●భక్తిశ్రద్ధలతో పసుపు కొమ్ముల నోము
అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతిథాంలో శనివారం లక్ష పసుపు కొమ్ముల నోము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన భక్తులు 102 రుషీ గోత్ర మందిరంలోని 90 అడుగుల పంచలోహ వాసవీ మాత విగ్రహాన్ని దర్శించుకొని, మరకత శిల వాసవీ మాతకు పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం మరకత శిల వాసవీ మాతను గాజుల అలంకరణ చేశారు. రుషీ గోత్ర మందిరంలో బెంగుళూరు దంపతులు లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించారు. పసుపు కొమ్ములు స్వీకరించడానికి పరిసర ప్రాంత భక్తులు పోటీ పడ్డారు. దంపతుల పూజ, పసుపుకొమ్ముల నోముతో వాసవీ థాం కిక్కిరిసిపోయింది. భక్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
– పెనుగొండ
●భక్తిశ్రద్ధలతో పసుపు కొమ్ముల నోము


