ప్రయాణికుల భద్రతకు భరోసా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ అంటే భద్రత, భరోసాకు మారుపేరని ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ ఏలూరు డిపో గ్యారేజ్‌లో ఆర్టీసీ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిన్నప్పుడు తన తల్లి తనతో ఆలస్యమైనా పరవాలేదు.. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పారని, నేటికీ దూర ప్రాంతాలు వెళ్ళాల్సి వస్తే ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళడానికి ఇష్టపడతానని తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించడం మనచేతుల్లోనే ఉందని, రహదారిపై వాహనాలతో వెళ్ళేటప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ డ్రైవర్లకు నిరంతరం శిక్షణ ఇస్తూ వారిని మానసికంగా కూడా సిద్ధం చేసేలా సైకాలజిస్టులతో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది రహదారి ప్రమాదాలు తగ్గించడంలో సఫలీకృతమయ్యామని, రహదారి ప్రమాదాల శాతాన్ని సున్నాకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు మరింత అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు శేఖర్, జగదీష్, సురేష్, ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బీ వాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గత ఏడాదిలో ప్రమాద రహితంగా బస్సులు నడిపిన డ్రైవర్లను అతిథుల ద్వారా ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందచేశారు.
ఉత్తమ డ్రైవర్ అవార్డులు అందుకున్నవారు
ఏలూరు డిపోకు చెందిన ఆర్‌వీ రావు, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బీకే రెడ్డి, ఎం.చిన్నయ్య జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఏలూరు డిపో స్థాయిలో ఎంఎస్‌రావు, ఎంఎస్‌నారాయణ, వీవీఎస్ రెడ్డి. జంగారెడ్డిగూడెం డిపో స్థాయిలో ఎస్‌కేఎం షాకీర్, ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, నూజివీడు డిపో స్థాయిలోఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్ అవార్డులు అందుకున్నారు.
ప్రథమ ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకుంటున్న కేవీ రావు, బీకే రెడ్డి, ద్వితీయ ఉత్తమ డ్రైవర్
డ్రైవర్లు ఎం. చిన్నయ్య, ఎంఎస్ రావు, ఎంఎస్ నారాయణ, వీవీఎస్ రెడ్డి, ఎస్‌కేఎం షాకీర్
డ్రైవర్లు ఎంబీ రావు, ఎంపీఆర్ రావు, ఎంజీ రావు, కేఆర్ కృష్ణ, ఎండీ సిద్ధిక్
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా
ప్రయాణికుల భద్రతకు భరోసా


