలిసింది భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని బేతనీపేటకు చెందిన యువతి విద్యుత్తు హీటర్ రాడ్ తగిలి షాక్‌తో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్.డి.లావణ్య(19) నవంబరు 29న స్నానం చేసి వస్తానని పై అంతస్తులో ఉన్న తండ్రికి చెప్పి కిందకు వచ్చింది. నీటిని వేడి చేసేందుకు హీటరు పెట్టింది. రాత్రి 10 గంటల వరకు ఆమె ఆచూకీ లేకపోవడంతో తండ్రి కిందికి వచ్చి చూసేసరికి కిందపడి ఉన్నట్టు గుర్తించారు. అల్లుడికి సమాచారం ఇవ్వగా అతడు వచ్చాక ఇంట్లోకి తీసుకెళ్లి పరిశీలిస్తే అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై బి.వై.కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, ఏలూరు కార్పొరేషన్, చింతలపూడి నగర పంచాయతీలుగా ఉన్నాయి. వీటిలో మొత్తంగా 1,14,684 అసెస్మెంట్లు ఉండగా, వీటిపై రూ.93.92 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, పాత బకాయిలు కూడా ఉన్నాయి. ఇంతవరకు 8 నెలల కాలంలో రూ.28.20 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది. మొత్తం మీద 30.03 శాతం మాత్రమే వసూలైంది. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్నులు అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి మొత్తం 1,14,684 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంతవరకు పన్నుల వసూళ్ళలో జంగారెడ్డిగూడెం పట్టణం 35.32 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్ 28.68 శాతంతో చివరి స్థానంలో ఉంది. రెండు , మూడు స్థానాల్లో నూజివీడు, చింతలపూడి ఉన్నాయి. పన్ను వసూళ్ల కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. సచివాలయాల వారీగా అన్ని సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ మహిళా పోలీసులకు కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేశాం. బకాయిదారులకు నోటీసు, మొండి బకాయిదాలకు రెడ్ నోటీసులు ఇస్తున్నాం. జనవరి వరకు 60 శాతం, ఫిబ్రవరి మార్చిలో 100 శాతం వసూలు చేసేలా ప్రణాళిక రచించాం. టాక్స్ వసూళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశాలు జారీ చేశాం. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. – కేవీ రమణ, మున్సిపల్ కమిషనర్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు వసూలవ్వాల్సిన వసూలైన శాతం పన్ను (రూ. కోట్లలో) పన్ను (రూ. కోట్లలో) ఏలూరు (కార్పొరేషన్) 67.98 12.50 28.68 జంగారెడ్డిగూడెం 12.62 4.46 35.32 నూజివీడు 10.64 3.42 32.15 చింతలపూడి 2.68 0.82 30.74 -
కరుణించు మంగమ్మతల్లీ
బుట్టాయగూడెం: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందిన గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణతో ఉన్న మంగమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరమానంద భరితులయ్యారు. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల వరకు భక్తులు తరలివచ్చి దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం, ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, పరిసర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ పాద చరణములే గతి అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు పాలపొంగళ్లు సమర్పించారు. అనేక కుటుంబాలు వేడి నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.50,605 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆకివీడు: మండలంలోని ఐ.భీమవరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మోసాది మోహన్ రావు, బుల్లి శ్రీరాములు కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో చేపల చెరువుపై పనిచేస్తున్నారు. శనివారం ఆకివీడు వస్తుండగా ఐ.భీమవరం వద్ద ప్రమాదం జరిగింది. మోహన్ రావు అక్కడక్కడ మృతిచెందగా శ్రీరాములు గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ షష్ఠి ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సివచ్చింది. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి క్యూలైన్లలో నిలబడి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద పూజలు చేసేందుకు మహిళలు పోటెత్తారు. గోశాల వద్ద సైతం భక్తులు అధిక సంఖ్యలో గోవులకు పూజలు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత కష్ణప్రసాద్ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. -
బాబు పాలనలో భరోసా శూన్యం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి ఎలాంటి పథకాలు లేకపోవడంతో వారికి ఆర్థికంగా భరోసా శూన్యంగా మారింది. వైఎస్సార్సీపీ గత ఐదేళ్ళ పాలనలో మహిళల స్వయం సమృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు అందిస్తూ వారి ఎదుగుదలకు అండగా నిలబడి ఊతం ఇచ్చింది. మహిళా సాధికారతే ధ్యేయంగా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందించారు. మహిళలను ఆర్థికంగా శక్తివంతుల్ని చేసే క్రమంలో వారికి ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పలు సంక్షేమ పథకాలు అక్కరకు వచ్చాయి. చిరు వ్యాపారాలు, డెయిరీ యూనిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి చేపట్టారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఐదేళ్ళల్లో రూ.13,451.50 కోట్ల రుణాలు వైఎస్సార్సీపీ పాలన ఐదేళ్ళలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో రూ.13,451.50 కోట్లు బ్యాంకు రుణాలను డ్వాక్రా మహిళలకు అందించారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు సంబంధించి రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మహిళల స్వయం సమృద్ధికి ఏ స్థాయిలో పనిచేసిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి మహిళలకు రుణాలు అందడం లేదు. ఏటా లక్ష్యానికి మించి రుణాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో డ్వాక్రా సంఘాలకు ఏటా నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేశారు. క్షేత్ర స్థాయిలో చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ డ్వాక్రా సంఘాలకు మెరుగైన సహకారం అందించేందుకు కృషి చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం మేరకు మహిళలకు డ్వాక్రా రుణాలు అందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సగటున 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు. ఆసరా పథకంలో రూ.2,300 కోట్ల లబ్ది వైఎస్సార్ ఆసరా పథకంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షల మందికి పైగా మహిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ది కలిగింది. కాపు నేస్తంలో రూ.220 కోట్ల ప్రయోజనం వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.60 వేల ఆర్థిక సహకారం అందించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ది చేకూరింది. ఏలూరు జిల్లాలోని కాపు మహిళలు 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలోని లక్ష మంది మహిళలకు రూ.1,20 కోట్ల మేరకు సహకారం లభించింది. వైఎస్సార్ చేయూతలో రూ.850 కోట్ల లబ్ధి వైఎస్సార్ చేయూతలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నాలుగు విడతల్లో రూ.440 కోట్ల మేరకు ప్రయోజనం చేకూరింది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం వైఎస్సార్సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేల ఆర్థిక సహకారం అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు అందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి రూ.63 కోట్ల మేర లబ్ది చేకూరింది. చంద్రబాబు పాలనలో కళతప్పిన మహిళలు నాడు వైఎస్సార్సీపీ పాలన ఐదేళ్ళల్లో మహిళలే మహారాణులుగా వెలుగొందారు. దానికి భిన్నంగా ప్రస్తుత చంద్రబాబు కూటమి పాలనలో మహిళలకు భరోసా లేదు. ఆర్థిక భరోసా కోల్పోయి ఎప్పటి లాగానే ప్రతీ చిన్న అవసరానికి ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఏదో పథకం ద్వారా మహిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ హాయాంలోని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే బాగుందని నేడు తమకు ఏ పథకం అందక పోవడంతో ఖర్చులకు వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అందని ఆర్థిక భరోసా వైఎస్సార్సీపీ పాలనలో మహిళలే మహారాణులు చేయూత, కాపు నేస్తం, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో భరోసా బ్యాంకు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు అందజేత -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
తణుకు అర్బన్: పేదలకు నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేటుకు కట్టబెట్టాలని చూస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు ఉమెన్స్ కళాశాల ప్రాంతంలో శనివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ శిబిరంలో ఆయన మాట్లాడారు. పేదవర్గాలకు ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గుండె, కిడ్నీ, లివర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందుతాయని, పేదలకు అందని ద్రాక్షగా ఉండే వైద్యవిద్య కూడా చేరువవుతుందన్నారు. అయితే వైద్యం, వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే దుర్భుద్ధితో మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయా లని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పేదల అనారోగ్య సమస్యలకు అప్పులపాలైపోతున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 17 నెలల కాలంలో పేదలకు ప్రభుత్వ వైద్యం గండంగా మారిందని, ఆరోగ్యశ్రీని సైతం అటకెక్కించారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులవుతున్నారని, కోటి సంతకాల ప్రతులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌కు చేరుతాయని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కానివ్వమని కారుమూరి అన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్‌సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, తణుకు పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు పెనుమాక రాజేష్, గెల్లా జగన్, పి.దొరబాబు, షేక్ బాజీ, పైడి సాయిసూర్య, ఎడ్వర్డ్ పాల్ పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి -
ప్రజా పంపిణీ ప‘రేషన్ ’
సరుకులకు కోత సాక్షి, భీమవరం: ప్రజాపంపిణీ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మండల లెవిల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లలో రెండు నెలలకు సరిపడా స్టాకు ఉండాలనే నిబంధన గాలికొదిలేసింది. గతంలో పది రోజుల ముందే రేషన్‌డిపోలకు స్టాకు మొత్తం ఒకేసారి చేరేది. రెండు నెలల నుంచి మూడు నాలుగు పర్యాయాలుగా సరుకులు సర్దుబాటు చేస్తోంది. 1,052 షాపులు.. 5.67 లక్షల కార్డులు జిల్లాలోని 1,052 రేషన్ డిపోల పరిధిలో 5,67,700 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 31,844 మంది అంత్యోదయ కార్డుదారులు ఉన్నారు. వీరికి 35 కిలోల బియ్యం, కిలో పంచదార, తెల్ల రేషన్ కార్డుదారులకు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం, అరకిలో పంచదార చొ ప్పున నెలకు సుమారు 8,790 టన్నుల బియ్యం, 300 టన్నుల చక్కెర అవసరం అవుతాయి. ప్రతినెలా 16వ తేదీ నుంచి 26వ తేదీలోపు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు సరుకులు చేరవేయాలి. 26వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికీ, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాధారణ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. నిల్వలకు కొరత : ఉండి, తణుకు, తాడేపల్లిగూ డెం, పెనుమంట్ర, పాలకొల్లు, నరసాపురంలోని ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా సరుకులు చేరవేస్తుంటారు. సాధారణంగా రెండు నెలలకు సరిపడా సరుకులు ఎప్పుడూ గోదాముల్లో నిల్వ ఉంచాలి. నెలనెలా సరుకులు సరఫరాకు తగ్గట్టు లోటును భర్తీ చేసుకుంటుండాలి. మునుపెన్నడూ లేనివిధంగా రెండు నెలల నుంచి ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో రేషన్ షాపులకు సరుకుల రవాణా ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఉండిలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు 2,300 టన్నుల బియ్యం, 70 టన్నులు పంచదార సరఫరా జరుగుతుంది. ఇక్కడి గోదాము ఖాళీ అవ్వడంతో ప్రస్తుతం భీమవరంలోని బఫర్ గొడౌన్ నుంచి సరుకులు సరఫరా చేస్తున్నారు. తణుకు ఎంఎల్ఎస్ పాయింట్లో రెండు గొడౌన్లకు ప్రస్తుతం ఒక్కటి మాత్రమే వినియోగంలో ఉంది. దీంతో పూర్తిస్థాయిలో స్టాకు పెట్టే పరిస్థితి ఉండటం లేదు. గోదా ము కెపాసిటీ 1,200 టన్నులకు ఈనెల కోటా సరఫరా చేయగా ప్రస్తుతం 250 టన్నులు ఉన్నట్టు సి బ్బంది చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఎంత మేర స్టాకులు ఉంటున్నాయనేది ప్రశ్నార్థకమే. ఆలస్యమవుతున్న సరుకులు బియ్యం, పంచదార, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనానికి సంబంధించి అలాట్మెంట్ మేరకు ఒకేసారి సరుకులు మొత్తాన్ని రేషన్ షాపులకు చేరవేస్తుంటారు. రెండు నెలల నుంచి మూడు నాలుగు పర్యాయాల్లో సరుకులు అందజేస్తున్నట్టు డీలర్లు అంటున్నారు. గత నెలలో 260 షాపులకు సరుకులు ఆలస్యంగా చేర గా, ఈనెల కూడా కొన్నింటికి సరుకులు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. సరుకులు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్‌కు వెళ్లి థంబ్ వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈపోస్ మెషీన్లో స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించక సరుకులు, థంబ్ కోసం నెలలో నాలుగైదు సార్లు తిరిగేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగుల కార్డులు జిల్లాలో 71,640 వరకు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 26వ తేదీ నుంచి నెలాఖరవు లోపు రేషన్ సరులకు డోర్ డెలివరీ చేయాలి. బియ్యం, పంచదార పూర్తిస్థాయిలో రాక సరుకుల పంపిణీ ఇబ్బంది అవుతోంది. వచ్చిన మేరకు బియ్యం అందజేస్తుండగా పంచదార కోసం మరలా షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈనెల రేషన్‌లో సాధారణ కార్డుదారులకు సైతం కొన్నిచోట్ల పంచదారకు కోత పెట్టిన పరిస్థితి కనిపించింది. డిసెంబరు నెలకు గాను ఇంకా కొన్ని షాపులకు పంచదార పూర్తిస్థాయిలో అందలేదని సమాచారం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అథోగతి పాలవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరి పూర్తిస్థాయిలో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కోతల సర్కారు ఎంఎల్ఎస్ పాయింట్లకు అరకొరగా నిల్వలు నిత్యం రెండు నెలలకు సరిపడా స్టాకు ఉంచాలన్న నిబంధన గాలికి రేషన్ షాపులకు ఆలస్యంగా చేరుతున్న సరుకులు సక్రమంగా జరగని సరుకుల డెలివరీ వృద్ధులకు డోర్ డెలివరీకి ఆటంకాలు -
జంతు గణనకు సన్నద్ధం
● పాపికొండల అభయారణ్యంలో గణన ● 1 నుంచి 8 వరకు ప్రక్రియ ● సాంకేతిక విధానం ద్వారా లెక్కింపు ● అటవీ సిబ్బందికి శిక్షణ పూర్తి ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలో పులులు, ఇతర జంతువుల గణనకు అటవీశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి అటవీ ప్రాంతంలోని జంతువుల గణన ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి 8వ తేదీ వరకూ పాపికొండల్లో జంతువుల గణనను చేపట్టనున్నారు. గతంలో జంతువుల గణన పుస్తకాల్లో మాత్రమే నమోదు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి అత్యాధునిక సాంకేతికత విధానం ద్వారా ఆన్లైన్లో పొందుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. గణనలో పాల్గొనే సిబ్బందికి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియపై శిక్షణ కూడా ఇచ్చామన్నారు. 8 రోజులపాటు.. పాపికొండల అభయారణ్యంలో సుమారు 8 రోజులపాటు జంతు గణన ప్రక్రియ జరగనుంది. మొదటి మూడు రోజులు అటవీ శాఖ సిబ్బంది తమకు నిర్ణయించిన మూడు కిలోమీటర్ల పరిధిలో కాలినడకన తిరుగుతూ జంతువుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తిస్తారు. తదుపరి ఐదు రోజులు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార జంతువులను గుర్తిస్తారు. అలాగే జంతువులు నేరుగా కనిపిస్తే ఫొటోలు తీయడంతోపాటు వారు సంచరించే సమయంలో జంతువుల పెంటికల్, పాదముద్రలను కూడా గుర్తిస్తారు. అడవుల్లో సంచరించే పశువుల కాపర్లతోపాటు అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండే ప్రజల నుంచి కూడా జంతువుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. జంతువులతోపాటు వారు పర్యటించే పరిసర ప్రాంతాల్లో ఏయే రకాల చెట్లు ఉన్నాయో అనే వివరాలను కూడా అటవీశాఖ సిబ్బంది నమోదు చేస్తారు. 1.12 లక్షల హెక్టార్లలో.. పాపికొండల అభయారణ్యం 1,12,500 హెక్టార్లలో విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలను కూడా గుర్తించారు. ఈ అభయారణ్యంలో ఎక్కువగా ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, ముళ్లపందులు, నక్కలు, ముంగీసలు, అడవి దున్నలు ఉన్నట్టు గుర్తించారు. 2022లో 116 ప్రాంతాల్లో.. పాపికొండల అభయారణ్యంలో 2018లో జంతుగణన నిర్వహించిన అధికారులు మరలా 2022లో జంతుగణన చేపట్టారు. పాపికొండల అభయారణ్యం పరిధిలో 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సింహాలు, ఏనుగులు తప్ప అన్నిరకాల జంతువులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. దేశవ్యాప్తంగా కార్యక్రమం : దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి చేపట్టనున్న జాతీయ పులుల గణన, వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం సుమారు 8 రోజులపాటు పాపికొండల అభయారణ్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా సర్వేకు సంబంధించిన ట్రయిన్ రన్‌కు కూడా అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు.ప్రతి నాలుగేళ్లకోసారి అభయారణ్యాల్లో పులులు, జంతు గణన సర్వే జరుగుతుంది. ఈ మేరకు పాపికొండల అభయారణ్యంలో పులులు, జంతుగణన సర్వే చేయనున్నాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. మొదటి మూడు రోజులు కాలినడకన తిరుగుతూ పులులకు సంబంధించిన ఆనవాళ్లను సిబ్బంది గుర్తిస్తారు. మిగిలిన ఐదు రోజులు వన్యప్రాణుల జాడను గుర్తించడంతోపాటు చెట్లను కూడా గుర్తిస్తారు. – ఎస్కే వలీ, అటవీ శాఖ అధికారి, పోలవరం రేంజ్ కుక్కునూరు: కుక్కునూరు అటవీ శాఖ రేంజ్ పరిధిలో పులుల లెక్కింపు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు రేంజ్ అధికారి కృష్ణకుమారి ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏలూరు అటవీ విభాగంలో పాపికొండల నేషనల్ పార్క్ నార్త్ ఈస్ట్రన్ ఘాట్స్‌లో పులుల సంరక్షణకు చివరి ప్రధాన ఆశగా ఉండటంతో పాటు తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల పులుల నివాసాలను కలిపే ముఖ్యమైన కారిడార్‌గా పనిచేస్తోందన్నారు. గతంలో పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఉడతపల్లి, కొవ్వాడ, గెడ్డపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం గుర్తించారన్నారు. గణనకు సర్వసన్నద్ధంగా ఉండటంతో పాటు సిబ్బందికి సూచనలు ఇచ్చామని పేర్కొన్నారు. -
నిధులు విడుదల చేయాలంటూ నిరసన
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపల్ సా ధారణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని వెంటనే వాటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ కౌ న్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం బత్తిన లక్ష్మి అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్మన్ ముప్పిడి అంజి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ప్లకార్డులతో నిరసనగా సమావేశపు హాల్లోకి వచ్చారు. హాల్లో ప్లకార్డులు ప్రదర్శించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ మున్సిపల్ నిధులు రూ.8.5 కోట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ధ్వజమెత్తారు. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు నిలిచి పోయాయన్నారు. గతంలో చేసిన అభివృద్ది పనుల కు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, కాంట్రా క్టర్లు కొత్తగా చేపట్టే పనులు చేపట్టడం లేదన్నారు. బిల్లులు చెల్లిస్తే కొత్త పనులు జరిగే అవకాశం ఉంటుందన్నారు. గత సమావేశంలో స్వయంగా మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వమే నిధులను ఫ్రీజ్ చేసిందని, ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉందని చెప్పారన్నారు. ప్రభుత్వం వా టిని విడుదల చేస్తేనేగాని నిధుల రావని చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో నిధులను వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరో వైస్ చైర్మన్ కంచర్ల వాసవీ రత్నం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వాడీవేడిగా సమావేశం మున్సిపల్ సాధారణ సమావేశం వాడీవేడిగా సా గింది. చైర్పర్సన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా వైస్ చైర్మన్ ముప్పిడి అంజి, చిటికెల అచ్చిరాజు గ్రేడ్–1 అప్‌గ్రేడ్‌పై మాట్లాడగా కొద్దిసేపు వాదనలు జరిగాయి. మున్సిపల్ కార్యాలయ, శానిటేషన్ సిబ్బందిని పెంచాలని సమావేశం తీర్మానించింది. పట్టణాభివృద్ధికి అధికారులు, కౌన్సిలర్లు సంయుక్తంగా సహకరించాలని కోరారు. -
ఏలూరు ద్వారకానగర్‌లో చోరీ
ఏలూరు టౌన్: ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ద్వారకానగర్ ఇంట్లో బంగారు, వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. రూరల్ ఎస్ఐ నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శొంఠి వెంకట సుబ్రహ్మణ్యం ఈనెల 21న కుటుంబంతో కలిసి విజయవాడలోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇంటికి సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల 28న రాత్రి తన ఫోనును పరిశీలించారు. సీసీ కెమెరాలు ఫోన్‌కు అనుసంధానం చేసి ఉండడంతో వాటిని చూడగా... కెమెరాలు పక్కకు తిప్పేసి ఉన్నాయి. వెంటనే సుబ్రహ్మణ్యం ఏలూరులోని ఇంటికి వచ్చి చూడగా బీరువాను పగులగొట్టి ఉంది. బీరువాలోని పావుకిలో వెండి వస్తువులు, మూడున్నర కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముదినేపల్లి రూరల్: మండలంలోని పెదపాలపర్రు గంగానమ్మ గుడికి చెందిన హుండీలో నగదు చోరీ జరిగింది. దీనిపై కమిటీ అధ్యక్షుడు ఎలిశెట్టి లక్ష్మీనరసింహరావు స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆలయం వద్ద ఆదివారం గంగానమ్మ సంబరం జరగనుంది. దీని నిమిత్తం ఆలయానికి వెళ్లగా ఆవరణలో ఏర్పాటుచేసిన హుండీని పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును దొంగిలించినట్లు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకాతిరుమల: ఓ వ్యక్తి ద్వారకాతిరుమలలో శనివారం కొండచిలువతో హల్చల్ చేశాడు. స్థానిక కిచ్చయ్య చెరువులో వలలో పడి, మృతి చెందిన కొండ చిలువను గ్రామానికి చెందిన పెయింటర్ లాజర్ మద్యం మత్తులో మెడలో వేసుకున్నాడు. అనంతరం శ్రీవారి దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాలలోకి వెళ్లి దాంతో విన్యాసాలు చేశాడు. విద్యార్థులు బయపడటంతో ఉపాధ్యాయులు అతడిని బయటకు పంపివేశారు. ఆ తరువాత ఆ పాముతో గుడి సెంటర్లో తిరిగాడు. మెడలో వేసుకుని పలు దుకాణాల వద్ద కుర్చున్నాడు. అయితే వ్యాపారులు అతడిని హెచ్చరించి, దూరంగా పంపేశారు. వీరవాసరం: వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 రాష్ట్రస్థాయి బాలబాలికల సాఫ్ట్‌బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్ల నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు 52 మంది కోచ్, మేనేజర్లు పాల్గొంటారన్నారు. ఏలూరు రూరల్: డిసెంబర్ 4 నుంచి 6 వరకూ కర్నూలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ 11వ సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.అలివేలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పురుషుల జట్టును డిసెంబర్ 1న ఎంపిక చేస్తామని వెల్లడించారు. వీరవాసరం మండలం కొణితివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 3 గంటలకు జట్టు ఎంపిక పోటీలు జరుగుతాయని వివరించారు. ఏలూరు (టూటౌన్): పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో ప్రజల అభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. -
వైకల్య నివారణకు జాగ్రత్తలు అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పిల్లల్లో వైకల్యాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సభ్యులు సూచించారు. నగరంలోని దొండపాడు ఉమా ఎడ్యుకేషన్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ప్రతినిధులు శనివారం మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. దగ్గరి రక్త సంబంధీకులతో వివాహం వద్దని, 18 సంవత్సరాలలోపు బాల్య వివాహాలు వద్దన్నారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులు 21 రకాలుగా గుర్తించారని, ప్రభుత్వం దివ్యాంగులకు అందించే హక్కులను వివరించారు. వైకల్య నివారణకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైకల్యం ముందుగా గుర్తించడం, వైకల్యం వచ్చిన తర్వాత దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సందర్భంగా వివరించారు. అనంతరం సంస్థ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక హక్కులను కల్పించిందని, వాటిని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 08812 –249297,7386565469 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు అల్లూరి రవి ప్రకాష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు: మోంథా తుపాను రైతులను నిండా ముంచింది. అప్పులు చేసి పండించిన పంట రైతు చేతికి అందకుండా ముంచేసింది. పూర్తిగా చేలు నేటనంటాయి. తాడేపల్లిగూడెం మండలంలో 46 వేల ఎకరాలకు పంట పూర్తిగా చేతికి దక్కినా, పెంటపాడు మండలంలో 22 వేల ఎకరాలకు గాను 40 శాతం పైగా వరి పంట నేలకు ఒరిగింది. ఇందులో అఽఽధిక భాగం స్వర్ణ రకం వరి.. ఈ వరి కొద్దిపాటి గాలికే నేలకొరుగుతుంది. అదృష్టవశాత్తూ చేలలో నీరు తక్కువగా ఉండడం, ఎగువభాగంలో కాలువలు కట్టేయడంతో రైతులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. పెంటపాడు మండలంలో ప్రధానంగా కె. పెంటపాడు, రావిపాడు, ముదునూరు, ఆకుతీగపాడు, జట్లపాలెం, యానాలపల్లి గ్రామాలలో తుపాను ప్రభావం వల్ల పంట చేలు నేలకు ఒరిగాయి. బీమా సొమ్ము కూడా పూర్తిగా కట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీమా సొమ్ము ప్రభుత్వం కట్టేది. ఈ సారి రైతులే కట్టుకోవాలని అని చెప్పడంతో ఎక్కువశాతం రైతులు బీమా సొమ్ము కట్టలేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా ఉన్నాయి. మరోవైపు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు హడావుడిగా మాసూళ్లు చేస్తున్నారు. యంత్రం ద్వారా కోసిన ధాన్యం ఆరబెడుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా రవాణా శాఖ అధికారి కొలుసు సాయి మురళీ వెంకట కృష్ణారావు ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో స్కూల్, కాలేజీ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. శనివారం అసిస్టెంట్ మోటార్ హెవికల్ ఇన్స్పెక్టర్లు బస్సుల ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా బస్సులు తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 347 బస్సులను తనిఖీ చేసి.. వాటిలో 140 బస్సుల్లో భద్రత లోపాలు గుర్తించి నోటిసులు జారీ చేశామన్నారు. రెండు బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా భీమవరం పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, విద్యార్థులకు రోడ్డు భద్రతా జాగ్రత్తలు, డ్రైవింగ్ లైసెనన్స్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
ఇస్లాం ఉగ్రవాదం నేర్పదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇస్లాం ధర్మం ఉగ్రవాదం నేర్పదని జమ్ యియ్యత్ అహ్లెహదీస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు షేక్ ఫజుల్ రహ్మాన్ ఖురైషి ఉమరి అన్నారు. జమ యియ్యత్ అహ్లెహదీస్ కార్యవర్గ సభ్యుల త్రైమాసిక సమావేశం శనివారం స్థానిక పెన్షన్ లైన్ మసీదులో జరిగింది. ఈ సందర్భంగా ఫజుల్ రెహ్మాన్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలో వదలకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదలు మతం పేరు వాడుకొని ధర్మ పవిత్రతను నాశనం చేస్తున్నారన్నారు. ఉగ్రవాదులకు ధర్మమూ, మతమూ ఉండదదన్నారు. ఈనెల 17న మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో పవిత్ర శ్రీఉమ్ఙ్రా కు వెళ్ళిన అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈనెల 30న జరగబోయే సిరాతె ముస్తఖీమ్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
అర్ధరాత్రి హత్య
● మహిళను వేధించాడంటూ యువకుడిపై ఘాతుకం ● స్నేహితుడే హంతకుడు ● తణుకులో ఘటన తణుకు అర్బన్: నిద్రిస్తున్న యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన తణుకులో సంచలనం రేకెత్తించింది. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ హత్య ఉదంతంతో తణుకు ప్రాంతం ఉలిక్కిపడింది. స్నేహితుల మధ్య ఒక మహిళ విషయంలో రేకెత్తిన అనుమానాలతో ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకులోని పైడిపర్రు గౌతమీ సాల్వెంట్ ప్రాంతంలోని సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న శిరాళం ప్రభాకర్ (28) ఇంట్లోకి వెళ్లిన కందుల శ్రీను, మిత్రుడు కాపకాయల శ్రీను సాయంతో కలిసి కత్తితో అత్యంత దారుణంగా దాడిచేయగా తీవ్రమైన రక్తస్రావం జరిగింది. దాడి తర్వాత నిందితులు తప్పించుకుపోగా వెంటనే కుటుంబసభ్యులు ముందుగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఆపై మెరుగైన వైద్యసేవలకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణం లేదని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఇద్దరూ స్నేహితులే.. సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న ప్రభాకర్, శ్రీను స్నేహితులు కావడంతోపాటు ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. అయితే శ్రీను బంధువు అయిన ఒక మహిళను వేధిస్తున్నాడనే అనుమానంతో ప్రభాకర్‌తో ఇటీవల వాగ్వాదం జరిగింది. దీంతో ప్రభాకర్ తనకు ప్రాణ హాని ఉందంటూ రూరల్ పోలీసులను సైతం ఆశ్రయించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు పంపించగా శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి ఇంకా వివాహం కాకపోగా తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి శిరాళం చిన్నారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన శ్రీనుతోపాటు సహకరించిన మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో మృతుడి పక్కనే ఉన్న సోదరుడు కూడా నిందితులపై ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. చెప్పినట్లే చంపేశాడు ఇద్దరి మధ్య ఏర్పడ్డ తగాదాల అనంతరం ఎలాగైనా కానీ ప్రభాకర్‌ను చంపేస్తానని శ్రీను బాహాటంగానే హెచ్చరించేవాడని, అతను చెప్పినట్లుగానే చంపేశాడని మృతుడి తల్లి చిన్నారి కన్నీళ్ల పర్యంతమయ్యారు. తనను చంపేస్తాడేమోనని ప్రభాకర్ భయపడినా అంతకు తెగిస్తాడని ఊహించలేదంటూ ఘొల్లుమన్నారు. హత్యకు పాల్పడిన కందుల శ్రీనుకు గతంలో కూడా నేరచరిత్ర ఉందని బాధిత వర్గాలు చెబుతున్నారు. గంజాయి తదితర వ్యవహరాల్లో పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి పో స్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. హత్య ఘటన తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తణుకు వ చ్చి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. తణుకు సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై చంద్రశేఖర్‌లు పంచనామా, పోస్టుమార్టంను పర్యవేక్షించారు. -
పరిహారం ఎప్పుడు జమ చేస్తారు ?
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న కివ్వాక గ్రామానికి సంబంధించి 106 మంది నిర్వాసితులకు ఇంటి పరిహారం ఎప్పుడు జమచేస్తారో తేల్చాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో మొత్తం 8 గ్రామాలను ప్రాజెక్ట్ 41.16 కాంటూర్ పరిధిలో పేర్కొనగా ఇటీవల అయా గ్రామాలకు ఆర్ అండ్ ఆర్, కుటుంబ, స్ట్రక్చర్ వాల్యూ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. 41.15 కాంటూర్ పరిధిలో పేర్కొన్న కివ్వాక గ్రామంలో మొత్తం 106 మంది నిర్వాసితుల పేర్లు స్ట్రక్చర్ వాల్యూ జాబితా నుంచి గల్లంతయ్యాయి. దీంతో పేర్లు గల్లంతయిన నిర్వాసితులు వారి పేర్లను పంచాయతీ సర్పంచ్‌తో తీర్మానం చేయించి తగిన ఆధారాలతో సహా అధికారులకు సమర్పించారు. ఇది జరిగి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు నిర్వాసితులకు న్యాయం జరగలేదు. ఆర్ అండ్ ఆర్ సర్వే అనంతరం అధికారులు పంచాయతీ కార్యాలయాల్లో ప్రకటించిన మొదటి రెండు జాబితాల్లో ఉన్న పేర్లు పరిహారం చెల్లింపులు వచ్చేసరికి ఎలా మిస్సవుతాయని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పుకు తాము శిక్ష అనుభవించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలోని పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఆర్ అండ్ ఆర్ కుటుంబ ప్యాకేజీ ఇచ్చి ఇళ్ల పరిహారం విషయంలో తమకు న్యాయం చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావడంలేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్షీరారామలింగేశ్వరస్వామి హుండీ లెక్కింపు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి హుండీ లెక్కించగా రూ.32,64,772 ఆదాయం వచ్చింది. శనివారం దేవదాయ శాఖ భీమవరం డివిజన్ అధికారి వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఎంఈవో రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ ద్వారకాతిరుమల చినవెంకన్నను వేలాది మంది భక్తులు శనివారం దర్శించారు. దాంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. ఎటు చూసినా భక్త జనమే కనిపించారు. దర్శనం క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు. దాంతో ప్రసాద వితరణ క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు, అనివేటి మండపం, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. -
అమలు కాని జీవోలతో రజకులకు ఇక్కట్లు
ఏలూరు (టూటౌన్): అమలు కాని జీవోలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రజకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రజక జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని రజక జనసంఘ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రజక నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రజకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 1984లో జారీ చేసిన జీవోల ప్రకారం ప్రతి జిల్లాలోనూ రజక సంక్షేమ కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సి ఉందని, కాని చాలాచోట్ల ఆచరణ కాలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 62, జీవో 25 ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు జరగాల్సి ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రజకులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నప్పటికి అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల వృత్తి చెరువుల విస్తీర్ణాన్ని జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి, ఆక్రమణలు తొలగించి, హద్దులు నిర్ధారించాలని, విస్తీర్ణాన్ని బట్టి జీవోల ప్రకారంగా శిస్తు నిర్ధారించాలని కోరారు. దోభీ ఘాట్లు, విశ్రాంతి భవనాలు నిర్మించాలని, పాత వాటికి మరమ్మతులు చేపట్టాలని, ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, కదిలి సుబ్బయ్య, శ్రీనివాసు, నాగశేషు, లక్ష్మీప్రసన్న, ఈధర మురళి, అంజుత్తు నాగేశ్వరరావు, కడకట్ల సత్యనారాయణ సురేష్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి నాటక పోటీలు ప్రారంభం
వీరవాసరం : తోలేరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21వ జాతీయస్థాయి నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాటక రంగం ద్వారా ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇతోధికంగా నాటక రంగానికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ముందుగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సంఘ సేవకులు భీమవరం హాస్పటల్ ఎండీ గాదిరాజు గోపాలరాజును ఘనంగా సత్కరించారు. కళావేదికపై మొదటి ప్రదర్శనగా చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి ‘మంచి మనసులు’ నాటిక ప్రదర్శనమైంది. రెండవ ప్రదర్శనగా మద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వంలో మద్దుకూరి ఆర్ట్స్ థియేటర్స్ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటిక ప్రదర్శనమైంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి నాటిక ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చవ్వాకుల సత్యనారాయణ మూర్తి, పోలిశెట్టి సత్యనారాయణ, బుద్దాల వెంకట రామారావు, దాయన సురేష్ చంద్రాజి, రాయప్రోలు భగవాన్, గుండా రామకృష్ణ, జవ్వాది దాశరథి శ్రీనివాస్, కట్రెడ్డి సత్యనారాయణ, మానాపురం సత్యనారాయణ, మురళీకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మెడలు వంచుదాం
నాటక పోటీలు ప్రారంభం తోలేరులో 21వ జాతీయస్థాయి నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మంచి మనసులు, మా ఇంట్లో మహాభారతం నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో uదుర్మార్గ ప్రభుత్వమిది కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆవరణ సమీపంలో ఆక్రమణలకు అడ్డకట్ట పడటం లేదు. శుక్రవారం మరో ముగ్గురు అక్రమ కట్టడాలకు సిద్ధమయ్యారు. 8లో uశనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: ఎన్నికల హామీలను అటకెక్కించి వంచనతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని, సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసే దిశగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పాలకొల్లులో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. దగా పడిన ప్రజల పక్షాన అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన ఉద్యమాల విజయవంతానికి, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నేతలకు దిశానిర్ధేశనం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద రాజు అధ్యక్షతన శుక్రవారం పాలకొల్లు అడబాల గార్డెన్స్‌లో జరిగింది. బొత్స ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు గుడాల శ్రీహరిగోపాలరావు, పీవీఎల్ నరసింహరాజు, చినమిల్లి వెంకటరాయుడు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా జరుగుతోందని, ఇప్పటికే 80 శాతానికి పైగా లక్ష్యం చేరుకున్నామని, మండల, మున్సిపాల్టీల మెయిన్ కమిటీలు దాదాపు పూర్తయ్యాయని ప్రసాదరాజు వివరించారు. మిగిలినవి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ప్రధానమైన వరి, ఆక్వా రైతులకు అండగా ఉద్యమ కార్యాచరణ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు కోరారు. పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కోఆర్డినేటర్లు వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను, ఆడబిడ్డ నిధి పేరిట మహిళలను వంచించిందని, ఏడాదిన్నరలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదని, గతంతో పోలిస్తే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఎస్ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, రాష్ట్ర కార్యదర్శులు ముప్పిడి సంపత్‌కుమార్, పేరిచర్ల విజయనరసింహరాజు, యడ్ల తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రామలింగేశ్వరరెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్లు కామన నాగేశ్వరరావు, జి.సుందర్‌కుమార్, గుబ్బల వీరబ్రహ్మం తదితరులు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి నేతల వైఖరి పట్ల అప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, జగన్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం అవుతున్నాయని నేతలు తెలిపారు. సంస్థాగతంగా బలోపేతం కావాలి: బొత్స . ఉత్సాహంగా కోటి సంతకాల సేకరణ క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ శరవేగంగా కమిటీల నియామకాలు పాలకొల్లులో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ పార్టీ నేతలకు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం పార్టీ అధ్యక్షుడు జగనన్ ఆదేశాల మేరకు సంస్థాగతంగా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సూచించారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుండటం, కమిటీల నియామకాలపై నేతలను అభినందించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని పార్టీ నేతలకు జగన్ ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని బొత్స తెలిపారు. గ్రామస్థాయిలో కమిటీల నియామకం, భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, రాజకీయ హత్యలు, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని, ప్రైవేటు పరం చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే దుర్బుద్ధితో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పాలకొల్లులో ప్రభుత్వ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రభుత్వం అధీనంలో ఉంటే మంచిదా? ప్రైవేటు పరం చేస్తే మంచిదా ? అనే విషయాలను ప్రజలు ఆలోచించాలని బొత్స కోరారుసాక్షి, భీమవరం: పేదల ప్రయోజనాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 26 జిల్లాల్లో 26 మెడికల్ కళాశాలలు ఉండాలని ఆలోచన చేశారన్నారు. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొందరు కూటమి నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం కూడా విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేసిన దాఖలాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం పేదవాళ్లపై ఎందుకు కక్షగట్టిందో అర్థం కావడం లేదని చెప్పారు. అమరావతి పేరిట రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మెడికల్ కళాశాలలకు ఎందుకు కేటాయించలేకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక రాజ్యం : రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, పోలీసులు, తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడపుతున్నారని ఎద్దేవా చేశారు. భీమవరంలో పేకాట క్లబ్బులు ఎక్కువ ఉన్నాయని, ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. నాయకులు, పోలీసులు కుమకై ్క దోచేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం చూస్తే వాస్తవమేనని అనిపించిందని, మరో నాయకుడు వచ్చి అబ్బే అదేం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులను సైతం ప్రభుత్వం నట్టేట ముంచిందని, ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిందని విమర్శించారు. ఏ రైతుకూ బీమా, ఇన్పుట్ సబ్సిడీ రాలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వసతి గృహాల్లో కలుషిత ఆహార సంఘటనలు ఎన్ని జరిగాయో చూడాలన్నారు. సంక్రాంతి నాటికల్లా గోతులు పూడ్చాలంటూ చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడుతున్నారని విమర్శించారు. పాలకొల్లు మెడికల్ కళాశాల వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని బొత్స విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మంచిదో? లేక ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మేలు జరుగుతుందో ప్రజలకు చెప్పాలని మంత్రి నిమ్మలకు సూచించారు. -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
ముసునూరు : వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం బలివేలో కలకలం రేపింది. పొలం తగాదాలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు బొప్పన రామకృష్ణపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు ప్రస్తుతం నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం మండలంలోని బలివే శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన బొప్పన రామకృష్ణ, బాలకృష్ణ అన్నదమ్ములు. వీరి కుటుంబ సభ్యులు 2016లో వడ్లపట్ల వెంకటేశ్వరరావు వద్ద భూమి కొనుగోలు చేశారు. కాగా వెంకటేశ్వరరావు తమ్ముడు వడ్లపట్ల సుబ్బారావు. అతని కుమారుడు ప్రతాప్ అనే వ్యక్తులు భూమి తమదంటూ ప్రతిసారి గొడవలకు దిగుతున్నారు. దీనిపై పలు పర్యాయాలు గొడవలు పడి, పోలీస్ స్టేషన్‌కు, రెవెన్యూ కార్యాలయానికి తిరిగారు. అనంతరం భూమి రామకృష్ణ, బాలకృష్ణ కుటుంబీకులదేనని రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. దీంతో గొడవలు కొంతవరకు సద్దుమణిగాయి. రగిలిన పాత కక్షలు ఇటీవల రామకృష్ణను వైఎస్సార్ సీపీ బలివే గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు మళ్లీ రగులు కోవడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే రామకృష్ణ గుండె సంబంధిత చికిత్స చేయించుకున్నాడు. అతనిపై దాడి చేస్తే, బలహీన పడిపోతారనే ఆలోచనతో శుక్రవారం సాయంత్రం పొలంలోకి వెళ్లిన రామకృష్ణపై సుబ్బారావు, ప్రతాప్ ఇరువురు కలసి చాకు, కత్తితో పోడిచారు. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను అతని సోదరుడు బాలకృష్ణ హుటాహుటీన నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఏరియా ఆస్పత్రికి వెళ్లి రామకృష్ణను పరామర్శించారు. రాజకీయ కక్షలతో దాడికి పాల్పడం విడ్డూరంగా ఉందని, ఇది సహించరాని విషయమని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, జెడ్పీటీసి డా.వరికూటి ప్రతాప్, మాజీ కౌన్సిలర్ కంచర్ల లవకుమార్ మాజీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. -
ఇసుక అక్రమ దందాపై ఫిర్యాదు
పెనుగొండ: ఆచంట నియోజక వర్గంలో అక్రమ ఇసుక దందాకు అంతేలేకుండా పోయిందని వైఎస్సార్ సీపీనాయకులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు పిర్యాదు చేశారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో అక్రమ దందాపై స్వయంగా కలిసి వివరించి వినతి పత్రం సమర్పించారు. అక్రమ దందాపై స్థానిక నాయకులు చేస్తున్న పోరాటాన్ని బొత్స సత్యనారరాయణ అభినందించారు. అక్రమ ఇసుక రవాణాను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ బొత్స దృఫ్టికి తీసుకు వెళ్లడంతో ఎక్కడైనా ఇబ్బందులకు గురిచేస్తే మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, జిల్లా నాయకత్వంతో కలిసి అండగా నిలుస్తామన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ, చెక్పవర్లు రద్దు చేస్తున్నారని వివరించారు. ఏలూరు టౌన్: ఆర్సీహెచ్ పోర్టల్‌లో గర్భిణుల వివరాలు సకాలంలో పొందుపర్చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో కిల్కారీ సేవలపై వైద్య సిబ్బందితో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కిల్కారీ కాల్స్ వచ్చినప్పుడు సమాచారాన్ని వింటూ వాటిని అనుసరించే గర్భిణులు, బాలింతల సంఖ్య పెరగాలని తెలిపారు. ముఖ్యంగా కిల్కారీ కాల్ నెంబర్ 911600403660 ను ప్రతీ గర్భిణి సెల్ఫోన్లో ఉండేలా ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. మరోమారు సమాచారాన్ని వినాలంటే 14423 లేదా 18005321255 టోల్‌ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి వినే అవకాశం ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ వృత్తిలో 20–30 సంవత్సరాలుగా పని చేస్తున్న వారు విద్యాహక్కు చట్టం నిబంధనల మేరకు టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చట్టంలోని క్లాజులు మార్చాలని యూటీఎఫ్ నాయకులు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పుతో దేశం మొత్తం మీద లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయిందన్నారు. టెట్ రాయాలనే నిబంధన కారణంగా రాష్ట్రంలో 1.70 లక్షల మంది సీనియర్ టీచర్లు టెట్ క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితని, లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2011 ముందు 20, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనుభవంతో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లు చేసి ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ ట్రైనింగ్‌లు తీసుకుంటూ అప్డేట్ అవుతూ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష క్వాలిఫై కావాలనే నిబంధనతో మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు పార్లమెంటులో మాట్లాడతానన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు శుక్రవారం పాఠశాల బస్సులపై ఫ్రెండ్లీ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలూరు, నూజివీడు, పెదపాడు, జంగారెడ్డిగూడెం, నిడమర్రు, కలిదిండి ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించారు. ఉదయం, సాయంత్రం కూడా తనిఖీలు చేశారు. బస్సుల ఫిట్నెస్, సౌకర్యాలు, ప్రమాణాలు ఉన్నాయా లేవా, అత్యవసర ద్వారాల పనితీరు వంటి వాటిని తనిఖీ చేశారు. దీంతో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, బాక్సుల్లో అందుబాటులో ఉంచిన మందులు, వాటి తయారీ, వినియోగ తేదీలు తనిఖీ చేశారు. స్వయంగా వారే వాహనాలను నడిపి బస్సుల పనితీరును తెలుసుకున్నారు. ఏఎంవీఐలు స్వామి, జగదీష్, ప్రజ్ఞ, జమీర్, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
డీజిల్ దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం: డీజిల్ దొంగలను శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఎన్వీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఇటీవల లారీల్లోని డీజిల్ దొంగతనాలు చోటు చేసుకోవడం, బాధితుల ఫిర్యాదులతో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఈ నేపథ్యంలో 27వ అర్ధరాత్రి మండలంలోని జాతీయ ప్రధాన రహదారి రామచర్లగూడెం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పీసీ చిట్టిబాబు డ్రోన్ కెమేరాతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారన్నారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి వైపు నుంచి వస్తున్న కారు పోలీసులను చూసి వెనుదిరగడాన్ని గుర్తించి, వెంటనే వెంబడించి అడ్డుకున్నామన్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు చోరీ చేసిన డీజిల్‌ను అమ్మి వచ్చిన సొమ్ముతో జూదక్రీడలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులు ముగ్గురూ పల్నాడు జిల్లాకు చెందిన వారని, వీరు పలు జిల్లాల్లో డీజిల్ దొంగతనాలు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుల నుంచి 30 లీటర్ల 1 డీజిల్ డబ్బా, 7 ఖాళీ డబ్బాలు, డీజిల్ చోరీకి వినియోగించే 30 మీటర్ల పచ్చరంగు పైపు, డ్రైవర్‌ను బెదిరించడానికి ఉపయోగించిన 4 అంగుళాల బ్లేడ్ ఉన్న చాకు, కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను అరెస్టులో ప్రతిభ చూపిన ఎస్సై ఎన్వీ ప్రసాద్, ఏఎస్సై ఎన్వీ సంపత్‌కుమార్, హెచ్‌సీ యు.ఉమామహేశ్వరరావు, పీసీలు సీహెచ్ చిట్టిబాబు, కె.శివాజీ, దిలీప్, ఈ.కిషోర్, యు.రవికుమార్‌లను ఏఎస్పీ సుస్మిత రామనాథన్, సీఐ ఎంవీ సుభాష్ అభినందించారు. నూజివీడు: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆక్రమణల పర్వం ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మండలంలోని దేవరగుంటలో అక్రమార్కులు రెవెన్యూ భూమిని యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. గత కొద్దిరోజులుగా జేసీబీలతో గట్టుపైన ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతా తొలగిస్తున్నా రెవెన్యూ అధికారులు గానీ, వీఆర్వో గాని అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దేవరగుంటలో చింతలగట్టు పేరుతో ఆర్ఎస్ నెంబరు 1లో దాదాపు 259 ఎకరాల రెవెన్యూకు సంబంధించిన కొండ పోరంబోకు భూమి ఉంది. అధికార పార్టీ నాయకుల అండతో కొందరు దాదాపు 50 ఎకరాల రెవెన్యూ భూమిని ఆక్రమించేస్తున్నారు. ఈ ఆక్రమణలపై గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా అటవీ ప్రాంతాన్ని ఇలా నరికేస్తే గ్రామంలోని గొర్రెలు, మేకలు, పశువులకు మేత దొరకకుండా పోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవు దేవరగుంటలోని సర్వే నెంబరు 1లోని కొండ పోరంబోకు భూమిని ఆక్రమిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని నూజివీడు తహసీల్దార్ గుగులోతు బద్రూ తెలిపారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దెందులూరు: చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ శుక్రవారం సీజ్ చేశారు. హైదరాబాదు నుంచి శ్రీ పర్రు గ్రామానికి చికెన్ వ్యర్థ పదార్థాలను వాహనాన్ని సొమవరప్పాడు వద్ద పట్టుకుని సీజ్ చేశామని, దీనికి సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
స.హ. చట్టంపై అవగాహన
ఏలూరు(మెట్రో): తెలుసుకోవడం మీ హక్కు.. చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా ఇరిగేషన్ అధికారులు సమాచార హక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ సీహెచ్ దేవ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి పథకాలు తదితర విషయాలను తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలను స.హ.చట్టం ద్వారా ప్రశ్నిస్తే, దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకు ఆయా నిబంధనలకు లోబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ పుట్టా ధనుంజయులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ శనక్కాయల నరేష్కుమార్, నీరు – ప్రగతి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ వెంకటస్వామి, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సుబ్బారాయుడికి వసంతోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరునికి వసంతోత్సవ వేడుక శుక్రవారం కన్నులపండువగా జరిగింది. ముందుగా ఆలయంలో వల్లీ, దేవసేన సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. అనంతరం నిర్వహించిన గ్రామోత్సవంలో అర్చకులు భక్తులపై వసంతాలను చల్లారు. అంతక ముందు ఆలయంలో మహా పూర్ణాహుతి వేడుకను వేద ఘోషల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శుక్రవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఆలయ భద్రతలో భాగంగా ఈ తనిఖీలు జరిపినట్టు అధికారులు తెలిపారు. ముందుగా ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్ద ఉన్న అట్ట పెట్టెలను పరిశీలించారు. అనంతరం డస్ట్ బిన్లు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచనలు, సలహాలనిచ్చారు. అట్టపెట్టెలు, మూటలు వంటి వాటిని ఎక్కడబడితే అక్కడ పెట్టవద్దని హెచ్చరించారు. ఆ తరువాత క్లోక్ రూమ్‌లో భక్తులు భద్రపరచుకున్న బ్యాగ్‌లు, ఇతర వస్తువులను పరిశీలించారు. అనంతరం ఆలయంలోని మూల మండపాలు, ధ్వజస్తంభం, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతాలను, భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో డాగ్ వీర, బాంబ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అప్‌గ్రేడ్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. 2023లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్–1 గా అప్‌గ్రేడ్ చేయాలని అధికారులు, పాలకవర్గం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 26న మరోసారి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత సంవత్సర ఆదాయం రూ.6 కోట్లు ఉంటే నిబంధనలు ప్రకారం గ్రేడ్–1 మున్సిపాలిటీ అవుతుంది. ప్రస్తుతం సంవత్సర ఆదాయం రూ.6.5 కోట్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 48,994, ప్రస్తుత జనాభా 70 నుంచి 75 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రేడ్–1గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ ప్రజలపై ఎటువంటి పన్నుల భారం ఉండదని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం 29 వార్డులు ఉండగా, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2025–26 విద్యా సంవత్సరానికి జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) డిసెంబరు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్లో, పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం వెబ్సైట్లో ఉంచారన్నారు. -
కొల్లేటికోటలో ఆగని ఆక్రమణలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆవరణ సమీపంలో ఆక్రమణలకు అడ్డకట్ట పడటం లేదు. శుక్రవారం మరో ముగ్గురు అక్రమ కట్టడాలకు సిద్ధమయ్యారు. ఆక్రమణలపై ఇప్పటికే గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై కలెక్టర్ వెట్రిసల్వి సీరియస్ అయ్యారు. ఆర్డీవో అచ్చుత అంబారీష్ను విచారణ చేయాలని ఆదేశించారు. కై కలూరు తహసీల్దారు రామకృష్ణారావును గురువారం కొల్లేటికోట పంపించారు. ఆయన అక్రమణదారుడితో నిర్మాణాలు ఆపివేయాలని ఆదేశించి వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా మరో ముగ్గురు శుక్రవారం అక్రమ కట్టడాలకు ప్రయత్నించారు. దీంతో వీఆర్వో రాజారత్నం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. దేవస్థానం సమీపంలో దాదాపు 40 కుటుంబాలు ఆక్రమించాయని అందరినీ తొలగించాలని ఆక్రమణదారులు పోలీసు, రెవెన్యూ వీఆర్వోతో వాదనకు దిగారు. శనివారం అందరూ ఆధారాలతో కై కలూరు తహసీల్దారు కార్యాలయానికి రావాలని వీఆర్వో వారికి చెప్పారు. సర్వే నంబరు 286లో ఆక్రమణలు దేవస్థాన సమీపంలో సర్వే నంబరు 286లో 8.68 ఎకరాల భూమి ఉంది. దీనిని 12 సబ్ డివిజన్లగా విభజించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భీమవరం, ఆకివీడు ప్రాంతాలకు చెందిన మంతెన దుర్గరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, కనుమూరి సుబ్బరాజు, సోమరాజు, వేగేశ్న పుల్లంరాజు, గోకరాజు నరసింహరాజు, మంతెన రంగరాజు, కాటూరు చెంచయ్య వంటి తదితరులు హక్కుదారులుగా ఉన్నారు. వీరందురు కొన్నేళ్లుగా భూముల వద్దకు రావడం లేదు. పెద్దింట్లమ్మ దేవస్థానం సమీపంలో ఉండటంతో అమ్మవారి దేవస్థానం వచ్చే భక్తులకు ఉపయోగపడుతుందని భావించారు. ఇదే అదునుగా అనేక మంది ఈ భూములను ఆక్రమించారు. గదులు నిర్మించి ప్రతి ఆదివారం వచ్చే భక్తుల నుంచి రూ.వేలల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా రావడంతో మిగిలిన వారూ ఆక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొల్లేటికోట దేవస్థానం వద్ద ఆక్రమణల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది కొల్లేటికోటలో శుక్రవారం ఆక్రమణదారులు పాతిన సరిహద్దు రాళ్లు పోలీసు సిబ్బందికి రెవెన్యూ వీఆర్వో ఫిర్యాదు సర్వే నంబరు 286లో ఆక్రమణల పర్వం గతంలో ఆక్రమణలు తొలగించాలని మెలిక దేవస్థానం సమీపంలో కొందరు భూములకు దస్తావేజులు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి తప్పుడు దస్తావేజులు సృష్టించారనే అనుమానాలు అనేక సంవత్సరాల నుంచి పలువురు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు లింకు డాక్యుమెంట్లతో సహా సరిపోల్చి నకిలీ భూమి పత్రాల గుట్టు విప్పాలని పలువురు కోరుతున్నారు. -
ఏలూరు జిల్లా పేరు మార్చాలి
● రూ.30.54 కోట్లకు పేరుకుపోయిన సెస్సు ● శిధిలావస్థలో జిల్లా కేంద్ర గ్రంథాలయం ● నూతన భవన నిర్మాణానికి నిధుల కొరత జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా పేరును గోదావరి లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ఏలూరు జిల్లా వాసులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు ఉత్తరంగా గోదావరి ప్రవహిస్తోందని, జిల్లా వాసులకు గోదావరితో విడ దీయరాని అనుబంధం ఉందన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాలు, జిల్లా పేరు మార్పులు జరుగుతున్నాయని, ఏలూరు జిల్లా పేరు మార్పు చేయాలని తీర్మానం చేశారు. ఉత్తర గోదావరి జిల్లా పేరు కోసం కమిటీ వేస్తామని నిర్ణయించారు. ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతర విధానాల్లో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మల్లాది సీతా రామలింగేశ్వర రావు, కొప్పాక శ్రీనివాసు, ఈసుపాటి వెంకట రామలక్ష్మి, దాసరి చంద్రశేషు, ముస్తఫా, పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ (పండు), పెనుమర్తి రామకుమార్, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, బొబ్బరపాల్, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రగంథాలయాలకు బకాయిల భారంఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు.. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నెల 14 నుంచి 20 వరకూ జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇవే మాటలు పదేపదే చెప్పారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రంథాలయ సంస్థ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఈ సంస్థకు స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్సు బకాయిలు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. గ్రంథాలయల అభివృద్ధికి సంబంధించిన అవసరమైన నిధుల్లో ఎక్కువ శాతం సెస్సుల ద్వారానే రావాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, పంచాయతీలు వంటి స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో 8 శాతం గ్రంథాలయ సెస్సుగా వసూలు చేస్తున్నాయి. అలా వసూలు చేసిన సెస్సుల్లో గ్రంథాలయాలకు రావాల్సిన వాటా మొత్తం గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. ఈ మేరకు మ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.30.54 కోట్లకు పైగా పేరుకుపోయాయి. వీటిలో సింహభాగం ఒక్క ఏలూరు నగర పాలక సంస్థదే. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.14,35,66,061 బకాయి పెట్టింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు కలిపి మరో రూ.10 కోట్లు, భీమవరం మున్సిపాలిటీ రూ.1,98,41,730 బకాయిపడింది. వీటితో పాటు కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు రూ.50 లక్షలకు పైగానే బకాయిలు పెట్టాయి. శిధిలావస్థలో జిల్లా గ్రంథాలయం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే గ్రంథాలయాల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో అక్కడక్కడా పెచ్చులూడి పాఠకులపై పడుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజుకు సుమారు 500కు పైగా పాఠకులతో కళకళలాడుతూ ఉండే జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రస్తుతం పాఠకులు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ భవనంలోని వివిధ విభాగాలను ఇప్పటికే సంబంధిత అధికారులు మూసివేసి కొద్దిగా బాగున్న గదుల్లో గ్రంథాలయాన్ని నిర్వహిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. ఈ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉంది. పాఠకులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేయడం చూస్తే జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతోంది. నూతన భవన నిర్మాణానికి అనుమతులు శిథిలావస్థలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని గత కొన్నేళ్ళుగా గ్రంథాలయ సంస్థ అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారి నుంచి పెద్దగా స్పందన లభించేది కాదు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.2.99 కోట్లతో చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలవుతూ వస్తున్నాయి. పదేపదే దీనిపై చేసిన ప్రాతినిధ్యం ఫలించి ఎట్టకేలకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా అనుమతులు మంజూరైన తరువాత నూతన భవన నిర్మాణం ప్రారంభించడానికి ప్రయత్నించగా గ్రంథాలయ సంస్థ కోశాగారం ఖాళీగా ఉంది. బకాయిపడ్డ సెస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదురైంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చనే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నూతన భనవ నిర్మాణానికి అనుమతులు మంజూరైన నేపధ్యంలో ముందుగా ప్రస్తుత గ్రంథాలయాన్ని యుద్ధ ప్రాతిపదికపై వేరొక భవనంలోకి తరలించే ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేయాలి. అనుకోని ప్రమాదం సంభవించి ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లా యంత్రాంగం మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. – లేళ్ళ వెంకటేశ్వర రావు, గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి రూ. 30 కోట్లకు పైగా సెస్సు బకాయిలను వసూలు చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. గతంలో ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బిల్లులు, గ్రంథా లయ సెస్సుల బకాయిలు చెల్లించేవారు. ప్రస్తుతం ఆర్థిక సంఘ నిధులు పంచాయతీల ఖాతాల్లో జమయినట్టుగా తెలుస్తోంది. వాటి నుంచి సెస్సు బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి సామాజికవేత్తలు, రచయితలు, సాహితీవేత్తలకు భాగస్వామ్యం కల్పించాలి. – నాగాస్త్ర, జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గ్రంథాలయ సంస్థ నిధుల లేమితో సతమతమౌతోంది. పాఠకులకు మంచి పుస్తకాలు కొనాలన్నా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ కొనాలన్నా నిధులు లేమి వెక్కిరిస్తోంది. కొన్ని స్థానిక సంస్థలు కొద్దోగొప్పో సెస్సు బకాయిలు చెల్లిస్తున్నా అవి సిబ్బంది జీతాలకే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబధించి చేయాల్సిన చెల్లింపులు సైతం చేయలేక వారికి సమాధానం చెప్పలేక గ్రంథాలయ సంస్థ అధికారులు సతమతమవుతున్నారు. -
రూ.20 కోట్లతో ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం
● బకాయిల వసూళ్లపై దృష్టి సారించండి ● ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి నూజివీడు: ఏపీసీపీడీసీఎల్ నూజివీడు డివిజన్లో రూ.20 కోట్ల వ్యయంతో ఐదు 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు సీఎండీ పెరుగు పుల్లారెడ్డి తెలిపారు. నూజివీడులోని ఇండోర్ సబ్‌స్టేషన్‌లో డివిజన్లోని విద్యుత్ శాఖ పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు, తిరువూరుల్లోని టిడ్కో కాలనీల వద్ద, ఆగిరిపల్లి, నెమలి, కొర్లమండలలో విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. దిగవల్లిలోని 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రంకు సంబంధించి స్థల సమస్య ఉందని, దానిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్‌శాఖలోని ఖాళీలను భర్తీ చేయడానికి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 860 జేఎల్ఎం, 56 ఏఈ, 70 జేఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 25వేల మంది పీఎం సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. 200 లోపు యూనిట్లు విద్యుత్‌ను వాడే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను 1.90 లక్షల మందిని గుర్తించామని, వారి ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసేందుకు డివిజన్ స్థాయిలో టెండర్లు పిలిచామన్నారు. ఈ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయన్నారు. పెండింగ్ లేకుండా చూడండి డివిజన్లోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, లైన్ల ఏర్పాటు తదితర వాటికి సంబంధించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఒక్క విస్సన్నపేట మండలంలోని వెయ్యి వరకు ట్రాన్స్ఫార్మర్లు పెండింగ్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి డబ్బులు ముందు చెల్లించిన వారికి ముందు పనిచేయాలన్నారు. డివిజన్లో విద్యుత్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన డిమాండ్‌లో 50 శాతం కూడా వసూలు కావడం లేదని, బాకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఏడీలు ఓఎంఅండ్ స్టాఫ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి పనితీరుపై సమీక్ష నిర్వహించాలని, డివిజన్లో అసలు సమావేశాలు జరుగుతున్న దాఖాలాలు కనిపించడం లేదన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్టిమేషన్లు వేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏఈలను ప్రశ్నించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ఎస్ఈ యూ హనుమయ్య, నూజివీడు ఈఈ ఏ సత్యన్నారాయణ, ఎంఆర్టీ ఈఈ ఏడుకొండలరావు, కనస్ట్రక్షన్ ఈఈ కిషోర్‌కుమార్, సీనియర్ అక్కౌంట్ ఆఫీసర్ నక్కా విజయకుమారి, డీఈలు ఓలేటి దుర్గారావు, ఎం పోతురాజు, రామకృష్ణ, వీరబాబు, ఏఈలు, జేఈలు పాల్గొన్నారు. -
సైబర్ నేరం.. రోజుకో రకం
● సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ స్కామ్‌లు ● డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో లక్షల్లో వసూళ్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు: సైబర్ నేరాలు రోజుకో రూట్ మారుతున్నాయి. మొన్నమొన్నటి వరకు పార్శిల్ వచ్చిందని, పార్శిల్లో మాదక ద్రవ్యాలున్నాయని కస్టమ్స్ పేరుతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసి డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో దందా చేసి నకిలీ ముఠాలు లక్షలు దండుకున్నాయి. కట్‌చేస్తే.. ఏపీకే ఫైల్స్ అంటూ వాట్సాప్‌ల్లో హానికరమైన లింకులు పంపి ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతా గల్లంతు చేసే ముఠాల బారిన అనేకమంది పడ్డారు. ఇక తాజాగా మరోకొత్త సైబర్ మోసం తెరపైకి వచ్చింది. కార్డ్‌డీల్ పేరుతో డిజిటల్ అరెస్ట్ ఖాతా సర్వం ఖాళీ చేసే ముఠాలు దేశవ్యాప్తంగా చెలరేగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అనేక మంది వీటి బారినపడి లక్షలు నష్టపోయారు. దీనికి ప్రధానంగా సీనియర్ సిటిజన్లనే ఎంపిక చేసుకుంటున్నారు. వారినే టార్గెట్ చేసి సులువుగా మాటలతో బెదిరించి నిమిషాల్లో ఖాతాను ఖాళీ చేస్తున్నారు. కార్డ్‌డీల్ మోసం ఇలా సైబర్ మోసాల్లో ప్రస్తుతం కార్డ్ డీల్ మోసం ఎక్కువగా జరుగుతుంది. ఇది కొత్త నేరవిధానం. దీనిలో సైబర్ నేరగాళ్లు బాధితుడిని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెదిరించి నకిలీ సుప్రీంకోర్టు డాక్యుమెంట్లు, క్రిమినల్ కేసుల పేరుతో నకిలీ ఎఫ్ఐఆర్ కాపీలు, అరెస్ట్ వారెంట్లు చూపి డబ్బు డిమాండ్ చేస్తారు. దీనికి కంబోడియా దేశంలో ఉన్న ప్రధాన సూత్రధారులు మన దేశంలోని తమ అసోసియేట్స్ ద్వారా కమిషన్లపై బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి నగదును కార్డ్ డీల్ ద్వారా త్వరితగతిన విత్‌డ్రా చేసి మిగిలిన మొత్తాన్ని కంబోడియా ఆపరేటర్లకు బదలాయింపు చేస్తారు. నేరం జరిగిన తరువాత ఎలాంటి ఆధారాలు జరగకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఇలాంటి మోసమే భీమవరంలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. బాధితులు.. వృద్ధులే : భీమవరం టూటౌన్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రోఫెసర్ని బురిడీ కొట్టంచిన ఘటనలో 13 మంది అంతర్జాతీయ సైబర్ ముఠాని అరెస్ట్ చేసి రూ.42 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏలూరులోనూ ఇదే తరహా మోసం గతంలో వెలుగుచూసింది. ఈఏడాది సెప్టెంబర్‌లో ఒక వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం 7 రాష్ట్రాల్లో పోలీసులు జల్లెడపట్టి 8 మందిని అరెస్టు చేశారు. యూపీకి చెందిన సైబర్ నేరగాళ్లు ఒక బ్యాంకు మేనేజర్, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. -
పునరావాస కేంద్రాలుగా కారాగారాలు
కై కలూరు: ఖైదీలకు పునరావాస కేంద్రాలుగా జైళ్లు మారుతున్నాయని ప్రిజనర్స్, కరక్షనల్(దిద్దుబాటు) సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కై కలూరు సబ్‌జైల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 23వ పెట్రోలియం ఔట్‌లెట్‌ను డీఐజీ ఆఫ్ జైల్స్ డాక్టర్ ఎం.వరప్రసాద్‌తో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైళ్లను పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, సమాజసేవా కేంద్రాలుగా మార్పు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ జైళ్ల శాఖ ద్వారా ఔట్లేట్లు ప్రారంభిస్తుందన్నారు. అనంతరం సమీపంలో రూ.1.63 కోట్లతో నిర్మిస్తున్న నూతన జైలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్ టైల్స్ ఏర్పాటుకు అదనపు ఖర్చు అవుతోందని ఆయన దృష్టికి తీసుకురాగా టెండర్లలో ఎందుకు కోడ్ చేయలేదని ప్రశ్నించారు. త్వరగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సబ్ జైల్స్ ఆఫీస ర్(విజయవాడ) ఎస్.శివశంకర్, ఏలూరు జిల్లా సబ్ జైల్స్ ఆఫీసర్ ఆర్వీ స్వామి, వివిధ ప్రాంతాల జైలర్లు పి.రమేష్, టి.తేజేశ్వరరావు, యూ.ఉమామహేశ్వరరావు, జి.ప్రేమ్‌సాగర్, కై కలూరు డెప్యూటి జైలర్ బొత్సా అప్పారావు, కై కలూరు టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ, మండవల్లి ఎస్సై రామచంద్రరావు, నాయకులు పూలా రాజీ, తోట లక్ష్మి, బాబీ తదితరులు పాల్గొన్నారు.డీజీ ప్రిజనర్స్ అంజినీ కుమార్ -
