నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.
ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్‌స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.
ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ప్రేరణ నిచ్చిన సినిమా
ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్‌పాత్‌పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.
1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్‌తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్‌లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది.
ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో

భార్య అనిత తోడుగా
రాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు.
అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు.


