మీటర్ రీడర్లకుఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్‌కు మంగళవారం ఉదయం విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్, ఏరియా కార్యదర్శి ఏ.అప్పలరాజు మాట్లాడుతూ మీటర్ రీడర్లుగా నాలుగు వేల మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్న నేపథ్యంలో విద్యుత్తు మీటర్ రీడర్స్ ఉపాధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. విద్యుత్ మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 25 శాతం సహకార సంఘాల ఉద్యోగుల కోటా ప్రకారం అర్హులైన వారితో భర్తీ చేయాలని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో డీఆర్వో, సహకార శాఖ అధికారికి మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడి ప్రసాద్, మాజీ ప్రధాన కార్యదర్శి టి.గంగరాజు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 2023లో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి కాల్ లెటర్స్ పంపించి ఇంటర్వ్యూలు నిర్వహించారన్నారు. 25 శాతం సహకార సంఘాల ఉద్యోగుల కోటాకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్‌షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు వర్క్‌షాపు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్నత స్థాయి అకడమిక్ కార్యక్రమాల నిర్వహణకు సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తొలిరోజు మాజీ చీఫ్ సైంటిస్ట్, అరకు వ్యాలీ మాజీ డైరెక్టర్ డాక్టర్ జీ.భగవన్నారాయణ, ఏపీ ఉన్నత విద్యామండలి గౌరవ చైర్మన్, ఆర్‌జేటీయూకేటీ ఆచార్య కె.మధుమూర్తి, ఉపకులపతి ఆచార్య ఎం.విజయ్ కుమార్ పర్యవేక్షించారు.
నరసాపురం: నరసాపురం కొండాలమ్మ గుడి ప్రాంతంలో మంగళవారం తుపాకీ పేలుడు కలకలం రేపింది. సమీపంలో వైఎన్ కళాశాల గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల గన్ ఫైరింగ్ మిస్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకుని కుదుట పడ్డారు. ఉదయం 12.30 గంటల సమయంలో కొండాలమ్మగుడి ప్రాంతంలో కొపనాతి రాము ఇంటి రెండో అంతస్తులో భారీ శబ్ధంతో అద్దం ముక్కలైంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న యజమాని రాము వచ్చి పరిశీలించగా బుల్లెట్ లభించింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆరాతీశారు. నేవీ, ఎన్‌సీసీ క్యాంపులు వైఎన్ కళాశాల గ్రౌండ్‌లో జరుగుతుంటాయి. క్యాంపులో గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఓ క్యాడెట్ గన్ నుంచి మిస్ ఫైరింగ్ జరిగి బుల్లెట్ 200 మీటర్లు దూరంలో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మీటర్ రీడర్లకుఉద్యోగ భద్రత కల్పించాలి
మీటర్ రీడర్లకుఉద్యోగ భద్రత కల్పించాలి
మీటర్ రీడర్లకుఉద్యోగ భద్రత కల్పించాలి