జగనన్న కాలనీలో డంపింగ్ యార్డు వద్దు
● చెత్త వాహనాలను అడ్డుకున్న కాలనీవాసులు ● కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా నరసాపురం రూరల్: పట్టణానికి చెందిన చెత్తను జగనన్న లేఅవుట్ కాలనీలో వేయొద్దంటూ కాలనీ వాసులు అడ్డుకున్నారు. గురువారం చెత్తను తీసుకువచ్చిన వాహనాలను అడ్డగించి కూటమి నాయకులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై ఆ ప్రాంతవాసులు బైఠాయించి వంట, వార్పు నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. ఆర్డీవో దాసిరాజు, కమిషనర్ ఆంజయ్య వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే మా ప్రాంతంలో చెత్తవేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని వారు తెగేసి చెప్పారు. వేములదీవి, రాజుల్లంక, రుస్తుంబాద, తుంగపాటివారి చెరువు, శ్రీహారిపేట, లాకుపేట తదితర ప్రాంతాల్లో చెత్త వేసేందుకు మునిసిపల్ యంత్రాంగం ప్రయత్నించగా అక్కడి ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే. వారంతా కాదన్నారని తమ ప్రాంతంలో చెత్త వేయడం ఎంతవరకూ సమంజసమని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క మంచినీటి ప్రాజక్టు, మరో పక్క విద్యుత్ సబ్‌స్టేషన్ ఉండగా ఈ ప్రాంతంలో చెత్త వేయాలని నిర్వహించడం చంద్రబాబు సర్కారు నాయకులకు తగదని ముక్తకంఠంతో అన్నారు. అఽధికారులు వారి కార్యాలయ ఆవరణలోనే చెత్తను రీ సైక్లింగ్ చేస్తే బావుంటుందని, అన్నారు. -
చావనైనా చస్తాం.. తవ్వకాలు జరపనివ్వం
నెట్ బాల్ పోటీలు శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో uగ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న రైతులు ఆగిరిపల్లి: మండలంలోని కనసానపల్లిలోని కర్రగట్టు వద్ద ఉన్న అసైన్డ్ భూమిలో గ్రావెల్ తవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రావెల్ తవ్వకాలతో పంట పొలాలు నాశనం అవుతాయని కనసానపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనసానపల్లిలోని కరగ్రట్టు వద్ద ఉన్న సర్వేనెంబర్లో అసైన్డ్ భూములు 252/4 లో 2.08 ఎకరాలు, సర్వే నెంబర్ 252/2లో 0.52 ఎకరాలను గుంటూరుకు చెందిన శ్రీ ఎకో మైన్స్, సుఖవాసి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. గురువారం లీజ్ అనుమతిదారులు తవ్వకాలు ప్రారంభించి గ్రావెల్‌ను లారీల్లో తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. కొండ చుట్టూ సుమారు రెండు వందల ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నామని, లారీల సంచారంతో పంట భూములు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాలు అనుమతి పొందిన వారు బెదిరింపులకు దిగుతున్నారని భయపడే ప్రసక్తి లేదని, ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేసే వరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. -
చంద్రబాబు సర్కారుకు ఉరితాడే
● వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ ● ఏలూరులో జోరుగా కోటి సంతకాల సేకరణ ఏలూరు టౌన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇదే చంద్రబాబు సర్కారుకు ఉరితాడుగా మారుతుందని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ హెచ్చరించారు. ఏలూరులో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు పెద్దసంఖ్యలో హాజరై కోటి సంతకాల సేకరణలో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. వ్యాపారులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారు సంతకాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా సర్వజన ఆసుపత్రులు, నర్సింగ్, ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇక జిల్లా హాస్పిటల్, ఏరియా ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లీనిక్స్‌తో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూడడం నీచమైన ఆలోచన అని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, పైడి భీమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు డింపుల్‌జాబ్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జేవియర్ మాస్టర్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, ఏలూరు లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, లీగల్‌సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ముగిసిన పొగాకు వేలం
రూ.555.29 కోట్ల అమ్మకాలు జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రం–1 పరిధిలో పొగాకు బేళ్ల వేలం ప్రక్రియ గురువారం ముగిసింది. ఆఖరి రోజు వేలంలో మొత్తం 452 బేళ్లు అమ్మకం జరిగినట్లు వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి తెలిపారు. కాగా, వేలం కేంద్రం–1 పరిధిలో ఈ సీజన్‌కు సంబంధించి మొత్తం 18.56 మి.కిలోల వర్జీనియా పొగాకు అమ్మకాలు జరిగాయి. వర్జీనియా పొగాకు కేజీ ఒక్కింటికి రూ. 299.06 సగటు లభించింది. ఈ సీజన్లో గత సీజన్ రికార్డును బ్రేక్ చేస్తూ అత్యధిక ధర రూ.453 నమోదైంది. అలాగే అత్యల్ప ధర రూ.50 నమోదు కాగా, సీజన్ మొత్తంగా రూ. 555.29 కోట్లు విలువైన పొగాకు అమ్మకాలు జరిగినట్లు వర్జీనియా అధికారులు తెలిపారు. కాగా, రైతు సంఘం ఆధ్వర్యంలో వేలం కేంద్రం అధికారులు, సిబ్బందిని, వ్యాపార ప్రతినిధులను ముఠా వర్కర్లు ఘనంగా సత్కరించారు. రైతు నాయకులు పరిమి రాంబాబు, వామిశెట్టి హరిబాబు, కరాటం రెడ్డిబాబు, అల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉందని, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఆరు తాలుకా యూనిట్ ఎన్నికల నిర్వహించుటకు అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న ఈ అడ్హాక్ కమిటీకి భీమవరం ట్రెజరీలో పనిచేస్తున్న యు.పాండురంగారావు ఎన్నికల ప్రక్రియ జరుపుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ హాజరవుతారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్సులు, పెన్షనర్లు సంఘం నాయకులు కె.కామరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పంట నష్టం నివారణ చర్యలపై గురువారం ఆమె అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం కళ్లాలపై ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులకు అవసరమైన టార్ఫాలిన్లు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. అవగాహన కల్పిస్తున్నాం వాతావరణ శాఖ తుపాను హెచ్చరిక నేపథ్యంలో పంట నష్టం జరగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ తెలియజేశారు. కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజిఎస్, ప్రభుత్వ కార్యక్రమాలపై పాజిటివ్ పబ్లిక్ పెరస్పన్ తదితర అంశాలపై ఏపీ సచివాలయం నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కలెక్టర్, రవాణా శాఖ కమిషనరు ఆదేశాల మేరకు జిల్లాలో విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలపై ప్రత్యేక స్నేహపూర్వక తనిఖీలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఇన్‌ఛార్జి ఉప రవాణా కమిషనరు కేఎస్‌ఎంవీ కృష్ణారావు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థల బస్సుల్లోని భద్రతా లోపాలను గుర్తించి వారికి నోటీసులు అందిస్తారన్నారు. విద్యాసంస్థల యాజమాన్యం రవాణా శాఖ అధికారులు నిర్వహించే ప్రత్యేక స్నేహపూర్వక తనిఖీలకు సహకరించాలని కోరారు. వాహన ఫిట్నెస్, ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ప్రత్యేక దృష్టిసారించి కేసులు నమోదు చేస్తామన్నారు. -
చిక్కిన సైబర్ నేరగాళ్లు
● పరారీలో ప్రధాన నిందితుడు ● 13 మంది అరెస్ట్, రూ.42 లక్షల నగదు స్వాధీనం భీమవరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్‌ను బురిడీ కొట్టించి నగదు కాజేసీన సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం భీమవరంలో ఎస్పీ అద్నామ్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్‌తో డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి రూ.78 లక్షలు కాజేశారు. నిందితులు దేశంలోని ఇంటర్నల్ నెట్‌వర్క్‌తో బాధితుడి సొమ్మును బ్యాంక్ ఖాతాలకు రహస్యంగా మళ్లించడానికి కార్డ్ డీల్ పద్ధతిని ఉపయోగించాచారు. దీనిపై బాధితుడు ఈనెల 17వ తేదీన టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేంగా 7 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీ కాగా కంబోడియాలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.42 లక్షల నగదుతో పాటు అంతర్జాతీయ సిమ్‌కార్డులతో కూడిన 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోగా వివిధ బ్యాంక్‌ల్లో సుమారు రూ.19.35 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుల వివరాలు ప్రధాన నిందితుడు రహత్ జే నయన్(ముంబై) పరారీలో ఉండగా పుట్టగుంపుల శ్రీనివాసచౌదరి(బెంగులూరు), గద్రత్తిచిన్ని బ్లాండినా (హైదరాబాద్), పిల్లి వంశీప్రసాద్ (హైదరాబాద్), గద్రత్తి శ్రీకాంత్ (హైదరాబాద్), తమ్మినేని సునీల్‌కుమార్ (హైదరాబాద్), మామిడి వెంకట రోహిణికుమార్(వైజాగ్), కూరగాయల ఈశ్వర్ (వైజాగ్), కొమ్మినేని అజయ్ (ఖమ్మం), తల్లారి జయచంద్రకుమార్(అనంతపురం), పెద్దన్న మంజునాధ్‌రెడ్డి (శ్రీసత్యసాయిజిల్లా), మంకముత్క వేమనారాయణ (అనంతపురం), ములకల రాజేష్ (అనంతపురం), పంకల హనుమంతరెడ్డి (శ్రీసత్యసాయిజిల్లా)లను ఈనెల 26వ తేదీన విజయవాడ సమీపంలోని గన్నవరంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. కేసును ఛేదించడంలో టూటౌన్ సీఐ జి కాళీచరణ్ ఆధ్వర్యలో వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు, ఆకివీడు సీఐ వి జగదీశ్వరరావు, ఎస్సైలు రెహమాన్, హెచ్ నాగరాజు, ఎం.రవివర్మ, ఎన్.శ్రీనివాసరావు, కేఎం వంశీ తదితర సిబ్బందితో కలసి పనిచేసినట్లు ఎస్పీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో భీమవరం, నరసాపురం డీఎస్పీలు ఆర్జీ జయసూర్య, శ్రీవేద పాల్గొన్నారు. -
అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: భీమడోలు మండలం పొలసానిపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగుల్లోకి తీసుకుని వస్తున్నందున తనపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత అంబటి నాగేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలోని చెరువులోని మట్టి, గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని తాను సంబంధిత అధికారులకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు విచారణ చేస్తుండడంతో పంచాయతీ పాలకవర్గంలోని ఇద్దరు సభ్యులు బుధవారం తన సొంతింటి శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. శంకుస్థాపన నిలిపేయడంతో ఆహ్వానించుకున్న బంధువులు, పెద్దలు వెనుతిరిగి వెళ్లిపోయారన్నారు. శంకుస్థాపనను అడ్డుకున్న వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
అంతరాలయ దర్శనం..నయనానందకరం
● ఐదేళ్ల తరువాత తొలిసారిగా అందుబాటులోకి.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు ద్వారకాతిరుమల: ఆపదమొక్కులవాడు ఆ వేంకటేశ్వరుడిని కనులారా వీక్షించిన వారిది కదా భాగ్యము.. దగ్గర నుంచి దర్శించిన వారిది కదా జన్మ ధన్యము. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో శ్రీవారి అంతరాలయ దర్శనం, అమ్మవార్ల ముందు నుంచి సాధారణ (దగ్గర) దర్శనాన్ని ఆలయ అధికారులు గురువారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకున్న భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. ఐదేళ్ల తరువాత మళ్లీ స్వామి వారిని దగ్గర నుంచి దర్శించుకునే వీలు కలిగిందని భక్తజనం సంతోషపడ్డారు. అలాగే బుధవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో వివాహాలు జరుపుకున్నవారు గురువారం ఉదయం ఆలయానికి వచ్చి, స్వామివారి దర్శనం చేసుకుని సంబరపడ్డారు. ఇదిలా ఉంటే అంతరాలయ దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉన్న వారు ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు, దళారుల ప్రమేయం లేకుండా దర్జాగా రూ.500 టికెట్లు తీసుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. తొలిరోజు 610 మంది భక్తులు రూ.500 టికెట్లను కొనుగోలు చేయడం ద్వారా శ్రీవారికి రూ.3,05,000ల ఆదాయం సమకూరింది. సాధారణ దర్శనం వైపే మొగ్గు అంతరాలయ దర్శనానికి, అమ్మవార్ల ముందు నుంచి చేసుకునే సాధారణ దర్శనానికి మధ్య ఒక గుమ్మం మాత్రమే ఉంటుంది. దాంతో ఈ రెండింటికి పెద్ద తేడా లేకపోవడంతో ఒక్కొక్కరికి రూ.500 ఖర్చు చేయడం ఎందుకు? అని భావించిన కొందరు భక్తులు సాధారణ దర్శనం చేసుకున్నారు. స్వామి, అమ్మవార్లు అందరికీ దగ్గర నుంచే కనిపిస్తున్నారు. గతంలో బయట నుంచి దర్శనం చేసుకునేటప్పుడు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లలో కేవలం పద్మావతి అమ్మవారి దర్శనం మాత్రమే అయ్యేది. వృద్ధులకు, కంటి సమస్య ఉన్న వారికి స్వామి వారి దర్శనం కూడా సరిగ్గా అయ్యేది కాదు. తూర్పు గుమ్మం వద్దే సమస్య ఉచిత దర్శనం, అలాగే రూ. 100, రూ. 200, రూ. 500 ల టికెట్లు పొందిన భక్తులు, నిత్యకల్యాణం, అష్టోత్తరం జరిపించుకున్న వారు తూర్పు గుమ్మం మీదుగా ఆలయంలోకి వెళుతున్నారు. ఐదు క్యూలైన్ల భక్తులు ఒకే గుమ్మం, అది కూడా ఇరుకుగా ఉన్న దాంట్లోంచి ఒకేసారి లోపలికి వెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయం, లోపలి నుంచి సాధారణ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ముందే ప్రకటించారు. ఆలయం లోపల ఇరుకుగా ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు అంతరాలయ దర్శనం చేసుకునే వీలు ఉండడం లేదు. ఈ క్రమంలోనే అధికారులు అంతరాలయ దర్శనం టికెట్ రుసుమును రూ.500గా నిర్ణయించడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. టికెట్ ధర తక్కువ ఉంటే రద్దీ పెరిగి, సమస్య తలెత్తేది. అధిక ధర కావడంతో అంతరాలయ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఫిల్టర్ అవుతోంది. ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకోవడం సంతృప్తినిచ్చింది. గతేడాది ఆలయానికి వచ్చినప్పుడు బయట నుంచే పంపించేశారు. దేవుడు కూడా సరిగ్గా కనిపించలేదు. అసలు ఆలయానికి ఎందుకొచ్చానో?తెలియలేదు. కానీ ఈసారి స్వామి, అమ్మవార్లను దగ్గర నుంచి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. – పాలవ ఆంజనేయులు, భక్తుడు, చెక్కపల్లి, ముసునూరు మండలంశ్రీ వారి అంతరాలయ దర్శనానికి, సాధారణ దర్శనానికి పెద్ద తేడా కనబడలేదు. కేవలం ఒక గుమ్మం మాత్రమే అడ్డుగా ఉంది. చెక్కల ర్యాంపు పైనుంచి స్వామివారు స్పష్టంగా కనిపించారు.. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించాను. మంచి దర్శన సౌకర్యాన్ని కల్పించిన ఆలయ అధికారులకు ధన్యవాదాలు. – గొడ్ల బేబీ సరోజిని, భక్తురాలు, ఎంగండి, పామర్రు మండలం -
గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని భక్తులు విమర్శిస్తున్నారు. గోసంరక్షణశాలలోని గిర్ జాతికి చెందిన ఆవు వాకింగ్ ట్రాక్‌లో తిరుగుతూ బుధవారం ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సెప్టిక్ ట్యాంక్‌కు, వాకింగ్ ట్రాక్‌కు మధ్య గురువారం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ రక్షణ చర్యలు ప్రమాదం జరగక ముందు చేపట్టి ఉంటే ఆవు మృతి చెంది ఉండేది కాదని భక్తులు వాపోతున్నారు. క్షేత్రంలో గో వరుస మరణాలు మంచిది కాదని ఓ పక్క పండితులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కై కలూరు: పెళ్లి చేసుకోపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని యుతిని బెదిరించిన యువకుడు, అతనికి సహకరించిన తల్లిదండ్రులపై కై కలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దొడ్డిపట్ల గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి చదవి ఇంటి వద్దే ఉంటుంది. ఏడాది నుంచి కలిదిండి మండలం విభరాంపురం గ్రామానికి చెందిన పామర్తి భార్గవ్(22) ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ ఏడాది జూలై 7న దొడ్డిపట్లలో బాలిక ఇంటికి ఎవరూ లేని సమయంలో గోడ దూకి వచ్చాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. తిరిగి ఈ నెల 23న వివాహం చేసుకోపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. యువకుడికి అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శివరామలక్ష్మీ సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ద్వారకాతిరుమల: ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన మండలంలోని సూర్యచంద్రరావుపేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తణుకుకు చెందిన ఓ లారీ వరంగల్ నుంచి తవుడు లోడుతో తణుకు పట్టణానికి వెళుతోంది. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఓవర్ టేక్ చేయబోయింది. అయితే బస్సు మీదకు రావడంతో లారీ డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ ముందు రెండు చక్రాలు విరిగిపోయి, అక్కడే నిలిచిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పిందని అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): డిసెంబర్ 1న ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్ల పంపిణీ, బంగారు కుటుంబాలను కలిసి, మార్గదర్శకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉందన్నారు. గొల్లగూడెం, గోపీనాథపట్నంలలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్, సభాస్థలి ప్రాంతాలను అధికారులు పరిశీలించి, ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. -
మేడపాడు హోంకు తరలింపు
పెంటపాడు: బాలికపై సంరక్షురాలి ఘాతుకం అని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్ జిల్లా అధికారులు స్పందించారు. గణపవరం ప్రాజెక్టు సీడీపీవో టీఎల్ సరస్వతి, భీమవరానికి చెందిన ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ గురువారం బాధితులకు కలిశారు. బాధితురాలు గోండి సంతోషిణినితో పాటు, ఆమె సోదరుడు గొండి విజయ్ కుమార్‌లను సంరక్షుల సమ్మతి మేరకు పాలకొల్లు సమీపంలో ఉన్న మేడపాడులో సీడబ్యూసీ హోమ్‌కు తరలించారు. వేరే దేశంలో ఉన్న వారి తల్లి జ్యోతిని ఫోన్లో సంప్రదించి ఆమె సమ్మతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటపాడు ఐసీడీఎస్ వర్కర్లు కనకలక్ష్మి, అనురాధ తెలిపారు. దెందులూరు: వివాహానికి వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును దుండగులు అపహరించారు. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్ల సత్యవతి వివాహానికి హాజరయ్యేందుకు దెందులూరు మండలం ఉండ్రాజవరం గ్రామానికి వెళ్తుంది. ఈ సత్యవతి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి అపహరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ వివరించారు. -
వంశధార జట్టుపై కొల్లేరు జట్టు విజయం
మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్‌బాల్ లీగ్ పోటీలు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్‌లో కొల్లేరు, వంశధార జట్లు తలపడ్డాయి. కొల్లేరు 4–1 గోల్స్ తేడాతో వంశధారపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లకు ముఖ్యఅతిథులుగా డైరెక్టర్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ పర్వతనేని సుభాష్‌బాబు, ఏరియా లీడర్ మూలుపూరి ఉపేంద్ర, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జి.రవీంద్ర రానా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తరఫున వై.శేషగిరిరావు, బి.చక్రవర్తి, జి.ఎస్.ఎస్ పవన్‌కుమార్, పండరి శ్రీనివాస్ పోటీలను పర్యవేక్షించారు. -
రాగి వైర్లు చోరీ చేసే ముఠా అరెస్టు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ చేసే ముఠాలో ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందడంతో ముఠా మొత్తం గుట్టురట్టయ్యింది. ఈ ఘటనకు సంబంధించి జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం పాల్వంచ, మణుగూరు, పరకాల ప్రాంతాలకు చెందిన కెల్లా దుర్గాప్రసాద్, షేక్ హైమత్, దేవకోటి రాజేష్, కండెల జ్యోతి, కూరాకుల పద్మ, కోరగట్టు నాగరాజు ఒక ముఠాగా ఏర్పడి ఆంధ్రా ప్రాంతానికి వచ్చి ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న రాత్రి తడికలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావికంపాడు గ్రామ శివారులో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగివైరు దొంగిలించడానికి రెండు కార్లలో వచ్చారు. దొంగతనం చేసే క్రమంలో ముఠాలోని సభ్యుడైన కోరగట్టు నాగరాజు ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. అయితే వైర్లను తప్పించే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ముఠా సభ్యులు నాగరాజును జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముఠాలోని ఐదుగురు సభ్యులు పారిపోయి మృతుడు నాగరాజు బావ అయిన పాల్వంచ మండలం కొత్తసూరారం గ్రామానికి చెందిన చాపా రాములుకు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి నాగరాజు మృతదేహం చూసి తడికలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు కేసు నమోదు చేసి, సీఐ ఎంవీ సుభాష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులకు అందిన సమాచారం మేరకు రావికంపాడు బస్‌స్టాప్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా రెండు కార్లలో వెళుతున్న కెల్లా దుర్గాప్రసాద్, షేక్ హైమత్, దేవకోటి రాజేష్, కండెల జ్యోతి, కూరాకుల పద్మను గుర్తించి అరెస్టు చేశారు. కాగా నిందితుల్లో కెల్లా దుర్గాప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్రం పాల్వంచ, ఎడుల్ల బయ్యారం పోలీస్స్టేషన్లలో 13 కేసులు ఉండగా, కండెల జ్యోతి, కూరాకుల పద్మలపై మెదక్‌లో ఒక కేసు ఉంది. నిందితులను కోర్టులో హాజరు పరిచనున్నట్లు తెలిపారు. అలాగే నిందితులు వినియోగించిన రెండు కార్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ చేసేందుకు వినియోగించే పరిరకాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్, ఏఎస్సై ఎన్వీ సంపత్‌కుమార్, జంగారెడ్డిగూడెం పీసీలు ఎన్.రమేష్, ఎస్కే షాన్బాబులకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. ముఠా సభ్యుడి మృతితో గుట్టురట్టు -
సోమేశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు
భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక గునుపూడిలో ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కించారు. 40 రోజులకు గానూ ప్రధాన హుండీల ద్వారా రూ.27,03,849, అన్నదానం హుండీ ద్వారా రూ.1,27,617 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు ఏవీసత్యనారాయణరాజు, పీటీ గోవింద్, ఎంవీ రామరాజు, ఆలయ ప్రధాన అర్చకులు సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఏలూరు రూరల్: భీమవరానికి చెందిన క్రికెటర్ బి.మునీష్‌వర్మ ఆంధ్ర టి20 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్టణం జిల్లాలో ఆంధ్ర క్రికెట్ ప్రిమియర్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాస్ట్బౌలర్, బ్యాట్స్‌మెన్‌గా ప్రతిభ చాటని మునీష్వర్మను సెలక్టర్లు ఆంధ్ర జట్టుకు ఎంపిక చేసారు. దీంతో త్వరలో లక్నోలో జరగబోయే ఆల్ ఇండియా సయ్యద్ ముస్తాక్ఆలీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. -
ఉత్సాహంగా అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలు
దెందులూరు: పోటీతత్వం పట్టుదల నిరంతర సాధన ఈ రంగంలోనైనా విజయాన్ని తెచ్చిపెడుతుందని ఏలూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ మహమ్మద్ అజీజ్, దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి అన్నారు. గురువారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో రెండు రోజుల అంతర్ కళాశాలల వాలీబాల్ మహిళల పోటీలు ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియేలు మాట్లాడుతూ రెండు రోజుల వాలీబాల్ మహిళల పోటీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఐదు జిల్లాల్లో 14 కళాశాల నుంచి మహిళలు హాజరయ్యారన్నారు. ఈ పోటీల్లో యూనివర్సిటీ టీంను ఎంపిక చేశారన్నారు. ఈ పోటీల్లో సెయింట్ థెరిస్సా కాలేజీ ఏలూరు ప్రథమ స్థానం, ప్రభుత్వ కళాశాల రంపచోడవరం ద్వితీయ స్థానం, సీఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ జట్టు తృతీయ స్థానం సాధించాయన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పోలిరెడ్డి విజేతలకు షీల్డ్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులను ఉద్యమానికి సిద్ధం చేయాల్సిన రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించకుండా వచ్చే సంవత్సరం మార్చి నుంచి టీచర్లు ఉద్యమ బాట పడతారని పత్రికా ముఖంగా ప్రకటించడం బాధ్యతారహితమని ఏపీటీఎఫ్ ఏలూరు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురమ ఆనంద కుమార్, అబ్బదాసరి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. -
రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వాలు
భీమవరం: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్స్ ప్రభుత్వమని, కార్పొరేట్లకు రాయితీలిస్తున్నారు కానీ రైతుల ఆత్మహత్యలు నివారించలేకపోతున్నారని అఖిల భారత కిసాన్ సభ ఆలిండియా అధ్యక్షుడు అశోక్ థావలే విమర్శించారు. గురువారం స్థానిక ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో ఉద్ధరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంతెన సీతారాం అధ్యక్షతన రైతాంగ సమస్యలు, ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ 2047 విజన్ పేరుతో కార్పొరేట్లకు భూములు దోచిపెట్టాలని చూస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మొదటి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే సంగతిని పాలకులు గుర్తించాలన్నారు. అమరావతి రాజధాని కోసం వందలాది ఎకరాలు బలవంతంగా రైతుల నుంచి సేకరించారని అశోక్ థావలే విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, బి.బలరామ్, ఎ రవి, జేఎన్వీ గోపాలన్, కె.రాజరామోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలు
పాలకోడేరు: గ్రామీణ యువత క్రీడల్లో సత్తా చాటేందుకు స్కూల్ గేమ్స్ పోటీలు ఎంతగానే ఉపయోగపడతాయని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి తెలిపారు. శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ అండర్–14 బాలుర, బాలికల పోటీలను గురువారం డీఈఓ నారాయణతో కలసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగేలీ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 390 మంది క్రీడాకారులు తరలిరాగా తొలిరోజు లీగ్ మ్యాచ్‌లు ఉత్సామంగా సాగాయి. 29న ఫైనల్ పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ పరిశీలకులు కల్పన తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 హరిఆనందప్రసాద్, ఎస్ఎఫ్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
డొక్కు బస్సులే దిక్కు
ఆర్టీసీ బస్సులకు జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆర్టీసీ డ్రైవర్లకు తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్యారేజ్ సిబ్బందికి కీలక సూచనలిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి దాటిన ఏ ఒక్క బస్సునూ అదనంగా ఒక్క రోజు కూడా తిప్పడం లేదు. ప్రమాదాలు జరగడం విచారకరం. లోపాలను సరి చేసుకుని ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడతాం. – షేక్ షబ్నం, ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనే నినాదంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆకర్షించి సత్ఫలితాలు రాబట్టింది. అయితే ఇటీవల ఆర్టీసీ బస్సుల నిర్వహణను గాలికొదిలేయడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులు మరణం అంచుల వరకూ వెళ్లి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్న సంఘటనలు ఉన్నాయి. నల్లటి పొగను వదులుతూ వాతావరణ కాలుష్యానికి కారణంగా నిలుస్తున్న బస్సులు కొన్ని కాగా.. గేర్లు పని చేయక, బ్రేకులు పడక చెట్లను, విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన బస్సులు ఉంటున్నాయి. ఇటీవల సీ్త్ర శక్తి పథకాన్ని ప్రవేశ పెట్టి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసిన నాటి నుంచి బస్సుల నిర్వహణ మరింతగా దిగజారిందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నుంచి చింతలపూడి, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో తిప్పుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు తరచూ ఆగిపోయి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బస్సు దిగి కొంత దూరం తోస్తేగానీ ఇంజన్ స్టార్ట్ అవ్వని సంఘటనలు కోకొల్లలు. ఈ రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం, వాటిని పూడ్చే చర్యలు కూడా చేపట్టకపోవడమే ఈ ప్రమాదాలకు కారణంగా చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన లింగపాలెం వద్ద ఒక పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి రహదారి పక్క తుప్పల్లోకి వెళ్ళిపోయింది. ఈ నెల 22న ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావు పేట వద్ద మరో పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తోటలోకి దూసుకుపోయి కొబ్బరి చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సుల నిర్వహణ లోపాలకు ఇలాంటి ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఆయా ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలకు త్రుటిలో ముప్పు తప్పినా ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్య స్థానాలకు వెళ్తామా లేదా అనే సందేహాలకు మాత్రం తావిస్తోంది. 15 లక్షల కిలోమీటర్లు తిరిగినా అవే దిక్కు ఏలూరు జిల్లాలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ శాతం అత్యధిక కిలోమీటర్లు తిరిగినవే. పెద్ద సిటీల్లో సిటీ బస్సులుగా తిరిగిన బస్సులను ఇక్కడకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ తదితర బస్సులను జిల్లాలో తిప్పుతున్నారని అంటున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో మొత్తం 224 ఆర్టీసీ బస్సులు, మరో 83 అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఆర్టీసీ తిప్పుతున్న 224 బస్సుల్లో ఎక్కువ శాతం డొక్కు బస్సులే ఉన్నాయి. ఉన్న బస్సుల్లో దాదాపు మూడింట రెండు వంతుల బస్సులు డొక్కువే. ఈ బస్సుల్లో 15 నుంచి 20 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 73, 10 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 66 ఉన్నాయి. సాధారణంగా ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగే ఆర్టీసీ బస్సుల జీవన ప్రమాణం కేవలం 15 సంవత్సరాలకే పరిమితం. ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులకు తంటాలు మధ్యలోనే ఆగిపోవడంతో ఇక్కట్లు 15 లక్షల కిలోమీటర్లు తిరిగినా వాటినే తిప్పుతున్న వైనం 7 నెలల్లో 14 ప్రమాదాలు, 6 మరణాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ ఏలూరు జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సులకు మొత్తం 14 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 6 ఘోర ప్రమాదాలు కాగా మరో నాలుగు భారీ ప్రమాదాలు, గత ఏడు నెలల్లో జరిగిన ఈ 6 ఘోర ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బస్సులకు ఎంతగా నిర్వహణ చేపట్టినా సుమారు 15 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగిన బస్సులు కావడంతోనే ప్రమాదాలకు గురవుతున్నాయని, ఆయా ప్రమాదాలకు ఆర్టీసీ డ్రైవర్లనో, గ్యారేజ్ సిబ్బందినో తప్పుపట్టలేమంటున్నారు. జిల్లాలో 1 నుంచి 5 లక్షల లోపు కిలోమీటర్లు తిరిగిన బస్సులు కేవలం 42, 5 నుంచి 10 లక్షల కిలోమీటర్ల మధ్యన తిరిగిన బస్సులు మరో 43 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో తిప్పుతున్న ఆర్టీసీ బస్సుల్లో కొద్దిగా కొత్తవి కేవలం 42 మాత్రమే ఉండడం విచారకరమంటున్నారు. -
కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని, ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు పెంచరాదని, కొల్లేరు ప్రజలు, రైతులు జీవించే హక్కు కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు కెనాల్ రోడ్డులోని యుటీఎఫ్ జిల్లా కార్యాలయంలో కొల్లేరు ప్రజలు, రైతుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎ.రవి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ 120 జీవో కొల్లేరు ప్రజల జీవితాలను నాశనం చేసిందని, కొల్లేరును 3వ కాంటూరుకు కుదిస్తామని ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు గట్టు చేరాక బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలలో మూడు లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారని తెలిపారు. 146 సొసైటీలు ఏర్పాటు చేసి 7,100 ఎకరాలలో చేపల చెరువులు తవ్వకపోతే ఊరుకోమని ఆనాటి వెంగళరావు ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఇప్పటి ప్రభుత్వాలు మీరు చేపల చెరువులే కాదు వ్యవసాయం కూడా చేయకూడని ఆంక్షలు విధిస్తోందన్నారు. కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలని, 146 సొసైటీలు పునరుద్ధరణ చేయాలని, 14,800 ఎకరాలు జిరాయితీ భూమి హక్కుదార్లకు అప్పగించాలని కోరారు. ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు విస్తరించరాదని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు ఎం.ఎస్.ఎస్.గంగాధర్, ఎం.కొండలరావు, జి.పార్ధసారథి, జి.ఖ్యాతి పుష్పశ్రీ, ఎ.కాశీరాజు తదితరులు మాట్లాడారు. -
నూజివీడు మార్కెట్లోకి చిన్న రసాలు
నూజివీడు: పట్టణంలోని మార్కెట్లోకి మామిడి చిన్న రసాలు వచ్చాయి. మున్సిపాలిటీ సమీపంలోని పండ్లమార్కెట్ సెంటర్, రైతు బజార్ వద్ద తోపుడు బండ్లపై చిన్న రసాలను వీధి వ్యాపారులు విక్రయిస్తున్నారు. కాయను సైజును బట్టి రూ.80 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. పప్పులో వేసుకొని వండుకుంటే మంచి రుచిగా ఉండటంతో రసాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏలూరు (టూటౌన్ ): భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో, బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, ఉమ్మడి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయ వాదులు, కోర్టు ఉద్యోగులు, పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్.కె.ఎం, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం ఏలూరులో భారీ ర్యాలీలు, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏఐటీయుసీ, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే అధ్యక్షతన జరిగిన సభలో రైతు–కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి ఝాన్సీ, సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, బీకెఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, బీకెఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువీ, ఏఐయుకెఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె.గౌస్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏలూరు (టూటౌన్): మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుంచి ద్వారకాతిరుమల మండలం హనుమాన్‌గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు రూ.20 లక్షల బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులకు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని, విత్తన కంపెనీ నుంచి రైతులకు అగ్రిమెంట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం – ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాన్ గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్ ఆర్గనైజర్ చేతిలో మోసపోయారని వారికి న్యాయం చేయాలని కోరారు. -
22ఏ భూముల పరిష్కారానికి మెగా క్యాంపు
ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 15వ లోగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు మెగా క్యాంపు నిర్వహించాలని, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, 22 ఏ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడూతూ 22 ఏ కింద నమోదైన భూములలో జిరాయితీ భూములు ఉండడంతో సదరు భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం అందించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని జిల్లాలోనూ 22 ఏ కింద పొరపాటుగా నమోదైన భూములను సదరు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారన్నారు.ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు 50.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, గత సంవత్సరం కన్నా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంతవరకు అధికంగా సేకరించామన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం తడిచిపోకుండా ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, వాటిని రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. ఎరువులు కొరతపై వ్యవసాయాధికారులు ప్రతి వారం సంబంధిత శాసనసభ్యులతో చర్చించాలని, ఎక్కడైనా సాగులో రైతులు సమస్యలు ఎదుర్కొంటే తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు మరమ్మతులు చేయాలి రోడ్లు గుంతలు లేకుండా చూడాలని, ఏలూరు నుంచి ఆశ్రం ఆసుపత్రికి వెళ్లే రహదారిలో వెంటనే మరమ్మతులు చేసి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేయాలన్నారు. వచ్చే మార్చి నాటికి పురోగతిలో ఉన్న 38 వేల గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న పేదల ఇళ్ల కాలనీలకు విద్యుత్, నీరు, రహదారి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి మంత్రి నాదెండ్ల -
శుభకార్యాలకువిరామం
● రేపటి నుంచి ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవు ● శుక్ర మౌఢ్యమే కారణం ద్వారకాతిరుమల: పెళ్లికి అతి ముఖ్యమైంది ముహూర్తం. బలమైన ముహూర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహూర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహూర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యమి(మూఢం), వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభకార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్ధంగా ఉన్న వారు మంచి ముహూర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. వివాహాలకు వేదికై న ద్వారకాతిరుమల శ్రీవారి దివ్య క్షేత్రంలో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేద మంత్రాలు ఈ 80 రోజుల పాటు వినబడవు. మాఘమాసమూ మూఢంలోనే.. మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢమిలో కలవడంతో ఒక్క ముహూర్తం కూడా లేదు. అంతే కాదు.. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిధులు కూడా మూఢంలో కలిసిపోయాయి. వ్యాపారులకు గడ్డు కాలం శుభకార్యాలకు బ్రేక్ పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డు కాలమనే చెప్పాలి. మండపాలు, ఫంక్షన్ హాల్స్, వస్త్ర దుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్, క్యాటరింగ్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, టెంట్‌హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డిజే బాక్సులు అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు, ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహ శక్తులు బలహీనమవడంతో శుక్ర గ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో, శుక్రుడు కూడా అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే సంబంధాలు, వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. శుక్ర మౌఢ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోడం శుభ సూచకం కాదని అంటున్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెంలోని జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై ఎన్వీ ప్రసాద్, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంకు చెందిన వీపు వెంకటేష్, తూంపాటి జీవరత్నం మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారి మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేయగా, వారి వద్ద మూడు గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని విచారించగా, ఒరిస్సా నుంచి వీటిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా గంజాయి ప్యాకెట్లలో ఒకటి 1.420 కేజీలు ఉండగా, మరో రెండు ప్యాకెట్లు 105 గ్రాముల చొప్పున ఉన్నాయి. మొత్తం 1.630 కేజీల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సుభాష్ చెప్పారు. నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఇంజినీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సర విద్యార్థులు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) పరీక్షల్లో 97.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ బుధవారం తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు 140 ఎన్పీటీఈఎల్ కోర్సులను ఎంపిక చేసుకున్నారన్నారు. విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రతిభను కనబరిచి మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించినట్లు వివరించారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలు కలిపి 10,113 మంది విద్యార్థులు ఎన్పీటీఈఎల్ సర్టిఫికెట్లు పొందగా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన 2,473 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారని పేర్కొన్నారు. ఎన్పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏలూరు (టూటౌన్): రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అవసరమైన నెట్, కలెక్టరేట్‌కు డేటా అనుసంధానం వంటి విషయాల్లో అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి రామకృష్ణ కోరారు. జిల్లా కలెక్టరేట్లో బుధవారం పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌కు ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తామే సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను కొనుగోలు చేసినా, దానికి అవసరమయ్యే ఇంటర్నెట్, కలెక్టరేట్‌కు అనుసంధానం వ్యవహారం వ్యయప్రయాసలకు సంబంధించిన విషయం అని, కావున ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల నేతలు బి ప్రసాద్ రాజు, సిపాని రాజశేఖర్, కేఎన్వీ ప్రసాద్, జయరాజు, పి.శివరామకృష్ణ, రవికుమార్, వేము ఆరోగ్యం, బి నాగు, కే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఏఐసీసీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, పంజాబ్ మాజీ ఎంపీ జస్వీర్‌సింగ్ దింపా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం నరసాపురంలో ఆయన పర్యటించారు. స్థానిక సన్‌రైజ్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మోదీ మోసాలతో కూడిన పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పాలన కూడా ప్రజల విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతుందని చెప్పారు. -
సోషల్ ఆడిట్ల ద్వారా అభ్యసనా సామర్థ్యాల మెరుగు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలల్లో సోషల్ ఆడిట్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడడంతో పాటు వారిలో విద్యా నైపుణ్యాలు పెంపొందుతాయని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ అన్నారు. జిల్లా స్థాయి సాల్ట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక సుబ్బమ్మాదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో క్లస్టర్ రీసోర్స్ మొబైల్ టీచర్స్ (సీఆర్ఎంటీ)లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పంకజ్ కుమార్ మాట్లాడుతూ సీఆర్ఎంటీలు పాఠశాలల స్థితిగతులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ మాట్లాడు తూ సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని సీఆర్ఎంటీలు విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏఎంఓ ఆర్.రామారావు, సీఎంఓ డీ.యెహోషువా, ఏఎల్‌ఎస్‌సీఓ సొంగా నాగేశ్వరరావు, ఏఎస్ఓ ఆర్.రామకృష్ణారావు పాల్గొన్నారు. -
మెడికల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 3వ ఏడాది వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన సహచర విద్యార్థులు ఏలూరు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి చదువులో ప్రతిభ చూపుతాడనీ, వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై అధిక మోతాదులో పారాసిట్మల్ ట్యాబ్లెట్లు మింగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వైద్య అధికారులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి వైద్య విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించారు. -
శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా
● భక్తిశ్రద్ధలతో షష్ఠి తిరునాళ్లు ● అత్తిలి, కై కరంలో పోటెత్తిన భక్తులు ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు అత్తిలి: షష్ఠి తిరునాళ్ల భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేకువజామునుంచే భక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద పోటెత్తారు. పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి షష్ఠి మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత దర్శనంతోపాటు ప్రత్యేక దర్శన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోగల శ్రీనాగేంద్రుని సర్పానికి మహిళలు పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో సంతానం కలిగిన దంపతులు తమ చిన్నారుల శిరస్సుపై నుంచి బూరెలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్వీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో షష్ఠి ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవేణుగోపాల కోలాట మండలి, శ్రీవీరవినాయక విఠల్ కోలాట భజన మండలి వారిచే నిర్వహించిన కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తణుకు రూరల్ సీఐ బి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో అత్తిలి ఎస్సై పి ప్రేమరాజు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్స్, కొలంబస్‌ల వద్ద సందడి నెలకొంది. పలు దుకాణాల వద్ద వస్తుసామాగ్రిని కొనుగోలు చేసేందుకు మహిళలు బారులు తీరారు. ఉత్సవాల్లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు, భక్తులకు పాలు, తాగునీరు అందజేశారు. వైభవంగా కై కరం షష్ఠి తిరునాళ్లు ఉంగుటూరు: కై కరం నాగమ్మ తల్లి షష్ఠి తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం వేకువ జాము కల్యాణం అనంతరం భక్తులు నాగమ్మ తల్లిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాగమ్మకు పాలు పోసి పూజలు చేశారు. భక్తులు నాగమ్మ తల్లి దర్శనం అనంతరం షష్ఠి తిరునాళ్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్సై సూర్య భగవాన్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రీవారి క్షేత్రంలో అట్టహాసంగా వేడుక ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన చెరువు వీధిలోని శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి దంపతులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, పండితులు శైవాగమం ప్రకారం కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని నామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. -
పెద్దింట్లమ్మ దేవస్థానం భూముల కబ్జా!
