వైఎస్సార్‌సీపీబలోపేతమే లక్ష్యం
కల్తీ విత్తనాలతో నష్టం
కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. 8లో u
చింతలపూడి: వైఎస్సార్‌సీపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమని, వారి కృషితోనే పార్టీ ఎప్పుడూ పటిష్టంగా ఉందని కొనియాడారు. త్వరలోనే గ్రామ, వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని, నిబద్ధతతో పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, ఎంపీపీ బి.రాంబాబు నాయక్, జెడ్పీటీసీ ఎం.నీరజా సుధాకర్, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, నాయకులు ఎస్.రమేష్‌రెడ్డి, ఎ.శాంతారావు, ఓరుగంటి నాగేంద్ర కుమార్, గుప్తా, బొడ్డు వెంకటేశ్వరరావు, సీహెచ్ జ్ఞానారెడ్డి, మల్నీడి బాబి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, ఎ.సుబ్బారావు, మట్టా సురేష్, మందలపు సాయిబాబు, బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


