గంగానమ్మ తల్లి.. భక్తులు ప్రణమిల్లి | - | Sakshi
Sakshi News home page

గంగానమ్మ తల్లి.. భక్తులు ప్రణమిల్లి

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

గంగానమ్మ తల్లి..  భక్తులు ప్రణమిల్లి

గంగానమ్మ తల్లి.. భక్తులు ప్రణమిల్లి

అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జన జాతరను తలపిస్తోంది. నగరమంతా గంగానమ్మవారి జాతర సందడి కనిపిస్తోంది. పడమరవీధిలో గంగానమ్మవారి జాతర ఆదివారం అట్టహాసంగా నిర్వ హించారు. గత వారం తూర్పువీధి, దక్షిణపువీధి, పవర్‌పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలో జాతర సంబరాలు జరగ్గా.. ఇప్పుడు పడమరవీధిలో వేడుకలు నిర్వహిస్తున్నారు. పడమరవీధి గంగానమ్మవారి జాతరను నగరంలోని దాదాపు సగం మంది జనం పైగా పాటించారు.

జాతర పూనకాలే..

ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మూడు నెలలుగా అమ్మవారిని పడమరవీధి వద్ద మేడల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూ జలు చేశారు. ఆదివారం వేకువజాము 2.30 గంటల నుంచి నైవేద్యాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

భారీ కుంభం

ఉదయం 9 గంటలకే అమ్మవారి మేడల వద్ద భక్తులు సమర్పించిన నైవేద్యాలతో భారీ కుంభం ఏర్పడింది. ఉదయం 10, 11 గంటల సమయానికి భక్తుల రాక మరింత పెరిగింది. భక్తులంతా నైవేద్యాలు సమర్పించడంతో అమ్మవారి మేడల వద్ద కుంభం కొండను తలపించింది. సాయంత్రానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్టు అంచనా.

అమ్మవారికి నీరా‘జనం’

జాతర మహోత్సవానికి నగర ప్రజల ఆహ్వానం మే రకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అతిథులు ఏలూరు చే రుకున్నారు. ముందస్తు బుకింగ్‌లతో లాడ్జీల్లో గదులన్నీ ఫుల్‌ అయ్యాయి. పడమరవీధి గంగానమ్మవారి దేవస్థానం పరిధిలోని పడమరవీధి, వంగాయగూడెం, రామకృష్ణాపురం, గులాబీతోట, ఎన్‌టీఆర్‌ నగర్‌, నరసింహరావుపేట, పోస్టల్‌ కాలనీ, శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రతి వీధిలో టిప్‌టాప్‌ పందిళ్లు వేసి బంధుమితుల్రకు విందు భోజనాలు ఏర్పాటుచేశారు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.

ప్రధాన రహదారుల్లో కిటకిట

వీధులన్నీ రద్దీగా ఉండటంతో ప్రధాన రహదారులపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో పాత బ స్టాండు, కొత్త బస్టాండు ప్రాంతాలు, రామకృష్ణాపురంలోని మినీ బైపాస్‌ రోడ్డు, విజయవిహార్‌ సెంటర్‌, వసంతమహల్‌ సెంటర్‌, పవర్‌పేట స్టేషన్‌ రో డ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఎదురయింది. కిలోమీటరు దూరం బైక్‌పై వెళ్లేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు.

హేలాపురి.. ఆధ్యాత్మిక సిరి

అట్టహాసంగా పడమర వీధి జాతర

నైవేద్యాలు సమర్పించిన లక్ష మందికి పైగా భక్తులు

నగరంలో పండుగ వాతావరణం

నేడు అమ్మవారిని సాగనంపనున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement