కొల్లేరులో జనాగ్రహం
ఈవీఎం గోడౌన్ తనిఖీ
అలజడి సృష్టిస్తూ..
న్యూస్‌రీల్
తమ పొట్టకొట్టారంటూ మండిపాటు
రెండున్నరేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కన్నీరు ఆగడం లేదు.
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరులో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గద్దెనెక్కిన కూటమి పాలకులు రెండేళ్లుగా మాయమాటలు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం లభించకపోగా ఆక్రమణల తొలగింపు పేరుతో కొల్లేరువాసుల కడుపుకొట్టడంతో జనాగ్ర హం పెల్లుబికింది. అటవీశాఖ అధికారులు స ర్వేలు, రీ సర్వేలు, ఆక్రమణల తొలగింపు అంటూ కొల్లేరు గ్రామాల్లో హడావుడిని కొల్లేరు వాసులు బలంగా ప్రతిఘటిస్తుండటంతో లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. రెండు రోజుల క్రితం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ను కొల్లేరువాసులు కడుపు మండి నిలదీశారు.
వీడని చిక్కుముడులు : గత ప్రభుత్వం హయాంలో సజావుగా ఉన్న కొల్లేరు వ్యవహారం ఒక్కసారిగా కదిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పేరుతో కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు తొలగించి, నివేదిక ఇవ్వడానికి అటవీశాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. అసలు కొల్లేరు సరిహద్దుల అంశం ఇంకా పూర్తిస్థాయిలో చిక్కుముడి వీడకపోవడం, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పేరుతో తీవ్ర కదలికలు ప్రారంభమయ్యాయి. కొల్లేరు ప్రజల అమాయకత్వాన్ని ప్రజాప్రతినిధులు ఆసరాగా చేసుకుని శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ గద్దెనెక్కి అధికారంలోకి రాగానే అంతా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది, మా పరిధిలో ఏమీ లేదంటూ కూటమి ప్రజా ప్రతినిధులు మాట దాటవేస్తుండటంతో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కొ ల్లేరు విస్తరించి ఉంది. ఆక్రమణల కారణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీఓ నం.120ను జారీ చేశారు. ఈ క్రమంలో 5వ కాంటూరు వరకు అ భయారణ్యంగా గుర్తించి 77,135 ఎకరాల విస్తీర్ణా న్ని నిర్ణయించారు. ఆ తరువాత కొల్లేరు ఆపరేషన్ లో రెండు జిల్లాలో 31120 ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5510 ఎకరాల డి.ఫారం భూములు ఉన్నాయి. వీటికి పరిహారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని రాష్ట్ర చేపల రైతుల సంఘం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. తదనంతర పరిణామాల్లో కాకినాడకు చెందిన పర్యావరణవేత్త కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగాయని, కొల్లేరు ఆపరేషన్ అనంతరం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం పాటించలేదంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు విచారణకు గత ఏడాది స్వీకరించింది. ఈ క్రమంలో గతేడాది ఆక్రమణల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి కేంద్ర సాధికార కమిటీని నియమించడం, కమిటీ సభ్యులు నలుగురు గతేడాది జూన్ 17, 18 తేదీల్లో కొల్లేరులో పర్యటించడం, ప్రజాప్రతినిధులు, రైతులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం నుంచి కొల్లేరుపై పూర్తి సమాచారం ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించలేదు. దీంతో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ రెండు జిల్లాల్లో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించి, నిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత వ్యవహారం ముందుకు సాగలేదు.
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను శనివారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
వచ్చే నెలాఖరులో కేసు విచారణకు రానుండటంతో అటవీశాఖ అధికారుల హడావుడి, అలజడి మొదలైంది. అదేస్థాయిలో కొల్లేరువాసులు అటవీశాఖ అధికారులను తిప్పి కొడుతున్నారు. అటవీశాఖ అధికారులు 18 వేల ఎకరాలు ఆక్రమణలో ఉందని, 9 వేల ఎకరాల్లో ఆక్రమణలను తొలగించామని నివేదికలు సమర్పించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర సాధికార కమిటీ నుంచి హడావుడి ఉంటుందని ఆక్రమణల తొలగింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కై కలూరు మండలం చటకాయి, వడ్లకూటితిప్ప, శృంగవరప్పాడు, కొట్టాడ, ఏలూరు మండలంలో పత్తికోళ్ల లంక, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, సాయన్నపాలెం గ్రామాల్లో అటవీశాఖ అధికారుల హడావుడిని కొల్లేరు ప్రజలు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం, నిరసనలు నిర్వహించడం కొనసాగించారు. ఇక తాజాగా, ఎమ్మెల్యే కామినేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
కొల్లేరు ప్రజలకు వేధింపులు పెరిగాయని, ఈనెల 27, 28 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలవడానికి కొల్లేరు నుంచి పాదయాత్రగా వెళ్లాలని కొల్లేరువాసులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద కొల్లేరు పెద్దల సమావేశానికి ఎమ్మెల్యే కామినేని హాజరై పాదయాత్ర వద్దు, తాను మాట్లాడతానని, లేదంటే కొద్దిమందిని కలిసే ఏర్పాటు చేస్తానని పెద్దలకు చెప్పారు. దీంతో కూటమి మాటలు నమ్మి మోసపోయాం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బంది రాలేదని, కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే మా పొట్టకొట్టారని తీవ్రస్థాయిలో నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.
కూటమి మాటలు నమ్మి మోసపోయామంటూ మండిపాటు
కొల్లేటికోటలో ఎమ్మెల్యే కామినేనిని నిలదీసిన కొల్లేరు పెద్దలు
ఆక్రమణల తొలగింపు పేరిట అటవీ శాఖ హడావుడి
అధికారులను ప్రతిఘటిస్తున్న కొల్లేరు ప్రజలు
సమస్యకు పరిష్కారం చూపాలంటూ వేడుకోలు
కొల్లేరులో జనాగ్రహం
కొల్లేరులో జనాగ్రహం


