కల్తీ కుట్రలపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

కల్తీ కుట్రలపై మండిపాటు

Feb 1 2026 3:27 AM | Updated on Feb 1 2026 3:27 AM

కల్తీ

కల్తీ కుట్రలపై మండిపాటు

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కదం తొక్కాయి. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులా సీబీఐ నివేదిక ఇచ్చిందని, ఇకనైనా తీరుమారకపోతే ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పూజలు చేశారు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతూ కలియుగదైవాన్ని కించపరిస్తే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కై కలూరులోని మీసాల వెంకన్న దేవస్థానంలో దూలం నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామికి అభిషేకం చేశారు. పార్టీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముదిరాజ్‌ సంఘ అధ్యక్షుడు కోమటి విష్ణువర్దనరావు, రాష్ట్ర నాయకులు రామిశెట్టి సత్యనారాయణ, గంటా సంధ్య, పాల్గొన్నారు.

నూజివీడులో నియోజకవర్గంలో..

నూజివీడులో నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడటం మానుకోవాలని, సమస్యలపై ప్రశ్నించినప్పుడల్లా ఇలాంటి డైవర్షన్‌ రాజకీయాలతో కాలం గడుపుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొమ్ము వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమెళ్ళ కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్‌, ఆగిరిపల్లి ఎంపీపీ బోళ్ళ అనూష తదితరులు పాల్గొన్నారు.

పోలవరం నియోజకవర్గంలో..

పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెంలోని శివాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. తెల్లం బాలరాజు మాట్లాడుతూ సీబీఐ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుదీర్ఘ విచారణ అనంతరం నివేదిక ఇచ్చిందని ఇకనైనా చంద్రబాబు మంచి బుద్ధితో పరిపాలన సాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో..

ఉంగుటూరులో సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలపై దాడి చేసిన చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ను దేవుడు కూడా క్షమించరని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ మెంబర్‌ గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు.

చింతలపూడి నియోజకవర్గంలో..

చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం విజయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబుకు సీబీఐ నివేదిక చెంపపెట్టులాంటిదని, తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకులు జెట్టి గురునాధరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్‌సీపీ ప్రత్యేక పూజలు

సమస్యలపై ప్రశ్నిస్తే డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం

కల్తీ కుట్రలపై మండిపాటు 1
1/2

కల్తీ కుట్రలపై మండిపాటు

కల్తీ కుట్రలపై మండిపాటు 2
2/2

కల్తీ కుట్రలపై మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement