సత్వర న్యాయం అందించాలి
ఏలూరు (టూటౌన్): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఎంపిక చేసిన న్యాయవాదులకు 5 రోజులపాటు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 27 నుండి 31 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. రాజీయోగ్యమైన కేసులలో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి త్వరితగెత్తిన పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, పర్మినెంటు లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఏ.మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కొనే సీతారాం తదితరులు పాల్గొన్నారు.


