పరాకాష్టకు పచ్చమూకల దాడులు | - | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు పచ్చమూకల దాడులు

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

పరాకా

పరాకాష్టకు పచ్చమూకల దాడులు

పరాకాష్టకు పచ్చమూకల దాడులు వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ కొనసాగిన ప్రాక్టికల్స్‌ పీజీఆర్‌ఎస్‌ రద్దు

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

బుట్టాయగూడెం: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం తారాస్థాయికి చేరుకుందని పోలవరం మాజీ ఎ మ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ తెల్లం బాల రాజు అన్నారు. ఆదివారం ఆయన దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో రూపంలో దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్‌, అలాగే భూమన బ్రహ్మనాయుడు ఇళ్లపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పచ్చమూకలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపో వడం బాధాకరమన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, అన్నింటికీ చంద్రబాబు, పవన్‌కల్యా ణ్‌, లోకేష్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైఎస్సార్‌ నాయకులు, కార్యకర్తలు భ యపడే ప్రసక్తే లేదని, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు.

ఉంగుటూరు: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడిగా డా.కోనా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. బాదంపూడి శివారులో కల్యాణ మండపంలో ఈ కార్య క్రమం నిర్వహించారు. రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌, తెలంగాణ రాష్ట్ర ఐవీఎఫ్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్త, ఐవీఎఫ్‌ వ్యవస్థాపక సభ్యులు రమేష్‌ అగర్వాల్‌, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డుండి రాకేష్‌లు పాల్గొన్నారు. వాసవీ మాత ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా కల్యాణ మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు కమిటీల్ని నియమించి ప్రమా ణ స్వీకారం చేయించారు. ఐవీఎఫ్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వక్తలు తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 54 కేంద్రాల్లో ఆదివారం ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు కొనసాగాయి. 5,076 మంది హాజరయ్యారు.

పెదపాడు: ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్‌కు రద్దు చేశారు. జాతర దృష్ట్యా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

పరాకాష్టకు పచ్చమూకల దాడులు 1
1/1

పరాకాష్టకు పచ్చమూకల దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement