వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం
ఆగిరిపల్లి: మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి శనివారం గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామి వారి కళ్యాణ మండపంలో హైదరాబాద్‌కు చెందిన ఆకుల బసవ ప్రసాద్‌రావు దంపతులు కై ంకర్యాపరులుగా వ్యవహరించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామిని పెళ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
భీమవరం: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ జేఎన్‌టీయూకే మహిళా క్రికెట్ టీమ్‌కు భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సీహెచ్ వర గాయత్రి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం అంజన్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 2వ తేదీవరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ చైన్నెలోని అన్నా యూనివర్సిటీలో జరుగుతుందన్నారు. పోటీలకు ఎంపికై న వరగాయత్రిని ప్రిన్సిపాల్ అంజన్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ పి మురళీధర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణికుమార్ తదితరులు ఈ సందర్భంగా అభినందించారు.
గణపవరం: ఉంగుటూరు మండలం నాచుగుంటలో ఈనెల 27, 28, 29 తేదీల్లో బైబిల్ మిషన్ 88వ మహాసభలు జరుగుతాయని బైబిల్ మిషన్ ప్రెసిడెంట్, మహాసభల చైర్మన్ బి.సంజీవరావు తెలిపారు. ఈ సభలకు వైస్ ప్రెసిడెంట్ ఎ.దైవారావు, కార్యదర్శి డి.ఇమ్మానుయేల్, జాయింట్ సెక్రటరీ జీఆర్ ఇమ్మానియేల్‌రాజు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలకు పరిసర గ్రామాలకు చెందిన విశ్వాసులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు.
ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లి గ్రామ సర్పంచ్ పోల్కంపల్లి అనీల్ కుమార్‌ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అనీల్ కుమార్ మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్‌ఆర్), ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భనం, ఇతర విభాగాల వద్ద భక్తులు కిటకిటలాడారు. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం
వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం
వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం


