గ్రూప్–2లో సత్తా
గ్రూప్ –2 ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. తణుకుకు చెందిన సాయి ఫణీంద్ర ఎకై ్సజ్ ఎస్సైగా, పాలకొల్లుకు చెందిన మౌనిక సబ్ రిజిస్ట్రార్‌గా, ఏలూరుకు చెందిన అజయ్ కుమార్ కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు.
– తణుకు అర్బన్, పాలకొల్లు సెంట్రల్, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)
గ్రూప్–2 ఫలితాల్లో తణుకుకు చెందిన దుద్దుపూడి సాయి ఫణీంద్ర మొదటి ప్రయత్నంలోనే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. గ్రూప్–2 ఫలితాల్లో 300 మార్కులకు 220.66 మార్కులు సాధించి ఈ ఘనత సాధించారు. దుద్దుపూడి మోహన్‌రావు, పోసి రత్నం కుమారుడైన ఫణీంద్ర తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. పదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి చనిపోగా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదిచారు. మూడేళ్ల పాటు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఫణీంద్ర సివిల్స్‌పై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. అమ్మ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయనున్నట్లు ఫణీంద్ర తెలిపారు.
కొంచాడ చిన్ని మౌనిక
పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కొంచాడ అప్పలరాజు, రమణి దంపతులకు కుమార్తె చిన్ని మౌనిక గ్రూప్–2 పలితాల్లో సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపికై ంది. ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని తెలిపింది. నవోదయలో 6 నుంచి 10 వరకూ చదివినట్లు తెలిపారు. అగ్రికల్చరల్ బీఎస్సీ అనంతరం.. 2023 మే నెలలో కోర్టులో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం భీమవరం కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. గ్రూప్–2లో సెలెక్ట్ అవ్వడంతో సబ్‌రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించానని.. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నానని తప్పనిసరిగా ఐఏఎస్ సాధిస్తానని ఆమె తెలిపింది. తండ్రి, సోదరుడు పట్టణంలోనే వ్యాపారం చేస్తుంటారు. తల్లి యలమంచిలి మండలంలో కలగంపూడి గ్రామ సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు.
గ్రూప్–2లో సత్తా


