నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

నత్తగ

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం

ఎన్నికల హామీలపై ప్రశ్నించినందుకు దాడి

ఇల్లు ధ్వంసం

కై కలూరు: చంద్రబాబు పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఏలూరు జిల్లా నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ ముంగర రామకృష్ణరాజు (రూబేన్‌)పై శనివారం అర్ధరాత్రి హత్యాయత్నం చేశారు. దాదాపు 60 మంది సర్పంచ్‌ ఇంటిని ధ్వంసం చేసి ఆయన తలపై ఇనుప రాడ్డుతో కొట్టారు. అడ్డువచ్చిన సర్పంచ్‌ భార్య నవ్య దుస్తు లు చించి దాడి చేశారు. కుటుంబసభ్యులు పోలీసు ల సాయంతో వారిని కై కలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కొల్లేరు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 22న కొల్లేటికోటకు వచ్చిన కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినే ని శ్రీనివాస్‌ను కొల్లేరు పెద్దలు నిలదీశారు. దీనిపై నత్తగుళ్లపాడు సర్పంచ్‌ రామకృష్ణరాజు కొల్లేరులో నివసించే ప్రతి కుటుంబానికీ అర ఎకరం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి కామినేని శ్రీనివాస్‌ మోసం చేశారని వీడియో విడుదల చేశారు. దానిని సహించలేక టీడీపీ నాయకుడు బలే ఏసురాజు తనపై దాడి చేయించాడని బా ధిత సర్పంచ్‌ రామకృష్ణరాజు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ రామకృష్ణరాజు దంపతులను వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షు డు, కై కలూరు నియోజకవర్గ కన్వీనర్‌ దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఆదివారం పరామర్శించారు.

దాడికి గురైన సర్పంచ్‌ రామకృష్ణరాజు వీపుపై గాయాలు

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం 1
1/3

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం 2
2/3

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం 3
3/3

నత్తగుళ్లపాడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై హత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement