(ఫైల్‌ఫోటో)
దిస్‌పూర్: అసోంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతైంది. ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం రాడార్ నుంచి లింక్‌లు తెగిపోయి అదృశ్యమైంది. ఈ యుద్ధ విమానం పైలట్ సైతం గల్లంతు కావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తక్షణ గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ రోజు(గురువారం, మార్చి 5వ తేదీ) రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతు కావడంతో కలవరం మొదలైంది. ఈ యుద్ధ విమానం కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఎస్‌యూ-30MKI భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన బహుళ శ్రేణి యుద్ధ విమానం. ఈ ప్రమాదం వాయుసేన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైలట్ అదృశ్యం కావడం వల్ల రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి.


