పోలీసులకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు అవార్డులు

Jan 26 2026 4:53 AM | Updated on Jan 26 2026 4:53 AM

పోలీస

పోలీసులకు అవార్డులు

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకు అవార్డులు దక్కాయి. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌ మెడల్‌ అవార్డులకు ఎంపికయ్యారు. ఏలూరు జిల్లాలో 10 మంది డీజీపీ కమెండేషన్‌ డిస్క్‌ మెడల్స్‌కు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీరంతా మెడల్స్‌ అందుకుంటారు.

ఏలూరు జిల్లా ఎస్‌బీ సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు, కై కలూరు రూరల్‌ సీఐ వీర రవికుమార్‌కు డీజీపీ కమెండేషన్‌ సిల్వర్‌ మెడల్స్‌ దక్కాయి. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఐటీ కోర్‌ టీమ్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐ బాలిబోయిన నరేంద్రకుమార్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయం డీఏఆర్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఉప్పులూరి హరిబాబు డీజీపీ కమెండేషన్‌ బ్రాంజ్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ఏలూరు మహిళా స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ తోట శ్రీనివాసరావు, ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ లంకా మరియరాజు, ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం ఐటీకోర్‌ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తోట పార్థసారథి, ఏలూరు మహిళ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ పల్లెల మధుసూధన్‌రావు, ఏలూరు డీఏఆర్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు కొవ్వూరు శేఖర్‌, కర్రి నాగేంద్రబాబు డీజీపీ కమెండేషన్‌ బ్రాంజ్‌ మెడల్స్‌కు ఎంపికయ్యారు.

ఎకై ్సజ్‌ సీఐ మద్దాలకు కమిషనర్‌ అవార్డు

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు ఎకై ్సజ్‌ సీఐ మద్దాల శ్రీనివాస్‌ కమిషనర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు సర్కిల్‌ పరిధిలో అనేక విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ సమావేశాలు నిర్వహించామని అన్నారు. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.

పోలీసులకు అవార్డులు 1
1/2

పోలీసులకు అవార్డులు

పోలీసులకు అవార్డులు 2
2/2

పోలీసులకు అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement