వీర వనితలకు జేజేలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థినులకు వీరోచిత వనితల త్యాగాలు, అసమాన ప్రతిభా, పాటవా లను బోధించాల్సిన అవసరం ఉందని బాలోత్సవా ల రాష్ట్ర సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అ న్నారు. నగరంలో గంగానమ్మ జాతర సందర్భంగా హేలాపురి బాలోత్సవం, మానవత, ఏవీఆర్ విజ్ఞా న కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల ఆడిటోరియంలో వీర వనితల జీవితాలతో కూడిన ప్రదర్శనలు ఇచ్చారు. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జాతర సందర్భంగా ఇటువంటి బహుముఖ కార్యక్రమాలు హేలాపురి బాలోత్సవం నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, దేవరకొండ వెంకటేశ్వర్లు, గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ బాల్యంలోనే విద్యార్థులకు దేశభక్తి భావాలను సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు వీరవనితలకు జేజేలు పేరు తో కార్యక్రమం నిర్వహించామన్నారు. విద్యార్థిను లు వీర వనితల వేషధారణలతో ఆకట్టుకు న్నారు. మ్యాజిక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్‌స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.


