జగన్ పేరు చెబితే కూటమికి వణుకు
ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
సైనికుల్లా పనిచేయాలి
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీ ఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతుందనీ, కేక్ కట్ చేసుకున్నా భయంతో అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారనీ వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నా రు. ఏలూరు నియోజకవర్గ సంస్థాగత కమిటీల నిర్మాణ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారు మూరి సునీల్‌కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి నా గార్జున యాదవ్ హాజరయ్యారు. ముందుగా దివంగత వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మరింత బలోపేతం చేయాలి
ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తూ సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు.
కార్యకర్తలకే ప్రాధాన్యం
రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలకే జగన్ ప్రాధాన్యమిస్తారని, ఆయన మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారని నాగార్జున యాదవ్ అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా ధైర్యంగా నిలబడి, అక్రమ కేసులను తట్టుకున్న వారందరినీ జగన్ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సైతం భయపడుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా జగన్‌కు అండగా నిలవాలని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలతో కలిసి కూటమిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు డీవీఆర్‌కే చౌదరి, దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల సూర్యప్రకాశరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, నాయకులు ఇనపనూరి జగదీష్, కేదారేశ్వరి, జిజ్జువరపు విజయనిర్మల, చిలకపాటి డింపుల్, షేక్ రియాజ్, గుడివాడ రామచంద్రకిషోర్, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ 2019–24 వరకు సంతోషంగా జీవిస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనతో నరకం చూస్తున్నామని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఖజానా ఖాళీ అని చెప్పగానే ప్రజలంతా మరోసారి మోసపోయామని చెంపలేసుకున్నారన్నారు.
ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ మాట్లా డుతూ ఏలూరు నియోజకవర్గంలో పార్టీని కొందరు నేతలు నట్టేట ముంచి వెళితే, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తన కు బాధ్యతలు అప్పగించారన్నారు. ఏలూరులో ఎంతో మంది సైనికుల్లాంటి నేతలు, కార్యకర్తలు ఉన్నారని, వారంతా అండగా ఉంటారని జగన్ భరోసా ఇచ్చారన్నారు. పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు
చంద్రబాబువి నీచ రాజకీయాలు
ఏలూరు సంస్థాగత కమిటీల నిర్మాణ సమావేశంలో నాయకులు


