క్షమించరాని నేరం
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, ఆయన ఇంటిపై దాడి చేయడం హేయం. కక్షకట్టి, రె చ్చగొట్టి అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై రౌడీలను, గూండాలను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురి చేయడం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప మరేమీ కాదు. దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం.
– పుప్పాల వాసుబాబు,
ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. విమర్శల సైతం హుందాగా ఉండాలి. దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు సరి కాదు. బాధితులూ అదే బాటలో పయనిస్తే పరిస్థితి ఏమిటి. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతల అమలు విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది.
– కొఠారు అబ్బయ్యచౌదరి,
దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే
రెడ్‌బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దౌర్జన్య కాండ దుర్మార్గపు పాలనకు, దుష్ట సామ్రా జ్యానికి నిదర్శనం. ప్రజలు హేయమైన ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి మరలా జగనన్న రాజ్యాన్ని త్వరలో తీసుకువస్తారు.
– కంభం విజయరాజు,
చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త
ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు పాలనను విస్మరించి ఆటవిక దాడులు, దహనకాండలకు తెరదీయడం నీతిమాలిన చర్య. ఎన్నికల ముందు నీతి వ్యాఖ్యలు వల్లించిన కూటమిలోని మిగతా పార్టీలు ఇప్పుడు దహనకాండలపై ఎందుకు నోరువిప్పడం లేదు. ప్రజలే కూటమి నేతలకు బుద్ధి చెప్పాలి.
– మామిళ్లపల్లి జయప్రకాష్,
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త
క్షమించరాని నేరం
క్షమించరాని నేరం
క్షమించరాని నేరం


