ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
తణుకు అర్బన్: హెడ్ కానిస్టేబుల్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమ వారం రాత్రి చోటుచేసుకుంది. చీటింగ్‌కి సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేయకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ రైటర్ కె.సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన జక్కంశెట్టి మావుళ్లేశ్వరరావు అనే వ్యక్తి మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని తణుకుకి చెందిన రావిపాటి నాగదేవి అనే మహిళ కలెక్టర్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేయించారని ఆ కేసుకు సంబంధించి 41 నోటీసు ఇచ్చేలా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.25 వేలు డిమాండ్ చేశారని, పట్టణ సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు, సుబ్బారావుకు రూ.5 వేలు అని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏలూరు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. ఈనెల 1న కేసు నమోదుచేసిన డీఎస్పీ సోమవారం రాత్రి మావుళ్లేశ్వరరావు రైటర్ సుబ్బారావుకు స్వయంగా రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తణుకు సీఐ ఎన్.కొండయ్యకు రూ.20 వేలు ఇవ్వాలన్న వ్యవహారంపై సీఐ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, నింది తుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడి ంచారు. దాడిలో ఏసీబీ సీఐలు కె.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.


