అనుగృహమెప్పుడో..?
గత ప్రభుత్వంలో 678 లేఅవుట్లలో..
ఏలూరు(మెట్రో): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఏరుదాటాక తెప్పతెగలేసిన చందంగా పాలన సాగిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో ఒక్క కొత్త ఇంటిని కూడా మంజూరు చేయలేదు. అలాగే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన ఇళ్లను మధ్యలో నిలిపివేసిన ఘనత కూడా చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు జగన్ సర్కారు ఉద్యమంలా ఇళ్లు మంజూరు చేస్తే, వీటి నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అప్పుడప్పుడూ పేదల ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ హడావుడి చేస్తూ సరిపెడుతోంది.
గత ప్రభుత్వంలో 82 వేలకు పైగా..
జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో 82,578 గృహ నిర్మాణాలు మంజూరు చేయగా వాటిలో 80,885 నిర్మాణాలు అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. 2024 జూన్ నాటికి 30,429 ఇళ్ల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం పూర్తి చేయించింది. అనంతరం మరో 15 వేల నిర్మాణాలను పూర్తి చేసి 45,453 మందితో గృహప్రవేశాలు చేయించి పేదల సొంతింటి కల సాకారం చేసింది. అదే ప్రగతిని ప్రస్తుత చంద్రబాబు సర్కారు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోంది తప్ప ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నాటికి 18,625 గృహ నిర్మాణాలు బేస్‌మెంట్ కంటే కింది స్థాయిలో, 9,569 నిర్మాణాలు బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయి. 4,158 గృహాలు లెంటిల్ స్థాయిలో, 2,594 గృహాలు రూఫ్ స్థాయిలో నిలిచాయి. 486 గృహాలు రూఫ్ పైకి చేరుకోగా 1,693 గృహనిర్మాణాలు అ సలు ప్రారంభం కాకుండానే ఉండిపోయాయి. గృహ నిర్మాణాలపై ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. నూతనంగా గృహ నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం, కొత్తగా గృహాలు మంజూరు చేస్తాం అని ప్రకటిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.
ఇళ్ల మంజూరు నిల్లు
రెండేళ్లుగా నిలిచిన నిర్మాణాలు
మాటలతో సరిపెట్టిన చంద్రబాబు సర్కారు
జిల్లాలో పలు దశల్లో నిలిచిన 35,432 ఇళ్లు
ఇప్పటికీ మొదలుకాని 1,693 నిర్మాణాలు
జిల్లాలో 678 లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను చేపట్టిన ఘనత గత జగన్ సర్కారుకే దక్కుతుంది. గతంలో గృహ నిర్మాణాలకు భూసేకరణలో అవినీతి చోటుచేసుకుందని హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలనే పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి పేదల సంక్షేమంపై చంద్రబాబు సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. ఇప్పటికై నా గృహ నిర్మాణాలను మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేయాలని పేదలు కోరుతున్నారు.
అనుగృహమెప్పుడో..?


