సచివాలయ ఉద్యోగినిపై దాడి దారుణం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ధనలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు డిమాండ్ నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగిని షేక్ షకీనాపై సోమవారం హోటల్ నిర్వాహకులు దాడి చేసిన ఘటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు మండిపడ్డారు. బాధితురాలు షకీనాతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దారుణమన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రక్షణ కరువయ్యిందని, ఇటీవల దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఇలా భౌతిక దాడులు ఎదురైతే ఎలా పనిచేస్తారని, షకీనాకు న్యాయం జరగకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు.
ఎన్నడూ చూడలేదు : తాను ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నానని, ఇంత దారుణం ఎన్నడూ చూడలేదని షకీనా అన్నారు. ఉన్నతాధికారులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల సూచనల మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం పోలీసులు టిఫిన్ సెంటర్ నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దాడికి ఖండన
యలమంచిలి: పాలకొల్లులో సచివాలయ ఉద్యోగినిపై దాడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పాలకొల్లు తాలూకా యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ ఆలీషా ప్రకటన విడుదల చేశారు. పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరా రు. పాలకొల్లు తాలూకా అధ్యక్షుడు వి.సునీల్‌కుమార్, ఎం.నారాయణ రాజు మద్దతు తెలిపారు.