కై కలూరు: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రెవెన్యూ అధికారులు భూ కబ్జాలపై ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తోన్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే ఇరిగేషన్, డ్రెయినేజీ భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తాజాగా అక్రమార్కుల కన్ను జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థాన ఆవరణ భూములపై పడింది. అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల నుంచి గదుల రూపంలో అద్దెలు వసూలు చేయడానికి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆక్రమణల తొలగింపు కొల్లేటికోట దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వం ఎకరం స్థలాన్ని స్థానిక వ్యాపారులు ఆక్రమించారు. దుకాణాలను ఏర్పాటు చేసుకుని అమ్మ దర్శనానికి వచ్చే భక్తుల నుంచి అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) దేవస్థానం వద్ద ఆక్రమణలను తొలగించారు. సమీప జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా దాతల సాయంతో అతి పెద్ద అనివేటి మండపాన్ని నిర్మించారు. ఆక్రమణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భక్తులను దృష్టిలో పెట్టుకుని డీఎన్నార్ పనులు చేయించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను అందరూ సమర్థించారు. అనంతరం దేవస్థానంలో నిర్మించిన గోడను చంద్రబాబు ప్రభుత్వంలో పగలగొట్టి వ్యాపారుల కోసం అడ్డగోలుగా గేటు ఏర్పాటు చేయడం విమర్శల పాలైంది. దోచుకోడానికి సన్నద్ధం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంకు ప్రతి ఆదివారం వేలల్లో భక్తులు వస్తారు. జాతర సమయంలో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దేవస్థానం తరుపున 12 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మాత్రం భక్తులకు సరిపోవడం లేదు. దీంతో దేవస్థానం సమీపంలో ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా సుమారు 80 గదులను నిర్మించారు. ఒక్కో ఏసీ గదిని వంట షామియానాతో కలుపుకుని రూ.5 వేల నుంచి రూ.6 వేలకు ఆదివారం రోజున అద్దెకు ఇస్తున్నారు. ఆదాయం బాగా రావడంతో మిగిలిన అక్రమార్కులు కొద్ది రోజులుగా దేవస్థానం సమీపంలో 6 ఇళ్లకు స్తంభాలు పాతారు. వీరికి కొల్లేరు పెద్దల్లో కొందరు సహాకరిస్తున్నారు. తొలగిస్తే అక్రమాలు అన్ని తొలగించాలని మెళిక పెడుతున్నారు. ఆక్రమలపై రెవెన్యూ, ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదు. పెద్దల పంచాయితీ దేవస్థాన సమీపంలో అక్రమ నిర్మాణాలపై నాలుగు రోజుల క్రితం పందిరిపల్లిగూడెం చావిడి వద్ద పెద్దల పంచాయితీ జరిగింది. అక్రమార్కులు మా పనులు ఆపితే అందరి ఆక్రమణలు తొలగించాలని వాదించారు. చివరకు పెద్దలు భక్తుల సౌకర్యార్థం గ్రామం తరుపున గదులు నిర్మించి 60 శాతం పంచాయతీ అభివృద్ధికి, 40 శాతం దేవస్థానంకు చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందిద్దామని నిర్ణయించారు. పూర్వం నుంచి దేవస్థానం వద్ద జీవనోపాధి పొందుతున్న వ్యాపారులకు సమీపంలో స్థలాలు అందించారని, కొత్త వ్యక్తులు ఆక్రమణలు చేయవద్దని కోరారు. దీనిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని నిర్ణయించారు. కొల్లేటి పెద్దల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు ఇళ్లు నిర్మించి భక్తులకు అద్దెకు ఇవ్వడానికి పన్నాగం పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై పందిరిపల్లిగూడెంలో పంచాయితీ పెద్దింట్లమ్మ దేవస్థానంకు కేటాయించిన చెందిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాం. అక్రమ నిర్మాణాలు అనేవి ప్రహరీ బయట జరిగే అవకాశం ఉంది. దేవస్థాన భూముల్లో ఎటువంటి అక్రమ నిర్మాణాలకు తావు లేదు. దేవస్థానం గదులు 12 మాత్రమే ఉన్నాయి. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. – కూచిపూడి శ్రీనివాసు, ఆలయ ఈవో, కొల్లేటికోట -
మూడు రోజులుగా అందని కోడిగుడ్డు
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్డు పెట్టడం లేదు. ఒకవైపు చికెన్ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి విదితమే. అయితే ఈనెల 24నుంచి కోడిగుడ్లూ కూడా పెట్టకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. నెల రోజుల నుంచి విద్యార్థులకు కోడిగుడ్లు, చికెన్‌ను అందించే బాధ్యతను ఆర్జీయూకేటీ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. విద్యార్థులకు చికెన్, కోడిగుడ్లు సక్రమంగా అందించడం లేదనే విమర్శలు రావడంతో.. ఆ సంస్థ ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. దీంతోనే విద్యార్థులకు మూడు రోజులుగా కోడిగుడ్లు అందడం లేదని సమాచారం. విద్యార్థులకు కోడిగుడ్లు అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంచి ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నాం విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నామని నూజివీడు ట్రిపుల్ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24, 25 తేదీల్లో సాక్షి దినపత్రికలో ట్రిపుల్ ఐటీపై వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. హెల్పింగ్హ్యాండ్స్లోని అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే గవర్నింగ్ కౌన్సిల్ ఆ సంస్థకు మాంసాహారం అందించే బాధ్యతను ఇచ్చిందన్నారు. చికెన్ అయిపోయిందని భావించి ఈ4 విద్యార్థులు ఆందోళనకు దిగారే తప్ప చికెన్ సరిపోని కారణంగా కాదని పేర్కొన్నారు. ఏలూరు రూరల్: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని డిసెంబర్ 1, 2 తేదీల్లో గుంటూరులో దివ్యాంగుల రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈ నెల 28వ తేదీ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టనున్నామని పేర్కొన్నారు. డబ్యుహెచ్1, డబ్యుహెచ్2 వీల్‌చైర్స్ వాడేవారు, ఎస్ఎల్3, ఎస్ఎల్4 లోయర్ లింబ్ ఇంపెయిర్మెంట్స్, ఎస్యు5 అప్పర్ లింబ్ ఇంపెయర్మెంట్స్ వారికి మాత్రమే పోటీలు జరుగుతాయని వెల్లడించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఎంపికలు చేస్తామన్నారు. వివరాలకు 9984779015 నంబర్లో సంప్రదించాలన్నారు. -
పోక్సో కేసుల్లో నిందితుడి అరెస్ట్
ఏలూరు టౌన్: రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏలూరు పోలీసులు మహారాష్ట్రలో పట్టుకున్నారు. వివరాల ప్రకారం కృష్ణాజిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన మువ్వల వెంకటేశ్వరరావు(33)పై ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు వేర్వేరు పోక్సో కేసులు నమోదయ్యాయి. అయితే అతడు గత రెండు, మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది విజయరాజు, విజయకుమార్, రాజేష్ బృందం నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. నిందితుడు వెంకటేశ్వరరావు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చికల్టన్ గ్రామం సమీపంలో ఉజ్జనీ డ్యామ్ పరిసరాల్లో చేపలవేట చేసుకుంటూ జీవిస్తున్నట్లు గుర్తించారు. ఈనెల 25న అతడ్ని అదుపులోకి తీసుకుని ఏలూరు తీసుకువచ్చారు. బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వరరావును పట్టుకోవటంలో ప్రతిభ చూపిన పోలీస్ స్పెషల్ టీమ్ సిబ్బందిని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరుకి చెందిన కంపని సత్యనారాయణ (మెగా బాబీ)ని వైఎస్సార్సీపీ రాష్ట్ర వలంటీర్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశ్వాసంతో పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలను పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. -
శ్రీవారి అంతరాలయ దర్శనానికి వేళాయే
ద్వారకాతిరుమల: శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని గురువారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఒక్కో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఒక భక్తుడిని మాత్రమే అనుమతిస్తామని, టికెట్‌కి రెండు లడ్డూ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయ దర్శనంతో పాటు, అంతరాలయం ముందు భాగం (అమ్మవార్ల ముందు) నుంచి దర్శనాన్ని నిలుపుదల చేసి, బయట నుంచే దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఆలయ సిబ్బంది బుధవారం రాత్రి అంతరాలయం ముందు భాగంలో చెక్కల ర్యాంపును అమర్చారు. మళ్లీ ఐదేళ్ల తరువాత.. సామాన్య భక్తులకు శ్రీవారి అంతరాలయ దర్శనం లభించి ఐదేళ్లయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యాన్ని భక్తులు కోల్పోయారు. కరోనా నిర్మూలన అనంతరం ఇతర దేవాలయాల్లో అంతరాలయ దర్శనం పునఃప్రారంభం అయినప్పటికీ.. ఈ ఆలయంలో మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో భక్తులు ఫోన్ల ద్వారా, అలాగే నేరుగా అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త అయ్యంగార్ ఫిర్యాదు, సాక్షి కథనాలపై అధికారులు స్పందించి, అంతరాలయ దర్శనాన్ని, అమ్మవార్ల ముందు నుంచి శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకునే సౌకర్యాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి అంతరాలయ దర్శనం పునఃప్రారంభం -
గిరిజనుల్ని మోసగించిన బాబు ప్రభుత్వం
బుట్టాయగూడెం: పోలవరాన్ని ఆదివాసీ జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం నియోజకవర్గంలో 5 గిరిజన మండలాలు, పోలవరం ముంపు గ్రామాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ముంపు నిర్వాసితుల నివాసాలు, భూములు ఉన్నాయన్నారు. ఇప్పటికే జనాభా పెరిగి నిర్వాసితులకు సరైన నివాసాలు ఏర్పాటు చేయకపోవడం, భూములు కేటాయించకపోవడం వల్ల నిర్వాసితులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే రంపచోడవరం పేరే నామకరణం చేయాలి తప్ప జిల్లాలో పేరు, ఊరులేకుండా పోలవరం జిల్లాగా చెప్పడం బాగోలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ మాజీ నియోజకవర్గ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. -
బంగారు ఆభరణం అప్పగింత
ద్వారకాతిరుమల: స్థానిక యూటీఎఫ్ భవనంలో ఓ పెళ్లి బృందం మరిచిపోయిన బంగారు ఆభరణాన్ని మంగళవారం ఆ కుటుంబానికి అప్పగించారు. యూటీఎఫ్ భవనంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వరుడి తరుఫు బంధువులు బంగారు ఆభరణాన్ని గదిలో మరచిపోయి వెళ్లిపోయారు. భవన నిర్వహణను చూసుకుంటున్న వీసం నాగేశ్వరరావు (యూటీఎఫ్ నాగు)కి ఈ ఆభరణం కనిపించింది. దాంతో విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియజేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు రవికుమార్, మస్తుఫాలీ, ఎంఈఓలు సత్యనారాయణ, వెంకటరావు బాధిత కుటుంబానికి ఈ ఆభరణాన్ని అందజేశారు. నాగు నిజాయతీని మెచ్చుకుని, అభినందించారు. -
చెక్‌బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
ఏలూరు (టూటౌన్): చెల్లని చెక్కు కేసులో నిందితురాలికి ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పడమరవీధి గాంధీమైనంలో నివసించే ఆరేపల్లి శ్రీనివాస్ భార్య ఆరేపల్లి సుమలత కుటుంబ అవసరాల నిమిత్తం స్ధానికంగా ఉంటున్న మేడపాటి సుధాకర్‌రెడ్డి వద్ద 2022 ఏప్రిల్ 20న రూ.6.50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చే క్రమంలో 2023 మే 5న రూ.5 లక్షల చెక్‌ను సుధాకర్ రెడ్డికి అందచేశారు. ఆ చెక్‌ను బ్యాంకులో వేయగా ఖాతాలో నిల్వ లేకపోవడంతో చెల్లుబాటు కాలేదు. దీనిపై సుధాకర్‌రెడ్డి కోర్టులో కేసు వేశారు. ఏలూరు స్పెషల్ మొబైల్ కోర్టులో మంగళవారం ఈ కేసుకు సంబంధించి తుది విచారణ చేపట్టారు. చెల్లని చెక్ ఇచ్చిన నేరం రుజువు కావడంతో ఆరేపల్లి సుమలతకు ఆరు నెలలు జైలుశిక్ష తో పాటు రూ. 5 లక్షలు చెల్లించే విధంగా తీర్పునిచ్చారు. బాధితులు తరపున న్యాయవాది ఏవీఎస్ సూర్యారావు తన వాదనలు వినిపించారు. ఏలూరు రూరల్ : ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మంగళవారం దివ్యాంగుల జిల్లాస్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మానసిక, శారీరక దివ్యాంగులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్, రన్నింగ్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కేరమ్స్, చెస్ తదితర అంశాల్లో దివ్యాంగులు పోటీ పడ్డారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తేదీన బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దివ్యాంగుల సంక్షేమశాఖ జిల్లా అధికారి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్‌తో పాటు ఇడా చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా ఏలూరులో దివ్యాంగులకు కోసం కమ్యునిటీహాలు నిర్మించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వీరభద్రరావు (వాసు) ఎమ్మెల్యేను కోరారు. ఇటీవల రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన దివ్యాంగుడు మన్విత్‌ను నిర్వాహకులు సన్మానించారు. హనుమాన్ జంక్షన్, కై కులూరు, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలకు చెందిన పలు స్వచ్చంద సంస్థలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కలిదిండి (కై కలూరు): తండ్రి ఆత్మహత్యకు కారణమైన కొడుకును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన కట్టా పెదకృష్ణ (70)ను పెద్ద కుమారుడు సత్యనారాయణ (45) చిత్ర హింసలు పెట్టేవాడు. ఇటీవలే ఓ హత్యకేసులో జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణ రోజూ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులను బాధపెట్టేవాడు. సోమవారం ఇంటికి పెట్రోలు పోయడంతో తండ్రి పెదకృష్ణ భయకంపితుడయ్యాడు. చివరకు తన చావుతోనైనా కొడుకు మారతాడని పెదకృష్ణ ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటనపై తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్సై వెంకటేశ్వరరావు నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి కై కలూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు. -
మహిళపై హత్యాయత్నం
కై కలూరు: తనతో సహజీవనం చేసే మహిళ 6 నెలలు నుంచి దూరంగా ఉండటంతో కసి పెంచుకున్న వ్యక్తి ఆమైపె హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కై కలూరులో మంగళవారం జరిగింది. కై కలూరు పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం కై కలూరు మండల శీతనపల్లి గ్రామానికి చెందిన చిన్నం ఏసేబు(పండు, 50) డ్రెవర్‌గా పనిచేసేవాడు. వివాహం జరిగిన కొద్ది కాలానికే భార్య, పిల్లలతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో హైదరాబాదు మైబాద్లో లలిత(45)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే లలితకు మల్లిఖార్జునరావుతో వివాహం జరిగింది. వీరికి పాప. లలితను ఏసేబు 15 ఏళ్ల క్రింతం శీతనపల్లి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. లలిత కుతూరు ఆమెతోనే ఉంటూ చదువుకుంటుంది. ఏసేబు మద్యానికి బానిసై గొడవలు చేస్తుండడంతో ఆమె ఆరు నెలల నుంచి అతనికి దూరంగా కై కలూరు ఇస్లాంపేటలో బంధువుల ఇంటి వద్ద నివాసముంటుంది. మంగళవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి తన జీవితాన్ని నాశనం చేశావంటూ కొబ్బరి బొండాలు నరికే కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కుడి చేతిని అడ్డుపెట్డడంతో చేతి వేళ్ల మధ్య నుంచి సుమారు 4 అంగుళాల లోతుకు తెగింది. కూతురు, బంధువులు గాయపడిన లలితను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. లలిత ఫిర్యాదు మేరకు కేసు టౌన్ ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెల్పింగ్ హ్యాండ్స్పై నిరసన
● ట్రిపుల్ ఐటీలో అరకొరగా గుడ్లు, చికెన్ సరఫరా ● విద్యార్థుల్లో నిరసన గళంనూజివీడు: ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న పేద విద్యార్థులను ఆదుకునేందుకు విద్యార్థులంతా కలిసి 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ స్వచ్ఛంద సంస్థపై నిరసన గళం వినిపిస్తోంది. విద్యార్థులు తమకు తోచినంత ఇవ్వడం, అలా వచ్చిన సొమ్మును పేద విద్యార్థుల ఆసుపత్రి ఖర్చులకు, ఉన్నత చదువులకు ఖర్చు చేస్తూ ముందుకు సాగిన ఈ సంస్థకు కోడిగుడ్లు, చికెన్ పెట్టే బాధ్యతను ఇస్తూ ఎప్పుడైతే గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందో దాని ముసుగులో ఇరువురు మెంటార్లు రంగప్రవేశం చేశారో అప్పటి నుంచి సంస్థ ప్రాభవం కోల్పోతోంది. బిల్లులు చెల్లించే స్థోమతే లేదు నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఆరేళ్లకు కలిపి 6,524 మంది విద్యార్థులు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు 2,355 మంది కలిపి మొత్తం 8,879 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి భోజనాలు పెట్టే బాధ్యతను ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అప్పగించారు. అయితే ఈ ఫౌండేషన్ తాము శాఖాహారం మాత్రమే పెడతామని కండీషన్ పెట్టడంతో ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.110 ఇచ్చేలా ఒప్పందం జరిగింది. అయితే గుడ్లు, చికెన్‌ను ట్రిపుల్ ఐటీలోనే విద్యార్థులు ఏర్పాటు చేసుకుని నడుపుకుంటున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు ఇచ్చి దీనికి గాను వారానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 46.83 పైసలను ఇవ్వాలని ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. దీని ప్రకారం ఒక రోజు కోడిగుడ్డు ఇవ్వాలన్నా రూ.50 వేలు అవసరమవుతాయి. ఆదివారం వస్తే చికెన్‌కు కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ట్రిపుల్ ఐటీ బిల్లులు చెల్లించే వరకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టే స్థోమత హెల్పింగ్‌హ్యాండ్స్ సంస్థకు ఉందా అనేది కూడా ఆలోచించనే లేదు. నాలుగు రోజులే పెడుతున్నారు ట్రిపుల్ ఐటీ వారానికి హెల్పింగ్ హ్యాండ్స్‌కు రూ.46.83 పైసలను చెల్లిస్తుంది. 8,879 మంది విద్యార్థులు ఉండగా ప్రతిరోజూ కేవలం 6 వేల గుడ్లను మాత్రమే అందజేస్తున్నారు. దీంతో చివరలో భోజనానికి వచ్చే విద్యార్థులకు గుడ్లు అందడం లేదని ధర్నాలో విద్యార్థులే పేర్కొన్నారు. కోడిగుడ్లను విద్యార్థులకు వారానికి ఐదు రోజులు పెట్టాల్సి ఉండగా కేవలం నాలుగు రోజులు మాత్రమే అందిస్తున్నారు. అలాగే ఆదివారం నాడు ఒక్కొక్క విద్యార్థికి 150 గ్రాముల చికెన్‌ను పెట్టాల్సి ఉండగా అది కూడా అరకొరగానే పెడుతున్నారు. అలాగే చికెన్ ఒక్కొక్క విద్యార్థికి 150 గ్రాముల చొప్పున క్యాంపస్‌లో ఉన్న మొత్తం విద్యార్థులకు కలిపి 1,331 కిలోల చికెన్‌ను కొనుగోలు చేసి వండాల్సి ఉంది. అంత మొత్తంలో కొనుగోలు చేస్తున్న దాఖాలాలు లేవు. రెండోసారి గ్రేవీ అడిగినా వేయడం లేదు. దీంతో విద్యార్థులకు ఓపిక నశించి రోడ్డెక్కారు. విద్యార్థుల ఆవేదన ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులకు గుడ్లు, చికెన్ పెట్టే బాధ్యతను హెల్పింగ్హ్యాండ్స్కు యూనివర్సిటీ అప్పగించిందనేది ఉత్తర్వుల వరకు మాత్రమేనని, నిర్వహించేదంతా ఇరువురు మెంటార్లేననేది ట్రిపుల్ ఐటీలో ప్రతి ఒక్కరికీ తెలిసిన వాస్తవం. హెల్పింగ్ హ్యాండ్స్‌లో సభ్యులుగా ఉన్న విద్యార్థులు సైతం కోడిగుడ్లు, చికెన్ పెట్టడం రిస్క్‌గా భావించి వారందరూ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వారి చదువేదో వారు చదువుకుంటుండగా ఇరువురు మెంటార్లు మాత్రం తనకు మాలిన ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల హడావుడి నిర్ణయాల వల్ల తాము ఏ లక్ష్యంతో అయితే హెల్పింగ్హ్యాండ్స్ను ఏర్పాటు చేసుకున్నామో దానికి భిన్నంగా ముందుకు సాగడంపై అంతర్మథనం చెందుతున్నారు. హెల్పింగ్‌హ్యాండ్స్ సంస్థ అధ్యక్షుడు సైతం తన పదవికి రాజీనామా చేయగా ఇంత వరకు దానికి తిరిగి కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేదని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. కోడిగుడ్లు, చికెన్ కొనుగోలు చేయడానికి అవసరమైన ప్రతి రూపాయిని హెల్పింగ్‌హ్యాండ్స్ ఎక్కౌంట్ నుంచి డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే అలా డ్రా చేస్తున్నారా, లేదా అనేది అనుమానమే. -
అక్కిరెడ్డిగూడెంలో భారీ చోరీ
ముసునూరు: అక్కిరెడ్డిగూడెంలో తాళాలు వేసి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.60 వేల నగదు, 11 కాసుల బంగారం అపహరించుకు పోయిన ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కిరెడ్డిగూడెంలో పైడిపాముల ఎబినేజర్, సుందర్‌సింగ్ అన్న దమ్ములు. వీరి కుటుంబ సభ్యులందరూ ఇంటి ఎదురుగా ఉన్న చర్చిలో సోమవారం రాత్రి ప్రార్థనలకు వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించి, బీరువాలు పగలగొట్టి, చోరీకి పాల్పడ్డారు. ప్రార్థనలు ముగించుకుని, యజమానులు ఇంట్లోకి వస్తుండడం చూసి, ఇంటి వెనుక నుంచి పారి పోయారు. ఇంట్లోకి చేరుకున్న యజమానులు బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి, ముసునూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై ఎంకే.బేగ్, చాట్రాయి ఎస్సై రామకృష్ణ జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి, ఆధారాలు సేకరించారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. వేగంగా కేసు దర్యాప్తు నిర్వహించి, దొంగలను పట్టుకుంటామని తెలిపారు. 11 కాసుల బంగారం, రూ.60 వేల నగదు అపహరణ -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
