గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
కొయ్యలగూడెం: భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం (ఆరిపాటి) గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కృపామణి ఆంధ్ర ప్రదేశ్ సీ్త్ర నిధి బ్యాంక్ డైరెక్టర్‌గా, ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కనకాద్రిపురంలో ఆమె తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులకుగాను గ్రామం పేరు ప్రపంచ ఫుడ్ ఫెస్టివల్‌లో మార్మోగింది. అంతేగాక నాబార్డు ద్వారా ఉత్తమ మహిళా ఎంటర్‌ప్రిన్యూర్ అవార్డు అందుకున్న కృపామణిని గతేడాది కలెక్టర్ వెట్రీ సెల్వి జిల్లా తరుపున సత్కరించారు.
యలమంచిలి: అధికంగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయిన వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంజూరి శ్రీను (45) ఈ నెల 20వ తేదీ రాత్రి అధికంగా మద్యం సేవించి బూరుగుపల్లి బస్టాండ్ సెంటర్లో పడిపోయాడు. అతను సిమెంట్ బల్లపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడికి బుధవారం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. శ్రీను భార్య గంగావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
మండవల్లి : పందెం కోళ్ల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సీహెచ్‌ఎస్ రామచంద్రరావు తెలిపిన వివరాలివి. గత నెలలో పసలపూడి గ్రామంలో గన్నమనేని సుధాకర్‌కు చెందిన 12 పందెం కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. వీటి విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుంది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి గురువారం రిమాండుకు పంపినట్లు తెలిపారు. కోళ్లను రికవరీ చేసినట్లు చెప్పారు.
పెదవేగి : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎలుకల మందు తిని మృత్యువాత పడ్డాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామానికి చెందిన కిలారి కుర్మినాయుడు (30) ఈనెల 17న మద్యం సేవించి తాగిన మత్తులో కడుపునొప్పి తట్టుకోలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు పేస్టును తిన్నాడు. వెంటనే కుటుంబీకులు అతడిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుర్మినాయుడుకి 21వ తేదీ వరకు బాగానే ఉందని వైద్యులు చెప్పారని, కానీ గురువారం చనిపోయినట్లు వెల్లడించారని, మృతుడి సోదరుడు కిలారి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
భీమవరం: మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సర్వోదయమే గాంధేయం అనే అంశంపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాస్థాయిలో నిర్వహించిన సీనియర్ రచయితల కవితా రచనల పోటీల్లో విజేతల వివరాలను సర్వోదయ మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు గురువారం తెలిపారు. పోటీల్లో 17 రచనలు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యాయన్నారు. విజేతలుగా వీఎస్‌వీ ప్రసాద్ (తణుకు), పి నాగరాజు (జీలకర్రగూడెం), టి లక్ష్మీనర్సింహమూర్తి (పాలకోడేరు), ఎం సూర్యనారాయణ (పెనుమదం), వై పాండురంగాచార్యులు (గణపవరం), కె గోపాలశర్మ (భీమవరం), బి జ్ఞానప్రసాద్ (తాడేపల్లిగూడెం), జీఆర్‌కే రాజువంశీ (భీమవరం), కె రామప్రసాద్ (పాలంగి), డీవీ బాలసుబ్రహ్మణ్యం (ఉండి), కె సుబ్రహ్మణ్యశర్మ (గునుపూడి), ఎల్‌ఎన్ శశికళ (అజ్జమూరు), కె కుషాలివెంకట్ (బొర్రంపాలెం), సీహెచ్ లక్ష్మీనారాయణ (భీమవరం), జి శేషేంద్రరావు (అత్తిలి), డి శ్రీరామకృష్ణంరాజు (తాడేపల్లిగూడెం), వి శ్రీనివాస్ (పెదతాడేపల్లి) నిలిచారన్నారు. వీరికి ఈనెల 30వ తేదీన పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో కవితా పురస్కారాలు, బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు తెలిపారు.
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం


