గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆదివారం అధికార బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకీయా ఆయనను పార్టీలోకి ఆహా్వనించారు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బోరాకు కీలక పదవి లభించింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కలి్పంచారు.
కాంగ్రెస్ నేతలు సంజూ బోరా, రాజేశ్‌కుమార్ జోషీ, కంగన్ దాస్, గగన్‌చంద్ర బోరాతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భూపేన్ కుమార్ బోరా ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా సమర్పించారు. రాహుల్ గాంధీ సహా పలు సీనియర్ నేతలు బోరాతో మాట్లాడి బుజ్జగించినా ఆయన మనసు మార్చుకోలేదు. అస్సాంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.


