గంగానమ్మకు నీరాజనం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చల్లని తల్లి.. సిరులు కురి పించే కల్లవల్లి.. ఏలూరు నగర ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. పడమర వీధి గంగానమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారికి సోమవారం నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏడేళ్లపాటు నీరాక కోసం ఎదురుచూస్తాం గంగానమ్మ అంటూ ఇంటింటా నీరాజనాలు అర్పించారు. సుమారు వంద రో జులపాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో కొలిచిన అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. తీన్‌మార్ డప్పు లు, బుట్టబొమ్మలు, శక్తివేషాలు, డీజేలు, కోయ, శాసీ్త్రయ, జానపద నృత్యాలతో ఊరేగింపు జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన కొర్లబండి ఊరేగింపు రాత్రి 7.30 గంటలకు సగం దూరం కూడా పూర్తికాలేదు. పడమర వీధిలో అమ్మవారి మేడల నుంచి మొదలైన ఊరేగింపు కుండీ సెంటర్, గడియార స్థంభం సెంటర్, మెయిన్‌బజార్, బిర్లా భవన్ సెంటర్, వైఎంహెచ్‌ఏ హాలు, రామకోటి ప్రాంగణం, అంబికా సెంటర్ మీదుగా ఓవర్‌బ్రిడ్జి డౌన్‌లోని జ్యూట్‌మిల్లు వద్దకు చేరుకోవడానికి దాదాపు తొమ్మిది గంటలు పట్టింది.
నగరం.. భక్త జన సంద్రం
కొర్లబండి ఊరేగింపును తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చినట్టు అంచనా. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆటోలు, ట్రా క్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వీరితో పాటు ఇప్పటికే నగరానికి వచ్చిన అతిథులు, నగర ప్రజలతో ఊరంతా జన ఉప్పెనను తలపించింది. ఊరేగింపుతో నగరం అష్టదిగ్బంధమైంది. ఎటు చూసినా భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చెమటోడ్చారు. అమ్మవారి ఊరేగింపు జ్యూట్‌మిల్లు ప్రాంతాన్ని దాటిన తరువాత ట్రాఫిక్‌ను వదిలారు. స్థానిక ఓవర్‌బ్రిడ్జిపై ప్రజలు వేలాదిగా నడుచుకుంటూ తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది. అలా గే కై కలూరు రోడ్డు, పెదపాడు రోడ్డు, పాతబస్టాండు సెంటర్, వంగాయగూడెం సెంటర్, విజయ విహార్ సెంటర్, రైల్వే ట్రాక్ రోడ్డు, రాజీవ్ స్నేహవారధి ఇలా ఎక్కడ చూసినా కోలాహలమే కనిపించింది. ఆయా మార్గాల్లో కిలోమీటరు దూరం వెళ్లడానికి గంటకు పైగా సమయం పట్టింది.
శక్తి వేషాలు
కొర్లబండిలో పంబల వారు
భక్త జన ఉప్పెన
ఏలూరులో జన జాతర
నేత్రపర్వంగా కొర్లబండిపై ఊరేగింపు
నగరం అష్టదిగ్బంధనం
అమ్మవారికి ఘనంగా వీడ్కోలు
గంగానమ్మకు నీరాజనం
గంగానమ్మకు నీరాజనం


