సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా సచివాలయ ఉద్యోగుల శాఖపై అధికారులు చూపడం దారుణం. ఒక రకంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖపై సవతి తల్లి ప్రేమను చూపడం బాధాకరం. మా శాఖలోని సమస్యలు పరిష్కరించకుండా భారం మోపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు తమ తీరును మార్చుకోవాలి
– జీవీఎస్ శ్రీనివాస్, రీజినల్ కో–ఆర్డినేటర్, సచివాలయ ఉద్యోగుల సంఘం
సర్వేలు, యాప్‌ల నిర్వహాణ సచివాలయ ఉద్యోగులకు భారంగా మారింది. కొన్ని సందర్భాల్లో సర్వేలకు ప్రజలకు సహాకరించకపోయినా దానికి కూడా ఉద్యోగులనే బాధ్యులను చేసి మాట్లాడుతున్నారు. పండుగలు, సెలవుల్లో ప్రత్యేక పనులు అప్పగిస్తున్నారు. పూర్తి చేయకపోతే సెలవులు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారు.
– జె.శ్యాం చంద్రబాబు, శానిటేషన్ సెక్రటరీ,ఏలూరు
రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి వల్ల అశువులు బాసిన సచివాలయ ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. బాధితుల పిల్లలు, తల్లిదండ్రుల పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక సహాకారం అందించాలి.
– మెట్టపల్లి కావ్య, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, ఏలూరు
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలి. సచివాలయం పరిధిలో అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు అటు మాతృశాఖ ద్వారా అప్పగించే పనులు కూడా చేయాల్సి రావడం భారంగా మారింది. కొన్ని సందర్భాల్లో పని భారం పెరిగి ఆలస్యం అవుతుంది.
– టి.శ్రీలక్ష్మి, హెల్త్ సెక్రటరీ, ఏలూరు
సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ


