కూటమి గూండాగిరి
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశ్నిస్తే.. దాడులు.. అదేంటని మళ్లీ అడిగితే రౌడీమూకలతో ఇళ్లపైకి తెగబడి దహనకాండ.. ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న పాలన. తిరుమల లడ్డూ వ్యవహారం, వైజాగ్ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి ఆటవిక దాడులు, దౌర్జన్యాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగింది సీఎం చంద్రబాబు అండ్ కో. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలకు నిప్పంటించి భౌతికదాడులకు తెగబడ్డాయి పచ్చ మూకలు. ఇదే తరహాలో జిల్లాలోని కై కలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు ప్రజలు ముక్తకంఠంతో దాడుల సంస్కృతిని ఖండిస్తున్నారు.
రాజకీయ దాడులు : గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాల కోసం కూటమి నేతలు దాడులకు తెరదీశారు. ఎమ్మెల్యేలు స్వయంగా దాడుల్లో పాల్గొనడం, తీవ్ర అసభ్యపదజాలంతో దూషించి రివర్స్‌లో కేసులు పెట్టించడం పరిస్థితి పరాకాష్టకు నిదర్శనం. జిల్లాలోని కై కలూరులో ఇదే తరహా దాడులు కొనసాగిస్తున్నారు. ఎన్నికల హామీ నెరవేర్చలేదని ఈనెల 22న కొల్లేటికోటకు వచ్చిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ను నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్ రామకృష్ణరాజు ప్రశ్నించడంతో ఇంటిపై దాడి చేసి సర్పంచ్‌పై హత్యాయత్నం చేశారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దెందులూరు నియోజకవర్గంలో నిన్నమొన్నటి వరకూ ఇదే తరహాలో రాజకీయ దాడులు కొనసాగాయి.
జంగిల్ రాజ్
రాష్ట్రంలో ఆటవిక పాలన
ప్రశ్నిస్తే దాడులు, ఇళ్లకు నిప్పు
జిల్లాలోనూ ఇదే సంస్కృతి
వైఎస్సార్‌సీపీ నేతలపై దాడుల పర్వం
కూటమి అరాచకాలపై సర్వత్రా నిరసనలు
కూటమి గూండాగిరి