నూజివీడు: పట్టణంలోని త్రివిధ హైస్కూల్ విద్యార్థి నాగళ్ల వివేక్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సబ్బినేని శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల కర్నూల్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని వివేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ముదినేపల్లి రూరల్: అల్లూరు హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి ప్రమోదిని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శొంఠి రామోజీ తెలిపారు. ఇటీవల మచిలీపట్నం నోబుల్ కళాశాలలో జరిగిన అండర్–14 ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రమోదినిని ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ వెంకటశ్యామల, కమిటీ సభ్యులు దావు నాగరాజు, వి రత్నకామేశ్వరరావు, హెచ్ఎం. ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో పొగాకు రైతు మృతి
జంగారెడ్డిగూడెం: వేగవరం సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్జీనియా పొగాకు రైతు మృతి చెందాడు. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన మువ్వ సాంబశివరావు (57) జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రానికి వచ్చారు. వేలం కేంద్రంలో పనులు ముగించుకుని తిరిగి ఇంటికి కలపాల రాజు అనే వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో రామాయణం బ్రహ్మం అనే వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వేగవరం పుంత రోడ్డు నుంచి వస్తూ వీరి మోటార్‌సైకిల్‌ను, సమీపంలో ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాంబశివరావుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబశివరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో సాంబశివరావు మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చొన్న కలపాల రాజుతో పాటు మరో మోటార్‌సైక్లిస్టు రామాయణం బ్రహ్మంకు గాయాలయ్యాయి. వీరిద్దరు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతిచెందిన సాంబశివరావుకు భార్య మణికుమారి, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బుట్టాయగూడెం: శ్రీకాకుళం నుంచి తెలంగాణవైపు గోవులను అక్రమంగా తరలిస్తున్న లారీని మంగళవారం జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్‌ను విచారించగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 50 ఎద్దులు, 15 ఆవులు మొత్తం 65 పశువులను అధిక ధరలకు కబేళాలకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. వీఆర్ఓ ఫిర్యాదుతో లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చామని, గోవులను గోశాలకు తరలించామని చెప్పారు. -
కై కరం తిరునాళ్లకు ఏర్పాట్లు
ఉంగుటూరు: కై కరం షష్ఠి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఆరు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైస్కూలు గ్రౌండ్లో షాపుల కోసం ఏర్పాట్లు చేశారు. తహసీల్దారు పూర్ణచంద్ర ప్రసాద్, వీఆర్వో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై సూర్య భగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గుడి ప్రాంగణంలో వైద్య సిబ్బందితో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి కల్యాణం అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెనన్స్ హాలు నుంచి పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, అందరికీ ఇల్లు, రోడ్డు ఆక్రమణలు, పీజీఆర్ఎస్, అక్రమ లేఅవుట్లు, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. అందరికీ ఇళ్లు సర్వే కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం జిల్లాలోని మందుగుండు సామగ్రి తయారీదారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామగ్రి తయారుచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తయారీ కేంద్రాలలో 15 కేజీలకు మించి మందుగుండు సామగ్రి ఉండకూడదన్నారు. భీమవరం: ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతి కుంభకోణంలో సంబంధం లేని నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడాన్ని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం భీమవరంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్మోహన్రాయ్, యూనియన్ జిల్లా కార్యదర్శి రాయుడు మాట్లాడుతూ అవినీతి జరిగిన రూ.82 లక్షలు వసూలు పేరుతో ఎలాంటి విచారణ చేయకుండా కొంతమంది ఉద్యోగుల దగ్గర బలవంతంగా సొమ్ము రికవరీ చేసి అసలు సంబంధం లేని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు ఎంఎస్ రావు వంటివారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అధికారులతో విచారణ చేయించి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఽకార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవరావు, నాయకులు ఆంజనేయులు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు: సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలం గొల్లగూడెం డిసెంబరు 1న పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. గొల్లగూడెం సూర్య స్కూలు ప్రాంగణంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరిపేందుకు నిర్ణయించారు. దాని ఎదురుగా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. -
కొల్లేరు వాసుల కన్నెర్ర
● అటవీ శాఖ ఆంక్షలపై ఆగ్రహం ● ఫారెస్ట్ అధికారులు వర్సెస్ కొల్లేరు వాసులు ● సమస్యను పరిష్కరించని ప్రజాప్రతినిధులు ● అభయారణ్య భూముల్లో సాగుకు యత్నం సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ఒక వైపు కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు ఘాటుగా చురకలు పెట్టింది. మరో వైపు ఎన్నికల్లో అమలుకాని హామీలను ప్రకటించిన ప్రజాప్రతినిధులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా కొల్లేరు ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి హడావుడి చేయడం తప్ప తమకేం లాభం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో జి రాయితీ, డీ–ఫాం, ప్రభుత్వ అనే మూడు కేటగిరిల భూములున్నాయి. మొత్తం అభయారణ్యం 77,138 ఎకరాలుగా నిర్ణయించగా, వీటిలో జి రాయితీ భూములు 14,932, డీ–ఫాం భూములు 5,510 ఎకరాలు, మిగిలిన ప్రభుత్వ భూమి 56,696 ఎకరాలుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరు ప్రభుత్వ భూమిలో ఎలాంటి సాగు చేసినా నివేదిక అందించాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉంటూ కొల్లేరు గ్రామాల్లో భూముల కోసం నిరసనలకు ఉసిగొల్పుతున్నారు. జిల్లాలోని నిడమర్రు, భీమడోలు, మొండికోడు, గుండుగొలను, ఆగడాలలంకల్లో కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో దాదాపు 5,500 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ పద్ధతి 2006 నుంచి కొనసాగుతోంది. పొలాల్లో ఎరువుల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, గతంలో కోర్టుకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల సుప్రీం ఆదేశాలతో ఇకపై కొల్లేరులో దాళ్వా సాగు చేయవద్దని అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, తోకలపల్లి, భైనేపల్లి, ఆముదాపల్లి, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, రామన్నగూడెంకు చెందిన ప్రజలు కొల్లేరు ప్రభుత్వ భూముల్లో సుమారు 1,680 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన 400 మంది పొలాలకు వెళ్ళడానికి మంగళవారం ప్రయత్నిస్తే భీమడోలు మండలం సాయన్నపాలెం వద్ద అటవీ సిబ్బంది నచ్చచెప్పి వెనక్కి పంపారు. నీటి మూటలుగా నాయకుల హామీలు ఎన్నికల ముందు కొల్లేరు గ్రామాల ఓట్ల కోసం నాయకులు హామీలు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2 పార్లమెంటు, 4 అసెంబ్లీ స్థానాల్లో కొల్లేరు పరిధి ఉంది. జిల్లాలో కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, పశ్చిమగోదావరిలో కె.రఘురామకృంరాజు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీలు పుట్టా మహేష్‌కుమార్ యాదవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉందని కొల్లేరు సమస్యలు పరిష్కారమవుతాయని కామినేని శ్రీనివాస్ ప్రతిచోట మాటలు చెబుతూ కాలం గడిపారు. అటవీశాఖలో అలజడి ఈ నెల 13న కలెక్టరేట్లో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ డాక్టర్ పీవీ.చలపతిరావు సమీక్షా నిర్వహించినప్పుడు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కొల్లేరు రైతులను తీసుకొచ్చి వ్యవసాయానికి అనుమతులు కల్పించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. తాజా పరిణామాల క్రమంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి ఉంగుటూరులో పర్యటనున్నారు. కొల్లేరు వాసులు సీఎంను కలిసి విన్నవించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని.. టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పిలునిచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ఏలూరు నియోజకవర్గంలో పెద్దెత్తున చేపడుతున్నారు. 46వ డివిజన్లో వైఎస్సార్సీపీ మైనార్టీ వింగ్ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సంతకాల సేకరణ చేపట్టారు. ఏలూరు సమన్వయకర్త జేపీ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ముఖ్యంగా రైతుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయని తెలిపారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిలో 10 మెడికల్ కాలేజీల భవన నిర్మాణాల చేయలేకపోవడం టీడీపీ నేతలు చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, పీ.రాజేష్, సముద్రాల చిన్ని, కొల్లిపాక సురేష్, తులసీ, ఎండీ రుబీనా బేగం, సాయి, రాము, బండ్లమూడి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గేదేలే..
బాలుర విభాగంలో షార్ట్పుట్లో మూడు చక్రాల సైకిల్ అయినా... పరుగు పందెం అయినా... బరువు విసరడమైనా... మాకు మేమే సాటి అన్నట్లు పోటీల్లో తగ్గేదేలే అని నిరూపించుకున్నారు వీరు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడాపోటీల్లో విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొని వారి నైపుణ్యాన్ని కనబరిచారు. తోటి స్నేహితులు సహకరిస్తూ సరదాగా స్టేడియంలో సందడి చేశారు. మంగళవారం ఎఎస్ఆర్ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల చిత్రాలు ఇవి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు బాలికల పరుగు పందెం -
ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం
జక్కంపూడి రాజా వైఎస్సార్సీపీ యువజన విభాగాన్ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్రియాశీలక యువజన నాయకులతో పార్టీ అభివద్ధికి కృషి చేస్తాం. కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాటాలు, ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉన్నారు. కారుమూరి సునీల్ రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాది కావస్తున్నా అసెంబ్లీల్లో ప్రస్తావన గానీ, బడ్జెట్లో కేటాయింపులు గానీ చేయలేదు. అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకుంటున్న కూటమి నేతలకు గుణపాఠం చెప్పేందుకు యువత ఎదురు చూస్తోంది. ముదునూరి మురళీ కృష్ణంరాజు యువతను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 20 లక్షలు ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి అని హామీలు ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారు. జగనన్మోహన్్ రెడ్డి పిలుపునందుకుని అన్ని ఉద్యమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి, కారుమూరి నాగేశ్వరరావు మన నాయకుడు జగన్ మాట ఇస్తే తప్పే మనిషి కాదు. పార్టీలో యువతకే ప్రాధాన్యత కల్పిస్తారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది. అప్పుడు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మార్కెట్లో వ్యాపారాలు జరిగేవి. జగన్ లేకపోవడంతో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మళ్లీ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేశారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు, అధికారంలోకి తీసుకురాగలరు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్‌లు చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షనన్ పాలిటిక్స్ చేస్తున్నారు. యువతంతా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. కొట్టు నాగేంద్ర, సీఈసీ సభ్యుడు యువత దశ, దిశగా మారి పార్టీని బలోపేతం చేయాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవ్వడానికి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఏడాదిన్నరలో ఏ పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వితంతు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో బాగా పనిచేసి 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి. సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యువజన విభాగం సిద్ధంగా ఉందని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్్ హాలులో మంగళవారం జరిగింది. యువజన విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో యువజన విభాగం సంస్థాగతంగా బలోపేతానికి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని రాజా సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ఏదోరకంగా ప్రజలను మోసగించడం, మభ్యపెట్టడం చంద్రబాబు నైజమన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సూపర్ సిక్స్ పేరిట రాష్ట్ర ప్రజల ఓట్లు దండుకుని ప్రజలకు మొండిచేయి చూపించారన్నారు. ఏడాదిన్నరైనా ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వాగ్దానాల ఊసే లేదన్నారు. అసెంబ్లీలో వాటి ప్రస్తావన గాని, బడ్జెట్లో కేటాయింపులు గాని లేవన్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేశారు యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కారుమూరి సునీల్ మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతను ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేసిందన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారని, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎస్ఈసీ సభ్యుడు కొట్టు నాగేంద్ర, యువజన విభాగం ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు కామిరెడ్డి నాని, పిల్లి సూర్యప్రకాష్, కంటమనేని రమేష్, రాగిరెడ్డి అరుణకుమార్, సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, యువజన విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: తణుకు వేదికగా జరిగిన వైఎస్సార్సీపీ యువజన విభాగం సమావేశంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన యువ నేతలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షేత్ర స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో యువజన విభాగం బలోపేతానికి, పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కార్యక్రమాల విజయవంతానికి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి యువజన విభాగం బలోపేతమే లక్ష్యం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి తణుకులో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం -
నేడు వైఎస్సార్సీపీ యువజన విభాగ సమావేశం
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశాన్ని తణుకులో నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తణుకు పద్మశ్రీ ఫంక్షన్లో హాలులో జరిగే సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరవుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నూతన కమిటీలు, యువజన విభాగ బలోపేతం తదితర కీలక అంశాలపై చర్చిస్తామని వివరించారు. ఏలూరు (టూటౌన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్నేపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర కులగణను తక్షణమే నిర్వహించాలన్నారు. ప్రతి కుటుంబం సామాజిక ఆర్థిక, రాజకీయ స్థితిగతులన్నింటినీ తెలుసుకునేలా సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. రా జ్యాంగ సవరణ చట్టం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీ,ఈలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ల్లో చేర్చి పరిరక్షించాలన్నా రు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి, ఓ బీసీ మహిళాలకు వారి జనాభా దామాషా ప్ర కారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఉన్నత న్యాయస్థానాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొ లువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం శంకుస్థాపనలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులతో కలిసి ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. దేవదా య శాఖ నిధులు రూ.3.50 కోట్లతో ఆలయ ప్రదక్షిణ మండపం, పంచాయతీరాజ్ రోడ్అసెట్స్ నిధులు రూ.3.70 కోట్లతో నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కేపీ శివకిషోర్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): తాడేపల్లిగూడెంలో ని మాగంటి అన్నపూర్ణదేవి మున్సిపల్ హై స్కూల్లో ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన లో గాయపడి వైద్యం పొందుతున్న 8వ తర గతి విద్యార్థిని హాసినిని సోమవారం ఆమె తల్లిదండ్రులు అంబులెన్స్‌లో భీమవరం కలెక్టరేట్‌కు తీసుకువచ్చారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అంబులెన్స్ వద్దకు వెళ్లి బాలిక ఆరోగ్యంపై ఆరా తీశారు. హాసినికి రెండు కాళ్లు విరిగి, ద వడ ఎముకకు గాయమైందని, వైద్య కోసం చా లా ఖర్చు చేశామని, ఇక ఖర్చు చేయలేమని త ల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. ముందుగా హాసిని కుటుంబసభ్యులు, బంధు వులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నదాతకు తుపాను గండం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభు త్వం ఓ వైపు, ప్రకృతి మరోవైపు అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో మోంథా తుపాను విరుచుకుపడగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన అరకొర దిగుబడులనైనా ఒబ్బిడి చేసుకుందామనే సమయంలో మరోమారు తుపాను హెచ్చరికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందంటూ వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో జిల్లావ్యాప్తంగా వరి మాసూళ్లు ముమ్మరం చేశారు. నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 11,613 మంది రైతులు నష్టాలను చవిచూశారు. 859.21 హెక్టార్లలో మినుములు, 4,807.37 హెక్టార్లలో వరి, 33.11 హెక్టార్లలో పత్తి ఇలా మొత్తంగా 5,704 హెక్టార్లలో పంటలను కోల్పోయారు. అనంతరం పంటను ఒబ్బిడి చేసుకుని ధాన్యం విక్రయించుకునే సమయంలో తుపాను ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెడుతు న్నారు. ఇప్పటివరకూ 40 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ధాన్యం కొనుగోలు నెమ్మదిగా సాగుతుండటంతో రైతుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఏమాత్రం ఆదుకోని సర్కారు : జిల్లాలో ఏటా విపత్తులు చుట్టుముడుతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాల సమయంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా 89,983 హెక్టార్లలో వరి సాగు చేయగా 5.73 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాలు రూపొందించినా ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రానున్న రెండు, మూడు రోజులు ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే మరోమారు తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ హెచ్చరికలతో ఆందోళన ముమ్మరంగా ఖరీఫ్ మాసూళ్లు రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబోత జిల్లాలో 89 వేల హెక్టార్లలో వరి సాగు -
ఏం చేశారని.. మా కోసం
చికెన్ సరిపోవడం లేదని.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చికెన్ అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 8లో uరైతును రాజు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ఉచిత పంటల బీమాకు ఎసరుపెట్టి అన్నదాతకు ధీమా లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఆక్వాకు రూ.1.50 సబ్సిడీ విద్యుత్ హామీ ఊసేలేదు. సాగులో రైతుకు భరోసా లేకుండా చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ‘రైతన్నా.. మీకోసం’ పేరుతో హడావుడి చేస్తోంది. మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, భీమవరం: నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతుపై వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులందరికీ అవ గాహన కార్యక్రమాల పేరిట మరో గారడీకి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోయినా ఇప్పుడు ఈ ప్రచార ఆర్భాటమేంటని రైతులు అంటున్నారు. ఏడాది సాయానికి ఎగనామం జిల్లా అంతటా ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అన్నదాత సుఖీభవ సా యంగా ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఊదర గొట్టారు. మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం రెండో ఏడాది నుంచి అరకొర మందికి సాయం అందించి చేతులు దులుపుకుంటోంది. ప్రస్తుతం జిల్లాలో 1,03,761 మంది రైతులకు ఈ ఏడాది సాయం అందిస్తుండగా.. తొలి ఏడాదికి గాను జిల్లాలోని రైతులు రూ.207.52 కోట్లు నష్టపోయినట్టు అంచనా. మరోపక్క కౌలు రైతులను ఎలాంటి సాయం అందించకుండా గాలికొదిలేసింది. పంటల బీమా.. లేదు ధీమా రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. ప్రతి ఎకరాకు బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు కౌలు రైతులకు పూర్తి పరిహారం అందేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ. 210లు చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉన్నాయి. ప్రాధాన్యం మరిచి.. రైతులను వంచించి.. ధాన్యం కొనుగోళ్లలో దళారులే ఇప్పుడు తెరవెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. తేమశాతం ఎక్కువనో, తాలుగింజలు ఉన్నాయనో కోత పెడుతున్నారు. గత రబీలో తొలుత 6 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత 7.5 లక్షల టన్నులకు పెంచింది. కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంచుల కొరత వేదిస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని చెప్పి గత సీజన్ చివరిలో దాదాపు నెలన్నర రోజులు జాప్యం చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నకిలీల బెడద అరికట్టేందుకు గత ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. జిల్లాలోని భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ల్యాబ్స్ నిర్మించారు. రైతులు శాంపిల్స్ తెస్తే చాలు వ్యవసాయం, మత్య్సశాఖ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించి అన్ని పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కొన్నిచోట్ల ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ సాగులో రైతుకు అన్నివిధాలా అండగా గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతులందరికీ రూ.1.50లకే సబ్సిడీ విద్యుత్ అందిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఆక్వా జోన్లో వాటికేనంటూ మెలిక పెడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడం, సిండికేటు దోపిడీతో నష్టాలు భరించలేక ఈ ఏడాది ప్రారంభంలో పాలకొల్లు, ఆచంట, నరసాపురంలోని ఆక్వా రైతులు క్రాఫ్ హాలీడే ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు కొయ్యలగూడెం బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు నిండా మునిగిన రైతు ఉచిత పంటల బీమాకు ఎసరు ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది ఎగనామం రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్య కుదింపు మీకోసం పేరుతో ప్రచార ఆర్భాటం ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం -
హోరాహోరీగా హ్యాండ్‌బాల్ పోటీలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. పూల్ సిలో విన్నర్‌గా వెస్ట్ గోదావరి, రన్నర్‌గా విజయనగరం జట్లు నిలిచాయి. హనుమాన్‌జంక్షన్ రూరల్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో భవానీ భక్తుడు మృతి చెందాడు. బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తణుకు సమీపంలోని సజ్జాపురానికి చెందిన కుక్కనూరి జయరామ్ (33) భవానీ దీక్ష విరమణ నిమిత్తం స్నేహితుడు అలబాని సాయితేజతో కలిసి సోమవారం పల్సర్ బైక్‌పై విజయవాడ దుర్గ గుడికి బయలుదేరారు. దర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో జయరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. -
షష్ఠి ఉత్సవాలకు ముస్తాబు
అత్తిలిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 8లో uచంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తిగా వంచించి పాలన సాగిస్తోంది. జోన్లతో నిమిత్తం లేకుండా ఆక్వా చెరువులు అన్నింటికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. సిండికేట్ దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విత్తు నుంచి ధాన్యం విక్రయించుకునే వరకూ వరి రైతులది అదే పరిస్థితి. ఏదో ఉద్దరించినట్టుగా ఇప్పుడు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. – వడ్డి రఘురాం, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తాడేపల్లిగూడెం ఐదు ఎకరాలు కౌలు సాగు చేస్తున్నాను. మమ్మల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అన్నదాత సుఖీభవ సాయం అందడం లేదు. కనీసం బీమా సాయం కూడా అందించలేని పరిస్థితి ఉంది. గతంలో బీమా బాధ్యత ప్రభుత్వమే తీసుకోవడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు విపత్తులతో రైతులు నష్టపోతూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. – గొట్టుముక్కల ఏసురత్నం, తూర్పుపాలెం -
చికెన్ సరిపోవడం లేదని ఆందోళన
నూజివీడు: చికెన్ అరకొరగా పెడుతున్నారని ఆదివారం ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లోని మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీలోని మెస్‌ల నిర్వహణను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అప్పగించారు. శాఖాహారం మాత్రమే పెడతామని ఈ ఫౌండేషన్ కండిషన్ పెట్టింది. విద్యార్థులకు వారంలో నాలుగు రోజుల పాటు కోడిగుడ్డు, రెండు రోజుల పాటు చికెన్ పెట్టే బాధ్యతను క్యాంపస్‌లో విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు అప్పగించారు. దీనికి గాను ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.6.69లు ట్రిపుల్ఐటీ చెల్లిస్తుంది. ఈనెల 23న 12 గంటలకు మెస్‌లో భోజనాలు ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు చికెన్ రాలేదు. చివరకు 1.30 గంటలకు ఉన్న చికెన్ అయిపోగా మిగిలిన వారు తమకు చికెన్ ఏదని నిలదీసేసరికి ఫ్యాకల్టీ తిట్టడంతో ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు మెస్ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రతి వారం తమకు చికెన్ సరిపోవడం లేదని, రెండోసారి వెళ్లి కొద్దిగా పులుసు వేయమన్నా వేయడం లేదని విద్యార్థులు వాపోయారు. హెల్పింగ్ హ్యాండ్స్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ఫ్యాకల్టీ కోడిగుడ్లు, చికెన్ వ్యవహారాన్ని నడుపుతుండటం గమనార్హం. విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయాన్ని ఫ్యాకల్టీలు ఏఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయన విద్యార్థుల వద్దకు వచ్చి బెదిరింపు ధోరణిలో వార్నింగ్‌లు ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థులు తమ సమస్యలను చెప్పేందుకు లేచి నిల్చుంటే వారి ఐడీ, బ్రాంచి వివరాలు అడగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారానికి రెండు రోజులు చికెన్ పెట్టమంటే కేవలం ఒక రోజు మాత్రమే అరకొరగా పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కై కలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి. పక్షుల అత్తారిల్లు కొల్లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్సార్ సదస్సు గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కై కలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్‌గా నామకరణ చేశారు. బార్ టెయిల్డ్ గాడ్విట్ నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి. ఆర్కిటిక్ టర్న్ అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్ టర్న్. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్తుంది. బార్ హెడెడ్ గీస్ ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్ హెడెడ్ గీస్. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్ తదితర సరస్సులకు వస్తాయి. గ్రేట్ స్నైప్ అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్ దేశాలు మంచుతో ఉంటాయి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి. – శ్రీరామ్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్ సమీక్షకుడు, హైదరాబాదు పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం. – బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు శీతాకాలంలో విడిది పక్షుల సందడి ఏటా 71 జాతులకు చెందిన 1.20 లక్షల విదేశీ వలస పక్షులు అక్టోబరు నుంచి మార్చి చివరి వరకు కనువిందు స్థానికంగా 210 రకాల పక్షి జాతులు ఉన్నట్టు గుర్తింపు -
అర్జీలను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి
ఏలూరు (మెట్రో): పీజీఆర్ఎస్లో అర్జీలను నాణ్యతతో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. 277 దరఖాస్తులు అందాయని, వాటిలో నిబంధనల మేర ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలను స్పష్టంగా తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. దరఖాస్తును పరిష్కరించిన అనంతరం పరిష్కార విధానంపై దరఖాస్తుదారుడితో సంబంధిత శాఖల అధికారులు మాట్లాడాలన్నారు. ఏలూరు రూరల్: డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 25న ఏలూరులో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆసక్తి గలవారు 9948779015 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లా అటవీ శాఖాధికారి(టెరిటోరియల్)గా పోతంశెట్టి వెంకట్ సందీప్ రెడ్డి జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్ రెడ్డి 2019లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. గతంలో డోర్నాల సబ్ డివిజనల్ అటవీ శాఖాధికారిగా, ఆత్మకూరు ఇన్చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కడప, పాడేరు జిల్లా అటవీశాఖాధికారిగా విధులు నిర్వహించి ఏలూరు జిల్లాకు బదిలీపై వచ్చారు. ఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక కొత్తపేట గాదివారి వీధికి చెందిన గేదెల సాయికుమార్ (33) పూలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విభేదాలు రావటంతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా జీవిస్తోన్న సాయికుమార్ ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ 2025 ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయాలని, సమస్యలతో డీఈఓ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయుల వినతుల స్వీకరణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఏలూరు కార్పొరేషన్లో పండిట్స్ అప్‌గ్రేడేషన్‌కు చర్యలు తీ సుకోవాలని, కొందరు హెచ్ఎంలు ఉపాధ్యాయులకు అనారోగ్యంగా ఉన్నా సెలవులు ఇవ్వడం లే దన్నారు. గతేడాది టెన్త్ వంద రోజుల ప్రణాళిక అ మలులో సెలవు రోజుల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కు సీసీఎల్ ఎనేబుల్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రా మారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ నసభ్యుడు ఎస్కే రంగావలి, జిల్లా కార్యదర్శి డీకేఎస్‌ఎస్ ప్రకాష్ రావు, సీ నియర్ నాయకులు ఎన్. కొండయ్య, నగర ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు ఉన్నారు. -
షష్ఠి ఉత్సవాలకు అత్తిలి ముస్తాబు
● నేడు స్వామివారి కల్యాణం ● 26న షష్ఠి మహోత్సవం అత్తిలి: రాష్ట్రంలో పేరుగాంచిన అత్తిలి శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు నిర్మించి, విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. ఈ నెల 25 నుంచి డిసెంబరు 9 వరకు జరిగే మహోత్సవాలలో ప్రతి రోజు సాయంత్రం స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి 7.20 గంటలకు దాసం ప్రసాద్, రాజరాజేశ్వరి దంపతులచే శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 26న షష్ఠి తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం కోలాట భజన, అన్నసమారాధన, రాత్రి శ్రీస్వామివారి ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయని షష్ఠి కమిటీ అధ్యక్షుడు కురెళ్ల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దిరిశాల మాధవరావు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి తిరునాళ్లు ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, కుజదోషం, కాల సర్పదోషం ఉన్నవారు ఈ దేవాలయాన్ని దర్శించి, స్వామికి పంచామృతాలతో అభిషేకించడం ద్వారా తమ కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. సంతానంలేనివారు నాగుల చీర కట్టుకుని, ముడుపులు కడతారు. సంతానం కలిగిన తరువాత పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుని, పిల్లలపై నుంచి బూరెలను పోసే సంప్రదాయం ఇక్కడ ఉంది. చిన్నపిల్లలకు నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి శుభకార్యక్రమాలు ఈఆలయంలోనే నిర్వహిస్తుంటారు. షష్ఠి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల సెట్టింగ్‌లు నెలకొల్పారు. -
నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు గర్భాలయంలో కొలువైన స్వామికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి గణపతి పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. పెదపాడు: ఎన్టీఆర్ జిల్లా నున్నలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌న్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్లో ఏలూరుకు చెందిన జీ స్నేహిత ద్వితీయస్థానం సాఽధించింది. దీంతో జార్ఖండ్‌లోని రాంచిలో జనవరి 13న జరిగే పోటీలకు ఎంపికై ంది. -
కొల్లేరుకు ప్రతి ఏటా వచ్చే విదేశీ వలస పక్షులు..
నార్తరన్ పిన్‌టైల్ (సూది తోక బాతు), రెడ్ క్రిస్టడ్ పోచర్ట్ (ఎర్రతల చిలువ), కామన్ శాండ్ పైపర్ (ఉల్లంకి పిట్ట), పసిఫిక్ గోల్డెన్ స్లోవర్ (బంగారు ఉల్లంకి), కామన్ రెడ్ షాంక్ (ఎర్రకాళ్ల ఉల్లంక్), బ్రాహ్మణి షెల్ డక్(బాపన బాతు), గ్రేట్ వైట్ పెలికాన్ (తెల్ల చిలుక బాతు), బ్లాక్ క్యాప్డ్ కింగ్‌ఫిషర్(నల్ల తల బుచ్చిగాడు), గుల్ బిల్డ్ టర్న్(గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్ టర్న్(సముద్రపు కాకి), గ్రేటర్ శాండ్ ప్లోవర్(పెద్ద ఇసుక ఉల్లంకి), రూఫ్ (ఈల వేసే పెద్ద చిలువ), మార్స్ శాండ్‌పైపర్ (చిత్తడి ఉల్లంకి) వంటివి దాదాపు 71 జాతులు ఉన్నట్టు గుర్తించారు. -
వైభవంగా శిఖర కలశ ప్రతిష్ఠ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడైన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా పండితులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ గణపతిపూజ, పుణ్యాహవాచన, గర్తన్యాసం, భీజిన్యాసం, ధాతున్యాసం, రత్నన్యాసం, యంత్రస్థాపనలను నిర్వహించారు. అనంతరం ఉదయం 9.27 గంటల సముహూర్త సమయంలో రాజగోపురంపై దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు తదితరులు శిఖర ప్రతిష్ఠాపన కనుల పండువగా జరిపించారు. ఆ తరువాత యాగశాలలో మహాపూర్ణాహుతి హోమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
నూజివీడు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నా టి నుంచి ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు మండలం గొల్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న దాదాపు 10 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇటుగా కన్నెత్తి చూసేందుకు రెవె న్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సాహసించడం లేదు. అక్రమార్కులకు టీడీపీ నాయకుల అండదండలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ స్థలంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వ హ యాంలో శంకుస్థాపనలు జరిగా యి. అంగన్వాడీ కేంద్రానికి, పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా బల్క్కూలర్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవన నిర్మా ణం బేస్మెంట్ స్థాయి వరకూ పూర్తయి ఆగిపోగా, బల్క్కూలర్ యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. 10 సెంట్ల స్థలం విలువ దాదాపు రూ.25 ల క్షలపైనే ఉంది. ఈ ఆక్రమణపై గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పీజీఆర్ఎస్లో వినతిపత్రం సైతం ఇచ్చారు. అయినా ఆక్రమణదారులు మా త్రం ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అర్జీని పరిష్కరించడానికి నెల రోజులు సమయం ఉంటుందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ఈలోపు స్లాబ్ లెవెల్ వరకూ గోడలు సైతం నిర్మాణమవుతాయని పలువురు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఆక్రమణలను నిలువరించాలని కోరుతున్నారు. -
నల్ల బంగారం.. తవ్వకాలకు సిద్ధం
● రేచర్ల బొగ్గు బ్లాక్‌కు ముగిసిన టెండర్లు ● నేటి నుంచి ఈ–ఆక్షన్ కేటాయింపు ● 2,225 మిలియన్ టన్నుల నిల్వలు ● ఆంధ్రా సింగరేణిగా ‘చింతలపూడి’సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి బొగ్గు తవ్వకాల వ్యవహారం తుది దశకు చేరుకుంది. బొగ్గు నిల్వల ఖరారు, బ్లాక్‌ల వారీగా గుర్తింపు ఇలా ఏళ్ల తరబడి సాగిన ప్రయత్నాలు పూర్తయి మొట్టమొదటిగా రేచర్ల బ్లాక్‌ను నిర్ధారించి టెండర్లు ఆహ్వానించి తుది దశకు తీసుకువచ్చారు. సోమవారం నుంచి ఈనెల 28లోపు ఈ–వేలం ద్వారా రేచర్ల బ్లాక్‌ను ఖరారు చేయనున్నారు. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్న ఈ బ్లాక్‌ను వేలం ద్వారా అప్పగించనున్నారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం నా లుగు సర్వేలు నిర్వహించింది. 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ వేగంగా పూర్తిచేసి తుది దశకు తీసుకువచ్చారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలా ల్లోని కొన్ని గ్రామాల్లో గ్రేడ్–1 నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటానీ అనే సంస్థలు గుర్తించి కేంద్రానికి నివేదిక అందజేశారు. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకు రాకపోకవడంతో నిలిచిపోయాయి. మూడోసారి ఈ ఏడాది సె ప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించి అదేనెల 15న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అక్టోబర్ 27 వరకు దరఖాస్తు స్వీకరణకు తుది గడువుగా నిర్ణయించి 28న టెక్నికల్ బిడ్లను తెరిచారు. 22.24 చ.కిలోమీటర్ల పరిధిలో.. రేచర్ల గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల పరిధిలోని 22.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రేచర్ల బొగ్గు బ్లాక్‌ను ఖరారు చేశారు. 623 మీటర్లలోతు నుంచి గరిష్టంగా 1,123 మీటర్ల లోతులో జీ–13 గ్రేడ్ బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 2,225.63 మిలియన్ టన్నుల నిల్వలు ఈ బ్లాక్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. వచ్చే వారంలో టెండర్ ఖరారైతే 2026 మార్చి నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన
● ఉమ్మడి జిల్లా నుంచి భారీగా రాక ● ఇంగ్లిష్, గణితంపై పట్టు సాధించేందుకు దోహదం తాడేపల్లిగూడెం (టీఓసీ): పాఠశాల స్థాయి విద్యార్థుల్లో ఇంగ్లిష్, గణితంలో ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ క్వార్టర్ ఫైన ల్స్ పరీక్షలు ఆదివా రం తాడేపల్లిగూడెంలోని సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నిర్వహించారు. లెక్కలపై భయా న్ని పోగొట్టడంతో పాటు ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంచేలా నిర్వహించిన పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా పరిధి లోని జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో సెంట్ ఆన్స్ ప్రాంగణంలో సందడి నెలకొంది. సెంట్ ఆన్స్ విద్యాసంస్థల చైర్మన్ అద్దంకి విజయకుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కె.ప్రవీణ్ వర్మ, శిరీషా, శ్రీనివాస్ పరీక్షలను ప ర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫే, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారు వ్యవహరిస్తున్నారు. గణిత సమస్య పరిష్కారంలో ప్రాక్టీస్ చేయడానికి, నైపుణ్యాలు సాధించ డానికి మ్యాథ్‌బీ పరీక్షలు ఉపయుక్తం. గణిత జ్ఞానాన్ని కొత్తమార్గంలో అన్వయించడానికి, భవిష్యత్ పరీక్షలకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. – యశస్విని, కేకేఆర్ గౌతమ్, ఏలూరు సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు రాయడం వల్ల పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుంది. భయం తగ్గుతుంది. పై స్థాయి పోటీలకు వెళ్లాలనే లక్ష్యం ఏర్పడుతుంది. మా భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తం. – కె.ప్రజ్ఞత, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం క్వార్టర్ ఫైనల్స్ స్పెల్‌బీ పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి ఫైనల్ స్థాయిలకు వెళ్లేందుకు కృషి చేస్తాను. పరీక్ష బాగా రాశాను. మరింత ఉత్సాహం వస్తుంది. పరీక్షల నిర్వహణ అభినందనీయం. – జె.హర్షిత్, ఆదిత్య, పాలకొల్లు ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్ నేర్చుకోవడం వల్ల పదాలు గుర్తు ఉండటం, పట్టు సాధించడం జరుగుతుంది. ప్రతి పదం అర్థం కూడా నేర్చుకోవడానికి వీలు ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లిష్‌కు ఉపయుక్తం. – ఎం.వర్షిణి, ఆదిత్య, నరసాపురం విద్యార్థుల్లో విశ్లేషనాత్మక ఆలోచనలు పెంచేలా భవిష్యత్తు సవాళ్లకు వారిని సిద్ధం చేసేలా సాక్షి స్పెల్‌బీ పరీక్షల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి పరీక్షలు విద్యార్థుల్లో భయాన్ని పోగొడతాయి. సాక్షికి అభినందనలు. – కె.సత్యనారాయణ, విద్యార్థి తండ్రి విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు గణితంపై పట్టు సాధించేలా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షల నిర్వహణ అభినందనీయం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. – జి.నాగజ్యోతి, టీచర్, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం -
శివ మండపానికి శిఖర ప్రతిష్ఠ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఏడేళ్ల క్రితం నిర్మించిన శివ మండపానికి ఆదివారం శిఖర కలశ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ నెల 9న ‘సాక్షి’లో ‘అలంకారప్రా యంగా మండపాలు’ శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. క్షేత్రంలోని పసరుకోనేరు ప్రాంతంలోని ధనుర్మాస మండపం, శివ మండపాలను పునర్నిర్మించినా ప్రారంభోత్సవం నిర్వహించలేదు. దీనిపై కథనం ప్రచురించగా శివ మండప శిఖర ప్రతిష్ఠకు చర్యలు తీసుకున్నారు. క్షేత్ర పాలకుని ఆలయంలో జరిగిన నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనలతో పాటు ఈ శివ మండపానికి శిఖర కలశ ప్రతిష్ఠను జరిపించారు. అయితే ధనుర్మాస మండపానికి శిఖర ప్రతిష్ఠపై స్పష్టత లేదు.


