శ్రీమావుళ్లమ్మ ఆలయ హుండీల ఆదాయం రూ.59.25 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సింగరాయపాలెం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ జి గంగా శ్రీదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి 26 రోజులకుగాను హుండీల ద్వారా రూ.59,25,41 ఆదాయం లభించగా బంగారం 45.100 గ్రాములు, వెండీ 210 గ్రాములు, విదేశీ కరెన్సీ లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావ తదితరులు పాల్గొన్నారు.


